• facebook
  • whatsapp
  • telegram

మూలకాల వర్గీకరణ

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) లోహాలు చాలా వరకు ఘనస్థితిలో ఉంటాయి.
బి) అలోహాలు ఘనస్థితి, ద్రవస్థితి లేదా వాయుస్థితుల్లో  ఉంటాయి.
సి) అలోహాలు సన్నటి తీగలాగా సాగే గుణం కలిగి ఉండవు.
డి) పైవన్నీ


2. కిందివాటిలో ద్రవస్థితిలో ఉండే అలోహం ఏది?
ఎ) మెర్క్యురీ        బి) పొటాషియం
సి) బ్రోమిన్‌        డి) క్లోరిన్‌


3. భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం ఏది?
ఎ) ఇనుము        బి) అల్యూమినియం
సి) ఆక్సిజన్‌        డి) బంగారం


4. ‘వేసవి ద్రవం’ అని పిలిచే లోహం ఏది?
ఎ) సోడియం        బి) కాల్షియం
సి) గాలియం        డి) ఆస్మియం


5. ఆవర్తన పట్టికలో అతిపెద్ద పీరియడ్‌ ఏది?
ఎ) 6, 7            బి) 1, 2            సి) 3, 4               డి) 4, 5


6. ఆవర్తన పట్టికలో అతిచిన్న పీరియడ్‌ ఏది?
ఎ) 2          బి) 6         సి) 7         డి) 1


7. ఉత్కృష్ట వాయువుల సాధారణ ఎలక్ట్రాన్‌ విన్యాసం?
ఎ) ns2 np1          బి) ns2 np3
సి) ns2 np5         డి) ns2 np6


8. 1వ గ్రూపు, 2వ గ్రూపు మూలకాల సాధారణ ఎలక్ట్రాన్‌ విన్యాసం ఏమిటి?
ఎ) ns1 np1, ns2 ns2    బి) ns1, ns2
సి) ns2 np1, ns2 np2 
 డి) పైవేవీకావు


9. కిందివాటిలో ప్రాతినిధ్య మూలకాలకు ఉదాహరణ ఏది?
i) ఇనుము    ii) జింక్‌      iii) నైట్రోజన్‌
iv) సోడియం  v) కాల్షియం vi) మెగ్నీషియం
vii) కార్బన్‌      viii) క్లోరిన్‌
ఎ) i, ii, vi, vii    బి) iii, iv, v, vi, vii, viii
సి) ii, iv, vi, viii డి) i, iii, v మాత్రమే


10. మొట్టమొదట మూలకాలను వర్గీకరించిన శాస్త్రవేత్త?
ఎ) డొబరైనర్‌          బి) మెండలీవ్‌  
సి) హెన్రీ మోస్లే      డి) కొస్సెల్‌


11. కిందివాటిలో మూలకం ఏది?
ఎ) H     బి) H2     సి) H2O      డి) H2O2


12. కిందివాటిలో క్లోరిన్‌ మూలకం సంకేతం ఏమిటి?
ఎ) Ch        బి) Cl      సి) Cr      డి) Co

 

13. కిందివాటిలో ద్రవస్థితిలోని మూలకం ఏది?
ఎ) హైడ్రోజన్‌          బి) సోడియం  
సి) మెర్క్యురీ          డి) ఆక్సిజన్‌


14. కిందివారిలో మూలకాల వర్గీకరణకు కృషి చేసింది? 
ఎ) మెండలీవ్‌         బి) లూథర్‌ మేయర్‌  
సి) ఎ, బి          డి) గెలూసాక్‌


15. మెండలీవియం అనే మూలకం పరమాణు సంఖ్య?
ఎ) 100    బి) 102   సి) 108   డి) 101


16. కిందివాటిలో సరైంది ఏది?
ఎ) మూలక ప్రాథమిక ధర్మం పరమాణు భారం
బి) మూలక ప్రాథమిక ధర్మం పరమాణు సంఖ్య
సి) ఒకే గ్రూపులోని మూలకాలకు సారూప్య ధర్మాలు ఉంటాయి
డి) బి, సి 


17. వాతావరణంలో అధికంగా లభించే 18వ గ్రూపు మూలకం ఏది?
ఎ) He           బి) Ne     సి) Ar      డి) Xe


18. కింది ఏ ఉత్కృష్ట వాయువు బాహ్యకక్ష్యలో రెండు ఎలక్ట్రాన్‌లను మాత్రమే కలిగి ఉంటుంది?
ఎ) హీలియం       బి) నియాన్‌        సి) రేడాన్‌          డి) ఆర్గాన్‌


19. కొత్త మూలకాలకు, రసాయనాలకు నామకరణం చేసే సంస్థ ఏది?
ఎ) ACS         బి) IUPAC         సి) RSC          డి) పైవేవీకావు


20. మెండలీవ్‌ కాలం నాటికి తెలిసిన మూలకాలను ఎన్ని పీరియడ్‌లు, గ్రూపులుగా వర్గీకరించారు?
ఎ) 7 పీరియడ్‌లు, 8 గ్రూపులు   
బి) 7 పీరియడ్‌లు, 18 గ్రూపులు
సి) 8 పీరియడ్‌లు, 8 గ్రూపులు    
డి) 8 పీరియడ్‌లు, 18 గ్రూపులు


21. మూలకాలను అష్టకాలుగా వర్గీకరించి అష్టక పరికల్పనను ప్రతిపాదించింది ఎవరు?
ఎ) మెండలీవ్‌         బి) డొబరైనర్‌  
సి) న్యూలాండ్‌          డి) మోస్లే


22. మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అని ప్రతిపాదించింది ఎవరు?
ఎ) మెండలీవ్‌         బి) న్యూలాండ్‌  
సి) మోస్లే          డి) నీల్స్‌బోర్‌


23. కిందివాటిని జతపరచండి.
       జాబితా - i          జాబితా - ii
A) జడవాయువు           i) ఆక్సిజన్‌
B) ప్రాతినిధ్య మూలకాలు   ii) ఐరన్‌
C) పరివర్తన మూలకం        iii) నియాన్‌
D) అంతర పరివర్తన మూలకం iv) యురేనియం
ఎ) A-iii, B-i, C-iv, D-ii       బి) A-iii, B-ii, C-i, D-iv
సి) A-i, B-iii, C-ii, D-iv      డి) A-iii, B-i, C-ii, D-iv

సమాధానాలు: 1-డి, 2-సి, 3-బి, 4-సి, 5-ఎ, 6-డి, 7-డి, 8-బి, 9-బి, 10-ఎ, 11-ఎ, 12-బి, 13-సి, 14-సి, 15-డి, 16-డి, 17-సి, 18-ఎ, 19-బి, 20-ఎ, 21-సి, 22-ఎ, 23-డి.
 

మాదిరి ప్రశ్నలు

1. కింది అంశాలను జతపరచండి.
సమ్మేళనం     ప్రదర్శించే రంగు
a. ఆర్ధ్ర కాపర్‌     i. ఊదారంగు
   సల్ఫేట్‌
b. పొటాషియం     ii. ఆరెంజ్‌
   పర్మాంగనేట్‌
c. పొటాషియం     iii.  నీలిరంగు
   డైక్రోమేట్‌
1) a-iii, b-ii, c-i         2) a-ii, b-iii, c-i        3) a-iii, b-i, c-ii     4) a-ii, b-i, c-iii 


2. హేబర్‌ పద్ధతి ద్వారా అమ్మోనియా తయారీలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది?
1) నికెల్‌     2) ఇనుము 
3) మాంగనీస్‌     4) వెనేడియం


3. కింది ఏ d - బ్లాక్‌ మూలకాల ఎలక్ట్రాన్‌ విన్యాసాలు సాధారణ విన్యాసానికి భిన్నంగా ఉంటాయి?
1) జింక్, నికెల్‌       2) జింక్, కాపర్‌ 
3) కాపర్, క్రోమియం   4) నికెల్, క్రోమియం


4. అయనీకరణ ఎంథాల్పీకి ప్రమాణాలు ఏవి?
1) KJ.Mol-1        2) eV      3) 1, 2       4) nm 


5. ప్రతిపాదన (A): ఆవర్తన పట్టికలో ఒక గ్రూప్‌లో పై నుంచి కిందికి అయనీకరణ శక్తి తగ్గుతుంది.
కారణం (R): ఒక గ్రూప్‌లో పై నుంచి కిందికి పరమాణు పరిమాణం పెరగడం వల్ల ఎలక్ట్రాన్‌ను తీసేయడం సులభం.
1) A నిజం, కానీ R తప్పు.
2) A తప్పు, కానీ R నిజం.
3) A, R రెండూ నిజం, Aకు  R సరైన వివరణ.
4) A, R రెండూ నిజం, Aకు R సరైన వివరణ కాదు.


6. కింది అంశాలను జతపరచండి.
జాబితా - ఎ        జాబితా - బి
a. గ్రూప్‌-1          i. హాలోజన్‌లు
b. గ్రూప్‌-16        ii. క్షారలోహాలు
c. గ్రూప్‌-17         iii. చాల్కోజన్‌లు
1) a-i, b-iii, c-ii     2) a-ii, b-i, c-iii       3) a-iii, b-ii, c-i     4) a-ii, b-iii, c-i


7. కిందివాటిలో హాలోజన్‌ కానిది?
1) క్లోరిన్‌         2) ఫ్లోరిన్‌  
3) అయోడిన్‌      4) ఐరన్‌


8. కింది ఏ మూలకం జీవరాశుల్లో తప్పనిసరిగా ఉండే ఘటకం?
1) కార్బన్‌         2) నైట్రోజన్‌  
3) ఆక్సిజన్‌       4) పైవన్నీ


9. భూపటలంలో అత్యంత విస్తృతంగా లభించే మూలకం ఏది?
1) సిలికాన్‌         2) ఆక్సిజన్‌  
3) అల్యూమినియం    4) నియాన్‌


10. కార్బన్‌ కుటుంబంలోని మూలకాలు ప్రదర్శించే ముఖ్య ఆక్సీకరణ స్థితులు ఏవి?
1) +1, +3         2) +2, +4        3) +1, +2           4) +3, +4 


11. కింది ఏ ఆర్బిటాల్‌కు యవనికా ప్రభావం లేదా మరుగుపరచే సామర్థ్యం తక్కువగా ఉంటుంది?
1) s - ఆర్బిటాల్‌        2) p - ఆర్బిటాల్‌ 
3) d - ఆర్బిటాల్‌        4) f - ఆర్బిటాల్‌


12. కిందివాటిలో సమ ఎలక్ట్రానిక్‌ జాతులు ఏవి?
1) O-2, F-, Na+, Mg+2            2) O-2, F-, Fe+2, Al+3
3) F-, Na+, Mg+2, Al+3          4) 1, 3 


13. s - బ్లాక్‌ మూలకాలు ప్రదర్శించే ఆక్సీకరణ స్థితులు ఏవి?
1) +1, +2          2) +2, +3          3) +1, +3          4) +2, +4

 

14. కిందివాటిలో క్షారస్వభావం ఉన్న ఆక్సైడ్‌ను ఏర్పరిచేది?
1) కాల్షియం      2) మెగ్నీషియం  
3) సల్ఫర్‌         4) 1, 2


15. ఆవర్తన పట్టికలోని మొదటి మూలకం ఏది?
1) హీలియం       2) హైడ్రోజన్‌  
3) కార్బన్‌         4) ఆక్సిజన్‌


16. కిందివాటిలో ఫెర్రో అయస్కాంత లోహాలు ఏవి?
1) ఐరన్‌          2) కోబాల్ట్‌         3) నికెల్‌      4) పైవన్నీ 


సమాధానాలు: 1-3, 2-2, 3-3, 4-3, 5-3, 6-4, 7-4, 8-4, 9-3, 10-2, 11-4, 12-4, 13-1, 14-4, 15-2, 16-4.

Posted Date : 17-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌