1. కిందివాటిలో ఏ బ్యాక్టీరియాను బయోపెస్టిసైడ్గా ఉపయోగిస్తున్నారు?
1) బాసిల్లస్ తురియెంజెనిసిస్ 2) ఈశ్చరీషియా కొలై
3) సూడోమోనాస్ ప్యుటిడా 4) సాల్మోనెల్లాటైఫి
జ: 1 (బాసిల్లస్ తురియెంజెనిసిస్)
2. బాసిల్లస్ తురియెంజెనిసిస్ బ్యాక్టీరియా దేన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది?
జ: కీటకాల వల్ల జరిగే నష్టం
3. ఏ మొక్క విత్తనాలు, పత్రాల నుంచి తీసిన రసాయనాలను బయోపెస్టిసైడ్లుగా వాడుతున్నారు?
జ: వేప
4. బయోపెస్టిసైడ్లుగా ఉపయోగించే సూక్ష్మజీవులు
1) బ్యాక్టీరియా 2) శిలీంద్రాలు 3) వైరస్లు 4) అన్నీ
జ: 4 (అన్నీ)
5. భారత ప్రభుత్వం బయోపెస్టిసైడ్ల వినియోగాన్ని ఏ ప్రోగ్రాం ద్వారా ప్రోత్సహిస్తోంది?
జ: ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్
6. కిందివాటిలో బయోపెస్టిసైడ్గా ఉపయోగించే వైరస్?
1) గ్రాన్యులోసిస్ వైరస్ 2) రినో వైరస్ 3) కరోనా వైరస్ 4) ఇన్ఫ్లుయాంజా వైరస్
జ: 1 (గ్రాన్యులోసిస్ వైరస్)
7. బయోపెస్టిసైడ్ల వల్ల కలిగే ఉపయోగాలు?
1) కీటకాలు వీటికి నిరోధకత చూపవు 2) పర్యావరణానికి హాని చేయవు
3) ఆహారపు గొలుసులోకి ప్రవేశించవు 4) అన్నీ
జ: 4 (అన్నీ)
8. కిందివాటిలో సరికాని జత?
1) బ్యాక్టీరియోసైడ్స్ - బ్యాక్టీరియాను చంపేవి 2) ఇన్సెక్టిసైడ్స్ - కీటకాలను చంపేవి
3) హెర్బిసైడ్స్ - లార్వాలను చంపేవి 4) ఫంగీసైడ్స్ - శిలీంద్రాలను చంపేవి
జ: 3 (హెర్బిసైడ్స్ - లార్వాలను చంపేవి)