• facebook
  • whatsapp
  • telegram

రక్తం

1. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
జ: హెమటాలజీ


2. రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయం?
జ: 5 నిమిషాలు


3. హీమోగ్లోబిన్‌లోని 'ఐరన్ రూపం'?
జ: Fe2+


4. జలగ లాలాజలంలోని యాంటీ కోయాగ్యులెంట్?
జ: హిరుడిన్


5. RBC ల జీవిత కాలం ఎంత?
జ: మూడు నెలలు


6. పాలీసైథీమియా అంటే...?
జ: RBC ల అసాధారణ పెరుగుదల


7. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించే 'ఎరిత్రోపాయిటిన్' హార్మోన్ ఏ అవయవం నుంచి విడుదలవుతుంది?
జ: మూత్రపిండం


8. కిందివాటిలో రక్తానికి సంబంధించిన సత్య ప్రవచనం?
1) రక్తం 7.4 pH విలువను కలిగి, క్షారగుణంతో ఉంటుంది.
2) రక్తంలోని సహజ ప్రతిస్కందక పదార్థం 'హెపారిన్.
3) రక్తంలో లవణాలు 0.85 - 0.9 శాతం ఉంటాయి.
4) పైవన్నీ సరైనవే
జ: 4 (పైవన్నీ సరైనవే)


9. 'గ్రేవ్‌యార్డ్ ఆఫ్ ఆర్‌బీసీ'గా దేన్ని పేర్కొంటారు?
జ: ప్లీహం


10. థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్...
జ: రక్తస్కందన ప్రక్రియకు తోడ్పడుతుంది.

Posted Date : 17-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌