• facebook
  • whatsapp
  • telegram

సంస్కృతి

''సమ్యక్ కృతి సంస్కృతి.. అంటే 'చక్కగా తీర్చిదిద్దినదీ' అని అర్థం. సంస్కృతి అంటే 'సంస్కరించి నది' ఈ సంస్కరించడమనేది నాగరకత పరంగా కావచ్చు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టూబొట్టు, కళలు, సాహిత్యం.. ఇలా ఒక జాతి ప్రజల జీవన విధానమే సంస్కృతి.''
ఒక జాతి / దేశం / ప్రజలు హీన స్థితి నుంచి మహోన్నత స్థితికి చేరడానికి చేసే ప్రయత్నమే సంస్కృతి. అంటే నాగరకత పరంగా ఆదిమ దశ నుంచి ఉన్నత స్థితికి.. సంచార స్థితి నుంచి స్థిర జీవితం గడిపే దశకు.. అవ్యవస్థీకృతమైన పాలన (ఉదా: తెగలు) నుంచి సువ్యవస్థీకృతమైన ప్రజాస్వామ్య పాలన దిశగా పయనించడానికి జరిగిన ప్రయత్నాలు.. ఈ పరిణామాలను క్రమానుగతంగా అధ్యయనం చేయడమే సంస్కృతి చరిత్ర.

 

చరిత్ర - సంస్కృతి

           చరిత్ర, సంస్కృతి అనే మాటలను అనేక సందర్భాల్లో ఒకే పదబంధంగా ప్రయోగిస్తున్నారు. ఈ రెండింటికీ నిర్దిష్ట వ్యత్యాసం ఉంది. చరిత్ర కేవలం రాజకీయ చరిత్రకు (పాలకులకు) ప్రాధాన్యమివ్వగా.. సంస్కృతి ప్రజల (పాలితులు) చరిత్రను విశదీకరిస్తుంది. ప్రజల సమగ్ర విధానాన్ని చిత్రించేదే సంస్కృతి.
20వ శతాబ్దం వరకు చరిత్రను రాజకీయ చరిత్రగానే భావించారు. ఎప్పుడైతే గతి తార్కిక భౌతికవాద దృక్పథంతో చరిత్రను అధ్యయనం చేయడం ప్రారంభమైందో.. అప్పటి నుంచి సామాజిక చరిత్రకు, సాంస్కృతిక చరిత్రకు ప్రాధాన్యం పెరిగింది. మహాకవి గురజాడ అప్పారావు 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అన్నారు. మహాకవి శ్రీశ్రీ రచించిన 'దేశ చరిత్రలు' అనే ఖండిక చరిత్రకు కొత్త భాష్యం చెప్పింది.
     'తారీఖులు, దస్తావేజులు, ఏ యుద్ధం ఎందుకు జరిగింది? ఆ ముట్టడికి అయిన ఖర్చు.. ఇవి కావోయ్ చరిత్రకు అర్థం. నైలునదీ నాగరకతలో సామాన్యుని జీవితమెట్టిది? ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలిప్పుడు.. తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. అది మోసిన బోయిలెవ్వరు?' అంటూ మహాప్రస్థానం ద్వారా చరిత్ర అధ్యయన గతిని మలుపు తిప్పారు శ్రీశ్రీ.
 భారతదేశంలో ప్రఖ్యాత చరిత్రకారులు రొమిలా థాపర్, ఎ.ఎల్.భాషమ్, డి.డి.కోశాంబి కృషి ఫలితంగా ప్రజల సామాజిక, సాంస్కృతిక చరిత్రకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనికి గతి తార్కిక భౌతిక దృష్టి, దృక్ఫథం తోడయ్యాయి. నాటి సమకాలీన సాహిత్యాన్ని కూడా ఈ ధోరణి ప్రభావితం చేసింది. తెలుగునాట అభ్యుదయ కవిత్వానికి ఇది ఆలంబనగా నిలిచింది.తెలంగాణ ప్రాంతం నుంచి మొదటి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని పొందిన రచన కూడా ప్రజల చరిత్రే. తెలంగాణ భాష, సాంస్కృతిక ఉద్యమాల్లో ప్రధాన భూమిక పోషించిన సురవరం ప్రతాపరెడ్డి రచించిన 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' అనే గ్రంథానికి ఈ పురస్కారం దక్కింది. తెలుగులో మరో ప్రముఖ సాంస్కృతిక చరిత్ర గ్రంథం ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం రచించిన 'ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి'. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేశారు.

 

భారతీయ సంస్కృతి ప్రాతిపదిక

సంస్కృతి రూపొందడంలో ప్రధానంగా రెండు విభిన్నమైన సిద్ధాంతాలున్నాయి. ఒకటి ఆదర్శవాద సిద్ధాంతం, మరొకటి భౌతికవాద సిద్ధాంతం.
 

ఆదర్శవాద సిద్ధాంతం

వేద కాలంలో రుషులు దైవ ప్రేరణ / అతీంద్రియ శక్తుల వల్ల ఏర్పరచుకున్న భావాలు కాలక్రమేణా ఆర్యుల సంస్కృతికి బీజాలు వేశాయి. వీరు ఈ ఆదర్శాన్ని సింధు, గంగా నది పరిసరాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆచరించారు. వీటి మూలంగా ఏర్పడిన భావాలు, సంస్థలు వేద సంస్కృతికి ప్రధానమైన భావాలు, సంస్కృతులుగా పరిణమించాయి.
 

భౌతికవాద సిద్ధాంతం

     ఒక సంస్కృతి ప్రారంభమవడానికి భౌతిక పరిసరాలే మౌలికమైన అవసరాలు / అంశాలు. ఆదిమ దశలో పరిసర వాతావరణం, భౌతిక వనరులు, ప్రజలు ఉపయోగించిన ఉత్పాదక సాధనాలు మానవ సమష్టి జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేశాయి. తద్వారా జీవితానుభవాల్లో తారసిల్లిన సిద్ధాంతాలకు, విశ్వాసాలకు స్థానం ఏర్పడి క్రమంగా నూతన సిద్ధాంతాలుగా, ప్రధానమైన భావాలుగా రూపుదిద్దుకున్నాయి.

      చారిత్రక, పురావస్తు శాస్త్ర అధ్యయనం ప్రకారం.. భౌతిక పరిసరాలు, ఆది భౌతిక సిద్ధాంతాల సమన్వయ ఫలితంగానే 'సంస్కృతి' పరిణామం చెందింది. ఈ రెండు సిద్ధాంతాల్లోనూ సంస్కృతి పరిణామ దశలో భౌతిక పరిసరాలు ప్రముఖ పాత్రను పోషించాయి. ప్రఖ్యాత చరిత్రకారుడు ఎస్.ఆబిద్‌హుస్సేన్ అభిభాషణ ప్రకారం.. భావాలు, సిద్ధాంతాలు, నమ్మకాల కంటే భౌతిక పరిసరాలు, సామాజిక పరిస్థితులే సంస్కృతి పరిణామానికి ప్రధానంగా దోహదం చేశాయి. అయితే ఈ భావాలు, సిద్ధాంతాలు, విశ్వాసాలు ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే సంబంధించినవి కావు. వాటికి వర్ణం, జాతి, భౌగోళిక ఎల్లలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఇవి స్థాపితమయ్యాయి. సంస్కృతి అనేది ఒక ప్రత్యేక ప్రాంతంలోన ేరూపుదిద్దుకుంటుంది. ప్రతి దేశంలోనూ విభిన్నమైన భావాలు, నమ్మకాలు ఉన్నప్పటికీ.. ఆయా దేశాల భౌగోళిక, సామాజిక పరిస్థితులపై అక్కడి సంస్కృతి ఆధారపడి ఉంటుంది. ఒక దేశ ప్రత్యేక సంస్కృతిలో అక్కడి భౌగోళికాంశాలు ప్రధానమైనవిగా ఉంటాయి. ఇవి భౌతిక రూపాలను ఏర్పరచడమే కాకుండా మానసిక వాతావరణం ఏర్పడేందుకు కూడా దోహదం చేస్తాయి. విభిన్న మతాలు, తాత్విక దృక్పథాలు ఉన్నప్పటికీ ఆ వాతావరణం ప్రజల మధ్య సమాన దృష్టిని, సమాన దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. ఈ జాతీయ మనస్తత్వం, మేధోసంపత్తే 'జాతీయ సంస్కృతి'కి ఆయువుపట్టు. ఈ భిన్న సంస్కృతులను జాతీయ సంస్కృతిలో భాగంగా మనం గ్రహించాలి. ప్రజలు తాము ఏ సమాజానికి చెందినా ఈ సమ్మిళిత, సమ్మిశ్రిత సంస్కృతిని తమదిగా భావించుకోవాలి. అప్పుడే 'జాతీయ సంస్కృతి' రూపొందుతుంది.
భారతీయ సంస్కృతి ఆవిర్భవించడానికి ప్రధాన కారణాలు భారత ప్రజల మేధోసంపత్తి, వివిధ ఉద్యమాల వైజ్ఞానిక ప్రభావం, వివిధ సంస్కృతుల సమ్మేళనం. చారిత్రక పూర్వయుగంలో భారతదేశంతో ఏర్పడిన తాత్కాలిక సంబంధ బాంధవ్యాల వల్ల విదేశీయులు ఇక్కడికి వచ్చి భారత్‌ను తమ దేశంగా భావించారు. అనంతరం విప్లవాత్మక, వైజ్ఞానిక ఉద్యమాలు కాలానుగుణంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ సంస్కృతి ఏర్పడింది.
* శకులు, ఇండో గ్రీకులు తదితరుల రాక వల్ల ఒక విశిష్టమైన సంస్కృతి ఏర్పడింది.
* బౌద్ధులు, జైనుల వల్ల గాంధార శిల్పకళ, వాస్తు శైలి అభివృద్ధి చెందాయి.
భౌతిక పరిస్థితులు, భౌతిక శక్తుల ప్రభావాలను పరిశీలిస్తే.. భారతదేశ ఆర్థిక విధానం వ్యవసాయ సంబంధమైందిగా అవతరించింది. ఈ భౌగోళిక పరిస్థితులు శాంతియుతమైన, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను ప్రోత్సహించాయి. యుద్ధం, దండయాత్రలు లాంటి విచ్ఛిన్నకర పరిస్థితులకు దారి తీయలేదు. ఈ చైతన్యమే భారతీయ సాంస్కృతిక చరిత్రలో ప్రతిబింబిస్తుంది.
ప్రజల జీవన విధానాన్ని గమనిస్తే.. వివిధ ప్రాంతాల్లో వైవిధ్యం కనిపిస్తుంది. అలాగే విద్యావంతులైన భారతీయుల్లోనూ, భారతీయ నాగరకతలోనూ ఎన్నో సమాన లక్షణాలు కనిపిస్తాయి. అనాదిగా ఈ దేశం ఎన్నో విదేశీ దండయాత్రలకు గురైంది. ఎన్నో విధాల అనైక్యతలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ భారతీయుల్లోని ఏకత్వ, సమానత లక్షణాలు జాతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటిచెప్పాయి.

 

తాత్విక జీవన విధానం

    ప్రపంచం అంటే ఏమిటి?, రేపు - ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే ఆందోళనలతో సతమతమవుతున్న ప్రజల ఆలోచనల్లో ప్రేమ, భక్తి అంకురించాయి. ఇలాంటి ఆలోచనలు మత సంబంధమైనవే కానీ తాత్విక సంబంధమైనవి కావు. అందుకే మత సంబంధమైన ఆలోచనావిధానం భారతదేశ సాంస్కృతిక జీవన విధానంలో భాగమైంది. ఈ రకమైన ఆలోచనల్లోని ఔన్నత్యం, భిన్నత్వంలో ఏకత్వమనే భావనలను భారతీయ మేధోసంపత్తి విశిష్ట లక్షణాలుగా పేర్కొనవచ్చు. ఇక్కడి ప్రజల వ్యవసాయ జీవన విధానం, భౌగోళిక పరిస్థితులు దేశ రాజకీయ నిర్మాణాన్ని, దేశాభివృద్ధిని మలచడంలో ప్రముఖపాత్ర పోషించాయి. భౌతిక, సామాజిక పరిసరాల ప్రభావం కూడా ఒక అంశమే అయినప్పటికీ.. దేశ రాజకీయ నిర్మాణంలో 'సంస్కృతి' కీలక భూమిక వహించింది. ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ భారతీయ మనస్తత్వం ఏకత్వాన్ని సాధించింది. కొన్ని అంశాలు సంఘర్షణకు పురిగొల్పినా అవి సామరస్యతను సంతరింపజేసుకుని ఒక విశిష్టమైన, మహోన్నతమైన సంస్కృతికి పునాది వేశాయి.
 

సంస్కృతి నిర్మాణం

     భారతదేశంలో చారిత్రక యుగానికి పూర్వమే ప్రసిద్ధిగాంచిన హరప్పా సంస్కృతి - సింధు నాగరకత వెల్లివిరిశాయి. వైదిక యుగం ప్రారంభంతో సువిశాల జాతీయ సంస్కృతి ఏర్పడింది. దీనిపై కొంత కాలానికి తలెత్తిన నిరసన భావాల ఫలితమే బౌద్ధ, జైన సంస్కృతుల ఆవిర్భావం. తర్వాత ఎన్నో సంఘర్షణలను తట్టుకుని భారతదేశ సాంస్కృతిక జీవన విధానం హైందవ సంస్కృతిగా పునరావిష్కృతమైంది. మళ్లీ మధ్యయుగంలో విచ్ఛిన్నకర శక్తుల ప్రభావానికి గురైనా.. మొగల్ చక్రవర్తుల హిందూ ముస్లింల సాంస్కృతిక సమ్మేళనంతో హిందుస్థానీ సంస్కృతి నిర్మాణం జరిగింది.
దేశంలో విభిన్న మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ప్రాంతాలు, భాషలు, మనస్తత్వాలు ఉన్నాయి. గతంలో ఎంతోమంది విదేశీయులు దండయాత్రలు చేశారు. అయినా భారత జాతీయ సంస్కృతి ఏకత్వం, సామరస్యం, వసుధైక కుటుంబ భావనతో మహోన్నతమైన సంస్కృతిగా వేల ఏళ్లుగా అప్రతిహాతంగా వెలుగొందుతోంది. ఇదే భారతీయ సంస్కృతి ఔన్నత్యం, గొప్పదనం.

 

ప్రపంచ ప్రఖ్యాత నాగరకత

     ఒక జాతి సమగ్ర జీవన విధానం సంస్కృతి.. సంపూర్ణ వికాసం పొందిన తీరును చిత్రించేది సంస్కృతి చరిత్ర. వేల ఏళ్ల కిందటే భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశిష్ట నాగరకత-సంస్కృతులు విలసిల్లాయి. నదీలోయలు సాంస్కృతిక వికాస కేంద్రాలయ్యాయి. తెలుగు నేలను ఏలిన తొలి చక్రవర్తులైన శాతవాహన సంస్కృతి కూడా పవిత్ర గోదావరి తీరాన్నే విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు ప్రవచించిన బౌద్ధ ఆధ్యాత్మిక ప్రవచనాలను కృష్ణవేణి తరంగిణులు ప్రతిధ్వనింపజేశాయి.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తెలంగాణలో మత వైవిధ్యం

     భారత దక్షిణాపథాన.. ప్రధానంగా తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన నాటి రాజుల కాలంలో వివిధ మతాలు ప్రాచుర్యం పొందాయి. ఒక్కో వంశీకుల కాలంలో ఒక్కో మతానికి విశేష స్థానం దక్కింది. శాతవాహనుల కాలం నుంచి కుతుబ్‌షాహీల వరకు వివిధ మతాలను ఆదరించినా.. మత సహనానికి పెద్దపీట వేయడం విశేషం. ఈ క్రమంలో అనేక ప్రఖ్యాత దేవాలయాలు.. వాటికి అనుసంధానంగా చెరువులు, ఇతర కట్టడాలు వంటివి నిర్మించిన పాలకులెందరో చరిత్రలో నిలిచిపోయారు. ఆనాటి మత పరిస్థితులు.. కాలక్రమేణా పరిణామాలు.. తదితర అంశాలపై అధ్యయన సమాచారం పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేకం..
    క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఉత్తర భారతాన రాజకీయ రంగంలో బౌద్ధ, జైన మతాలు సరికొత్త సంచలనాన్ని సృష్టించాయి. క్రమేపీ శాతవాహనుల కాలం నాటికి దక్షిణాన స్థిరపడ్డాయి. ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల కాలంలో విశేషంగా వ్యాప్తి చెందిన ఈ మతాలు కాకతీయుల కాలం నాటికి కనుమరుగయ్యాయి. శైవ, వైష్ణవ మతాలు బాగా విస్తృతం కావడంతో మహా విష్ణువు దశావతారాల్లో బుద్ధుడు కూడా ఒక అవతారమని భావించేవారు. అలాగే కుతుబ్‌షాహీల కాలంలో తెలంగాణ ప్రాంతం మతపరంగా ఒక కొత్త మిశ్రమ సంస్కృతిని ఏర్పరుచుకుంది.

 

శాతవాహనుల కాలం

    శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితుల్లో ఒక విశిష్టత కనిపిస్తుంది. చక్రవర్తులు వైదిక మతాన్ని అనుసరించి ఈ మతోద్ధరణకు కృషి చేశారు. గౌతమీపుత్ర శాతకర్ణికి ఉన్న 'ఏక బ్రాహ్మణ', 'ఆగమ నిలయ' లాంటి బిరుదులను బట్టి అతడు వర్ణాశ్రమ ధర్మాన్ని పరిరక్షించినట్లు తెలుస్తోంది. గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ఆధారంగా గౌతమీపుత్ర శాతకర్ణి వర్ణసాంకర్యాన్ని నిరోధించాడని చెప్పవచ్చు. శాతవాహన రాజులు యజ్ఞ యాగాది వైదిక క్రతువులు, అశ్వమేధ, రాజసూయ యాగాలు నిర్వహించారు. ఇంద్రుడు, వాసుదేవుడు, వరుణుడు తదితర హిందూ దేవతలను ఆరాధించారు. అయితే వీరి కాలంలో ఎక్కడా హిందూ దేవాలయాలున్న దాఖలాలు లేవు. పాలకులు మతం విషయంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ప్రభువులు వైదిక మతాన్ని అనుసరించగా రాణులు, అంతఃపుర స్త్రీలు, సామాన్య ప్రజలు బౌద్ధ మతాన్ని ఆరాధించారు. ఇందుకు నిదర్శనం తెలంగాణ ప్రాంతంలో విశేషంగా కనిపించే బౌద్ధ కట్టడ నిర్మాణాలే. అద్భుతమైన శిల్పకళతో బౌద్ధుల చైత్యాలు (ప్రార్థనా మందిరాలు), విహారాలు (విశ్రాంతి మందిరాలు), స్తూపాలు (సమాధులు - స్మారక మందిరాలు) లాంటివి నిర్మించారు. నల్గొండ జిల్లా కొండాపూర్, ఫణిగరి, నాగార్జున కొండల్లోనూ.. కరీంనగర్ జిల్లా పెద్ద బంకూర్, ధూళికట్ట తదితర ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలున్నాయి.
బాణుడి 'హర్షచరిత్ర' ప్రకారం మలి శాతవాహన చక్రవర్తుల్లో సుప్రసిద్ధుడైన యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధ మతాన్ని ఆచరించాడు. ఆచార్య నాగార్జునుడిని గురువుగా ఆరాధించి, అతడి సంస్మరణార్థం శ్రీ పర్వతం వద్ద ఒక చైత్యాన్ని నిర్మించాడు. ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమిత గ్రంథాన్ని మహాయాన బౌద్ధ మతానికి కరదీపికగా భావించేవారు. ఆచార్య నాగార్జునుడు 'సుహృల్లేఖ'ను రచించి యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితమిచ్చాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడి ఆధ్వర్యంలో తెలుగునేలపై మహాయాన బౌద్ధమతం విశేష ప్రాభవం పొందింది. తొలి శాతవాహన చక్రవర్తి శ్రీముఖుడు మొదట జైన మతాభిమాని అని కరీంగనర్ జిల్లా మునులగుట్ట వద్ద లభించిన పురావస్తు ఆధారాల (నాణేలు) ద్వారా తెలుస్తోంది.

 

ఇక్ష్వాకుల కాలం

    ఇక్ష్వాకుల వంశ పాలకుడు వాశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు కూడా అశ్వమేధ, రాజసూయాది యాగాల్ని నిర్వహించి వైదిక మతాన్ని అనుసరించినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా ఆదరించాడు. వీర పురుషదత్తుడు తొలుత వైదిక మతాన్నే అనుసరించినప్పటికీ తర్వాత బౌద్ధమతాన్ని ప్రోత్సహించడానికి బౌద్ధ విహారాలకు, మహా చైత్యాలకు భూరి విరాళాలిచ్చాడు.. దానధర్మాలు చేశాడు. నాగార్జున కొండలో లభ్యమైన శాసనాధారాల్ని బట్టి రాజ కుటుంబాలకు చెందిన మహిళలు కూడా బౌద్ధ మహామఠాలకు (విజయపురి) దానాలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్ష్వాకుల కాలంలో విజయపురి ప్రపంచంలోనే అతిపెద్ద మహాయాన బౌద్ధక్షేత్రంగా పేరు పొందింది. అయితే ఎహూవుల చాంతమూలుడు మాత్రం వైదిక మతాన్నే అనుసరించాడు. హిందూ-వైదిక పురాణ దేవతలకు గుళ్లు కట్టించాడు. బౌద్ధమతాన్ని కూడా ప్రోత్సహించాడు. వీరగళ్(అంటే రాజు కోసం జీవించి, మరణించే అంగరక్షకులు)ల జ్ఞాపకార్థం విగ్రహాలు ప్రతిష్ఠించే సంప్రదాయం ఇక్ష్వాకుల నుంచే ప్రారంభమైంది.
 

విష్ణు కుండినుల కాలం

   విష్ణు కుండినుల పాలకుడైన గోవిందవర్మ మొదట బౌద్ధమతాన్ని అనుసరించినప్పటికీ తర్వాత శైవమతాన్ని అవలంబించాడు. బౌద్ధ బిక్షువులకు, బ్రాహ్మణులకు, పేదలకు విశేషంగా దానధర్మాలు చేశాడు. అతడి భార్య, కుమార్తె (ప్రిత్వీముల) ఇంద్రపురిలోని బౌద్ధ సంఘానికి విహారాన్ని నిర్మించి ఇచ్చినట్లు తెలుస్తోంది. జయాశ్రయుడనే బిరుదున్న రెండో మాధవ వర్మ 11 అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగం లాంటి ఎన్నో అగ్ని స్తోమ యాగాలు చేశాడు. హిరణ్యగర్భ, పౌండరీక యాగాలు కూడా చేశాడు. రెండో విక్రమేంద్రవర్మ శైవ మతస్థుడైనప్పటికీ ఇంద్రపురిలో ఉన్న బౌద్ధ విహారానికి తన వంతు ప్రోత్సాహాన్ని అందించాడు. విష్ణుకుండినుల్లో చివరివాడైన నాలుగో మాధవవర్మ తన రాజ్య, వంశ కీర్తి ప్రతిష్ఠలను ద్విగుణీకృతం చేయాలన్న సంకల్పంతో హిందూ మతాలను ఆచరించాడు. అశ్వమేధం లాంటి వైదిక యజ్ఞ యాగాదులను నిర్వహించాడు. దక్షిణాదిన దేవాలయాలను నిర్మించడమనే సంప్రదాయం వీరి కాలంలోనే మొదలైంది. విజయపురిలో యాగశాల, ప్రముఖ దేవతలైన పుష్పభద్ర(శివ), మహాసేన, అష్టభుజ(విష్ణువు), హారితి(శక్తి) దేవాలయాలను నిర్మించారు. విజయపురిలోని శ్రీపర్వతలోయ బౌద్ధ మతానికి ఏవిధంగా కేంద్ర బిందువైందో.. అదేరీతిలో విజయపురి సమీపంలోని మంచికల్లు శివ, విష్ణు, శక్తి క్షేత్రంగా ప్రఖ్యాతి చెందింది. ఇంతటి ప్రాభవం ఉన్న బౌద్ధమతం క్రీ.శ. 7వ శతాబ్దం నాటికి క్రమేపీ క్షీణించసాగింది. పౌరాణిక హిందూ మతంలో బుద్ధుడిని అంతర్లీనంగా భావించి ఆరాధించేవారు.
 

శైవ మతానికి ప్రాచుర్యం

   శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినుల కాలంలో వర్ధిల్లిన బౌద్ధ, జైన మతాల ప్రాబల్యానికి దీటుగా చాళుక్య పాలకులు శైవ మతానికి ప్రాచుర్యం కల్పించే ప్రయత్నం చేశారు. చాళుక్య వంశంలోని పాలకులు అనేక యజ్ఞ, యాగాది క్రతువులను క్రమం తప్పకుండా వివిధ సందర్భాల్లో నిర్వహించేవారు. తెలంగాణలో ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, పోలవాస నాయకుల కాలంలో శైవమతానికి విశేష ఆదరణ, ప్రోత్సాహం లభించాయి. వీరి కాలంలో శ్రీశైల క్షేత్రం బహుళ ప్రాచుర్యం పొందింది. శ్రీశైల క్షేత్రానికి.. ప్రముఖ శైవ క్షేత్రాలైన త్రిపురాంతకం - తూర్పు, ఆలంపూర్ - పడమర, సిద్ధవటం - దక్షిణ, ఉమామహేశ్వరం - ఉత్తర ద్వారాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలంపూర్‌లోని శిల్పాల్లో బుద్ధుడు యోగముద్రలో ఉన్నట్లుగా చిత్రించి ఉంటుంది. విష్ణువు మిగతా అవతారాలు ఆ బుద్ధుడి చుట్టూ ఉన్నట్లుగా చెక్కారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వీరి కాలంలో ప్రధాన శైవక్షేత్రంగా వెలిసింది. ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల కాలంలో విశేష ఆదరణ పొందిన బౌద్ధ మతానికి వీరి కాలంలో క్రమంగా ఆదరణ తగ్గింది. అయితే జైన మతానికి మాత్రం ఆదరణ, ప్రోత్సాహం తగ్గలేదు. వేములవాడ చాళుక్యరాజు రెండో అరికేసరి కాలంలో 'త్రిభువన తిలక' అనే జైన బసతిని నిర్మించారు. ప్రముఖ కన్నడ కవి.. పంపకవి సోదరుడైన జిన వల్లభుడు చక్రేశ్వరితో కూడిన 24 మంది జైన తీర్థంకరుల విగ్రహాలను ప్రతిష్ఠించాడు. ఈ కాలానికి చెందిన బద్దెగ రాజు శుభధామ జినాలయాన్ని నిర్మించి ప్రఖ్యాత జైన కవి అయిన సోమదేవున్ని గురువుగా నియమించాడు. వీరి కాలంలోనే పటాన్‌చెరువు, బోధన్, ఉజ్జలి, కొలనుపాక, పెద కోడుమూరు, తొగరకుంట ప్రముఖ జైన క్షేత్రాలుగా వెలుగొందాయి. ఇవన్నీ పాలకుల భూరి విరాళాలు, దానధర్మాలతో పాటు, ప్రజల ఆదరణ వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాలుగా విలసిల్లాయి.
 

వైష్ణవ మత ప్రాచుర్యం

    క్రీ.శ. 10వ శతాబ్ది నాటికి తెలంగాణలో ప్రధాన పరిణామాలు.. శైవ మతానికి ప్రాబల్యం పెరగడం.. శైవ, జైన మతాల్లో అంతఃకలహాలు చెలరేగడం.. క్రమంగా ఇది పౌరాణిక శైవమతానికి దారులు వేసింది. ఇదే కాలంలో తెలంగాణ ప్రాంతంలో శైవమతంతో పాటు వైష్ణవ మతం కూడా ప్రాచుర్యాన్ని పొందింది. బూరుగుగడ్డ, మక్తల్, లింగగిరి ప్రాంతాలు ప్రముఖ వైష్ణవ మత ప్రాంతాలుగా పేరుపొందాయి. విష్ణుకుండినుల పాలకుడైన మాధవవర్మ శ్రీ పర్వతస్వామిని ఆరాధిస్తూ తనను ఆ స్వామితో సరిసమానంగా ఊహించుకున్నాడు. వైష్ణవ మతారాధకుల్లో సామాన్యంగా కనిపించే లక్షణం భక్తుడు-భగవంతుడూ వేరు కాదనే భావన. వైష్ణవుల్లో భగవంతుడు అవతార పురుషుడనేది గట్టి విశ్వాసం. బుద్ధుడు కూడా ఆ అవతార పరంపరలో విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకడనే భావన ఏర్పడింది. వైదిక బ్రాహ్మణ మతానికి బదులుగా పౌరాణిక మతం వచ్చి, దేవాలయాల్లోని పూజా విధానానికి నాంది పలికింది. భక్తి భావం పెరిగి, పూజాది ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేవారు. ఫలితంగా క్రీ.శ. 10వ శతాబ్దం నుంచే దేవాలయాల నిర్మాణాలు ఎక్కువయ్యాయి.
 

కాకతీయుల కాలం

     కాకతీయుల కాలంలో జరిగిన ప్రధాన మత పరిణామం జైన, బౌద్ధ మతాలు క్షీణించడం. విష్ణుమూర్తి దశావతారాల్లో బుద్ధుడిని తొమ్మిదో అవతారంగా భావించడం.. బౌద్ధం పౌరాణిక హిందూ మతంలో విలీనం కావడం కనిపిస్తాయి. క్రీ.శ. 12వ శతాబ్దం వరకు.. అంటే తొలి కాకతీయుల కాలం దాకా పాలకులు జైన మతాన్ని అవలంబించారు. మలి కాకతీయులైన రెండో ప్రోలరాజు నుంచి తెలంగాణలో శైవ మత ప్రాచుర్యం ప్రారంభమైంది. ఈ కాలంలోనే జైన-శైవ మతాల మధ్య సంఘర్షణలు మొదలయ్యాయి. కర్ణాటకలో ప్రారంభమైన వీరశైవ మత ఉద్యమం ప్రభావంతో పాల్కురికి సోమనాథుడు తెలుగుదేశంలో వీరశైవ మత ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. తన రచనల ద్వారా వీరశైవానికి ప్రాభవం తెచ్చాడు. విశేషమేమంటే వీరశైవ మతానికి ప్రాచుర్యం కల్పించిన సోమనాథుడు జన్మించిన పాలకుర్తి.. పరమ భాగవతుడైన పోతన జన్మస్థలం బమ్మెర.. రెండూ ఇరుగు పొరుగు గ్రామాలు. వీరశైవ మత గ్రంథాలను ఆగమాలని, గురువులను జంగములని అంటారు. వీరశైవ ఉద్యమ ప్రభంజనంలో తెలంగాణలోని పటాన్‌చెరువు ప్రాంతంలోని జైన వసతులు విధ్వంసానికి గురైనట్లు పాల్కురికి సోమన తన 'పండితారాధ్య చర్రిత'లో ప్రస్తావించాడు. తెలంగాణలో వర్ధమానపురం, హన్మకొండ, వరంగల్, పటాన్‌చెరువు, పూడూరు, ఆలంపూర్, కొలనుపాక, వేములవాడ, పొట్లపల్లి ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న జైన తీర్థంకరుల శిలా విగ్రహాలే ఇందుకు నిదర్శనం. హన్మకొండలోని నేటి పద్మాక్షమ్మ గుట్ట తొలుత జైన క్షేత్రమే. క్రమేపీ తెలంగాణలోని అనేక జైన మతాలయాలను శైవాలయాలుగా మార్చడంతో జైనమతం కనుమరుగైంది. శైవ మతం విస్తృతమైంది. శైవమతంలో కాలాముఖ, కాపాలిక, పాశుపత, వీరశైవం, ఆరాధ్యశైవం లాంటి శాఖలు ఉద్భవించాయి. కాకతీయ పాలకులు-కాలాముఖ, పాశుపత శైవాన్ని ఆచరించి, శైవాచార్యులకు భూదానాలు చేశారు. రెండో బేతరాజు హన్మకొండలో శివపురాన్ని నిర్మించి కాలాముఖ శైవాచార్యుడైన రామేశ్వర పండితుడికి మాన్యంగా ఇచ్చాడు. కాకతీయ మహాదేవుని శివ గురువు ధ్రువేశ్వర పండితుడు. ఆ కాలం నాటి శివాచార్యుల్లో విశ్వేశ్వర శివాచార్యులు సుప్రసిద్ధులు. గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రునికి కూడా విశ్వేశ్వర శివగురువే శివదీక్షను ఇచ్చాడు. రుద్రమదేవి తమ గురువైన విశ్వేశ్వర శివాచార్యుడికి.. గోళకీ మఠాన్ని నెలకొల్పేందుకు వీలుగా వెలగపూడితో పాటు మందడ గ్రామాన్ని దానం చేసినట్లు మల్కాపురం శాసనం ద్వారా తెలుస్తోంది. శ్రీపతి, మల్లికార్జున, మంచన పండితులు కలిసి ఆరాధ్య శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. పండిత త్రయంగా ప్రసిద్ధి చెందిన వీరు ఆ సంప్రదాయానికి ప్రాచుర్యం కల్పించారు.
 

ఆర్థిక వనరులుగా దేవాలయాలు

కాకతీయులు దేవాలయాల నిర్మాణాన్ని పుణ్యకార్యంగా భావించి అనేక ఆలయాలను నిర్మించారు. దేవాలయాల్లోనే శాసనాలు వేయించారు. వాటికి దగ్గర్లోనే చెరువులను నిర్మించే సంప్రదాయానికి కూడా వీరే శ్రీకారం చుట్టారు. ఈ చెరువుల నుంచి వ్యవసాయానికి సాగునీరు అందించడం ద్వారా దేవాలయాలకు ఆర్థిక పురిపుష్టిని కల్పించేవారు. దీన్నిబట్టి ఆ కాలం నాటి దేవాలయాలు కేవలం సాంఘిక, సాంస్కృతిక కేంద్రాలుగానే కాకుండా ఆర్థిక వనరులుగా కొనసాగినట్లుగా తెలుస్తోంది. వివిధ వృత్తి పనులు చేసుకునేవారు, కళాకారులు ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దేవాలయాల మీద ఆధారపడేవారు. కాకతీయుల కాలం నాటి ప్రధాన, ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో హన్మకొండ వేయి స్తంభాల గుడి, పాలంపేట రామప్పగుడి, వరంగల్ భద్రకాళి ఆలయం.. నాగులపాడు, పిల్లలమర్రి, ఐనవోలు ఆలయాలున్నాయి. దుర్గాష్టమి, దసరా, దీపావళి, సంక్రాంతి, మహా శివరాత్రి, ఉగాది, ఏరువాక లాంటివి ఆనాటి హిందువుల ముఖ్యమైన పండగలు. కాకతీయుల కాలంలో మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేవారు. ఏటా కొత్తగా వ్యవసాయం, సేద్యపు పనులు ప్రారంభించడానికి ముందు 'ఏరువాక' పండగ నిర్వహించేవారు. ఎల్లమ్మ, కాకతమ్మ, ఏకవీర, పోలేరమ్మ, మారమ్మ, మల్లారమ్మ గ్రామదేవతలతో పాటు దుర్గ, పార్వతి, శివుడు, విష్ణువు అవతారాలను పూజించేవారు. వీరి కాలంలోనే బ్రహ్మనాయుడు మాచర్లలో చెన్న కేశవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. అప్పట్లో మధ్వాచార్యుల అనుచరులను మధ్వులు అని పిలిచేవారు. తెలంగాణలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదగిరి గుట్ట. కాకతీయల కాలంలో శైవం - వైష్ణవం మధ్య సమన్వయం సాధించడానికి తిక్కన హరిహరనాథ తత్వాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. ఈ విధంగా పౌరాణిక హిందూ మతం సర్వమత సమభావనను ప్రతిపాదించింది. కుల దేవతలు, గ్రామ దేవతలు, వీరుల ఆరాధన కూడా కాకతీయుల కాలంలో కొనసాగింది. ఓరుగల్లులో ఈ గ్రామ దేవతల పూజలు, పల్నాటి వీరుల పూజలు జరిగినట్లు 'క్రీడాభిరామం' ద్వారా తెలుస్తోంది.
 

పద్మనాయకుల కాలం

కాకతీయుల అనంతరం రేచర్ల పద్మనాయకులు వైష్ణవ మతాన్ని అనుసరించారు. సర్వజ్ఞ సింగభూపాలుడు గొప్ప వైష్ణవ మతాభిమాని. మాదానాయకుడు కూడా రామానుజాచార్యుల కుమారుడైన వెంకటాచార్యుడి శిష్యుడై వైష్ణవ మతాన్ని అవలంబించాడు. పాలకులు వైష్ణవ మతాన్ని ఆచరించగా సామాన్య ప్రజలు తీవ్రవాద శైవంపై ఆదరాభిమానాలు చూపించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వీరి కాలంలోనే 'రణము కుడుపు' అనే ఆచారం ప్రారంభమైంది. 'రణము కుడుపు' అంటే మృతుల రక్త మాంసాలతో బియ్యం కలిపి వండిన ఆహారాన్ని రణ దేవతలకు, భూత ప్రేతాలకు నివేదన చేయడం. శైవ-వైష్ణవాల మధ్య పోటాపోటీ ఉన్నప్పటికీ ప్రజలు సామరస్య పూర్వకంగా మెలిగి మత సహనాన్ని పాటించారు.
 

కుతుబ్‌షాహీల కాలం

    కుతుబ్‌షాహీ పాలకులు పరమత సహనం పాటించి రాజ్యాన్ని పరిపాలించారు. నాటి పాలకులు ముస్లింలు కాగా రాజ్యంలోని అత్యధిక శాతం ప్రజలు హిందువులు. గోల్కొండ పాలకులు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. కుల, మత భేదం లేకుండా మ్తొతం 14 పండగలను జాతీయ పర్వదినాలుగా ప్రకటించారు. మహమ్మద్ కులీ కుతుబ్‌షా 'వసంతోత్సవాల'ను ప్రారంభించాడు. గోల్కొండ బోనాల పండగ నాటి నుంచే నిర్వహించేవారు. నేటికీ తెలంగాణలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలు మొదట గోల్కొడ కోట నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. హిందూ ముస్లింల సామరస్యానికి ప్రతీక పీర్ల పండగ. హిందూ ముస్లింల సఖ్యత, హిందువులను ఉద్యోగాల్లో నియమించడం వంటి పరిణామాలు మొగలులు గోల్కొండపై దండెత్తడానికి దారితీశాయి. హిందూ ముస్లింల సఖ్యత, సామరస్యం కుతుబ్‌షాహీల కాలంలో అత్యున్నత స్థితికి చేరుకుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను రూపుమాపి, కాలజ్ఞాన తత్వాల ద్వారా మత సామరస్యానికి కృషి చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ కాలానికే చెందివాడు కావడం విశేషం. గోల్కొండ ప్రభువులు క్రైస్తవుల కోసం మచిలీపట్నంలో చర్చిని కూడా నిర్మించి తమ ఔన్నత్వాన్ని నిరూపించుకున్నారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సాంస్కృతిక వారసత్వం

      ఘనమైన సాంస్కృతిక వారసత్వ చరిత్ర తెలంగాణ ప్రాంతం సొంతం. మొదటి పాలకులైన శాతవాహనులు పవిత్ర గోదావరి నదీ తీరం నుంచే రాజ్యస్థాపనకు శ్రీకారం చుట్టారు. కృష్ణా నది అవతలి తీరం వరకు అధికారాన్ని విస్తరించారు. వీరంతా సంస్కృతి, కళలు, వాస్తు-శిల్పం, సాహిత్యం పరంగా తెలంగాణ నేలను సుసంపన్నం చేశారు. తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ / ముదిగొండ చాళుక్యులు, కాకతీయులు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు పాలించారు. ఆయా రాజవంశీయుల పాలన కాలాల్లో సాంస్కృతిక చరిత్రలోని ప్రధాన విభాగమైన సమాజ స్థితిగతులు, సామాజిక పరిణామ క్రమం ఇది.
ఒక నిర్దిష్ట సమాజంలో అభివృద్ధి చెందిన లేదా రూపొందిన ప్రజల జీవన విధానాలను ఒక తరం నుంచి మరో తరం అందిపుచ్చుకున్న వైనాన్ని వ్యక్తపరిచేదే సాంస్కృతిక వారసత్వం. దీన్ని మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. వస్తు / భౌతిక సంస్కృతి: భవన నిర్మాణాలు, వస్తుసామగ్రి, వాస్తు-శిల్పం, స్మారక చిహ్నాలు.
2. సాంఘికాచారాలు: ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు.
3. సహజసిద్ధ సాంస్కృతిక వారసత్వం: సహజసిద్ధమైన నదీలోయలు, పర్వత పంక్తులు, అరణ్యాలు, సరోవరాలు.

 

శాతవాహనుల కాలంలో..

  శాతవాహనుల కాలం నాటి సమాజంలో వర్ణ వ్యవస్థ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వర్ణ వ్యవస్థను మొదటిసారిగా రుగ్వేదంలోని పురుష సూక్తంలో ప్రస్తావించారు. సమాజంలో వృత్తిపరమైన విభజన కనిపిస్తుంది. వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయి కానీ కులవ్యవస్థ రూపొందలేదు. సమాజాన్ని నాలుగు తరగతులుగా విభజించారు.
మొదటి తరగతి: మహా సేనాపతి, మహాభోజ, మహారథికలు లాంటి కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి పాలకులు, అధికారులు ఉండేవారు.
రెండో తరగతి: అమాత్యులు, మహాపాత్రులు, శ్రేష్ఠి లేదా వర్తకులు.
మూడో తరగతి: వైద్యులు, చేతివృత్తులవారు, రైతులు, నగలు తయారు చేసేవారు.
నాలుగో తరగతి: శ్రామికులు, నేత పనివారు, కుమ్మరులు.

 

తండ్రిదే ప్రధానపాత్ర

  శాతవాహనుల కాలం నాటి సమాజంలో ఆర్య సంస్కృతి లక్షణాల వారసత్వం కొనసాగింపు కనిపిస్తుంది. ఆర్యుల కాలంలోనూ కుల వ్యవస్థ రూపొందలేదు. వృత్తిని బట్టి సమాజంలో వర్గ విభజన కనిపిస్తుంది. ఒకే కుటుంబంలో విభిన్నమైన వృత్తులు-ప్రవృత్తులు కలిగిన సభ్యులున్నారు. ఆర్యులది 'పితృస్వామ్య వ్యవస్థ'. శాతవాహనుల కాలం నాటి సమాజం కూడా 'పితృస్వామ్య' స్వభావాన్నే ఆచరించింది. పురుషాధిక్యతే కనిపిస్తుంది. కుటుంబ ఆలనా పాలనా విషయాల్లో తండ్రిదే ప్రధాన పాత్ర. ఇంటికి యజమాని తండ్రి (గృహపతి). నాటి సమాజంలో పురుషాధిక్యత కొనసాగినప్పటికీ సాహిత్య, శాసనాధారాల ద్వారా స్త్రీలు ఉన్నత స్థానంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శాతవాహన చక్రవర్తులు (గౌతమీపుత్ర శాతకర్ణి, వాశిష్టీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి) తమ పేర్లకు ముందు 'మాతృ సంజ్ఞలు' ధరించడాన్ని బట్టి నాటి సమాజంలో స్త్రీలకు గల ప్రాధాన్యం అర్థమవుతుంది. పాలనా వ్యవహారాల్లో కూడా పతుల పదవీ బాధ్యతల్లో స్త్రీలు భాగస్వాములయ్యారు.
 

సమష్టితత్వం

  సమష్టి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ సభ్యులంతా ఒక్కతాటిపై నడిచేవారు. సమష్టిగా బౌద్ధ సంఘాలకు, ఆరామాలకు విరాళాలు ప్రకటించడాన్ని దీనికి రుజువుగా చెప్పవచ్చు. అమరావతి, నాసిక్ శాసనాలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాయి. సమాజంలో కులాంతర, దేశాంతర వివాహాలు జరిగేవి. హాలుడు శ్రీలంక రాజకుమారి లీలావతిని వివాహం చేసుకున్నాడు. శాతవాహనులు మరాఠాలతో, శకులతో వివాహ సంబంధాలను ఏర్పరుచుకున్నారు. సమాజంలో వితంతువుల పట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శించేవారు. శకులు, కార్దమాకులు స్థానికులతో వివాహ సంబంధాలను ఏర్పరచుకోవడం. అలాగే క్షత్రియులు - వ్యాపారం; బ్రాహ్మణులు, వైశ్యులు - ఉద్యోగాలు చేయడం ఆధారంగా సమాజంలో వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ అది నిరంకుశం కాదని తెలుస్తోంది. శాతవాహన చక్రవర్తులు వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణను తమ కర్తవ్యంగా భావించారు. గౌతమీపుత్ర శాతకర్ణి 'వర్ణసాంకర్యాన్ని' నిరోధించాడని 'నాసిక్ శాసనం' ద్వారా తెలుస్తోంది.
 

 

శాతవాహనుల అనంతరం..

   శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ/ముదిగొండ చాళుక్యులు పరిపాలించారు. శాతవాహన చక్రవర్తుల్లా సువిశాల రాజ్యాన్ని పాలించక పోయినప్పటికీ విభిన్నమైన పాలకుల వల్ల వైవిధ్యభరితమైన సమ్మిళితమైన సంస్కృతి ఏర్పడింది.
శాతవాహన యుగానంతర కాలం నాటికి సమాజంలో వర్ణ వ్యవస్థ బలపడింది. సమాజంలో బ్రాహ్మణులు ఉన్నత స్థానంలో ఉన్నారు. పాలకులతో గౌరవ సత్కారాలు, పన్నులేని అగ్రహారాలను విరాళంగా పొందేవారు. విదేశీయులైన శకులు కూడా వైదిక సంప్రదాయ సహిత సమాజంలో భాగమయ్యారు. సమాజంలో శాతవాహనుల కాలం నాటి వృత్తిపరమైన విభజన కాకుండా కులం ప్రాబల్యం పెరగడం గమనార్హం. విష్ణుకుండినులు, చాళుక్యులు క్షత్రియులు కాకపోయినప్పటికీ బ్రాహ్మణ సాంకర్యంతో తమ వైభవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. నాటి సమాజంపై బౌద్ధమత ప్రభావం వల్ల నిమ్నవర్ణాల వారు ఏకమయ్యారు. బ్రాహ్మణులు వేదాలు, శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించి పురోహితులుగానే కాకుండా పాలన విభాగంలోనూ ముఖ్యమైన పదవులను అలంకరించారు. చంద్రశ్రేష్ఠిలు - వర్తక సంఘాలుగా, వడ్డెపనివారు - శిల్పకారులుగా సమాజంలో గుర్తింపు పొందారు.
సమాజంలో స్త్రీల స్థానం, ప్రాభవం శాతవాహనుల కాలంలో మాదిరిగానే కొనసాగింది. ఇక్ష్వాక వంశ పాలకులు (వాశిష్టీపుత్ర శ్రీ శాంతమూలుడు లాంటివారు) కూడా మాతృ సంజ్ఞలను ధరించారు. స్త్రీలు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవించారు. రాణివాసపు స్త్రీలు విరివిగా బౌద్ధ, జైన మత గురువులకు విరాళాలిచ్చారు. సమాజంలో ఆనాటికే మేనరిక వివాహాలు ఆచారంలో ఉన్నాయి. వీరపురుషదత్తుడు మేనత్తల కుమార్తెలు ముగ్గురినీ వివాహమాడాడు. సమాజంలో బహుభార్యత్వం కనిపిస్తుంది. వేశ్యలు ప్రతిష్ఠ, అంతస్తుకు చిహ్నమయ్యారు. వీరికాలంలో కూడా కుల, దేశాంతర వివాహాలు జరిగాయి. వీరపురుషదత్తుడు తన కుమార్తె 'కొడబలిసిరి'ని చుటు కులస్థుడైన వనవాసి మహారాజుకు ఇచ్చి వివాహం చేశాడు. నాటి సమాజంలో అత్యధిక సంఖ్యాకులైన శూద్రులు సైన్యంలో ఎక్కువగా చేరారు. శూద్రులు ఒక వర్గంగా కాకుండా చేసే వృత్తిని బట్టి వివిధ శాఖలుగా ఏర్పడ్డారు. కొందరు బ్రాహ్మణులతో సమానంగా రాణించడానికి ప్రయత్నించారు. క్రీ.శ. 13వ శతాబ్దం ఆరంభం నాటికి బ్రాహ్మణులు, క్షత్రియుల ఆధిపత్యం, ప్రాభవం తగ్గిపోయి.. కమ్మ, వెలమ, రెడ్డి లాంటి వ్యవసాయదారుల కులాలు ఆవిర్భవించాయి. వర్తక, వ్యాపారాలు నిర్వహించే వైశ్యేతర కులస్థులు కూడా తమ పేర్ల చివర 'సెట్టి', 'కోమటి' అనే మాటలను చేర్చుకున్నారు. సమాజంలో వర్ణవ్యవస్థ, వర్గ విభజన ఉన్నప్పటికీ ప్రజలు సామరస్య పూర్వకంగా జీవనం సాగించడం ఈ శాతవాహన - కాకతీయుల మధ్యయుగం కాలం నాటి విశేషంగా చెప్పొచ్చు.

 

సామాజిక విస్తృతి

   కాకతీయుల కాలంనాటి సమాజంలో కూడా చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింది. సమాజంలో వృత్తి, ప్రాంతాన్ని బట్టి అనేక కులాలు, ఉపకులాలు విస్తృతంగా ఏర్పడ్డాయి. ఈ కాలంనాటి శాసనాలు, సాహిత్యాధారాలు సమాజంలో 'అష్టాదశ ప్రజలు (18 కులాలు)' ఉన్నట్లుగా పేర్కొంటున్నాయి. ప్రతి కులానికి, ఉపకులానికి వృత్తి సంఘాలు ఉండేవి. వీటిని 'సమయాలు' అంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు, సాలెలు, తెలికులు (నూనె వ్యాపారులు), తమ్మడ్లు (వ్యవసాయం), గొల్లవారు (పశుపోషణ), ఈదులవారు (గీత కార్మికులు), మంగలి, కుమ్మరి, మేదరి, వెలమ, కరణం (భూముల లెక్కలు), రెడ్లు (వ్యవసాయం), ఉప్పరి (మట్టి పని), మచరాసి (బెస్త, చేపలు పట్టడం), మేర, పెరిక (వ్యవసాయం, వాణిజ్యం), ఎరుకలి (బుట్టలు అల్లడం), కాసె (రాళ్లు కొట్టడం) మొదలైన కులాలు, ఉపకులాలను ప్రధానంగా పేర్కొన్నారు. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగర జీవితాన్ని, వివిధ వృత్తులను 'ప్రతాప చరిత్ర' కూడా ప్రస్తావించింది. బ్రాహ్మణులు, మంత్రులు, యోధులు, వైశ్యులు, పద్మనాయకులు (వెలమ), విశ్వకర్మలు, కాపులు, ఎడిగలు (గీత కార్మికులు), కుంభకరులు (కుమ్మరులు), పట్టుసాలెలు (పట్టునేతవారు), పద్మసాలె (నేత కార్మికులు), మేదరులు, బెస్తలు, రజకులు, వేశ్యలు, పూటకూళ్లవారు ఓరుగల్లు నగర జీవన సంస్కృతిలో భాగమయ్యారు.
బ్రాహ్మణ కులస్థుల్లోనూ వైదికులు (వేదశాస్త్రాల అధ్యయనం, పౌరోహిత్యం), నియోగులు (రాజాశ్రయంలో ఉద్యోగాలు, పదవులు) అనే శాఖలు ఏర్పడ్డాయి. వైదికుల్లో కూడా వారు అధ్యయనం చేసిన వేదశాఖను బట్టి రుగ్వేదులు, శుక్ల యజుర్వేదులు, కృష్ణ యజుర్వేదులు అనే విభాగాలు ఏర్పడ్డాయి. ప్రాంతాన్ని బట్టి వారు అనుసరించే కులాల్లోనూ ఉపకులాలు ఏర్పడ్డాయి. వేంగినాటి, పాకనాటి, వెలనాటి, తెలంగాణ బ్రాహ్మణులుగా వ్యవహారంలోకి వచ్చారు. ఈ కాలంలో బ్రాహ్మణులకు, దేవాలయాలకు పన్ను మినహాయింపుతో కూడిన భూములను దానం చేయడం విస్తృతమైంది. దీంతో వీటి వివరాలను లిఖిత పూర్వకంగా నమోదు చేయడం, భద్రపరిచి పర్యవేక్షణ చేయడానికి ఉద్యోగుల ఆవశ్యకత ఏర్పడింది. కాయస్థ, కరణం, కరణిక, లేఖిక, ధర్మలేఖిక మొదలైన ఉద్యోగులకు ఈ బాధ్యతల్ని అప్పగించడంతో వీరు 'కాయస్థ' అనే ఉపకులంగా ఆవిర్భవించారు. దీంతో రాజాస్థానాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసినట్లయింది. కాకతీయ ప్రభువులకు 'కాయస్థులు' మంత్రులుగా కూడా పనిచేశారు. వర్ణవ్యవస్థలో అట్టడుగున ఉన్న శూద్రుల పరిస్థితి మెరుగవడం ఈ కాలం నాటి ప్రధాన సామాజిక పరిణామం. వీరిని వ్యవసాయదారులుగా పరిగణించారు. రెడ్లు, వెలమలు, కమ్మలు రాజాస్థానాల్లో ఉన్నతోద్యోగాల్లో నియమితులయ్యారు. వైశ్యుల స్థాయి తగ్గడంతో వారిని శూద్రులతో సమానంగా పరిగణించారు.

 

ఉద్యమాల ప్రభావం

   కాకతీయుల కాలంనాటి తెలంగాణ సమాజంలో వీరశైవం, శ్రీవైష్ణవ ఉద్యమాల ప్రభావం కూడా గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. వీరశైవం సమాజంలోని బ్రాహ్మణ వర్గం ఆధిపత్యాన్ని సవాల్ చేసింది. కుల వ్యవస్థను నిరసించింది. సనాతన సంప్రదాయాలను వ్యతిరేకించింది. బాల్యవివాహాలు, వైధవ్యం లాంటి సాంఘిక దురాచారాలను ఎండగట్టింది. ప్రధానంగా కమ్మరులు, చర్మకారులు, సాలెవారు మొదలైన కులాల వారు వీరశైవంలో చేరి సంస్కరణలకు కారణమయ్యారు. రామానుజాచార్యులు ప్రచారం చేసిన శ్రీవైష్ణవం మానవులంతా ఒక్కటేనని, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు కృషిచేసి వారికి దేవాలయ ప్రవేశాన్ని కల్పించింది. పల్నాడులో బ్రహ్మనాయుడు 'చాపకూడు' పేరుతో సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశాడు. తెలంగాణ ప్రాంతంలో బ్రాహ్మణేతరులైన రామానుజాచార్యుల అనుచరులను సాతానులని, దాసరులని పిలుస్తున్నారు. నాటి సమాజాన్ని బాల్యవివాహాలు, సతీసహగమనం, దేవదాసీ, బహుభార్యత్వం, కన్యాశుల్కం, వేశ్యావ్యవస్థ లాంటి సామాజిక దురాచారాలు పట్టిపీడించాయి. దేవాలయాల్లో జీవనం గడుపుతూ తమ ఆట, పాటలతో రంజింపచేయడం దేవదాసీల వృత్తిగా ఉండేది. ఉన్నత, మధ్యతరగతి వర్గాల ప్రజల్లో బహుభార్యత్వం ఉండేది. రాచరికంలో స్త్రీలకు గౌరవ, మర్యాదలను కల్పించారు. దక్షిణ భారత చరిత్రలోనే మొదటిసారిగా మహిళను పరిపాలకురాలిని చేసిన ఘనత కాకతీయులదే. ముప్పమాంబ, మైలాంబ, కుందమాంబ తదితర స్త్రీలు విరివిగా భూదానాలు చేసినట్లు, చెరువులను తవ్వించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
ముఖ్యంగా కాకతీయల కాలంనాటి ప్రజల సాంఘిక పరిస్థితులను తెలుసుకోవడానికి ఆధారం వినుకొండ వల్లభరాయుడు రాసిన 'క్రీడాభిరామం'. ఓరుగల్లు నగరంలోని ప్రజల సమగ్ర జీవన విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ నగరంలోని వెలిపాలెం, మేదరివాడ, అంగడి వీధి, మట్టియవాడ (మటైవాడ) తదితర వీధులను ప్రస్తావించారు. కోట గోడపై.. గడియారం, దేవాలయాలు, పూటకూళ్ల భోజనం, తోలుబొమ్మలాట, వేశ్యలు, కవి, గాయక వైతాళికులు, కోడిపందేలు, బంతులాట, దొమ్మరాటలు, మొదలైన వాటిని చిత్రించారు. సమాజంలో సామరస్య వాతావరణం క్రమంగా తగ్గి కుల వైషమ్యాలు, విశృంఖలత్వం పెరిగిపోయింది. రెడ్లు - వెలమల మధ్య అధికారం కోసం పోటీ విపరీత పరిణామాలకు దారి తీసింది.

 

సమ్మిశ్రిత సమాజం

కుతుబ్‌షాహీల కాలంనాటి సమాజంలో తెలంగాణలో ఒక విశిష్టమైన సమాజ నిర్మాణం జరిగింది. వర్ణవ్యవస్థ ప్రాబల్యం స్థానంలో సమాజంలో హిందువులు, ముస్లింలు అనే రెండు ప్రధాన వర్గాలు ప్రాముఖ్యం వహించాయి. హిందువుల్లో రాజోద్యోగులు, వర్తకులు, రైతులు ముఖ్య వర్గాలు కాగా.. ముస్లింలలో ప్రభుత్వోద్యోగులు, వర్తకులు ప్రధాన వర్గాలు. హిందూ జనాభాలో బ్రాహ్మణుల సంఖ్య బాగా తగ్గిపోయింది. హిందూ జనాభాలో అనేక ఉపకులాలు, శాఖలు ఏర్పడ్డాయి. కాపులు, రెడ్లు, బలిజలు, వెలమలు, వడ్రంగులు, కమ్మరి, నేత, బోయ, దర్జీ, మత్స్యకారులు, రజక, నాయీబ్రాహ్మణ తదితర జనాభా ఎక్కువ. హిందువులను పాలనా వ్యవస్థలోని అత్యున్నత ఉద్యోగాల్లో సైతం నియమించారు. రాజధాని గోల్కొండకు మధ్య ఆసియా ప్రాంతం నుంచి కవులు, కళాకారులు, వివిధ రకాల వృత్తి నిపుణులు, ఇరాన్‌కు చెందిన అఫాకీలు తరలివచ్చారు. వీరి వలసల ఫలితంగా తెలంగాణలోని భాగ్యనగరంలో ఒక విశిష్టమైన సమ్మిశ్రిత సంస్కృతి రూపుదాల్చింది. పాలకులు రాజ్యంలోని జనాభాలో మెజార్టీ భాగమైన హిందువుల ఆచార వ్యవహారాలను గౌరవించారు. హిందూ దేవాలయాలకు, పండితులకు విశేషంగా ఇనాములు ఇచ్చారు. బ్రాహ్మణులకు అగ్రహారాలను దానం చేశారు. సమాజంలో బహుభార్యత్వం, కన్యాశుల్కం, సతీసహగమనం, వేశ్యా వ్యవస్థ తదితర సాంఘిక దురాచారాలు కొనసాగాయి. వేశ్యలకు ప్రభుత్వ ఆదరణతో పాటు సమాజంలో గౌరవ, మర్యాదలను కల్పించారు. కుత్‌బ్‌షాహీ పాలకులు సతీసహగమనాన్ని రూపుమాపడానికి ప్రయత్నించారు.
సమాజంలోని ప్రజల ఆచార వ్యవహారాల్లో ఉత్తర భారత, హిందుస్థానీ ప్రభావం కనిపిస్తుంది. పురుషులు తలపై పొడవైన టోపీ, కుర్తా - పైజామా ధరించగా.. స్త్రీలు సాధారణంగా చీర, రవిక ధరించినప్పటికీ పేద స్త్రీలు రవికను అంతగా వాడలేదు. ముస్లిం స్త్రీలు పైజామా, దుపట్టాలను విరివిగా ధరించారు. స్త్రీ, పురుషులిద్దరూ బంగారు నగలు, ఆభరణాలను ధరించారు. రెడ్డి, బ్రాహ్మణ కులస్థులు మిద్దె ఇళ్లలో నివసించేవారు. వారి ఇళ్లలోనే పశువులకు, వాటి మేతకు కొంత స్థలాన్ని కేటాయించేవారు. వేలకొద్దీ వ్యభిచారుల గృహాలు గోల్కొండలో ఉండేవి. దేవాలయాలు, రాజాస్థానాలు, ముస్లింల పండగలు, శుభకార్యాల్లో 'నృత్యం' ఆనవాయితీగా మారింది. నేటికీ సంపన్నుల విందు వినోదాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది.
  

జీవనవిధానం

శాతవాహనుల కాలం నాటి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారాలు హాలుడి 'గాథాసప్తశతి', అమరావతి స్తూపంలోని శిల్పాలు. 'అత్త', 'పాడి', 'పొట్ట' లాంటి తెలుగు మాటలు 'గాథాసప్తశతి'లో ఉన్నాయి. తెలుగువారు వివిధ సందర్భాల్లో పాడుకునే పాటల ప్రస్తావన కూడా ఉంది. భాష సామాజిక సంపద. శాతవాహనుల కాలం నాటి ప్రజల భాష ప్రాకృతం కాగా రాజ భాష సంస్కృతం. అమరావతి స్తూపంపై కనిపించే మొదటి తెలుగు మాట 'నాగబు'. అమరావతి, కార్లే స్తూపాలపై చెక్కిన శిల్పాల్లోని స్త్రీలు, పురుష ప్రతిమలను బట్టి నాటి వస్త్రధారణ పద్ధతులు తెలుస్తున్నాయి. పురుషులు ధోతీ, ఉత్తరీయంతో పాటు తలపాగా ధరించేవారు. స్త్రీలు చాలా తక్కువ దుస్తులను వాడేవారు. శరీరమంతా కప్పుకోవడానికి ఒకే వస్త్రాన్ని ఉపయోగించేవారు. నాటి స్త్రీలకు ఆభరణాలు, నగలు అంటే మక్కువ. చెవులకు రింగులు, గాజులు, ఉంగరాలు, జుంకాలు, మురుగులు, వడ్డాణం, హారాలు ధరించేవారు. పురుషులు కూడా కర్ణాభరణాలు, మురుగులు, హారాలు ధరించేవారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సామాన్య జీవితాన్ని గడపగా.. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ప్రజలు సంగీత ప్రియులని, తీరిక వేళల్లో చదరంగం, నాట్యం వీరికి వినోద కార్యకలాపాలని తెలుస్తోంది. సంగీత పరికరాలైన వీణ, మృదంగం, వేణువులను ఉపయోగించడాన్ని బట్టి వీరు కళాప్రియులని తెలుస్తోంది. శాతవాహనుల కాలంనాటి ప్రజలు ఆహారప్రియులు, ఆరంభశూరులని ఒక విదేశీ చరిత్రకారుడి అభిప్రాయం.
 

భారతీయ సాంస్కృతిక వారసత్వపు ఔన్నత్యంపై గాంధీజీ ఏమన్నారంటే..

    ''భారతీయ సాంస్కృతిక వారసత్వం అనేది భారతదేశంలో నిలదొక్కుకోవడానికి వచ్చిన విభిన్న సంస్కృతుల మేళవింపు. అది భారతీయ జీవన విధానాన్ని ప్రభావితం చేసింది. మరోవైపు దేశ ప్రజలు స్వతహాగా ఇక్కడి మట్టి, నేలతల్లి స్ఫూర్తిగా ప్రభావితులయ్యారు. సహజంగానే ఇక్కడి మట్టి, నేల విశిష్టమైన సాంస్కృతిక సమ్మేళనానికి స్ఫూర్తినిచ్చింది. అమెరికాలో మాదిరిగా కాకుండా ఇక్కడ సహజసిద్ధంగానే జనించిన స్వదేశీ భావనే ఇలాంటి సమ్మిశ్రిత సంస్కృతికి ఆధారమైంది. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్క సంస్కృతికి సాధికారమైన స్థానముంది. ఇక్కడి సంస్కృతి సుస్థిరమైన శాంతిని తనలో ఐక్యం చేసుకుంటుంది. అక్కడి సంస్కృతిలో మాత్రం సామరస్యం కాకుండా ఒక కృత్రిమమైన, బలవంతపు ఐక్యత కనిపిస్తుంది".

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సాంస్కృతిక వారసత్వం

మాదిరి ప్రశ్నలు

1. శాతవాహనుల కాలం నాటి సామాజిక వ్యవస్థ ఏది?
ఎ) పితృస్వామికం బి) మాతృస్వామికం సి) పై రెండూ డి) ఏదీకాదు
జ: (ఎ)

 

2. శాతవాహనుల కాలం నాటి ప్రజల సాంఘికాచారాలను తెలియజేసే గ్రంథం ఏది?
ఎ) బృహత్కథ బి) కాతంత్ర వ్యాకరణం సి) గాథాసప్తశతి డి) సుహృల్లేఖ
జ: (సి)

 

3. తిథి, వార, నక్షత్ర, పక్ష, మాసాదులతో కూడిన 'పంచాంగం' ఎవరి కాలం నుంచి వాడుకలోకి వచ్చింది?
ఎ) శాతవాహనులు బి) ఇక్ష్వాకులు సి) విష్ణుకుండినులు డి) చాళుక్యులు
జ: (బి)

 

4. 'మాచల్దేవి' కాకతీయ ప్రతాపరుద్రుడికి ఏమవుతుంది?
ఎ) వారకాంత బి) కులకాంత సి) ప్రియురాలు డి) పైవన్నీ
జ: (ఎ)

 

5. శాతవాహనుల కాలంనాటి సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందిన స్త్రీల ప్రాభవం ఎవరి కాలంలో దిగజారింది?
ఎ) ఇక్ష్వాకులు బి) విష్ణుకుండినులు సి) కాకతీయులు డి) కుతుబ్‌షాహీలు
జ: (సి)

 

6. సాంఘిక దురాచారాలు ప్రబలిన కాలం ఎవరిది?
ఎ) శాతవాహనులు బి) విష్ణుకుండినులు సి) ఇక్ష్వాకులు డి) కాకతీయులు
జ: (డి)

 

7. ఎవరి కాలంలో చండాలులు 'పంచమ కులం'గా ఏర్పడ్డారు?
ఎ) కాకతీయులు బి) చాళుక్యులు సి) ఇక్ష్వాకులు డి) శాతవాహనులు
జ: (ఎ)

 

8. కాకతీయుల కాలం నాటి సమాజంలో అత్యధిక సంఖ్యాక ప్రజలు ఎవరు?
ఎ) బ్రాహ్మణులు బి) వైశ్యులు సి) శూద్రులు డి) ఎవరూకాదు
జ: (సి)

 

9. కాకతీయుల కాలం నాటి వివిధ వృత్తుల గురించి పేర్కొంటున్న గ్రంథం ఏది?
ఎ) క్రీడాభిరామం బి) బసవ పురాణం సి) ప్రతాపచరిత్ర డి) ఎ, సి
జ: (డి)

 

10. కాకతీయుల కాలం నాటి సమాజంలో ఎన్ని కులాలవారు ఉన్నట్లుగా శాసనాలు, సాహిత్యంలో ప్రస్తావించారు?
ఎ) 18 బి) 12 సి) 8 డి) 4
జ: (ఎ)

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహనుల నుంచి కుతుబ్‌షాహీల దాకా.. వ్యవ‌సాయ, వ్యాపార ప్రగ‌తి, ప‌ట్టణీక‌ర‌ణ‌

శాతవాహనుల కాలంలో అధిక సంఖ్యలో ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. అందుకే పాలకులు కూడా వ్యవసాయాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. నాటి కాలంలో వ్యవసాయ భూములను రెండు రకాలుగా వర్గీకరించారు. మొదటి రకం - రాజు సొంత భూములు. వీటిని 'రాజ కంఖేట' లేదా 'రాజక్షేత్రం' అనేవారు. రెండో రకం - రైతులు సాగు చేసుకునే భూములు. గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్ర పనులన్నీ గౌల్మిక (గ్రామపెద్ద) పర్యవేక్షణలో జరిగేవి. 'దున్నే వాడిదే భూమి' అనే భావనకు శాతవాహనుల కాలం నుంచే బీజాలు పడ్డాయి. శాతవాహన రాజులు దున్నే భూమిపై రైతులకు హక్కులను కల్పించారు. మొదటిసారిగా దక్కన్ ప్రాంతంలో భూములను దానం చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు.
భారతదేశ చరిత్రలో సింధు ప్రజల నుంచి మౌర్యుల కాలం వరకూ వ్యవసాయానికి వర్షాలే ఆధారం. మౌర్యుల అనంతరం శాతవాహనుల కాలంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు ప్రారంభమయ్యాయి. వీరు బావులు, చెరువులను తవ్వించారు. వీటి నుంచి నీటిని తోడటానికి 'ఉదక యంత్రాలు' ఉపయోగించినట్లు 'నాసిక్ శాసనం'లో ఉంది. నీటిని పట్టేందుకు/ తోడే సాధనం 'ఘటి యంత్రం'.. ముడిపత్తి నుంచి విత్తనాలు వేరుచేసే యంత్రాన్ని 'గరిక యంత్రం' అని వ్యవహరించేవారు. ఆధునిక వ్యవసాయ సామగ్రి, పరికరాల రూపకల్పన బాధ్యతలను గిల్టులు / శ్రేణులు చూసుకునేవి. భూమిని దున్నడానికి గాడిదలను, దున్నలను ఉపయోగించేవారు. శాతవాహనుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. పంటలో ఆరో వంతు శిస్తుగా చెల్లించాల్సి ఉండేది. పంటలో రాజు భాగాన్ని 'దయామేయం' అనేవారు.

 

భూమిశిస్తు ఆదాయ వనరు

ఇక్ష్వాకుల కాలంలో వర్తక, వ్యాపారాలు కుంటుపడ్డాయి. ఈ పరిస్థితులు పరోక్షంగా పాలకులను వ్యవసాయాభివృద్ధికి కృషి చేసేలా చేశాయి. భూమిశిస్తు ప్రధాన ఆదాయ వనరు కాబట్టి పాలకులు వ్యవసాయాభివృద్ధికి కృషి చేశారు. వాశిష్టీపుత్ర శాంతమూల చక్రవర్తి వ్యవసాయాన్ని విస్తరించడానికి బంగారు నాణేలను, భూమిని, నాగళ్లను, గోవులను దానం చేశాడు. ఇతడు లక్ష నాగళ్లను దానం చేసినట్లు.. ఇతడికున్న 'శతసహస్ర హాలక' అనే బిరుదును బట్టి తెలుస్తోంది.
విష్ణుకుండినులు కూడా వ్యవసాయాభివృద్ధికి విస్తృతంగా భూములను దానం చేశారు. ఫలితంగా తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యవసాయాభివృద్ధికి అవకాశం ఏర్పడింది. బ్రాహ్మణులకు భూదానాలు ఇచ్చారు. చాళుక్య పాలకులు కూడా ఉదారంగా భూదానాలు చేయడం ద్వారా వ్యవసాయాభివృద్ధికి కృషి చేశారు. బ్రాహ్మణులకు భూదానాలు ఎక్కువయ్యాయి. పైగా పన్ను రహిత భూములను విరాళంగా (అగ్రహారాలు) ఇచ్చారు.

 

నేలలు.. రకాలు

చాళుక్యుల కాలం నాటి శాసనాల ద్వారా వివిధ రకాల నేలలు / భూములు ఉన్నట్లు తెలుస్తోంది. అవి నల్లరేగడి నేల, నీరు లేదా పానీయ క్షేత్రం, పన్నస లేదా చిత్తడి నేల, రాజ్యభూమి, పూదొంట లేదా పూవనితోట లాంటివి. చాళుక్య రాజులు పన్నులను విస్తృతంగా వసూలు చేశారు. భూమిశిస్తు, సేద్యపు నీటి సౌకర్యంపై పన్ను, పశుగ్రాసంపై పన్ను, ఇంటిపన్ను, ఆఖరుకు వివాహాలపై కూడా పన్నులు విధించారు. దీన్నిబట్టి ప్రజలకు పన్నుపోటు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరికాలంలో పన్నుల వసూళ్లకు 'సుంకాధికారులు' (పన్ను వసూలు అధికారులు) కూడా నియమితులయ్యారు.
 

కౌలు విధానం

కాకతీయుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో కూడా వ్యవసాయం ప్రధాన పాత్ర పోషించింది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యాన్ని పండించినట్లు విదేశీ యాత్రికుడైన 'మార్కోపోలో' పేర్కొన్నాడు. వ్యవసాయ భూముల్లో రాజు సొంత భూములను అర్ధాదాయానికి కౌలుకిచ్చేవారు. ఇలాంటి కౌలుదార్లను 'అర్ధసిరి' అని వ్యవహరించే వారు. భూమిశిస్తు - పంటలో పదో వంతుగా ఉండేది. వీరి కాలంలో భూములను / పొలాలను 'గడ' లేదా 'దండ' లేదా 'కోల'ల్లో కొలిచేవారు. ఒక్కో 'గడ' పొడవు 32 జానలు ఉండేది. సాగు భూములను కాకతీయులు 3 రకాలుగా వర్గీకరించారు. అవి వెలిచేను, నీరునేల, తోటభూమి. 'కోరు, పుట్టి, సహితి' అనేవి వ్యవసాయం మీద విధించిన పన్నులు కాగా, గడ్డి మీద కూడా 'పుల్లరి పన్ను'ను విధించారు.
కుతుబ్‌షాహీల కాలంలో కూడా ఎక్కువమంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవించేవారు. పాలకులు వ్యవసాయభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం వ్యవసాయోత్పత్తులపైనే ఆధారపడింది. ప్రతి గ్రామంలోనూ సంతలు, వారాంతపు అంగళ్లు జరిగేవని.. నాటి రచన 'హంస వింశతి' ద్వారా తెలుస్తోంది. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. ఈ విధంగా ఆయా కాలాల్లో తెలంగాణ ప్రజల ప్రధాన ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయంపైనే ఆధారపడటంతో పాలకులు వ్యవసాయాభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చారు.

 

నీటి పారుదలకు పెద్దపీట

తెలంగాణ సమాజంలో ప్రాచీన కాలం నుంచీ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యం ఉన్న వ్యవసాయ రంగానికి వెన్నూ-దన్నూ కూడా పాలకులు కల్పించిన నీటిపారుదల సౌకర్యాలే. దేశంలో అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాల మేరకు మౌర్యుల కాలంలో తవ్వించిన జలాశయాల్లో 'సుదర్శన తటాకమే' మొదటిదని చెప్పవచ్చు. మౌర్యుల రాజకీయ వారసులైన దక్షిణాత్య శాతవాహనులు, వారి అనంతరం ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు వ్యవసాయాభివృద్ధికి విశేషంగా కృషి చేసినప్పటికీ చెరువులు, తటాకాలు, జలాశయాలు నిర్మించిన ప్రస్తావన లేదు. తెలంగాణలో తొలిసారిగా వేములవాడ / ముదిగొండ చాళుక్యుల కాలం నాటి శాసనాలు చెరువులను, తటాకాలను పేర్కొంటున్నాయి. మదివోజనకెరె (మెదక్), బీమసముద్రం (మహబూబ్‌నగర్), బృహత్ తటాక (నల్గొండ), అచ్చెబ్బె సముద్ర (చొప్పదండి) తదితర తటాకాలను చాళుక్య శాసనాలు ప్రస్తావించాయి. సహజ సిద్ధంగానే తెలంగాణ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, సారవంతమైన నేలలు లేకపోవడం వల్ల కృత్రిమ నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం పాలకులకు అనివార్యమైంది. అందుకే వారు చెరువులను, కుంటలను నిర్మించారు. వీటినే - కెరె, సముద్రం, కుంటలు, తటాకాలు అని పిలిచేవారు. ఇక్ష్వాకుల కాలం నుంచి మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి చాళుక్య పాలకులు కల్పించిన నీటిపారుదల సౌకర్యాల ఫలితంగా వ్యవసాయాభివృద్ధి సాధ్యమై ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి.
 

చెరువుల నిర్మాణం

నీటిపారుదల సౌకర్యాల విషయంలో తెలంగాణలో కాకతీయుల కాలాన్ని మహోజ్జ్వల ఘట్టంగా చెప్పవచ్చు. కాకతీయ పాలకులు చెరువులు / తటాకాల నిర్మాణాన్ని పవిత్ర కార్యంగా, సప్తసంతానాల్లో భాగంగా భావించి చెరువుల తవ్వకాన్ని విస్తృతంగా కొనసాగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'మిషన్ కాకతీయ', 'జలహారం' కార్యక్రమాలకు కాకతీయులు నిర్మించిన చెరువులే స్ఫూర్తిగా నిలిచాయి. కాకతీయుల కాలంలో చెరువులను సముద్రాలు అని కూడా పిలిచేవారు. కనీసం ప్రతి ఊరుకొక చెరువు నిర్మించి వ్యవసాయానికి కాకతీయులు ప్రాణవాయువై నిలిచారు.
కాకతీయ పాలకులు ముఖ్యంగా 'గొలుసుకట్టు చెరువు'లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అంటే ఒక చెరువు నిండిన తర్వాత మిగులు జలాలు కిందనున్న మరో చెరువులోకి చేరేవిధంగా చెరువులను నిర్మించడం. వీరు నిర్మించిన ప్రధాన చెరువుల్లో ఘనపురం, బయ్యారం, రామప్ప, పాకాల, లక్నవరం, చౌడ సముద్రం, బాల సముద్రం, కోట సముద్రం, నామ సముద్రం, అంబ సముద్రం, కేసముద్రం లాంటివి ఉన్నాయి. మొదటి ప్రోలరాజు కేసముద్రాన్ని, రుద్రదేవుడు పానగల్లులో రుద్ర సముద్రాన్ని, గణపతిదేవుని సేనాని రేచర్లరుద్రుడు పాకాల, రామప్ప చెరువులను తవ్వించారు. గణపతిదేవ చక్రవర్తి సోదరీమణులు మైలాంబ బయ్యారం, ధర్మసాగర్ చెరువులను; కుందాంబ కుంద సముద్రాన్ని నిర్మించారు. కాకతీయులు 'దశవంద ఇనాం' పద్ధతిలో చెరువుల్ని తవ్వించి రైతులకు సేద్యపు నీటి సదుపాయాల్ని కల్పించారు. అంటే - సేద్యపు నీటి ద్వారా ప్రయోజనం / లబ్ది పొందిన రైతులు తమ పంటలో పదో వంతు శిస్తు చెల్లించడం.
తెలంగాణలో వ్యవసాయ రంగానికి నీటిపారుదల సౌకర్యాల కల్పన విషయంలో కాకతీయుల వారసత్వాన్ని కుతుబ్‌షాహీ పాలకులు కొనసాగించారు. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా ఇబ్రహీంపట్నం, హుస్సేన్‌సాగర్ చెరువులను తవ్వించాడు. హుస్సేన్‌సాగర్ నిర్మాణం హుస్సేన్‌షావాలీ స్వీయ పర్యవేక్షణలో కొనసాగింది. రాజమాత మాసాహెబా 'మాసాహెబా ట్యాంక్‌'ను నిర్మించింది. కుతుబ్‌షాహీ పాలకులు నీటిపారుదల సౌకర్యాల పునరుద్ధరణ, నిర్మాణ బాధ్యతలను గ్రామం, సర్కారు, పరగణా, తరఫ్ స్థాయుల్లో ఆయా స్థానిక అధికారులకే అప్పజెప్పారు. వీటి నిర్మాణాలకు ప్రత్యేకంగా రాయితీలను కల్పించి ప్రోత్సహించారు.

 

నేత వస్త్రాలు, వజ్రాలు

వ్యవసాయంతో పాటు చిన్న, కుటీర పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషించాయి. శాతవాహనుల కాలం నాటి సమాజంలో ఉన్నత, సంపన్న వర్గాలుగా పేరొందిన వ్యక్తులు, వర్తకులు, శ్రేణులు ఆదాయార్జనలో, హోదాలో పాలకులతో పోటీపడ్డారు. ఫలితంగా చిన్నతరహా, కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. వివిధ వృత్తులు, వృత్తి ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందడం వల్ల పట్టణ ప్రాంతాల ప్రజలు సుఖసంతోషాలతో విలాసవంతమైన జీవితం గడిపినట్లు తెలుస్తోంది. శాతవాహనుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత పరిశ్రమలదే స్థానమని నాటి వాఞ్మయ, శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. నాసిక్, జున్నార్ శాసనాలు నాటి కాలంలోని వివిధ వ్యాపారాలు, పరిశ్రమలు, శ్రామికుల గురించి ప్రస్తావించాయి. వాటి ప్రకారం.. తిలపిష్టకులు - నూనె తీసేవారు, దమ్మికులు - ధాన్యం వర్తకులు, కొలికలు - నేత పనివారు, వసకరులు - వెదురు బుట్టలు అల్లేవారు లేదా మేదర్లు. ఈ కాలంలో చేతివృత్తులు బాగా విలసిల్లడం వల్లే పాలకులు చేతివృత్తులదారులపై 'కురుకర' అనే పన్ను విధించినట్లు తెలుస్తోంది. శాతవాహనుల అనంతరం విష్టుకుండినులు, ఇక్ష్వాకుల కాలంలో పారిశ్రామిక రంగం చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించలేదు. చాళుక్యుల కాలంలో తిరిగి చేతివృత్తులు, పరిశ్రమలు ప్రాభవం పొందాయి. కాకతీయుల కాలంలో నేత పరిశ్రమ, వజ్రాలు, నూనె పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించాయి. తెలంగాణ / తెలుగు ప్రాంతం ప్రాచీన కాలం నుంచే సన్నని వస్త్రాలు, చీరలకు ప్రసిద్ధి గాంచింది. ఓరుగల్లు రత్నకంబళ్లకు, తివాచీలకు, మఖ్‌మల్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందినట్లు కవులు, విదేశీ యాత్రికులు తమ రచనల్లో ప్రస్తావించారు. పాల్కురికి సోమనాథుడు తన 'పండితారాధ్య చరిత్ర'లో 50కి పైగా వివిధ రకాలైన వస్త్రాలను పేర్కొనడాన్ని బట్టి నాటి నేత పరిశ్రమ వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు. రుద్రమదేవి కాలంలో కాకతీయుల రాజ్యాన్ని సందర్శించిన వెనీస్ యాత్రికుడు మార్కోపోలో సైతం ఇక్కడి వస్త్ర-నేత కళా నైపుణ్యాన్ని చూసి ముగ్ధుడై ఇలా ప్రశంసించాడు..
'వీటి ధర చాలా ప్రియం. నిజంగా ఆ దుస్తులు సాలెగూడు కన్నా సన్నగా ఉంటాయి. ఆ వస్త్రాలను ధరించని రాజు కానీ, రాణి కానీ ప్రపంచంలో లేరు'.
       కాకతీయుల కాలంలో మైసోలియా (మచిలీపట్నం) ప్రాంతం వస్త్ర తయారీకి ప్రసిద్ధి చెందినట్లు ప్లీనీ తన 'నేచురల్ హిస్టరీ'లో పేర్కొన్నాడు. కాకతీయుల కాలం నుంచే గోల్కొండ ప్రాంతం వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో వజ్రాల గనులున్నట్లు మార్కోపోలో తెలిపాడు. కుతుబ్‌షాహీల కాలంలో గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. విదేశీ యాత్రికుడు మెతోల్డ్, గోల్కొండలో వజ్రాల గనులున్నట్లు పేర్కొన్నాడు. ట్రావెర్నియర్ అనే యాత్రికుడు కొల్లూరు వజ్రాల గని గురించి రాస్తూ సుమారుగా 60 వేల మంది కార్మికులు ఇక్కడ వజ్రాల పరిశ్రమల్లో పనిచేసేవారని పేర్కొన్నాడు. ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ తాను 1665లో ఔరంగజేబు కోశాగారంలో ప్రత్యక్షంగా 'కోహినూర్' వజ్రాన్ని చూశానని పేర్కొన్నాడు. చివరకు 1849లో లార్డ్ లారెన్స్ ఈ కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ మహారాణి విక్టోరియాకు బహుకరించాడు. దీని బరువు 106 క్యారెట్‌లు. ఈ వజ్రం సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో వెలికితీశారు. ఇది కొల్లూరు వజ్రాలగనిలో లభించినట్లు ట్రావెర్నియర్ అభిప్రాయపడ్డాడు. గోల్కొండ రాజ్యం వజ్రాలకే కాకుండా వస్త్రాలకు కూడా పేరు పొందింది. ఈ రాజ్యంలోనే అత్యంత మేలురకమైన వస్త్రాలకు, వస్త్రాల ఎగుమతులకు 'మైసోలియా' ప్రసిద్ధి చెందింది. కుతుబ్‌షాహీలు ముఘ్రా, తెలియా నేత పనివారిని ఆదరించారు. వీరి తర్వాత మొగల్ చక్రవర్తుల దాడులు తెలుగు ప్రాంతంలోని చేనేత పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

 

పట్టణ, నగరీకరణలు

తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలం నుంచి కుతుబ్‌షాహీల వరకు క్రమంగా వ్యాపారం, అభివృద్ధి విస్తృతి.. పట్టణాలు, నగరాల ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేశాయి. వ్యవసాయం, పరిశ్రమలు, వర్తక వ్యాపారాలు పుంజుకున్నాయి. దేవాలయాలు కూడా ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలం కావడంతో మధ్యయుగంలో అనేక వాణిజ్య నగరాలు, కొత్త పట్టణాలు వెలిశాయి. ప్రాచీన యుగంలో ధాన్యకటకం, అమరావతి, నాగార్జునకొండ, విజయపురి.. మధ్యయుగంలో వరంగల్, వేములవాడ, ఆలంపూర్, పొలాస, శ్రీశైలం, గోల్కొండ తదితర పట్టణాలు, నగరాలు అవతరించాయి. ఇవి ఆర్థిక వ్యవస్థకు కేంద్రాలై నగర జీవనాన్ని ప్రతిబింబించాయి.
 

వర్తక వ్యాపారాలు

వ్యవసాయం, పరిశ్రమలతో పాటు స్వదేశీ, విదేశీ వర్తక వాణిజ్యాలు తెలంగాణ ప్రజల ఆర్థిక వ్యవస్థలో ప్రాచీన యుగం నుంచే చెరగని ముద్రవేశాయి. శాతవాహనుల కాలంనాటి పరిశ్రమల వల్ల స్వదేశీ, విదేశీ వాణిజ్యం కూడా వృద్ధి చెందింది. దేశీయ వ్యాపారాలన్నీ 'గిల్డు' లేదా 'శ్రేణులు' అనే సంఘాల ద్వారా జరిగేవి. ప్రతి వృత్తిపనివారికి సంఘాలు ఉండేవి. శాతవాహనుల కాలంలో ఇలాంటివి 18 సంఘాలున్నట్లు తెలుస్తోంది. ఈ 'గిల్డు'లు అనేవి నేటి సహకార బ్యాంకుల్లా లావాదేవీలు నిర్వహించేవి. దేశీయ వ్యాపారం, రవాణా ఎడ్ల బండ్ల ద్వారా జరిగేవి. వస్తు మార్పిడి పద్ధతిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. వీరి కాలంలో విదేశీ వర్తకం బాగా సాగింది. శాతవాహనుల కాలం నాటి విదేశీ వర్తకం ఎక్కువగా రోమ్‌తోనే జరిగేది. విదేశాల్లో వర్తకం చేసే వ్యాపారులను 'సార్ధవాహులు' అనేవారు. ప్రధానంగా విదేశీ వ్యాపారం నౌకల ద్వారా సాగేది. సన్నని నాణ్యమైన మస్లిన్, పట్టు, సిల్కు వస్త్రాలు విదేశాలకు ఎగుమతయ్యేవి. పైఠాన్, తగర, జున్నార్, నాసిక్, వైజయంతిలు పశ్చిమ తీరాన ఉన్న నౌకా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. తూర్పు తీరాన కోడూరు, మైసోలియా, ఘంటశాలలు ప్రధాన రేవు పట్టణాలు. యజ్ఞశ్రీ శాతకర్ణి తన నాణేలపై ఒకవైపు నౌకబొమ్మను ముద్రించాడు. ఇక్ష్వాకుల కాలంలో వర్తక వ్యాపారాల్లో సహకార స్ఫూర్తి కొరవడటంతో వ్యాపారానికి, ఉత్పాదకతకు మధ్య సమన్వయం కుదురలేదు. ఫలితంగా చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు దెబ్బతిని వర్తక, వ్యాపారాలు మందగించాయి. శాతవాహనుల కాలం నాటి శ్రేణులు / నిగమాలు / వర్తక సంఘాలు ప్రాభవాన్ని కోల్పోయాయి. తిరిగి చాళుక్యుల కాలంలో అవి పునర్‌వైభవాన్ని సాధించడంతో ఆర్థిక వ్యవస్థ, వర్తక వ్యాపారాలు ఊపందుకున్నాయి.
కాకతీయల కాలం నాటి దేశీయ వ్యాపారంలో కూడా వర్తక సంఘాలు గణనీయమైన పాత్ర పోషించాయి. వీరి కాలంలోని ముఖ్య వర్తక సంఘాలు అయిదు. అవి.. స్వదేశీ, పరదేశీ, నానాదేశీ, నకరం, పెక్కుండ్రు. వీరి కాలంనాటి వ్యాపార వస్తు సామగ్రిలో మూడు రకాలైన భాండాలను (కొలత పాత్రలు) ఉపయోగించారు. అవి భూసి భాండం - ఆహారధాన్యాలు.. కొలభాండం - ఆవాలు, మిరియాలు, నువ్వుల నూనెలు.. మణిభాండం - ముత్యాలు, నగలు, విలువైన రాళ్లు, రత్నాలను కొలవడానికి ఉపయోగించేవారు. విదేశీ వ్యాపారం ప్రధానంగా రేవు పట్టణాల ద్వారా జరిగేది. సన్నని నూలు వస్త్రాలు, వజ్రాలు విదేశాలకు ఎగుమతయ్యేవి. తూర్పు తీరంలోని ప్రధాన రేవు పట్టణాలు మోటుపల్లి, మచిలీపట్నం, కృష్ణపట్నం, హంసలదీవి.

 

వర్తక కేంద్రాలు

కుతుబ్‌షాహీల కాలం నాటి వర్తక, వ్యాపార విశేషాలను సమకాలీన రచనలైన శుకసప్తతి, హంసవింశతిలు తెలియజేస్తున్నాయి. గోల్కొండ, హైదరాబాద్, వరంగల్, మచిలీపట్నం, కొండపల్లి, పెనుగొండ, తిరుపతి, ఉదయగిరి, నిజాంపట్నం, మోటుపల్లి తదితర ప్రాంతాలు వీరి కాలంనాటి ప్రధాన వర్తక కేంద్రాలు. నాటి తెలంగాణలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, పెద్దపెద్ద వర్తక కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వేములవాడ, గుల్బర్గా, ఔరంగాబాద్, అహోబిలం, శ్రీశైలం, తిరుపతి పట్టణాలు సుప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రాలుగా వైభవాన్ని సంతరించుకున్నాయి. ఆయా ప్రాంతాలు, క్షేత్రాల్లో ఏటా జరిగే వార్షికోత్సవాలు, తిరునాళ్లు, జాతరల సందర్భంగా భారీ ఎత్తున వ్యాపారం జరిగేది. దేశీయ వ్యాపారానికి సంబంధించి ఎద్దులపై, ఎద్దులబండ్లపై, ఒంటెలపై సరకులు రవాణా ద్వారా చేసేవారు. పెరిక (జనపనార సంచులు)ల్లో సరకులను నింపి చేరవేసేవారు. క్రమంగా పెరికలు ఒక సామాజిక వర్గంగా అవతరించారు. ఈనాటి దేశీయ / విదేశీయ వ్యాపారంలో స్థానిక వైశ్యులు / కోమట్లు, గౌరలు, విదేశీ అరబ్బులు, యూరోపియన్‌లు ప్రముఖ పాత్ర పోషించారు. వీరికాలంలో ప్రధానంగా విదేశీ వర్తకం మోటుపల్లి ఓడరేవు ద్వారా జరిగేది. గోల్కొండ వజ్రాలు, మేలురకపు వస్త్రాలు ఈ రేవు నుంచి ఐరోపా దేశాలకు ఎగుమతయ్యేవి. నౌకలపై సముద్రం ద్వారా జరిగే విదేశీ వర్తకాన్ని 'శుకసప్తతి'లో ఓడ బేరంగా పేర్కొన్నారు. 'ఓడకాడు' అనే మాట కూడా అందులో పేర్కొన్నారు. ఫ్రెంచ్ యాత్రికులైన ట్రావెర్నియర్, ధీవ్‌నాట్, బెర్నియార్.. బ్రిటిష్ వ్యాపారి థామస్‌బౌరీలు కుతుబ్‌షాహీల కాలంనాటి విదేశీ వర్తక, వాణిజ్య విశేషాలను వర్ణించారు. కుతుబ్‌షాహీల కాలం నాటి ప్రధాన రేవు పట్టణాలు మచిలీపట్నం, పులికాట్, నరసాపురం, నిజాంపట్నం. రేవు ప్రధానాధికారిని 'షాబందర్' అంటారు.
 

నాణేలు

    శాత‌వాహ‌నుల కాలంనాటి వ‌ర్తక సంఘాలు పంచ్ మార్క్‌డ్ నాణేల‌ను ముద్రించేవి. వీరి కాలంలో సీసం, పోటీన్‌, వెండి, బంగారు నాణేలు చెలామ‌ణిలో ఉన్నాయి. ఎక్కువ‌గా సీస‌పు నాణేలు వాడుక‌లో ఉన్నాయి. శాత‌వాహ‌నుల బంగారు నాణేన్ని 'సువ‌ర్ణాలు' అని, వెండి నాణేన్ని 'క‌ర్షాప‌ణ' అని వ్యవ‌హ‌రించేవారు. 1 సువ‌ర్ణ = 35 కర్షాపణాలు. శాతవాహన కాలంనాటి వర్తక వ్యాపారాల గురించి రాస్తూ ప్లీనీ తన 'నేచురల్ హిస్టరీ'లో 'రోమ్ దేశ బంగారం భారత్‌కు తరలిపోతుందని' పేర్కొన్నాడు. కాకతీయుల కాలంనాటి బంగారు నాణెం 'గద్వాణం', వెండి నాణేలు 'రూకలు'. నాణేలన్నింట్లోకెల్లా పెద్దది గద్వాణం. దీన్నే మాడ, నిష్కం అని కూడా అంటారు. 1 మాడ = 10 రూకలు. కుతుబ్‌షాహీల కాలం నాటి బంగారు నాణెం హొణ్ణు. విదేశీ వర్తకులు దీన్నే పగోడా అని కూడా అనేవారు. ఫణం / తార్ / కాసు అనేవి ఇతర నాణేలు. 'కుతుబ్‌షాహీల కాలంనాటి ప్రభుత్వ ఆదాయం రూ.5 కోట్లు' అని మెతోల్డ్ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించాడు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహనుల నుంచి కుతుబ్‌షాహీల దాకా.. వ్యవ‌సాయ, వ్యాపార ప్రగ‌తి, ప‌ట్టణీక‌ర‌ణ‌

మాదిరి ప్రశ్నలు

1. శాతవాహనుల కాలంలో వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణ చూసేది ఎవరు?
   ఎ) గౌల్మిక    బి) తిలపిష్టక    సి) కొలిక    డి) హాలిక
జ: (ఎ)

 

2. మొదటిసారిగా దక్కన్‌లో భూములను దానం చేసే విధానాన్ని ప్రారంభించింది ఎవరు?
   ఎ) మౌర్యులు    బి) శాతవాహనులు    సి) ఇక్ష్వాకులు    డి) విష్ణుకుండినులు
జ: (బి)

 

3. శాతవాహనుల కాలంలో రైతులు తాము పండించిన పంటలో రాజుకు చెల్లించే భాగాన్ని ఏమనేవారు?
   ఎ) బలి    బి) దయామేయం    సి) శిస్తు    డి) సుంకం
జ: (బి)

 

4. 'శతసహస్ర హాలక' బిరుదున్న పాలకుడు ఎవరు?
   ఎ) వాశిష్టీపుత్ర శాంతమూలుడు    బి) వీరపురుషదత్తుడు    సి) ఎహూబల శాంతమూలుడు    డి) రుద్రపురుషదత్తుడు
జ: (ఎ)

 

5. పశుగ్రాసం, వివాహాలపై పన్నులు విధించిన పాలకులు?
   ఎ) ఇక్ష్వాకులు    బి) విష్ణుకుండినులు    సి) చాళుక్యులు    డి) కాకతీయులు
జ: (సి)

 

6. కాకతీయుల కాలంలో వ్యవసాయం మీద విధించిన పన్ను?
   ఎ) కోరు    బి) పుట్టి    సి) సహితి    డి) అన్నీ
జ: (డి)

 

7. కుతుబ్‌షాహీల కాలం నాటి వర్తక వ్యాపార విశేషాలను ప్రస్తావించిన రచన ఏది?
   ఎ) శుకసప్తతి    బి) తపతీ సంవరణోపాఖ్యానం    సి) సుగ్రీవ విజయం    డి) ఏదీకాదు
జ: (ఎ)

 

8. కాకతీయుల కాలంలో చెరువులను ఏమని పిలిచేవారు?
   ఎ) కెరె    బి) తటాకం    సి) సముద్రం    డి) అన్నీ
జ: (డి)

 

9. 'కేసముద్రం' చెరువును తవ్వించింది ఎవరు?
   ఎ) రుద్రదేవుడు    బి) మొదటి ప్రోలరాజు    సి) గణపతిదేవుడు    డి) ప్రతాపరుద్రుడు
జ: (బి)

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వేములవాడ చాళుక్యుల కాలంనాటి సాంస్కృతిక పరిస్థితులు

నమూనా ప్రశ్నలు

1. 'ఉంచాలి' అంటే?
జ‌: పన్నులు లేని భూములు

 

2. తైర్థికులు అంటే?
జ‌: వర్తకులు

 

3. 'నకరములు' అంటే?
జ‌: వర్తక సంఘాలు

 

4. కిందివాటిలో జైన క్షేత్రం?
     ఎ) చెన్నూరు       బి) ఇందల్‌వాయి        సి) వేములవాడ      డి) వేల్పూరు
జ‌: సి(వేములవాడ)

 

5. వేములవాడ చాళుక్యుల రాజ భాష ఏది?
జ‌: కన్నడ

 

6. 'కవితాగుణార్ణవుడు' అనే బిరుదు ఎవరిది?
జ‌: పంప

 

7. చంపూ కావ్యమైన 'యశస్తిలక'ను రచించినవారు ఎవరు?
జ‌: సోమదేవసూరి

 

8. తెలుగు భాషలోని మొదటి కంద పద్యాలు కింది ఏ శాసనంలో ఉన్నాయి?
    ఎ) వేములవాడ శాసనం                           బి) కుర్క్యాల శాసనం
    సి) హనుమకొండ శాసనం                         డి) కురవగట్టు శాసనం
జ‌: బి(కుర్క్యాల శాసనం)

 

9. 'శ్యాద్వాదాచలసింహ' అనే బిరుదు ఎవరిది?
జ‌: సోమదేవసూరి

 

10. కాకతీయుల గురించి మొదటి ప్రస్తావన కింది ఏ శాసనంలో ఉంది?
      ఎ) హనుమకొండ శాసనం                             బి) మాగల్లు శాసనం
      సి) బీదర్ శాసనం                                          డి) వేంగి శాసనం
జ‌: బి(మాగల్లు శాసనం)

 

11. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు?
జ‌: ప్రోలరాజు

 

12. రుద్రదేవుడిని వినయ విభూషణుడని తెలిపే శాసనం ఏది?
జ‌: ద్రాక్షారామ శాసనం

 

13. మోటుపల్లి అభయ శాసనాన్ని ఎప్పుడు వేయించారు?
జ‌: 1244

 

14. రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరు?
జ‌: గణపతి దేవుడు

 

15. వెనిస్ యాత్రికుడు మార్కోపోలో కింది ఎవరి కాలంలో ఓరుగల్లును దర్శించాడు?
      ఎ) గణపతి దేవుడు         బి) రుద్రమదేవి        సి) ప్రతాపరుద్రుడు         డి) రుద్రదేవుడు
జ‌: బి(రుద్రమదేవి)

 

16. 'నీతిసారం' గ్రంథ రచయిత?
జ‌: రుద్రదేవుడు

 

17. ఓరుగల్లుకు 'సుల్తాన్‌పూర్' అని ఎవరు పేరు పెట్టారు?
జ‌: మహ్మద్‌బిన్ తుగ్లక్

 

18. సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల్లో వేయించిన శాసనం ఏది?
జ‌: కుర్క్యాల శాసనం

 

19. ముదిగొండ చాళుక్య వంశానికి మూల పురుషుడు?
జ‌: రణమర్థుడు

 

20. ముదికొండ చాళుక్య పాలకుల్లో చివరివాడు?
జ‌: నాగతిరాజు

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వేములవాడ చాళుక్యుల కాలంనాటి సాంస్కృతిక పరిస్థితులు

పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని అనేక విషయాలుగా, ఒక్కో విషయాన్ని సీమలుగా విభజించారు. విషయంపై అధికారిని విషయాధిపతి అని, సీమపై అధికారిని సేనా నాయకుడు అని అంటారు.
 

గ్రామాధికారులు:
  1) గ్రన్తి - నీటి నిల్వలపై అధికారి
  2) కరణం - భూమి శిస్తు లెక్కలను చూసేవాడు
  3) తలారి - గ్రామ రక్షణకు బాధ్యత వహించేవాడు
  4) గ్రామోపాధ్యాయుడు - గ్రామ విద్యార్థులకు విద్యాబోధన చేసేవాడు
       ఈ కాలంనాటి న్యాయాధికారిని ప్రాడ్వివాకుడు అనేవాడు.  రాజ్యాదాయానికి ప్రధానమైన ఆధారం భూమిశిస్తు. పన్నులు లేని భూములను 'ఉంచాలి' అనేవారు. ఈ కాలంలో విదేశీ వాణిజ్యం బాగా జరిగేది. గోదావరి, మంజీరా నదులు ఓడలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉండేవి. వర్తకులు మంజీరా దేశానికి నౌకల్లో వెళ్లేవారు. కాళేశ్వరం, కందుకుర్తి గొప్ప వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. వర్తకులను తైర్థికులు అని, సుంకాన్ని హెజ్జుంక లేదా పెర్జుంక అని, వర్తక సంఘాలను 'నకరములు' అని పిలిచేవారు. గద్యాణం, హాగ అనే పేరుతో నాణేలుండేవి.

 

మతం:
వేములవాడ చాళుక్యుల కాలంలో జైన, వైదిక మతాలు ఉండేవి. జైనులు ఇతర మతాల వారిని తమవైపు ఆకర్షించడానికి వర్ణ వ్యవస్థను అంగీకరించారు. అనేకమంది రాజులు జైన మతాన్ని అనుసరించి,  జినాలయాలను నిర్మించారు. వేములవాడ గొప్ప జైన క్షేత్రంగా ఉండేది. రెండో అరికేసరి, కొంతమంది రాజులు శైవ మతాన్ని అనుసరించారు.

 

విద్యా సారస్వతాలు:
    ఆ కాలంనాటి రాజ భాష కన్నడం. అప్పటి శాసనాలన్నీ కన్నడ భాషలోనే ఉండేవి. శైవ మఠాలు, జైన బసదులు నాటి ఉన్నత విద్యాలయాలు. ఇందులో వేదాంగాలు, ఆగమాలు, పురాణాలు బోధించేవారు.
    వేములవాడ చాళుక్యుల కాలం కన్నడ భాషకు స్వర్ణయుగం లాంటిది. రెండో అరికేసరి ఆస్థానంలో కన్నడ భాషల్లో ఆదికవిగా పేరొందిన పంప కవి ఉండేవాడు. ఇతడికి 'కవితాగుణార్ణవుడు' అనే బిరుదు ఉండేది. పంపకవి జైన మతాభిమాని. ఇతడు 'విక్రమార్జున విజయం' అనే గ్రంథాన్ని కన్నడ భాషలో రచించి, తన రాజైన రెండో అరికేసరికి అంకితం ఇచ్చాడు.
* సోమదేవసూరి అనే మరో జైన కవి 'యశస్తిలక' అనే చంపూ కావ్యాన్ని రచించాడు. ఇతడికి 'శ్యాద్వాదాచలసింహ' అనే బిరుదు ఉండేది. జినవల్లభుడు పంపకవి సోదరుడు. ఇతడు కుర్క్యాల శాసనాన్ని సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల్లో వేయించాడు. కుర్క్యాల శాసనంలో తెలుగు భాషలో మూడు కంద పద్యాలు ఉండేవి. ఇవి తెలుగు భాషలో మొదటి కంద పద్యాలు.

 

మొదటి బేతరాజు(క్రీ.శ. 995 - 1052)

  ఇతడు కాకతీయుల్లో తొలి పాలకుడు. ఈ విషయం మనకు కాజీపేట, బయ్యారం శాసనాల ద్వారా తెలుస్తుంది. బేతరాజు మంత్రి నారణయ్య శనిగరంలోని (కరీంనగర్ జిల్లా) యుద్ధమల్ల జినాలయాన్ని పునరుద్ధరించి, అక్కడ శనిగరం శాసనం వేయించాడు. బేతరాజుకు 'కాకతి పురాధినాథ' అనే బిరుదు ఉండేది.
 

రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116 - 1157)

  ఇతడు తొలి కాకతీయుల్లో ముఖ్యమైనవాడు. ఇతడి రాజకీయ విజయాలను హనుమకొండ శాసనం వివరిస్తుంది. ఓరుగల్లును శత్రు దుర్భేద్యమైన దుర్గంగా రూపొందించడానికి రెండో ప్రోలరాజు పునాదులు వేశాడని చింతలూరి తామ్ర శాసనం తెలియజేస్తోంది.

రుద్రదేవుడు (క్రీ.శ. 1158 - 1196)

ఇతడు రెండో ప్రోలరాజు కుమారుడు. హనుమకొండ శాసనం రుద్రదేవుడి ఘన విజయాలను పేర్కొంటుంది. రుద్రదేవుడు 'వినయ విభూషణుడు' అని ద్రాక్షారామ శాసనం తెలియజేస్తుంది. రుద్రదేవుడు సంస్కృత భాషలో 'నీతిసారం' అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడికి 'విద్యాభూషణ' అనే బిరుదు ఉండేది. క్రీ.శ.1163లో హనుమకొండలో రుద్రేశ్వరాలయం (వేయి స్తంభాల గుడి) అనే త్రికూటాలయాన్ని నిర్మించాడు. రుద్రేశ్వర దేవాలయ పోషణకు మద్దిచెరువుల గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. దేవగిరి యాదవ రాజైన జైతుగితో (జ్తెత్రపాలుడు) జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించాడు.  

గణపతిదేవుడు (క్రీ.శ. 1199 - 1262)

  గణపతిదేవుడు కాకతీయ పాలకుల్లో గొప్పవాడు. ఇతడి రాజ్యం తమిళనాడులోని ఉన్న కంచి వరకు విస్తరించింది. ఇతడు దీర్ఘకాలం (63 సంవత్సరాలు) పాలించాడు. గణపతిదేవుడు దివిసీమ పాలకుడైన పిన్నచోడి కుమార్తెలైన నారమ, పేరమలను వివాహం చేసుకుని, వారి సోదరుడైన జాయపను తన సైన్యంలో గజసాహిణిగా నియమించాడు. గణపతిదేవుడు విదేశీ వర్తకులకు అభయమిస్తూ, మోటుపల్లి అభయ శాసనం (క్రీ.శ.1244లో) వేయించాడు. ఇతడు 1254లో తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. గణపతిదేవుడికి 'ఆంధ్రాధీశుడు', 'సకలదేశ ప్రతిష్ఠాపనాచార్య', 'మహామండలేశ్వర', 'పృథ్వీశ్వర' లాంటి బిరుదులు ఉండేవి.
 

రుద్రమదేవి (క్రీ.శ. 1262 - 1289)

  రుద్రమదేవి గణపతిదేవుడి కుమారై. ఈమె రుద్రదేవ మహారాజు పేరిట సింహాసనాన్ని అధిష్టించింది. ఈమె తెలంగాణను పాలించిన మొదటి స్త్రీ పాలకురాలు. దేవగిరిని పాలించే యాదవ వంశరాజైన మహాదేవుడు ఓరుగల్లుపై దండెత్తి రాగా, రుద్రమదేవి అతడిని ఓడించి, దేవగిరి వరకు తరిమింది.
   ఈమె కాయస్త అంబదేవుడితో జరిగిన యుద్ధంలో మరణించినట్లు చందుపట్ల శానసం తెలియజేస్తుంది. రుద్రమదేవి సైన్యంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈమె పాలనా కాలంలో వెనిస్ (ఇటలీ) యాత్రికుడైన మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని, మోటుపల్లి ఓడరేవును దర్శించాడు.

 

ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289 - 1323)

ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనుమడు, కాకతీయుల్లో చివరి పాలకుడు. ఇతడు రాయలసీమ ప్రాంతంలో అనేక నూతన గ్రామాలను నిర్మించాడు. అడవులను పంట పొలాలుగా మార్చి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ఇతడి కాలంలో ఢిల్లీ సుల్తాన్‌లు కాకతీయ రాజ్యంపై ఎనిమిదిసార్లు దండయాత్ర చేశారు. ఎనిమిదో దండయాత్రలో (1323) జునాఖాన్ (మహ్మద్‌బిన్ తుగ్లక్) ప్రతాపరుద్రుడిని ఓడించి, ఢిల్లీకి బందీగా తీసుకుపోయాడు. అయితే మార్గమధ్యంలోనే నర్మదా నది (సోమోద్భవ) తీరంలో ప్రతాపరుద్రుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ముసునూరి ప్రోలయ నాయకుడి విలస శాసనం, అనితల్లి వేయించిన కలువచేరు తామ్ర శాసనం తెలుపుతున్నాయి. దీంతో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఢిల్లీ సుల్తాన్ మహ్మద్‌బిన్ తుగ్లక్ ఓరుగల్లును ఆక్రమించి దానికి సుల్తాన్‌పూర్ అని పేరు పెట్టాడు. ఇతడు తెలంగాణ మొత్తాన్ని ఆక్రమించి అక్కడ రాజప్రతినిధిని నియమించి తన పరిపాలనను ప్రారంభించాడు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కాకతీయుల కాలంనాటి ఆర్థిక, సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు

        తెలుగు రాష్ట్రాల చరిత్రలో కాకతీయులకు విశిష్టస్థానం ఉంది. పరిపాలన, పన్నుల విధింపులో వారి విధానాల ప్రభావం ఇప్పటికీ ఉంది.  కాకతీయుల ఆస్థానంలోని పదవులు, పన్నుల పేర్లు, సామాజిక స్థితిగతులు, మతాల తీరు పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యమైన అంశాలు.
 

పరిపాలన
* కాకతీయుల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. కాకతీయులు సంప్రదాయ సిద్ధమైన రాజరికాన్ని అనుసరించారు. రాజులు సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించి పాలించారు.
* రాజోద్యోగులను నియోగాలుగా విభజించారు. మొత్తం 72 నియోగాలు (శాఖలు) ఉండేవి. వీటిని బాహత్తర నియోగాధిపతి పర్యవేక్షించేవాడు. అంతఃపుర రక్షకుడు అనే ఉద్యోగిని నగర శ్రీకావళి అని వ్యవరించేవారు. ఈ కాలం నాటి పాలకులు మహామండలేశ్వర బిరుదు ధరించారు.
* పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని స్థలం, గ్రామాలుగా విభజించారు. గ్రామ పరిపాలనకు 'మహాజనులు' అనే పేరుతో ఒక సభ ఉండేది. ఈ సభ నిర్ణయాలను అమలుపరుస్తూ 12 మంది ఆయగార్లు (వివిధ వృత్తుల వారు) ఉండేవారు. వీరిలో ముగ్గురు ముఖ్యమైనవారు.
* కరణం - గ్రామంలోని భూముల వివరాలను సేకరించేవాడు. రెడ్డి - భూమిశిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసేవాడు. తలారి - గ్రామ రక్షకుడు. శాంతిభద్రతలను పరిరక్షించేవాడు.
* ఆయగార్లకు పన్నులు లేని భూములే కాకుండా పంటలో కూడా భాగముండేది.
* కాకతీయుల కాలంలో సైన్యం రెండు రకాలుగా ఉండేది. మొదటిది చక్రవర్తి సైన్యం, రెండోది నాయంకర సైన్యం. రుద్రమదేవి మొదటిసారిగా సైన్యంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. కాకతీయులు తమకు విశ్వాసపాత్రులైన వారికి భూములను ఇచ్చి వారితో సైన్యాలను పోషింపజేసేవారు. వీరిని నాయంకరులు అంటారు.
* చక్రవర్తి అంగరక్షకులను లెంకలు అనేవారు. గ్రామంలోని వివాదాలను తలారి, మహాజనులు విచారించి న్యాయ నిర్ణయం తీసుకునేవారు. ధర్మాసనాలు (న్యాయస్థానాలు) ఇచ్చిన తీర్పులను 'జయపత్రాలు' అనే పేరుతో రాజముద్రిక వేసి ఇచ్చేవారు. భూమిశిస్తును 'అరి' చెల్లించేవారిని 'అరిగాపులు' అని వ్యవహరించేవారు.

పన్నులు
* దరిశనం - రాజును దర్శించినప్పుడు ఇచ్చే కానుకలు.
* ఉపకృతి - రాజు లేదా ఇతర అధికారులు మేలు చేసినప్పుడు ప్రతిఫలంగా చెల్లించే పన్ను.
* అప్పనం - అకారణంగా వచ్చేది.
* భూమిని కేసరి పాటిగడతో కొలిచేవారు.
* ప్రతి గ్రామంలో రాజు సొంత పొలానికి 'రాచదొడ్డి' అని పేరు. ఈ పొలాన్ని రైతులకు 'కోరు' లేదా అర్థాదాయానికి కౌలుకు ఇచ్చేవారు. ఇలాంటి రైతులను 'అర్థశిరీ' అనేవారు. ఇంటిపన్నును ఇల్లరి, అటవీ ఉత్పత్తులపై పన్నును  పుల్లరి అని వ్యవహరించేవారు.

వాణిజ్యం
* వర్తకులు శ్రేణీ వ్యవస్థ ద్వారా వర్తకం చేసేవారు. ఆనాటి పెద్ద శ్రేణి సర్వదేశీయ సహస్రతెలికి, దేశీయ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రధాన కేంద్రం. ఇక్కడ ప్రతివారం మడిసంత, మైలసంత జరిగేవి. మంథెన, పానగల్లు, అలంపురం, మాచెర్ల, వేల్పూరు, తంగెడ మొదలైన దేశీయ వాణిజ్య కేంద్రాలు ఉండేవి. వీటిని రేవు పట్టణాలతో కలుపుతూ రహదారులు ఉండేవి. మోటుపల్లి, కృష్ణపట్నం, హంసలదీవి, మచిలీపట్నం ఓడరేవుల ద్వారా విదేశీ వాణిజ్యం జరిగేది. వీటిని కరపట్టణాలు అనేవారు. చైనా, పర్షియా, సింహళం, అరేబియా దేశాలు, తూర్పు ఇండియా దీవులతో వాణిజ్యం సాగేది. సుగంధ ద్రవ్యాలు ప్రధానంగా ఎగుమతి అయ్యేవి. గద్యాణం (బంగారు నాణెం), రూక (వెండి నాణెం) మొదలైన నాణేలు ఉండేవి.

సాంఘిక పరిస్థితులు
* కాకతీయులు శూద్రులు. విజ్ఞానేశ్వరం స్త్రీ ధనాన్ని అయిదు రకాలుగా వివరిస్తుంది. వీరశైవ, వీర వైష్ణవ, మత శాఖల వల్ల బలిజ, సాతాని, లింగాయతులు, తుంబళులు, నంబులు, దాసరులు, చాత్తాద వైష్ణవులు మొదలైన కొత్త కులాలు ఈ కాలంలో ఏర్పడ్డాయి.
* బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర వర్ణాల్లో ఉపకులాలు ఆవిర్భవించాయి. కాకతీయుల కాలం నాటి సాంఘిక జీవితంలో మరో ముఖ్య లక్షణం కుల సంఘాలు. వీటిని సమయాలు అనేవారు.
1. బ్రాహ్మణ కుల సంఘం (సమయం) - మహాజనులు
2. వైశ్య కుల సంఘం (సమయం) - నకరం
* శైవ సమయాలు, వైష్ణవ సమయాలు దేవాలయ అర్చక సంఘాలుగా వ్యవహరించేవి. నాటి సమాజంలో బాల్య వివాహాలు, కన్యాశుల్కం సతీ సహగమనం, నిర్భంద వైధవ్యం మొదలైన మూఢాచారాలుండేవి.
* దేవదాసీలకు, బసివిరాండ్రకు, వేశ్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. బసివిరాండ్రు బసవని (శివుడు) పేరున బాలికలను శివాలయానికి అంకితం చేసేవారు. వీరు తమ జీవితాన్ని శివుడికి అర్పించి, శివుడికి సేవలు చేసేవారు. ప్రభువులు, ఉన్నత వర్గాల వారు దేవాలయాలకు దేవదాసీలను, నాట్యగత్తెలను బహూకరించేవారు. దుర్గాష్టమి, దీపావళి, మకర సంక్రాంతి, ఉగాది, మహాశివరాత్రి, ఏరువాక అనే పండుగలను జరుపుకునేవారు. పల్నాటి బ్రహ్మనాయుడు కులవ్యవస్థను ఖండించి సహపంక్తి భోజనాలను చాప కూళ్లను ప్రోత్సహించాడు. ఈయన వీర వైష్ణవాన్ని అనుసరించి అనేక మంది నిమ్నకులస్థులను అందులో చేర్చాడు.

 

జైన మతం
* హనుమకొండ క్రీ.శ.800 సంవత్సరాల నాటికి గొప్ప జైన కేంద్రంగా ఉండేది. తొలి కాకతీయ రాజులు దిగంబర జైన మతాన్ని అనుసరించారు.
* రాజరాజనరేంద్రుడు అనే వేంగి చాళుక్య రాజు హింసించగా ఋషభనాథుడనే జైనాచార్యుడు హనుమకొండకు వచ్చాడనే విషయం ఓరుగల్లు కైఫీయత్తు ద్వారా తెలుస్తోంది. ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ హనుమకొండపై కడలాయ అనే జైన బసదిని నిర్మించింది.
* శైవులు జైనులను హింసించి వారి దేవాలయాలను నేలమట్టం చేసి వారిని బలవంతంగా శైవంలోకి మార్చారు.
* బోధన్, హనుమకొండ, కొల్లిపాక (కొలనుపాక), పొట్ల చెరువు (పటాన్‌చెరువు), వేములవాడ, వర్ధమానపురం, అలంపురం మొదలైనవి ప్రముఖ జైన కేంద్రాలుగా ఉండేవి.

 

శైవం
* కాకతీయుల కాలంలో శైవ మతం ప్రజాదరణ, రాజాదరణ పొందింది.
* శైవంలో అనేక శాఖలు ఉండేవి. క్రీ.శ.10వ శతాబ్దంలో కాలాముఖ శైవం ప్రచారంలో ఉండేది. గోళకీ మఠ ప్రధానాచార్యుడైన విశ్వేశ్వర శంభూ గణపతి దేవుడి శివదీక్షా గురువు. క్రీ.శ.1261లో రుద్రమదేవి విశ్వేశ్వర శంభూనకు మందారమ్ (మందడం) గ్రామాన్ని వెలగపూడి కృష్ణలంకలతో కలిపి దానం చేసినట్లు మలకాపురం శాసనం పేర్కొంది. విశ్వేశ్వర శంభూ మందడం గ్రామంలో ఒక శివాలయాన్ని, శుద్ధశైవ మఠాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మఠానికి అనుబంధంగా ఒక వేదశాస్త్ర ఆగమ విద్యాలయాన్ని, ప్రసూతి వైద్యశాలను ఏర్పాటు చేశాడు. శివుడి అవతారాలైన 28 మంది యోగాచార్యుల గురించి శివ పురాణం, కూర్మ పురాణం తెలుపుతున్నాయి.
* ఈ యోగాచార్యుల్లో శ్వేతాచార్యుడు మొదటి గురువు, లకులీశుడు చివరి గురువు. వీర శైవాన్ని బసవేశ్వరుడు కర్ణాటకలో స్థాపించాడు. ఆంధ్రదేశంలో బసవేశ్వరుడి శిష్యులకు వీరశైవులు లేదా లింగాయతులని పేరు. వీరశైవులు కుల వ్యవస్థను, బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రశ్నించారు. వీరశైవుల గురువులను జంగములు అని, వీరశైవ గ్రంథాలను ఆగమములు అని అంటారు.

 

వైష్ణవం
* ఈ కాలంలో వైష్ణవం కూడా ప్రజాదరణ పొందింది. కాకతీయుల రాజలాంఛనం వరాహం. వీరి ముద్రలు, నాణేల మీద వరాహ లాంఛనం ఉండేది. దక్షిణ దేశం నుంచి రామానుజ వైష్ణవం ఆంధ్రదేశంలోకి ప్రవేశించింది. రుద్రమదేవి కాలం నుంచి వైష్ణవం విశేషంగా వ్యాప్తి చెందింది. కాకతీయ సామంతులు వైష్ణవ మతాన్ని ఆదరించారు. పల్నాడులో బ్రహ్మనాయుడు వీరవైష్ణవ మతాన్ని ప్రచారం చేసి సంఘ సంస్కరణకు పూనుకున్నాడు. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు, గణపతిదేవుడు 'చాతుర్వర్ణ సముద్ధరణ' బిరుదు ధరించారు. వీరులకు వీరగల్లు, వీరగుళ్లు వెలిశాయి.

 

చెరువుల నిర్మాణం

* కాకతీయులు చెరువుల నిర్మాణాన్ని ప్రోత్సహించి వ్యవసాయాభివృద్ధికి కృషిచేశారు. ఫలితంగా తెలంగాణలోని అన్ని గ్రామాల్లోనూ చెరువులను నిర్మించారు. చెరువును నిర్మించిన వ్యక్తికి అశ్వమేధ యాగం చేసిన వ్యక్తికి వచ్చే పుణ్యం వస్తుందనే నమ్మకం ఉండేది.
ముఖ్యమైన చెరువులు
* కేసరి సముద్రం  - మొదటి ప్రోలరాజు నిర్మించాడు
* కేసముద్రం  - మొదటి ప్రోలరాజు
* ఉదయచోడని చెరువు - రుద్రదేవుడు
* పాకాల చెరువు - జగదల ముమ్మడ (గణపతి దేవుడి సేనాని)
* రామప్ప చెరువు - రేచెర్ల రుద్రుడు (గణపతి దేవుడి సేనాని)
* లక్నవరం చెరువు - ప్రతాపరుద్రుడు
* బయ్యారం చెరువు - మైలాంబ (గణపతి దేవుడి సోదరి)
* వ్యవసాయ పొలాలకు నీటిని ఏతం, మోట ద్వారా సరఫరా చేసేవారు.
* గోధుమలు, కొర్రలు, వరి, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు పంటలు పండించేవారు. తెలంగాణలో వివిధ పరిశ్రమలు  
  1. రత్నకంబళాలు, ముఖమల్ వస్త్రాలు - ఓరుగల్లు 
  2. ఇనుము పరిశ్రమ - గుత్తికొండ, పల్నాటి సీమ
  3. వజ్రాల గనులు - గోల్కొండ, రాయలసీమ
  4. వజ్రపురి - గురజాల (వజ్రాలకు ప్రసిద్ధి)
  5. కత్తులు - నిర్మల్

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కాకతీయుల కాలంనాటి ఆర్థిక, సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు

గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు

1. గ్రామ పరిపాలనలో ఆయగార్ విధానాన్ని ప్రవేశపెట్టింది?
జ‌: కాకతీయులు

 

2. ఏ శాసనం రుద్రదేవుడిని 'వినయ భూషణుడు' అని తెలియజేస్తుంది?
జ‌: ద్రాక్షారామ‌

 

3. మధ్యయుగాల్లో దేన్ని సుల్తాన్‌పూర్ అనేవారు?
జ‌: వరంగల్

 

4. కిందివాటిని జతపరచండి.
    అ) బయ్యారం చెరువు                      1) జగదల ముమ్మడ
    ఆ) పాకాల చెరువు                          2) మొదటి ప్రోలరాజు
   ఇ) కేసముద్రం చెరువు                      3) మైలాంబ
   ఈ) నాగ సముద్రం చెరువు                4) నాగాంబిక
జ‌: అ-3, ఆ-1, ఇ-2, ఈ-4

 

5. కాకతీయులు ఎవరు?
జ‌: శూద్రులు

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తెలంగాణ వార‌స‌త్వ క‌ళ‌లు

తెలంగాణ ఘన వారసత్వ సంపదలో భాగమైన అద్భుత కళలెన్నో ఇక్కడి ఖ్యాతిని చాటిచెప్పాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విశిష్టత.. హస్తకళల్లో అద్భుత నైపుణ్యం ఉట్టిపడుతుంది. చేనేతలు, కొయ్యబొమ్మలు, లోహ సామగ్రి, లేసుల అల్లికలు, వ్యవసాయ పరికరాలు.. తదితర పరిశ్రమలెన్నో తెలంగాణ ప్రత్యేకం. లలిత కళలు విస్తృత ప్రాచుర్యం పొందడంతోపాటు.. పూసలు, గాజులు, ముత్యాలు, వజ్రాల పరిశ్రమలు విరాజిల్లాయి. భాగ్యనగరమైన హైదరాబాద్ సహా పోచంపల్లి, నిర్మల్, దుమ్ముగూడెం తదితర ఎన్నో ప్రాంతాలు ఘన వారసత్వాన్ని చాటుతున్నాయి. ప్రాచీనకాలం నుంచి తెలంగాణ ఖ్యాతిని చాటి చెబుతున్న ఈ కళలపై ప్రత్యేక అధ్యయన సమాచారం పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం..
           

              ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వృత్తికళా నైపుణ్యం, కళా రూపాలు, వాస్తు-శిల్పకళలు లాంటి వాటితోపాటు.. స్థిర, చరాస్తులు, సిరి సంపదలు ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించడాన్నే వారసత్వం అంటున్నాం. అనాదిగా మన పూర్వీకులు విశిష్టమైన సంస్కృతిని వారసత్వ పరంపరగా తరతరాలకు అందిస్తూ వచ్చారు. మహోన్నతమైన భారతీయ సంస్కృతికి హరప్పా ప్రజలు పునాదులు వేశారు. నదుల వరదలకు గట్లు కట్టి పంటలు పండించడం నేర్పారు. ప్రపంచంలోనే తొలిసారిగా సింధు ప్రజలు పత్తిని పండించారు. కాల్చిన ఇటుకలను, ముద్రికలను తయారు చేశారు. మట్టి పాత్రలు, కంచుపాత్రలు, ఇతర సామగ్రి తయారీ.. పూసల పరిశ్రమ.. విగ్రహారాధన.. అమ్మతల్లి-శక్తి దేవతారాధన.. పుష్కరిణిలో పవిత్ర స్నానాలు.. మత, ధార్మిక సంప్రదాయాలెన్నింటినో వేల సంవత్సరాల కిందటే వారు ఆచరించి చూపించారు. మనం వాటిని అనుసరిస్తున్నామంటే అది సింధు ప్రజలు భారత జాతికి అందించిన వారసత్వమే.
 

 

ఘన వారసత్వం

         తెలంగాణ సమాజానికి వారసత్వ పరంపరగా సంక్రమించిన ఘనతరమైన కళాసంపద ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కళ అభివృద్ధి చెందింది. వాటిని ఆదరిస్తూ నేటికీ ఆచరిస్తుండటం విశేషం. వృత్తిధర్మాన్ని నమ్మడం.. అంటే వృత్తినే దైవంగా భావించడం, అది దైవదత్తమనే విశ్వాసం మన భారతీయ సంస్కృతిలోని గొప్పదనం. చాలామంది కులవృత్తులను నమ్ముకుని వాటినే జీవనాధారంగా మలచుకోవడం వల్లే ఆయా కళలు, కళారూపాలు నేటికీ వర్థిల్లుతున్నాయి. అనాదిగా మనదేశంలో ఆర్థిక వ్యవస్థకు పల్లెసీమలే పట్టుగొమ్మలుగా ఉన్నాయి. వ్యవసాయంతోపాటు వృత్తి ఆధారిత కుటీర పరిశ్రమలు, హస్తకళలు ఆర్థిక వ్యవస్థలో ప్రధానపాత్ర పోషించాయి. కొన్ని వృత్తులు, కళలు కుటీర, లఘు పరిశ్రమల స్థాయికి ఎదిగాయి. కొన్ని కళలు, కళారూపాలు మౌఖిక ప్రచారమే మాధ్యమంగా.. జానపద బిక్షుక గాయకుల కృషి ఫలితంగా వికాసం పొందాయి. అలాంటి వారి జీవనానికి, మనుగడకు కూడా ప్రాణవాయువులయ్యాయి. మరికొన్ని కళలు.. సంగీతం, నృత్యం లాంటివి జమీందార్‌లను, సంస్థానాధిపతులను, సంపన్నులను రంజింపజేయడం ద్వారా అభివృద్ధి చెందాయి. వారంతా వాటిని పోషించారు.
 

హస్తకళా వికాసం

హస్తకళా నైపుణ్యంలో తెలంగాణ ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. ఇక్కడి వస్త్ర పరిశ్రమకు వేల సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. లోహ సంగ్రహణం (Metallurgy), గృహోపకరణాలు, ఆటబొమ్మలు, విలాస వస్తువులు, పూసల తయారీ, చిత్రలేఖనం తదితర హస్తకళలెన్నో అభివృద్ధి చెంది, దేశ విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాయి.
 

చేనేతలు, అద్దకం

       ప్రాచీన కాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో నేతకళ ప్రాచుర్యం పొందింది. శాతవాహనుల కాలంలోనే ఇక్కడి నుంచి రోమ్‌కు సన్నని పట్టు సెల్లాలు ఎగుమతి అయ్యేవి. సన్నటి సాలెగూడు లాంటి వస్త్రాలంటే రోమన్ యువతులకు అత్యంత ఇష్టమని ప్లీనీ లాంటి చరిత్రకారుల రచనల వల్ల తెలుస్తోంది. రుద్రమదేవి పరిపాలన కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన వెనీస్ యాత్రికుడు మార్కోపోలో కూడా ఇక్కడి చేనేత, వస్త్రకళా నైపుణ్యాన్ని ప్రశంసించాడు. పాల్కురికి సోమన తన పండితారాధ్యచరిత్రలో 50 రకాలైన వస్త్రాలను ప్రస్తావించాడు. కుతుబ్‌షాహీ, నిజాం కాలంలో కూడా తెలంగాణలో నేత పరిశ్రమ విస్తరించింది. నల్గొండ జిల్లా పోచంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల, కొత్తకోట, నారాయణపేట్‌లు నేత వస్త్రాలకు పెట్టిందిపేరుగా ఖ్యాతి పొందాయి. భూదాన్ పోచంపల్లి చీరలు, పట్టుచీరల తయారీలో కళాకారులకు తమదైన ప్రత్యేక శైలి ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాలు పోచంపల్లి Tie & dye పరిశ్రమకు కేంద్రాలుగా మారాయి. చౌటుప్పల్, కొయ్యలగూడెం, సిరిపురం, రామన్నపేట, పుట్టపాక, గట్టుప్పుల, తేరటుపల్లి, చండూరు ప్రాంతాల్లోని వేలాది మంది చేనేత కార్మికులు పోచంపల్లి చీరలు, పట్టు చీరలకు ఖ్యాతిని తెచ్చిపెట్టారు. పుట్టపాక నేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరలను రూపొందించారు. ఇలా పోచంపల్లి పట్టు వస్త్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. తెలుగునాట ఏ ఇంట్లో ఏ శుభకార్యమైనా గద్వాల, కొత్తకోట, నారాయణపేట్‌ల చేనేత వస్త్రాలు ప్రత్యేకంగా నిలుస్తాయి.
తెలంగాణలో తివాచీలు, రగ్గులు, కంబళ్ల తయారీకి వరంగల్ ప్రసిద్ధి చెందింది. మఖ్‌మల్, సన్నటి వస్త్రాలకు నాటి కాలంలో గోల్కొండ ప్రాచుర్యం పొందింది. మెదక్ అద్దకం వస్త్రాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. జాతీయ, అంతర్జాతీయ విపణిలో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో ఇదొక ప్రత్యేక కళగా అభివృద్ధి చెందింది. ఒకే చిత్తరువుపై లేదా వస్త్రంపై అనేక రంగులను అద్దడం దీని ప్రత్యేకత.

 

లోహ పరిశ్రమ

         లోహపు పాత్రలు, లోహపు సామగ్రి, పూజా పాత్రలు, కంచు-ఇత్తడి-రాగి మిశ్రమ లోహాలతో తయారైన వస్తు సామగ్రి తయారీకి తెలంగాణ పెట్టింది పేరు. నల్గొండ జిల్లాలోని పానగల్లు, చండూరు ప్రాంతాల్లో.. దేవాలయాల్లో ఉపయోగించే కంచు గంటలు, పళ్లాలు, పాత్రలు, శఠగోపం, సింహతలాటం, నాగాభరణాలు తయారయ్యేవి. వరంగల్ జిల్లా పెంబర్తి, పరకాల ప్రాంతాల్లో ఇత్తడి, కంచు లోహపు పనులు చేసే కళాకారులున్నారు. కురనపల్లి, సిద్దిపేట(మెదక్ జిల్లా)ల్లోని కళాకారులు ఇత్తడి, కంచు ఉత్పత్తుల తయారీలో సిద్ధహస్తులు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, నిజామాబాద్ జిల్లా ఇందూరులో ఇనుము, ఉక్కు, ఆయుధ పరిశ్రమలున్నాయి. కుతుబ్‌షాహీల కాలంలోనే నిర్మల్‌లో తయారైన కత్తులు డమాస్కస్‌కు ఎగుమతయ్యేవి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన డమాస్కస్ కత్తుల తయారీలో గోల్కొండ ఉక్కు ఉపయోగించినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో అతి ప్రాచీనమైన, సున్నితమైన వెండి నగిషీలు చెక్కే నిపుణులైన కళాకారులున్నారు. సన్నని వెండి తీగలను అల్లడం, పోత పోయడంలో వీరు సిద్ధహస్తులు. తాంబూలం పెట్టెలు, కుంకుమ భరిణలు, పతకాలు, షీల్డులు, గుండీలు, ఫొటోఫ్రేమ్‌లు తదితర వెండి పనులకు కరీంనగర్ ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ పాతబస్తీలో సన్నటి వెండిరేకులు, మిఠాయిలపై అతికించే వెండి కాగితం తయారీ కళాకారులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. హైదరాబాద్ ప్రాంతం ప్రత్యేకమైన 'బిద్రీ' పరిశ్రమకు కేంద్రంగా ఉంది. పర్షియన్ సంప్రదాయానికి చెందిన ఈ కళ దక్కన్‌లో బహమనీ సుల్తాన్‌ల కాలంలో విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ఈ కళ కర్ణాటక (బీదర్) నుంచి హైదరాబాద్‌కి ప్రవేశించి 'బిద్రీ' కళగా ప్రసిద్ధి గాంచింది. ఇది పూర్తిగా రెండు, మూడు రకాల మిశ్రమ లోహాలతో కలిసి ఉన్నది. తుత్తునాగం, రాగి కలిసిన మిశ్రమ లోహంతో నీటి పాత్రలు, జార్‌లు, పూలకుండీలు, భరిణలు, తాంబూలం / సుగంధ ద్రవ్యాల పెట్టెలు, హుక్కా బుడ్డీలు తదితర వస్తుసామగ్రి తయారుచేస్తారు. ఈ మిశ్రమ లోహం ప్రత్యేకత తుప్పు పట్టకుండా ఉండటమే.
 

లేసుల అల్లికలు

లేసుల అల్లిక కళ ప్రధానంగా క్రైస్తవ మతసంస్థల ప్రచారం ద్వారా భారతదేశంలోకి ప్రవేశించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం లేసుల అల్లిక పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. నూలు దారాన్ని తీసుకుని నిర్ణీత ఆకృతుల(డిజైన్)లో సూది సహాయంతో అల్లుతారు. అమ్మాయిలు ధరించే పరికిణీ(వోణీ)ల అంచులు.. ఇంటి గుమ్మాలకు, కిటికీలకు తెరలు.. టేబుల్ మ్యాట్‌లు.. చిన్న తాళపు చెవిలు, వస్తువులు లాంటివి భద్రపరచుకోవడానికి గోడలకు వేలాడదీసే సంచులు.. తదితర వస్త్రాల తయారీలో ఈ కళాకారులు సిద్ధహస్తులు.
 

పూసలు, ముత్యాలు, వజ్రాలు

తెలంగాణలోని గోల్కొండ తొలినాళ్ల నుంచే వజ్ర పరిశ్రమకు పేరు పొందింది. కాకతీయులు, కుతుబ్‌షాహీల కాలం నుంచే విలువైన వజ్రసంపదకు గోల్కొండ ప్రసిద్ధి. ఇక్కడ వజ్రాల గనులున్నట్లు విదేశీ యాత్రికులు మార్కోపోలో, ధీవాట్, ట్రావెర్నియర్‌లు ప్రస్తావించారు. ఇక్కడి గనుల్లో 60 వేల మందికి పైగా కార్మికులు పనిచేసినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. కార్వాన్ ప్రాంతంలో వజ్రాలకు సాన (మెరుగు) పట్టే పరిశ్రమ కొనసాగింది. హైదరాబాద్‌లోని ముత్యాల పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. గుల్జార్‌హౌస్, చార్ కమాన్, పత్తర్‌గట్టీ ప్రాంతాలు ముత్యాల వర్తకానికి పేరొందిన ప్రాంతాలు. కుతుబ్‌షాహీ పాలకుల కాలం నుంచే భద్రాచలంలో శ్రీరామనవమినాడు అంగరంగ వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి గోల్కొండ నుంచి పాలకులు ముత్యాల తలంబ్రాలను పంపించే ఆనవాయితీ ఉంది. హైదరాబాదీ ముత్యాలు దేశ విదేశాల్లో సైతం విశేషంగా ప్రాచుర్యాన్ని పొందాయి. తెలంగాణలో స్త్రీలు ప్రత్యేకంగా ధరించే నగలు, ఆభరణాలు, నల్లపూసల గొలుసుల్లో అలంకరణకు ఉపయోగించే పూసల తయారీకీ పాపానాయుడుపేట పెట్టింది పేరు. గాజును కరిగించి పూసలను చేత్తోనే తయారు చేస్తారు. ఇందుకోసం వాడే ప్రత్యేకమైన గాజును ఫిరోజాబాద్ నుంచి దిగుమతి చేసుకోవడం విశేషం. హైదరాబాద్‌లోని లాడ్ బజార్, చార్మినార్ ప్రాంతాలు గాజుల తయారీకి ప్రసిద్ధి.
 

కొయ్యబొమ్మలు

   ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. ఇక్కడ కొయ్యబొమ్మల తయారీకీ బూరుగు, పొనుకు కర్రను ఉపయోగిస్తారు. పిల్లల ఆటబొమ్మలు, అందమైన గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు నిర్మల్ హస్తకళల కేంద్రాల్లో తయారవుతున్నాయి. ఏటికొప్పాక కొయ్యబొమ్మలు కూడా ప్రముఖమైనవి. లక్కపిడతలు, పిల్లల ఆట వస్తువులు, చదరంగపు పలకలు, పలకలు, దీపపు బుడ్లు, గృహాలంకరణ వస్తువులు ఇక్కడి పరిశ్రమల్లో వైవిధ్యభరిత రూపాల్లో తయారవుతున్నాయి. ఏటికొప్పాక లక్కబొమ్మల్లో అంకుడు, గిరిమల్లి కర్రలను ఉపయోగిస్తున్నారు.
 

వడ్రంగం

    తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వడ్రంగి వృత్తివారు ప్రధానపాత్ర పోషిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు అవసరమయ్యే పరికరాలు, సామగ్రికి ప్రతి గ్రామంలోనూ వడ్రంగి వృత్తివారు వారసత్వ పరంపరగా ఇంట్లోనే కుటీర పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. నాగళ్లు, గొర్రులు, దుక్కిదున్నే.. విత్తనాలు నాటే.. సామగ్రి కోసం కర్రను ఉపయోగించడంలో వీరు సిద్ధహస్తులు. గృహ నిర్మాణానికి కావాల్సిన కలప సామగ్రి, తలుపులు, కిటీకీలు ఫర్నిచర్ మాత్రమే కాకుండా నేత పరిశ్రమలో వినియోగించే వస్తు సామగ్రిని అందిచడంలోనూ వడ్రంగి పనివారు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అలాగే వ్యవసాయం, రైతులకు కావాల్సిన ఇనుప పరికరాల తయారీలో కమ్మరి పనివారిది ప్రధానపాత్ర. వ్యవసాయానికే కాకుండా దేవాలయాల్లో వివిధ సేవలకు ఉపయోగించే పల్లకీలు, రథాల తయారీ, కర్రపై నగిషీలు చెక్కిన పల్లకీలు ప్రాచీన కాలంలో నుంచే ప్రసిద్ధి చెందాయి. వీటిని కూడా వడ్రంగి వృత్తివారు చేస్తుంటారు. ఇలాంటి హస్తకళలు, తెలంగాణ కళా రంగ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించాయి. బుట్టల అల్లిక, కుండల తయారీ, మట్టి పాత్రల తయారీ, ఇటుకల తయారీ వంటి ఎన్నో హస్తకళలు, చేతి వృత్తులు తెలంగాణ అంతటా విస్తరించి ఉన్నాయి. ప్రత్యేకంగా పరిశ్రమ రూపంలో ఎదగకపోయినా ఎన్నో చేతివృత్తులు పరస్పర పోషకంగా, ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి.
 

కళలు

   మన ప్రాచీన ఆలంకారికులు చతుస్సష్టి (64) కళల గురించి ప్రస్తావించారు. లలిత కళల్లో సంగీతం - రాగ, తాళ, లయాన్వితమై మనసుకు హాయినిస్తుంది. అందుకే ఇది ఆపాత మధురమైన కళగా ప్రసిద్ధి చెందింది. కవిత్వం ఆలోచనామృతం.. కవిత్వ ప్రయోజనం కూడా ఆనందం కలిగించడం, ఉపదేశించడమే. శిల్పం సజీవ సౌందర్యాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తుంది. చలనం, జీవం లేకున్నా సజీవంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. వర్ణ రంజితమైంది చిత్రకళ.. చిత్రకారుడి మనోఫలకంపై రూపుదాల్చిన అద్భుత భావన ప్రపంచాన్ని, చిత్తరువులను చూసేవారికి కళ్లకు కట్టినట్లు చిత్రంచేది చిత్రకళ. నృత్యం సమాహార కళ. రాగం, తాళం, లయబద్ధతకు తోడుగా అభినయం కూడా మేళవించిన కళారూపం. ఇందులో ఆంగికం, వాచికం, ఆహార్యం అన్నీ ప్రధానమే. నవరసాలొలికించే వీలున్న ఏకైక లలితకళ నృత్యమే. ఈ సంప్రదాయ నృత్యకళ నుంచే అనేక నృత్యరీతులు అభివృద్ధి చెందాయి.
 

సాంస్కృతిక వారసత్వం

క్రమానుగత పరంపరగా ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తున్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రధానంగా మూడు విభాగాలుగా వర్గీకరించారు. అవి..
1. భౌతిక / వస్తు సంస్కృతి (Physical & Material Culture)
2. సాంఘిక సంస్కృతి (Social Culture)
3. సహజ / ప్రకృతి సిద్ధ సంస్కృతి (Natural Culture)
భవన నిర్మాణాలు, వస్తు సామగ్రి, వాస్తు శిల్పం, స్మారక చిహ్నాలు, కట్టడాలు లాంటివి భౌతిక / వస్తు సంస్కృతి విభాగం కిందకు వస్తాయి. ఇవి భౌతికంగా ఒక రూపాన్ని సంతరించుకుని, తరతరాలుగా గత వైభవానికి తార్కాణాలుగా నిలిచే ఉంటాయి. అందువల్ల వీటిని దృగ్గోచర సాంస్కృతికాంశాలు (Tangible Culture)గా కూడా పేర్కొంటారు.
సాంఘికాచారాలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, కట్టుబాట్లు, తిట్లు, ఒట్లు లాంటి వాటికి ఒక నిర్దిష్ట (వస్తు)రూపమంటూ ఉండదు. కంటికి కనిపించకుండా పరంపరగా ప్రజలు ఆచరిస్తూ, అనుసరిస్తూ ఒక తరం నుంచి మరో తరం వారు అందిపుచ్చుకుంటారు. అందుకే వీటిని అదృశ్య సాంస్కృతికాంశాలు (Intangible Culture)గా పేర్కొంటారు.
సహజసిద్ధమైన నదీలోయలు, పర్వత పంక్తులు, అరణ్యాలు, సరోవరాలు, జలపాతాలు లాంటివి సహజ / ప్రకృతి సిద్ధమైన సాంస్కృతిక అంశాలుగా పరిగణిస్తున్నారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తెలంగాణ వార‌స‌త్వ క‌ళ‌లు

మాదిరి ప్రశ్నలు

1. లలిత కళలు ఎన్ని?
ఎ) 5 బి) 6 సి) 4 డి) 12
జ: (ఎ)

 

2. రోమ్ యువతకు తెలంగాణకు చెందిన ఏ వస్తువులంటే అమిత ఇష్టం?
ఎ) వస్త్రాలు బి) పూసలు, ఆభరణాలు సి) ఆహార పదార్థాలు డి) ఆట వస్తువులు
జ: (ఎ)

 

3. ప్రాచీన కాలం నుంచి విశేష ప్రాచుర్యం పొందిన హస్తకళ?
ఎ) చేనేత బి) లోహకళ సి) వజ్రాల పరిశ్రమ డి) కొయ్యబొమ్మలు
జ: (ఎ)

 

4. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పట్టుచీరల నేత పరిశ్రమ కిందివాటిలో ఎక్కడ ఉంది?
ఎ) గద్వాల్ బి) పోచంపల్లి సి) నారాయణ పేట డి) కొత్తకోట
జ: (బి)

 

5. రగ్గులు, కంబళ్ల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
ఎ) వరంగల్ బి) నిర్మల్ సి) గద్వాల డి) కొలనుపాక
జ: (ఎ)

 

6. అద్దకం కళకు పేరుపొందిన ప్రాంతం?
ఎ) మెదక్ బి) నిర్మల్ సి) పోచంపల్లి డి) మంచిర్యాల
జ: (ఎ)

 

7. దేవాలయాల్లో ఉపయోగించే పూజ సామగ్రి కంచుగంటలు, పళ్లాలు, పాత్రలు తయారు చేసే కళాకారులు ఎక్కడ ఉన్నారు?
ఎ) పానగల్లు బి) ఇందూరు సి) గోల్కొండ డి) ఓరుగల్లు
జ: (ఎ)

 

8. వరంగల్ జిల్లా పెంబర్తి, నల్గొండ జిల్లా చండూరు ప్రాంతాలు ఏ కళకు ప్రసిద్ధి?
ఎ) ఇత్తడి, కంచు బి) చిత్రకళ సి) నేత డి) బొమ్మలు
జ: (ఎ)

 

9. ఇనుము, ఉక్కు ఆయుధ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
ఎ) ఇందూరు బి) గోల్కొండ సి) ఆదిలాబాద్ డి) ఏదీకాదు
జ: (ఎ)

 

10. ఇందూరు, నిర్మల్‌లో తయారైన కత్తులు ఏ దేశానికి ఎగుమతయ్యేవి?
ఎ) పోర్చుగల్ బి) డమాస్కస్ సి) రోమ్ డి) ఇటలీ
జ: (ఎ)

 

11. వెండి నగిషీ కళాకారులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
ఎ) కరీంనగర్ బి) మెదక్ సి) నల్గొండ డి) ఆదిలాబాద్
జ: (ఎ)

 

12. బిద్రీ పరిశ్రమ దక్కన్‌లో హైదరాబాద్‌కి ఏ రాష్ట్రం నుంచి వచ్చింది?
ఎ) కర్ణాటక బి) మహారాష్ట్ర సి) రాజస్థాన్ డి) తమిళనాడు
జ: (ఎ)

 

13. కుతుబ్‌షాహీల కాలంలో వజ్రాలకు సానపట్టే పరిశ్రమ ఎక్కడ నెలకొంది?
ఎ) కార్వాన్ బి) గుల్జార్‌హౌజ్ సి) గోల్కొండ డి) చార్మినార్
జ: (ఎ)

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వాస్తుశిల్పకళ - వారసత్వం

తెలంగాణ ప్రాచీనకాలం నుంచే కళలకు కాణాచిగా ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల కాలం నుంచే తెలుగునాట శిల్పకళ - వాస్తుశిల్పం పరిఢవిల్లింది. క్రీ.శ.6వ శతాబ్దం వరకు మహాయాన బౌద్ధమతం విరాజిల్లడంతో అమరావతి శిల్పకళ ఆవిర్భవించి, ఇక్ష్వాకుల కాలం నాటికి పరిపూర్ణతను సాధించింది. చాళుక్యుల కాలంలో ఉత్తర, దక్షిణాల మేలు కలయికగా సరికొత్త శిల్పకళారీతి 'వేసర శైలి' రూపుదిద్దుకుంది. మధ్యయుగంలోని కాకతీయుల కాలంలో తెలంగాణ శిల్పకళ - వాస్తుశిల్పం వైభవాన్ని సంతరించుకుంది. అనంతరం తెలంగాణలో కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల పాలనలో ఇస్లాం - పర్షియన్; తెలుగు - పర్షియన్ సంప్రదాయాల మేళవింపు ఒక నూతన శైలికి శ్రీకారం చుట్టింది. ఈ సంప్రదాయం భవన నిర్మాణాలు, వాస్తుశిల్పంపై విశేష ప్రభావాన్ని చూపింది. ఉత్తరాది మొగలాయిల వాస్తు - శిల్పకళ కూడా తెలంగాణ మధ్యయుగ వాస్తు - శిల్పకళపై తనదైన ముద్ర వేసింది. ఈ రెండూ వేర్వేరైనా ఆయాకాలాల్లోని వాస్తుశిల్పాల్లో శిల్పకళ అంతర్లీనంగా కనిపిస్తుంది.
 
శాతవాహనుల శిల్పకళ
తెలంగాణలో శిల్పకళకు శాతవాహనుల కాలంలోనే బీజాలు పడినట్లు తెలుస్తోంది. దక్కన్‌లో అభివృద్ధి చెందిన వాస్తు - శిల్పకళ 'అమరావతి శిల్పకళారీతి' ప్రాచుర్యాన్ని పొందింది. కరీంనగర్ జిల్లాలోని ధూళికట్ట, పెద్దబంకూర్, కోటిలింగాలు; ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, నల్లగొండ జిల్లాలోని ఫణిగిరిలో శిథిలావస్థలో ఉన్న బౌద్ధ స్తూపాలు, చైత్యాలు ఉన్నాయి. శాతవాహనుల కాలం నాటి అమరావతి శిల్పకళకు నాగార్జునకొండ ప్రధాన కేంద్రం. శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలం నాటి అనేక శిల్పాలు నాగార్జునకొండ ప్రాజెక్టు తవ్వకాల్లో లభించాయి. ప్రియుడు మధుపాత్రను అందిస్తుండగా ప్రియురాలు దాన్ని తిరస్కరిస్తున్నట్లుగా చెప్పిన శిల్పఖండం నాటి శిల్పకళా నైపుణ్యానికి తార్కాణం. ఒక చిత్రకారుడి మనోజ్ఞమైన భావనను సైతం తలదన్నేలా శిల్పి చూపిన ప్రతిభాకౌశలం అపూర్వం.
స్తూపాలు సమాధులు, ఆరాధ్య కేంద్రాలుగా ప్రతీతి. చైత్యాలు అంటే దేవాలయాలు, విహారాలు. ఇవి బౌద్ధ భిక్షువుల విశ్రాంతి కేంద్రాలు. ప్రధానంగా తెలంగాణలోని బౌద్ధ స్తూపాలన్నింటినీ సాంచీ స్తూప నమూనాను అనుసరించి నిర్మించారు. స్తూపం అనేది గుండ్రంగా రాతితో లేదా మట్టితో నిర్మించిన కట్టడం. దీనిపైన నిర్మించే 'డోమ్‌'ను 'అండ' అని, దానిపైన 'ఛత్రం' ఆకారంలో ఉండే నిర్మాణాన్ని 'హర్మిక' అని అంటారు. స్తూపాల చుట్టూ ప్రాకారాలను నిర్మించడం ఆనాటి సంప్రదాయం. వీటిపై బుద్ధుడి జాతక కథలను చెక్కేవారు. ప్రతి స్తూపానికి నాలుగు దిక్కుల్లో నాలుగు ఆయక స్తంభాలను నిర్మించడం ఆనవాయితీ. ఈ అంశాలన్నింటినీ ఫణిగిరి స్తూపంలో గమనించవచ్చు. ప్రధానంగా తెలంగాణలోని బౌద్ధ స్తూపాలన్నీ ఇటుకలతో నిర్మించినవే కావడం విశేషం.
                                                           

ఇక్ష్వాకులు
ఇక్ష్వాకుల బౌద్ధుల వాస్తుశిల్ప కళకు పరాకాష్ఠ నాగార్జునకొండ. ఇక్కడ స్తూపం, చైత్యం అనే రెండు నిర్మాణాలు ఉన్నాయి. స్తూపం పలకలపైన బుద్ధుడి విగ్రహాలు, జాతక కథలను చెక్కారు. వీరికాలంలో మొదటిసారిగా హిందూ దేవాలయాల నిర్మాణం జరిగింది. ఇక్ష్వాకులు మొదట చైత్య నిర్మాణాల నమూనాలోనే ఆలయాలను నిర్మించారు. మొదటిసారిగా పుష్పభద్రస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక్ష్వాకుల కాలంలో ఆలయాలను ధ్వజ స్తంభాలు, మండపాలు, అంతరాలయం, గర్భగుడి ఉండేలా నిర్మించేవారు. బాదామి చాళుక్యులు దేవాలయాల నిర్మాణంలో నూతన శైలిని ప్రారంభించారు. చాళుక్యులు ఉత్తర, దక్షిణ భారతంలోని నగర, ద్రవిడ శైలుల కలబోతగా 'వేసర శైలి' అనే ఒక కొత్త శిల్పకళారీతికి శ్రీకారం చుట్టారు. ఈ శైలికి వేములవాడ, ధర్మపురి, అలంపూర్ దేవాలయాలు చక్కని నిదర్శనాలు. కొలనుపాక, శనిగరం, కోరుట్ల, వేములవాడలోని జైనమందిరాలను కూడా ఈ శైలిలోనే నిర్మించారు. వేములవాడ భీమేశ్వర, నాగేశ్వర, కేదారేశ్వర, రాజరాజేశ్వరాలయాల్లో కళ్యాణి చాళుక్యుల శైలి కనిపిస్తుంది.

 

కాకతీయులు
తెలంగాణ సంస్కృతి చరిత్రలో కాకతీయుల కాలం నాటి వాస్తుశిల్పకళ మహోన్నతంగా విలసిల్లింది. తొలి కాకతీయులు చాళుక్యుల కాలం నాటి వేసర శైలినే అనుసరించినప్పటికీ స్వతంత్రులయ్యాక తమదైన కాకతీయ శిల్పకళా సంప్రదాయానికి నాంది పలికారు. ఎత్తయిన వేదికలు, నునుపైన శిల్పాలతో కూడిన స్తంభాలు, లోకప్పులపైన శిల్పాలతో అలంకరణ, మండపాల చుట్టూ పిట్టగోడలు, కాకతీయుల శిలా తోరణం, హంసలు, పద్మాలు వారి శిల్పకళ ప్రత్యేకతలు. ఇసుక పునాదులపైన దేవాలయాలను నిర్మించడం కాకతీయుల విశిష్టత. మొదటి ప్రోలరాజు హన్మకొండలో నిర్మించిన సిద్ధేశ్వరాలయం, పద్మాక్షి ఆలయాలు జైన దేవాలయాలుగా ప్రసిద్ధిగాంచాయి. కాకతీయ శిల్పకళా వైభవానికి కీర్తిపతాకాలు హన్మకొండలోని 'వేయిస్తంభాల గుడి' (రుద్రేశ్వరాలయం), పాలంపేటలోని 'రామప్పగుడి'.
             క్రీ.శ.1163లో రుద్రదేవుడు నిర్మించిన రుద్రేశ్వరాలయం త్రికూటాలయం. ముగ్గురు మూర్తులు శివుడు, విష్ణువు, సూర్యుడు కొలువై ఉన్న కూటమి కాబట్టి దీన్ని త్రికూటాలయంగా పిలుస్తారు. వరంగల్ కోట (ఖిలా వరంగల్)లోని స్వయంభూ దేవాలయాన్ని రెండో ప్రోలరాజు నిర్మించాడు. ఈ దేవాలయానికి నాలుగు దిక్కులా నాలుగు శిలాతోరణాలతో కూడిన ద్వారాలు ఉండటం అనేది నాటి శిల్పుల ప్రతిభ, నైపుణ్యానికి నిదర్శనం. గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు క్రీ.శ.1213లో రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఇది నక్షత్రాకారంలో ఉన్న ఏకేశ్వరాలయం. పైకప్పులోని శిలలపై రామాయణ, భాగవతం, శివపురాణాల్లోని కథలను చెక్కడం; వివిధ భంగిమల్లో మలచిన మదనిక, నాగినుల శిల్పాలు ఉండటం ఈ గుడి ప్రత్యేక లక్షణాలు. దీనిలోని నందీశ్వరుడి విగ్రహ శిల్పాన్ని ఎటు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లుగా ఉండటం 'నభూతోనభవిష్యతి'. రామప్ప దేవాలయం గోపురాన్ని నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించారు. ఇది ఆనాటి వాస్తుశిల్పంలోనే ఒక పెద్ద అద్భుతం. రేచర్ల రుద్రుడి కుమారుడైన రేచర్ల గణిపిరెడ్డి ఘనపురం (ములుగు)లో గణపేశ్వరాలయాలను నిర్మించాడు. ఇవే 'కోటగుళ్లు'గా ప్రాచుర్యం పొందాయి. కాకతీయుల సామంతరాజు నామిరెడ్డి పిల్లలమర్రిలో 'నామేశ్వరాలయాన్ని' నిర్మించాడు. కాకతీయుల కాలం నాటి శివాలయాలు వరంగల్ జిల్లాలోని హన్మకొండ, వరంగల్, ఐనవోలు, గూడూరు, ఇనుగుర్తి, కొండపర్తి, పాలంపేట, ఘనపురంలో; కరీంనగర్ జిల్లాలోని మంథని, రాయ్‌కల్, గొడిశాల, బెజ్జంకి, నగునూరు, కాళేశ్వరంలో; నల్లగొండ జిల్లాలోని నాగులపాడు, పానగల్లు, పిల్లలమర్రిలో; మహబూబ్‌నగర్ జిల్లాలోని జక్కారం, వడ్డెమాను, ముత్తారంలో ఉన్నాయి.

 

కుతుబ్‌షాహీలు
వీరు అద్భుతమైన వాస్తుకళా పోషకులుగా హైదరాబాద్ వాస్తు శిల్పకళకు ప్రపంచ ప్రఖ్యాతి కల్పించారు. భాగ్యనగరాన్ని నిర్మించి నగర సౌందర్యాన్ని ఇనుమడింపజేసే చరిత్రాత్మక కట్టడాలెన్నింటినో భావితరాలకు వారసత్వ సంపదగా అందించారు. కుతుబ్‌షాహీ పాలకులు చరిత్రలో నిలిచిపోయే రాజప్రాసాదాలు, కోటలు, స్మారకాలు (సమాధులు), ఆసుపత్రులు, మసీదులు, అశ్రుఖానాలు, చెరువులు, సరాయిలు ఎన్నింటినో నిర్మించారు. వీటిలో ప్రధానమైనవి భాగ్యనగర నిర్మాణం, చార్మినార్, మక్కామసీదు, టోలీ మసీదు, తారామతి బారాదరీ, మూసీపై పురానాపూల్ వంతెన. చార్మినార్, మక్కామసీదు అపూర్వ వాస్తు శిల్పానికి ప్రతీకలు. నేటికీ తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లో చార్మినార్‌లో రాతిని, మక్కామసీదులో మట్టిని ఉపయోగించలేదని చాలా గొప్పగా చెప్పుకుంటారు. కుతుబ్‌షాహీల కాలం నాటి విశ్వవిఖ్యాత కట్టడం చార్మినార్. ఇది నాటి తాపీమేస్త్రీల కళానైపుణ్యం, భవన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం, ప్రభువుల వాస్తుశిల్ప కళాభిమానానికి నిలువెత్తు నిదర్శనం. నాలుగు ఎత్తయిన మినార్‌లతో నగరం నడిబొడ్డున సగర్వంగా నిలబడి నాలుగు శతాబ్దాలకుపైగా సుదీర్ఘచరిత్రకు సజీవసాక్ష్యంగా మిగిలిన ఈ నిర్మాణం మధ్యయుగ చరిత్రలోని వాస్తు శిల్ప కళాచాతుర్యానికి మచ్చుతునక. ఆనాడు నగరాన్ని పట్టిపీడించిన మహమ్మారి 'ప్లేగు' వ్యాధి స్మృతి చిహ్నంగా క్రీ.శ.1590-91లో సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్‌షా చార్మినార్‌ను నిర్మించాడు. భాగ్యనగర నిర్మాణం కుతుబ్‌షాహీల యుగంలో మరపురాని మహోజ్వల ఘట్టం.
                క్రీ.శ.1590 - 91లో ప్రారంభమైన హైదరాబాద్ నగర నిర్మాణం ఆసియా ఖండంలోనే విశిష్టమైందిగా ప్రాచుర్యాన్ని పొందింది. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న గోల్కొండ పట్టణ జనాభాను తరచూ మూసీనది వరదలు ముంచెత్తుతుండటంతో సుల్తాన్ మదిలో మూసీనదికి దక్షిణ దిక్కున ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచన కలిగింది. మహ్మద్ కులీకుతుబ్‌షా కొలువులోని ప్రముఖ పాలనావేత్త, సాహితీవేత్త, ఆధ్యాత్మికవేత్త, వాస్తుశిల్పి అయిన 'మీర్ మొమిన్'  అస్త్రాబాదీ తన విశేషానుభవాన్ని ఉపయోగించి హైదరాబాద్ నగర నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించాడు. దీనికోసం తన మాతృదేశమైన ఇరాన్‌లోని 'ఇస్‌ఫహాన్' నగర నిర్మాణాన్ని నమూనాగా తీసుకున్నాడు. పర్షియన్ సంప్రదాయ ముద్రతో చార్మినార్ కేంద్రంగా ప్రధాన పరిపాలనా, ఆధ్యాత్మిక, వ్యాపార కేంద్రాలన్నీ దాని చుట్టూ విస్తరించి ఉండేలా నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. నాలుగు విశాలమైన రహదారుల కూడలిలో చార్మినార్ ఉండేలా బృహత్తరమైన ప్రణాళికతో సుందరమైన నగరాన్ని నిర్మించాడు. చార్మినార్‌కు సమీపంలో 'చార్‌కమాన్‌'ను కూడా కట్టించాడు. హైదరాబాద్ నగరానికి ఉత్తర సరిహద్దున గల 'నౌబత్‌ఘాట్‌'కు సమీపాన ఇబ్రహీం కులీకుతుబ్‌షా హుస్సేన్‌సాగర్ జలాశయాన్ని నిర్మించాడు. దీని నిర్మాణం సుల్తాన్ అల్లుడైన హుస్సేన్ షా వలీ స్వీయ పర్యవేక్షణలో జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలిపే మార్గంగా ఈ చెరువుకట్ట నేటికీ సేవలందిస్తోంది. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలోనే నిర్మించిన మరొక అద్భుతం మూసీనదిపై కట్టిన 'పురానాపూల్' వంతెన. మొత్తం ఈ వంతెన నిర్మాణంలో 22 ఆర్చ్‌లు ఉన్నాయి. ఇది 54 అడుగుల ఎత్తు, 600 అడుగుల పొడవు, 35 అడుగుల వెడల్పుతో గోల్కొండ - హైదరాబాద్ నగరాలను కలిపే వారధిగా నాటి నుంచి నేటికి ఉపయోగపడుతోంది. ఈ నిర్మాణ చాతుర్యానికి ముగ్దుడైన ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ దీన్ని పారిస్‌లోని 'ఫోంటో న్యుఫ్' నిర్మాణంతో పోల్చి ప్రశంసించాడు.
                సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్‌షా కాలంలో నిర్మించిన ధర్మాసుపత్రే 'దారుల్ - షిఫా'. సామాన్య ప్రజల వైద్యచికిత్సకు రెండంతస్తులతో నిర్మించిన ఈ భవనంలో యునానీ వైద్య సదుపాయాన్ని కల్పించేవారు. కుతుబ్‌షాహీ ప్రభువుల ప్రధాన పరిపాలనకు కేంద్రం గోల్కొండ ఖిల్లా. ప్రభువుల పాలనా వ్యవహారాలన్నీ ఈ కోట నుంచే నిర్వహించేవారు. సుమారు రెండు శతాబ్దాల పాటు కుతుబ్‌షాహీ పాలకుల ప్రధాన కార్యస్థలంగా, అధికారానికి కేంద్రంగా, సార్వభౌమత్వానికి కీర్తిపతాకంగా నిలిచిన గోల్కొండ కోట నిర్మాణం మహాద్భుతం. భూమి ఉపరితలం నుంచి 400 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఈ కోట శత్రుదుర్బేధ్యంగా నిర్మితమైంది. కోట ప్రాకారాన్ని పటిష్ఠమైన గ్రానైట్ బండరాళ్లలో నిర్మించారు. కోట బయట మొత్తం ఎనిమిది దర్వాజాలు ఉంటాయి. వీటిలో ఫతే దర్వాజా ప్రధానమైంది. కోట లోపలి భవనాలైన బాలాహిస్సార్, దివాన్ - ప్యాలెస్, జామా మసీదు, నగీనాబాగ్, సిల్వాఖానాలు నాటి వాస్తుశిల్ప కళావైభవానికి ప్రతీకలు. గోల్కొండ కోట తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి, త్యాగాలకు నిదర్శనం. కుతుబ్‌షాహీల కట్టడాల్లో ప్రసిద్ధిగాంచిన పవిత్ర, ఆధ్యాత్మిక కట్టడం మక్కామసీదు. 'మక్కా'లో ప్రసిద్ధిగాంచిన ఒక మసీదు నమూనాలో దీన్ని నిర్మించడంతో 'మక్కామసీదు'గా ప్రాచుర్యాన్ని పొందింది. సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్‌షా తమ రాజాస్థాన అధికారైన 'దరోగా' మీర్ - ఫజీయుల్లా - బేగ్, చౌదరి రాజయ్యల పర్యవేక్షణలో 'మక్కామసీదు' నిర్మాణానికి క్రీ.శ.1617లో శ్రీకారం చుట్టారు. సుమారు 77 ఏళ్లకు అంటే క్రీ.శ.1694లో ఈ నిర్మాణం పూర్తయ్యింది. మధ్యయుగ వాస్తు శిల్ప కళాచాతుర్యానికి మక్కామసీదు ఒక నిదర్శనం. పర్షియా, అరబ్ దేశాలకు చెందిన సుమారు ఎనిమిది వేల మంది తాపీమేస్త్రీలు, కూలీలు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. ఈ మసీదులో 15 ఆర్చ్‌లు; పొడవు 67 మీ., వెడల్పు 54 మీ., ఎత్తు 23 మీ. గల ప్రధానమైన హాలు ఉంది. మొత్తం పదివేల మంది ప్రజలు ఏకకాలంలో సామూహికంగా ప్రార్థనలు చేసే వీలుండటం ఈ మసీదు విశేషం.
                 ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ మక్కామసీదు వాస్తుశిల్ప శైలికి, నిర్మాణ చాతుర్యం పట్ల ఆశ్చర్యానికి గురై రాసిన మాటలు మధ్యయుగ చరిత్రలోనే అజరామరంగా నిలిచాయి. దీని నిర్మాణానికి అవసరమైన రాళ్లను చేరవేయడానికి వేలాది ఎద్దుల బండ్లను తయారు చేశారని; మహ్మద్ ప్రవక్త కేశాలు, ఇతర పవిత్ర వస్తువులను ఈ మసీదులో భద్రపరిచారని తన రచనల్లో పేర్కొనడం మక్కామసీదు ప్రాశస్త్యాన్ని తెలియజేస్తోంది. సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్‌షా ఏకైక కుమార్తె హయత్ -భక్షీ- బేగం పాలనా వ్యవహారాల్లో పాల్గొనడమే కాకుండా పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. హైదరాబాద్‌కు తూర్పున 'హయత్‌నగర్‌'ను నిర్మించి అక్కడ ఒక రాజమహల్‌ను; వ్యాపారులు, బాటసారులు సేదతీరి, విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా కార్వాన్‌లో 'మా సాహెబ్ సరాయ్' నిర్మాణాన్ని చేపట్టింది. ఈమె తన గురువైన 'ఆకుంద్ - ముల్లా - అబ్దుల్‌మాలిక్' స్మారకార్థం ఖైరతాబాద్‌లో ఒక పెద్ద మసీదును కూడా నిర్మించింది. హయత్-భక్షీ- బేగం స్మారకార్థం ఆమె కుమారుడు అబ్దుల్లా కుతుబ్‌షా తన తల్లి సమాధి పక్కనే ఒక మసీదును అద్భుతమైన వాస్తుశిల్ప కళా నైపుణ్యంతో నిర్మించాడు. దీన్నే 'బజీ మసీదు' అని కూడా పిలుస్తారు. కుతుబ్‌షాహీ ప్రభువులు మధ్యయుగ వాస్తుశిల్ప కళకు ఎంత ప్రాభావాన్ని కల్పించారో, వారు తమ పూర్వీకుల సమాధుల నిర్మాణంలోనూ అదే వాస్తుశిల్ప కళాచాతుర్యాన్ని ప్రదర్శించారు. వీరి వాస్తు శిల్పుల నైపుణ్యం ఏడు సమాధుల్లో కనిపిస్తుంది. మహ్మద్ కులీకుతుబ్‌షా, ఇబ్రహీం కుతుబ్‌షా, మహ్మద్ కుతుబ్‌షా, అబ్దుల్లా కుతుబ్‌షా, బేగం హయత్ భక్షీ, జంషీద్ కులీ, సుల్తాన్ కులీ కుతుబ్-ఉల్-ముల్క్ సమాధులను గోల్కొండ కోటకు సమీపాన నిర్మించారు. ఇవి అద్భుతమైన వాస్తుశిల్ప కళకు నిదర్శనంగా, తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద కట్టడాలుగా ప్రసిద్ధిగాంచి, దేశ విదేశీ పర్యటకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 

 అసఫ్‌జాహీల వాస్తు శిల్పం
ఆధునిక హైదరాబాద్‌కు ఆయువు పట్టు, అద్భుతమైన వాస్తు శిల్పం తొణికిసలాడే కట్టడాలను అసఫ్‌జాహీలు నిర్మించారు. ప్రత్యేకించి నవాబు మీర్ఉస్మాన్ అలీఖాన్ వాస్తుశిల్ప వికాసానికి గణనీయమైన కృషిచేశారు. ఈ కాలం నాటి ప్రసిద్ధిచెందిన కట్టడాల్లో సమకాలీన సంస్కృతి, నాగరికత ప్రతిఫలిస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా ఆసుపత్రి భవనాలను ఇండో - మొగలాయిక్ వాస్తు శైలిలో; హైకోర్టు భవనాన్ని ఇండో - సెరసానిక్, అసెంబ్లీ భవనాన్ని రాజస్థానీ - సెరసానిక్ వాస్తు శైలిలో నిర్మించారు. సిటీ కళాశాల, హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భవనాలు, జూబ్లీహిల్స్, పబ్లిక్‌గార్డెన్స్, చార్మినార్ యునానీ ఆసుపత్రి, అసిఫియా గ్రంథాలయం, జూడీ మసీదు, టౌన్‌హాలు, ఇడెన్‌బాగ్ లాంటివి నిజాం ప్రభువుల కాలం నాటి వాస్తుశిల్ప కళానైపుణ్యానికి నిదర్శనాలు. ఈజిప్టు విశ్వవిద్యాలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన బెల్జియం వాస్తుశిల్పి జాస్పర్ నిజాం రాజు కోరిక మేరకు 1933లో హైదరాబాద్‌కు వచ్చారు. భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల్లోని చారిత్రక కట్టడాలను పరిశీలించి 'హిందూ - ఇస్లామిక్ (పర్షియన్) - యురోపియన్' వాస్తు శైలుల సమ్మేళనంతో 1934 - 39 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలను నిర్మించారు. దీని నిర్మాణంలో నిజాం హైదరాబాద్ రాజ్య వాస్తుశిల్పి నవాబ్ జైన్‌యార్ జంగ్, ప్రముఖ వాస్తుశిల్పి సయ్యద్ అలీరజాలు ప్రధానపాత్ర పోషించారు. 

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వాస్తుశిల్పకళ - వారసత్వం

మాదిరి ప్రశ్నలు

1. అమరావతి శిల్పకళకు ఆధారం?
జ: మహాయాన బౌద్ధం

 

2. తెలంగాణలోని బౌద్ధ స్తూపాలను కిందివాటిలో దేన్ని అనుసరించి నిర్మించారు?
    1) సాంచి                2) అమరావతి                3) సారనాథ్              4) కార్లే
జ: 1(సాంచి)

 

3. 'ఫణిగిరి' ప్రఖ్యాత బౌద్ధ స్తూపం ఏ జిల్లాలో ఉంది?
జ: నల్గొండ

 

4. తెలంగాణలో ఆలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఇక్ష్వాకులు మొదట ఏ ఆలయాన్ని నిర్మించారు?
జ:  పుష్పభ‌ద్ర స్వామి

5. కిందివాటిలో 'వేసర శైలి'లో నిర్మించిన ఆలయాలు?
     ఎ) వేములవాడ                                                  బి) ధర్మపురి
     సి) ఆలంపూర్                                                    డి) కొలనుపాక జైన మందిర్
జ: అన్నీ

 

6. ఇసుక పునాదులపై దేవాలయాలు నిర్మించడం ఎవరి కాలం నాటి వాస్తుశిల్ప ప్రత్యేకత?
జ: కాకతీయులు

 

7. కాకతీయుల శిల్పకళా వైభవానికి కీర్తి పతాకంగా భావించే వేయిస్తంభాల గుడిని ఎవరు నిర్మించారు?
జ: రుద్రదేవుడు

 

8. కిందివాటిలో కాకతీయుల కాలం నాటి ఏ ఆలయాన్ని నక్షత్రాకారంలో నిర్మించారు?
     1) వేయిస్తంభాల గుడి   2) రామప్ప  3) స్వయంభూ దేవాలయం  4) సిద్ధేశ్వరాలయం
జ: 2(రామప్ప)

 

9. వివిధ భంగిమల్లో మలచిన మదనిక, నాగినుల శిల్పాలు ఏ దేవాలయంలో ఉన్నాయి?
జ: రామప్ప

 

10. హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని ఎవరు పర్యవేక్షించారు?
జ: హుస్సేన్ షా-వలీ

 

11. కుతుబ్‌షాహీ సుల్తాన్‌లు నిర్మించిన 'పురానాపూల్' వంతెనలో ఎన్ని ఆర్చ్‌లు ఉన్నాయి?
జ: 22

 

12. భూఉపరితలం నుంచి గోల్కొండ ఖిల్లాలోని భవన నిర్మాణాల గరిష్ఠ ఎత్తు ఎంత?
జ: 400 మీ.

 

13. 'మక్కామసీదు' నిర్మాణాన్ని ఎన్ని సంవత్సరాల్లో పూర్తిచేశారు?
: 77 సంవత్సరాలు

 

14. 'హయత్ నగర్‌'ను ఎవరు నిర్మించారు?
జ: హయత్ భక్షీ బేగం

 

15. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణ ప్రణాళికను రూపొందించిన శిల్పి ఏ దేశస్థుడు?
జ: బెల్జియం

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రదర్శన కళారూపాలు

తెలంగాణలో సంగీత, నృత్య సంబంధమైన కళారూపాలే కాకుండా మరెన్నో ప్రదర్శన రూపాలు ఉన్నాయి. ఇవి ఎంతో మంది కళాకారులకు జీవనోపాధిని కల్పించి ప్రజలకు విజ్ఞాన, వినోదాలను అందిస్తున్నాయి. మరికొన్ని సంఘంలోని దురాచారాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో తోడ్పడుతున్నాయి.
 

తోలుబొమ్మలాట: 'తోలుబొమ్మలాట' కళారూపం ప్రాచీన కాలం నుంచే ఉన్నట్లు సాహిత్యాధారాలు లభించాయి. శ్రీశైలం శివరాత్రి ఉత్సవాల్లో తోలుబొమ్మలాటను ప్రదర్శించినట్లు పాల్కురికి సోమన 'పండితారాధ్య చరిత్ర'లో పేర్కొన్నారు. శ్రీనాథుడి 'పల్నాటి వీర చరిత్ర', 'భాస్కర శతకం'లో తోలుబొమ్మలాట ప్రస్తావన ఉంది. తోలుబొమ్మలాట సమాహార కళారూపం. సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనానికి సమప్రాధాన్యం ఉంటుంది. ప్రదర్శనకు సిద్ధం చేసిన తోలుబొమ్మలను తెల్లని పారదర్శకమైన తెరవెనుక నుంచి సూత్రాల సాయంతో పట్టి ఉంచి, సన్నివేశాలకు అనుగుణంగా సూత్రధారుడు వాటిని ఆడిస్తాడు. దాదాపు నాటక ప్రదర్శనకు ఉండాల్సిన సర్వహంగులతో కథను నడిపిస్తారు. కుటుంబంలోని సభ్యులే ఆయా పాత్రలకు వాచికం చెప్పి ఆడిస్తారు.
    ప్రధానంగా రామాయణ, భారత కథల్లోని ఘట్టాలనే ప్రదర్శనకు ఎంచుకుంటారు. వాచికానికి ఉపయోగించే సాహిత్యాన్ని యక్షగానాల నుంచి స్వీకరిస్తారు. బొమ్మల తయారీలో దుష్ట పాత్రలకు మేక చర్మాన్ని, మంచి పాత్రలకు జింక చర్మాన్ని ఉపయోగిస్తారు. కథాక్రమాన్ని అనుసరించి పాత్రలను (బొమ్మలను) తెరమీద ప్రవేశపెడతారు. ఆటను గణపతి పూజతో ప్రారంభించడం ఆనవాయతి. గాత్రం, తాళం, హార్మోనియం, మృదంగం వాయించే కళాకారులంతా తెర లోపలే కూర్చొని ఉంటారు. ఇందులో సూత్రధారుడిదే కీలకపాత్ర. జుట్టు పోలిగాడు, బంగారక్క, కేతిగాడు ప్రధాన హాస్యపాత్రలు.

 

బుట్టబొమ్మలాట: బుట్టబొమ్మలను పేడతో తయారు చేస్తారు. పెళ్లి ఊరేగింపులు, జాతర్లు, ఉత్సవాల సందర్భాల్లో 'బుట్టబొమ్మలాట'ను ప్రదర్శిస్తారు. పురుషులు మాత్రమే ఆడించడం ఈ కళారూపం విశిష్టత. పై భాగమంతా బొమ్మతో ఉండి, లోపలి భాగం డొల్లగా ఉంటుంది. బొమ్మ కాళ్లు, నోటి భాగంలో రంధ్రాలు ఉంటాయి. ఆటగాడు బొమ్మల లోపలి భాగంలో దూరి ఆడుతుంటే చూసేవారికి బొమ్మ మాత్రమే నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. బొమ్మల్లో ఒకటి స్త్రీది కాగా మరొకటి పురుషుడిది. కొన్ని బొమ్మలు సింగి, సింగడుగా ఉంటాయి. ప్రజలకు వినోదాన్ని పంచే ఈ కళారూపం ప్రస్తుతం కనుమరుగైంది.
 

చోడిగాని కలాపం: తెలంగాణలో ప్రధానంగా దసరా పండగ సందర్భాల్లో ప్రదర్శించే వేషాల్లో చోడిగాని వేషం ఒకటి. ఈ వేషధారణ హాస్యాన్ని పుట్టిస్తుంది. ముఖం నిండా సున్నం బొట్లు, వాటి మధ్య నల్లటి చుక్కలు, తలకు నల్లని వస్త్రం చుట్టుకొని దాని మధ్యలో కాకి ఈకలు, నడుముకు గోచీ, భుజాన జోలే, చేతిలో దుడ్డుకర్ర పట్టుకొని వీధుల్లోకి ప్రవేశించి హడలెత్తిస్తుంటాడు. తోలుబొమ్మలాటలో జుట్టు పోలిగాడిలా చోడిగాని కలాపంలో చోడిగానిదే కీలకపాత్ర. ఈ పాత్ర కేవలం హాస్యంగానే కాక కథానాయకుడి పాత్రను కూడా పోషిస్తుండటం విశేషం. దైనందిన జీవితంలో బాగా ప్రాచుర్యం పొందిన పాత్ర సోలిగాడు. పనీ పాట లేకుండా గాలి తిరుగుడు తిరిగేవారిని సోడిగాడు, సోలిగాడు అనడం పరిపాటైపోయింది.
 

పగటి వేషాలు: ప్రజలకు విజ్ఞాన, వినోదాలను పంచే కళారూపాలను కేవలం రాత్రి సమయాల్లోనే ప్రదర్శిస్తుంటారు. కానీ వీటిని ప్రదర్శించే కళాకారులు, భిక్షువులు పగటి సమయంలోనే ఈ వేషాలు ధరించి ప్రదర్శిస్తుండటంతో 'పగటి వేషాలు/పగటి వేషగాళ్లు' అనే పేరు వచ్చింది. వీరినే 'బహురూపులు' అని కూడా వ్యవహరిస్తారు. తమ వేషధారణ, పాత్రల ద్వారా సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, దురాచారాలను వ్యంగ్యంగా, హాస్య ధోరణిలో వ్యక్తం చేస్తూ ప్రజలను చైతన్యపరిచేవారు. ఎదుటి వారి మనసు నొప్పించకుండా తమ సాహిత్యంతో సమాజంలోని చెడును ఎండగట్టడం వీరి ప్రత్యేకత. పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం, పండితారాధ్య చరిత్రల్లో బహురూపుల ప్రదర్శనను ప్రస్తావిస్తూ శ్రీశైలంలోని శివరాత్రి ఉత్సవాల్లో వీటిని ప్రదర్శించే వారని తెలిపారు. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకంలోనూ నాటక ప్రదర్శన గురించి చెబుతూ బహురూపులను ప్రస్తావించాడు. కాకతీయుల కాలంలో యుగంధర మహా మంత్రి పిచ్చివాడిగా నటించి 'ఢిల్లీ సుల్తాన్, పట్టుకుపోతాన్' అంటూ పగటి వేషగాడి పాత్ర ద్వారానే విజయం సాధించాడని తెలుస్తోంది. పగటివేషాల్లో ప్రధానమైనవి ఫకీరు, రెడ్డి, పంతులు, పఠాన్, తాగుబోతు, కోమటి, గారడి వేషాలు. పగటివేషాల్లో ప్రసిద్ధి చెందినవి బుడబుక్కల, తహశీల్దార్, పాములవాడు, ఎరుకల, దొమ్మరి, బోగం, కోయ, పిట్టలదొర, భట్రాజు, గొల్లభామ, సింగి - సింగడు వేషాలు మొదలైనవి. పాత్రధారి ఏ వేషం వేస్తే ఆ పాత్రోచిత భాషను ప్రయోగించి, తన హావభావాలతో అలరించి ప్రజలకు వినోదాన్ని పంచడమే ప్రధానంగా కనిపిస్తుంది.
 

దొమ్మరాట: ఇది కూడా ప్రాచీన కాలం నుంచే ప్రచారంలో ఉన్న ప్రదర్శన కళ. దీన్నే 'సర్కస్' అని కూడా అంటారు. జనసమ్మర్థమైన ప్రదేశాల్లో, నాలుగు వీధులు కలిసే చోట ఈ ప్రదర్శనలను నిర్వహించేవారు. ఒక పొడవాటి వెదురుగడను పాతి పురుషుడు డోలు వాయిద్యాన్ని వాయిస్తుండగా, స్త్రీ వివిధ రకాలైన సాహస విన్యాసాలను ప్రదర్శిస్తుంది. పాల్కురికి సోమన రచనల ద్వారా క్రీ.శ.13వ శతాబ్దం నుంచే 'దొమ్మరాట' ప్రదర్శించే వారని తెలుస్తోంది. దొమ్మరిసానులు వెదురుగడలపై ఆకాశంలో అప్సరసలు ఆడుతున్న భ్రమను కలిగించేవారని ఆయన తెలిపాడు.
గారడీ విద్యలు: గారడీ విద్యలు తెలుగునాట పూర్వకాలం నుంచే ప్రచారంలో ఉన్నాయని తెలుస్తోంది. పాల్కురికి సోమన తన పండితారాధ్య చరిత్రలో గారడీవారు మోకులపై ఆడినట్లు ప్రస్తావించాడు. పొడవైన చువ్వను ఆకాశంలోకి విసరగానే అది వెదురుగడలా నిలబడటం, గారడీవాడు తాడు మీద నిచ్చెన ఎక్కినట్లుగా జరజరాపాక్కుంటూ వెళ్లి మాయమై, తిరిగి ప్రత్యక్షమై చిత్ర విచిత్రమైన విన్యాసాలను ప్రదర్శిస్తాడు. నేటికీ పల్లెల్లో ఈ విద్యను ప్రదర్శించే కళాకారులున్నారు. వేపాకులు దూసి తేళ్లను రప్పించడం, అరచేతిలో రూపాయి నాణేలను సృష్టించడం, గొంతు కోసి రక్తం చూపించడం; మన వద్ద ఉన్న వస్తువులు, సొమ్ములను మాయం చేసి మరొకరి జేబులోకి రప్పించడం వంటి అనేక ప్రదర్శనలు గారడీ కళాకారులు చేస్తారు.

 

విప్రవినోదులు: వీరు కూడా ఇంద్రజాల ప్రదర్శన వంటి గారడీ విద్యలనే ప్రదర్శిస్తారు. విప్రులను మాత్రమే యాచిస్తూ జీవనాన్ని గడుపుతారు. ఒక విశాలమైన ప్రాంతంలో నాలుగు వీధులు కలిసే చోట ఒక చిన్న పందిరిలో (శాలువాలతో) ప్రదర్శనను నిర్వహిస్తారు. వీరు రాళ్లు, రప్పలతో దేవతల విగ్రహాలను తయారు చేస్తారు. పందిరిలో ఒక కర్రకు కట్టి ఉంచిన వ్యక్తి, పందిరి తెరను ఎత్తి చూసేలోగా మరో కర్రకు కట్టి ఉన్నట్లుగా దర్శనమిస్తాడు. ఒక ఖాళీ అలమరాను పందిరి లోపల ఉంచి చూపిస్తారు. ముఖ్య కళాకారుడు తాటాకుల గ్రంథంలో తెరల మధ్యలోకి వెళ్లి పావుగంట వరకు లోపలనే ఉంటాడు. ఈలోగా బయట భజన కార్యక్రమం మొదలై, అది పూర్తికాగానే తెరను తొలగిస్తారు. అప్పటి వరకు ఖాళీగా ఉన్న అలమరాలో దేవతల విగ్రహాలు, దీపారాధనతో వెలుగుతున్న జ్యోతులు, పుష్పాలు, ఫలాలు, నైవేద్య ప్రసాదాలు, పిండి వంటలు దర్శనమిస్తాయి. ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన రూపం. ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది.
 

గొల్లసుద్దులు: సుద్దులు చెప్పుకుంటూ గొల్లలను యాచించే కళాకారులనే 'గొల్లసుద్దులు' అంటారు. ఇదొక విశిష్టమైన కళారూపం. గొల్ల/యాదవుల చరిత్రకు సంబంధించిన శ్రీకృష్ణుడి లీలలు, కాటమరాజు కథను గొల్లసుద్దులు గానం చేస్తారు. వీరు తమ కథాగానం కోసం కథా వివరాలను చెప్పడానికి పెద్ద వస్త్రాలపై చిత్రించిన బొమ్మలను ఉపయోగిస్తారు.
      ఆధునిక యుగంలో గొల్లసుద్దుల కళారూపం ప్రచార మాధ్యమంగా కూడా పరిణామం చెందింది. చేతిలో కర్ర, భుజాన గొంగడి వేసుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలు, మూఢనమ్మకాలను వ్యంగ్యంగా, ఎత్తి పొడుపు ధోరణిలో ప్రదర్శించేవారు. ప్రసార మాధ్యమాలు కూడా ఈ కళారూపానికి విశేషంగా ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నాయి. సామాజిక చైతన్యమే పరమావధిగా జన నాట్యమండలి, ప్రజా నాట్యమండలి వంటి వామపక్ష సంస్థలు తమ ప్రచారంలో భాగంగా 'గొల్లసుద్దులను' తిరుగులేని ఆయుధంగా మలచుకున్నాయి.

 

సాధనాశూరులు: వీరు పద్మశాలీలను మాత్రమే యాచిస్తారు. ప్రదర్శన కూడా విప్రవినోదుల ప్రదర్శన మాదిరిగానే ఉంటుంది. ఎదురు రొమ్ము మీద పెద్ద పెద్ద బండలను ఉంచి వాటిని సుత్తెలతో పగలగొట్టడం, బుగ్గల్లో ఇనుప చువ్వలను గుచ్చుకోవడం, ముక్కు ఒక రంధ్రంలోకి నీటిని పంపి మరో రంధ్రంలో నుంచి బయటకు రప్పించడం, చొప్పబెండ్లతో తయారు చేసిన బండెక్కి ఊరేగడం, మనిషి తలపై పొయ్యిని వెలిగించి పిండి వంటలు చేయడం లాంటి విద్యలను ప్రదర్శించేవారు.
 

జంతరు పెట్టె: ఇది మాయల ఫకీరు పెట్టె లాంటింది. జంతరవాడు దీనిలో చేయి పెట్టి అనేక అద్భుతాలను సృష్టిస్తాడు. రకరకాల వస్తువులు, బొమ్మలను ఒకదాని తర్వాత ఒకటి తీస్తూ వాటిని ప్రదర్శిస్తాడు. ఈ విధంగా తెలంగాణలోని ఎన్నో ప్రదర్శన కళలు ప్రజలను రంజింపజేస్తూ, వాటినే వృత్తిగా నమ్ముకొని ఆచరిస్తున్న భిక్షువులకు, జానపద కళాకారులకు వెలుగులు పంచుతున్నాయి.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రదర్శన కళారూపాలు

1. 'పేరిణీ' నృత్యకళా సంప్రదాయాన్ని పునరుద్ధరించిన నాట్యకారుడు ఎవరు?
జ: నటరాజ రామకృష్ణ

 

2. భామా కలాపం/గొల్ల కలాపం రూపకాలకు మాతృక?
జ: కూచిపూడి

 

3. పాండవుల వారసులుగా ప్రసిద్ధిగాంచిన గోండులు ప్రదర్శించే నృత్య రూపం?
జ: దండారియా నృత్యం

 

4. 'సింధీలు' అనే తెగ ఆచరించే నృత్యరీతి?
జ: ఢమాల్ నృత్యం

 

5. 'రాస్‌లీలా'ను పోలిన గిరిజన నృత్యం?
జ: మాధురీ నృత్యం

 

6. తెలంగాణలో దసరా, పీర్ల పండగ సందర్భాల్లో ప్రదర్శించే నృత్య రూపం?
జ: పులి వేషం

 

7. 'కాముని ఆట' నృత్య కళారూపంలో మిళితమైన మరో నృత్య విశేషం?
జ: కోలాటం

 

8. 'కోలాటం' అనే నృత్య కళారూపం ఏ రాష్ట్రంలో ఆవిర్భవించిందని భావిస్తున్నారు?
జ: తమిళనాడు

 

9. 'తోలుబొమ్మలాట'లో దుష్ట పాత్రలకు ఏ జంతువు చర్మాన్ని ఉపయోగిస్తారు?
జ: మేక చర్మం

10. 'బుట్టబొమ్మలాట'లోని బొమ్మలను దేంతో తయారు చేస్తారు?
జ: పేడ

 

11. పనీ పాట లేకుండా గాలి తిరుగుడు తిరిగేవారిని ఏమంటారు?
జ: సోలిగాడు

 

12. పగటి వేషాలు/వేషగాళ్లకు మరో పేరు?
జ: బహురూపులు

 

13. 'ఆకాశంలో అప్సరసల్లా ఆడుతున్నారంటూ' పాల్కురికి సోమన తన రచనల్లో ఎవరిని ప్రస్తావించాడు?
జ: దొమ్మరిసానులు

 

14. బ్రాహ్మణులను మాత్రమే యాచించి, ఇంద్రజాలం లాంటి ప్రదర్శనలు చేసేవారు?
జ: విప్రవినోదులు

 

15. పద్మశాలీలను మాత్రమే యాచించి ప్రదర్శనలను ఇచ్చేవారు?
జ: సాధనాశూరులు

 

తెలంగాణ కళలపై గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. తెలంగాణలో విస్తృతంగా ప్రదర్శించే యక్షగానం యొక్క మరో రూపం?  (AMVI Exam-2015)

జ: చిందు భాగవతం
 

2. 'జమిడిక' అనేది దేనికి సంబంధించింది?  (AMVI Exam-2015)
జ: వాయిద్య పరికరం

 

3. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కె.లక్ష్మాగౌడ్ ఏ రంగానికి చెందినవారు? (Tecnician, Gr-II)
జ: చిత్రలేఖనం

 

4. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ దేనికి ప్రసిద్ధి చెందింది? (Technician, Gr-II)
జ: హస్తకళలు, చిత్రలేఖనం

 

5. బతుకమ్మ సంబురాల్లోని మొదటి రోజును ఏమంటారు? (Managers HMWSSB-2015)
జ: ఎంగిలిపూలు

6. కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం?  (AEE, 2015)
జ: పేరిణీ నృత్యం

 

7. బతుకమ్మలో ప్రధానంగా ఏ పువ్వును ఉపయోగిస్తారు? (AEE, 2015)
జ: గునుగు

 

8. 'రంగం' అనే భవిష్యవాణి దేంతో ముడిపడి ఉంది? (AEE, 2015)
జ: సికింద్రాబాద్ బోనాలు

 

9. 'బాలసంతులు' ఒక (AEE, 2015)
జ: కుల సమూహం
10. బతుకమ్మ చివరి రోజును ఏమంటారు? (AEE, 2015)
జ: సద్దుల బతుకమ్మ

 

11. 'గుస్సాడీ' నాట్యం తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రాచుర్యంలో ఉంది? (AFA Exam)
జ: ఆదిలాబాద్

 

12. ప్రసిద్ధ ఒగ్గుకథ కళాకారుడు/కళాకారిణి పేరు? (AFA Exam)
జ: చుక్క సత్తయ్య

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తెలంగాణ భావన

తెలంగాణ ఉద్యమ చరిత్ర అధ్యయనం చేసేటప్పుడు మొదట తెలంగాణ అనే భావన ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసుకోవాలి. దాని గురించి అవగాహన చేసుకోడానికి ముందుగా భౌగోళికంగా తెలంగాణ ఏర్పాటు, ప్రత్యేకతలతోపాటు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటైన రాజ్యాలు, వాటి పాలన, సంస్కృతి తదితర అంశాలను మౌలికంగా అర్థం చేసుకోవాలి.
హైదరాబాద్ రాష్ట్రం భౌగోళికంగా 15o 10- 20o 40ఉత్తర అక్షాంశాలు, 74o40 - 81o 35' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉండేది. ఈ రాష్ట్రం వింధ్య పర్వతాలకు దక్షిణాన దక్కన్ పీఠభూమిలో, సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తులో ఉండేది. భారతదేశంలోని దేశీయ సంస్థానాలన్నింటిలో హైదరాబాద్ పెద్దది. ఇది 82,698 చదరపు మైళ్ల వైశాల్యంతో, పంచకోణ ఆకృతిలో ఉండేది.
ప్రధాన నదులు గోదావరి, కృష్ణ. ఎత్తయిన పర్వత శిఖరం స్వరూపనాథ్. ఔరంగాబాద్‌కు పశ్చిమోత్తర దిశలో ఉంది. ఇంకా జాల్నా, బాలఘాట్, కందికల్, రాఖీ, అనంతగిరి, నల్లమల, నిర్మల్, రాచకొండ, సహ్యాద్రి పర్వత శ్రేణులు వందల మైళ్లు విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్ సంస్థానంలోని భూమి దక్కన్ పీఠభూమికి కేంద్రంగా ఉండేది. ఇక్కడ నల్లరేగడి, ఎర్రనేలలు, ఇసుక, మొరం నేలలు ఉండేవి. 1901 గణాంకాల ప్రకారం సంస్థానంలోని 12,531 చ.మైళ్ల (41.4శాతం) విస్తీర్ణంలో జొన్న పంట పండేది. వరి పండే విస్తీర్ణం 1,358 చ.మైళ్లు (4.5 శాతం). రెండో పెద్ద పంట పత్తి. 3,226 చ.మైళ్ల విస్తీర్ణంలో (10.7 శాతం) పండించేవారు.

ఆర్థిక పరిస్థితులు
హైదరాబాద్ సంస్థానంలోని భూమి వివిధ యజమాన్యాల కింద ఉండేది. రాజ్యంలో వ్యవసాయం కింద ఉన్న భూమి మొత్తం 5 కోట్ల 30 లక్షల ఎకరాలు. అందులో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. దీన్నే దివానీ లేదా ఖల్సా ప్రాంతం అంటారు. దాదాపు కోటీ యాభైలక్షల ఎకరాలు జాగిర్దారీ విధానం కింద ఉండేది.
సర్ఫేఖాస్: రాజ్యంలో దాదాపు 10 శాతం భూమి నిజాం సొంత కమతంగా ఉండేది. దీన్నే 'సర్ఫేఖాస్ అనేవారు. ఈ భూమి 8,100 చదరపు మైళ్లలో 18 తాలుకాల్లో విస్తరించి ఉండేది. ఈ భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని నిజాంకు చెల్లించేవారు.
జాగీరు ప్రాంతాలు: జాగీరు ప్రాంతాలు మొత్తం సంస్థానంలో 1/30వ వంతు ఉండేవి. ఈ ప్రాంతాల్లో పైగాలు, సంస్థానాలు, జాగీర్దార్లు, ఇజారాదార్లు, మక్తేదార్లు, ఈనాందార్లు, అగ్రహారికులు అనే పేర్లతో వివిధ రకాల భూస్వామ్య వర్గాలుండేవి. వీరిలో కొందరికి పన్నులు విధించి వసూలు చేసేందుకు సొంత రెవెన్యూ అధికారులు ఉండేవారు. ఇవి సంస్థానానికి సామంత రాజ్యాలుగా వ్యవహరించేవి.
పైగాలు: నిజాం రాజ బంధువులకు పైగాలు అనే భూములను ఇచ్చేవారు. వీరు ఈ భూములను అనుభవిస్తూ సొంత సైన్యాలను పోషించేవారు. ఈ సైన్యాన్ని యుద్ధ సమయంలో రాజుకు సరఫరా చేసేవారు.
దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు: వీరు గతంలో ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేసేవారు. సాలార్‌జంగ్ సంస్థాన్ దివాన్ (ప్రధాని) అయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమే నేరుగా రైతుల నుంచి పన్నులు వసూలు చేసేది. దీంతో ప్రభుత్వం గతంలో వీరు చేసిన సేవకు వతన్లు లేదా మాష్‌ను (ఉద్యోగ విరమణానంతర భృతి) ఇచ్చేవారు.
 దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు పన్నులు వసూలు చేసే కాలంలో రైతుల నుంచి అతి సారవంతమైన భూములను వేలాది ఎకరాల ఆక్రమించి రైతులను కౌలుదార్ల స్థాయికి నెట్టేశారు. భూస్వాములు పంటల పేరుతో రైతులకు అధిక వడ్డీకి రుణాలిచ్చారు. అవి తీర్చలేని రైతుల భూములను ఆక్రమించుకున్నారు.
పటేల్, పట్వారీ, మాలీ పటేల్: తెలంగాణ గ్రామాల్లో వంశపారంపర్య హక్కులతో పటేల్, పట్వారీ, మాలీ పటేల్ అనే గ్రామాధికారులు ఉండేవారు. వీరిలో ప్రతి ఒక్కరూ అయిదు నుంచి పది గ్రామాలను వతన్‌గా పొందేవారు. ఈ వతన్ గ్రామాల్లో భూస్వాములు తమ గుమాస్తాలు, ఏజెంట్ల (సేరీవార్ల) ద్వారా అధికారం చెలాయించేవారు. వీరికి ప్రభుత్వ అధికారుల్లా అన్ని అధికారాలుండేవి. వీరు రైతుల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. భూస్వామికి తెలియకుండా గ్రామస్థుల మధ్య వివాదాలు కూడా పరిష్కారమయ్యేవి కావు. జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల వద్ద ఉండే రైఫిళ్లు, తుపాకులకు లైసెన్స్‌లు ఉండేవి. వారికి సాయుధ, అశ్విక బలగాలు ఉండేవి.

 

దేశ్‌ముఖ్‌లు, దొరలు: జన్నారెడ్డి, ప్రతాపరెడ్డి
ఎర్రపాడు దేశ్‌ముఖ్‌కు 20 గ్రామాల్లో లక్షా యాభైవేల ఎకరాల భూమి ఉండేది. నల్గొండ జిల్లా సూర్యాపేట తాలుకాలోని ఎర్రపాడు గ్రామం నుంచి వరంగల్ జిల్లా కుమ్మరికుంట్ల వరకు అనేక గ్రామాలు ఇతడి అధీనంలో ఉండేవి. ఇతడు ఇకముందు కొత్త భూములను పట్టా చేసుకోకూడదని నిజాం ఫర్మానా జారీ చేశాడు.
కల్లూరు దేశ్‌ముఖ్‌కు (మధిర తాలూకా, ఖమ్మం జిల్లా) లక్ష ఎకరాల భూమి ఉండేది. విసునూరు దేశ్‌ముఖ్‌కు (జనగామ తాలూకా, నల్గొండ జిల్లా) 60 గ్రామాల్లో 40 వేల ఎకరాల భూమి ఉండేది. సూర్యాపేట దేశ్‌ముఖ్‌కు 20 వేల ఎకరాల భూమి ఉండేది.

 

నీటిపారుదల సౌకర్యాలు
కాకతీయులు తెలంగాణలోని ప్రతి గ్రామంలో చెరువులు నిర్మించారు. చెరువుల నిర్మాణాన్ని ఒక పుణ్యకార్యంగా ప్రోత్సహించారు. రామప్ప, పాకాల, లక్నవరం, బయ్యారం చెరువులు నిర్మించారు. తెలంగాణ జిల్లాల్లో కాకతీయులు, కుతుబ్‌షాహీలు వేలాది గొలుసు చెరువులు, కుంటలు నిర్మించారు. వీటిని పరిరక్షించిన అసఫ్‌జాహీ పాలకులు కొత్త చెరువుల నిర్మాణం చేపట్టారు. అసఫ్‌జాహీల కాలంలో మీర్ ఆలం హైదరాబాద్ నగరంలో మీర్ ఆలం తటాకం నిర్మించాడు. చివరి పాలకుడైన ఉస్మాన్ అలీఖాన్ ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్ చెరువులు నిర్మించి మంచినీటి సరఫరాకు, వ్యవసాయానికి వసతి కల్పించాడు. ఇతడు రూ.7 కోట్ల ఖర్చుతో మంజీరా నదిపై నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించాడు. నిజాం రాజ్య పాలనలో ఇదే బృహత్తర నిర్మాణం. ఉస్మాన్ అలీఖాన్ కాలంలో వైరా, పాలేరు ప్రాజెక్టులు (ఖమ్మం జిల్లా), కోయిల సాగర్ (మహబూబ్‌నగర్ జిల్లా), రాయపల్లి చెరువు (మెదక్ జిల్లా), బోధన్‌లోని అలీసాగర్ (నిజామాబాద్ జిల్లా) నిర్మించారు. తెలంగాణలో అనేక ఖనిజాలు లభించేవి. సింగరేణి, కొత్తగూడెంలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ గనులు గోదావరి, ప్రాణహిత నదుల మాగాణుల వరకు విస్తరించి ఉన్నాయి. గోదావరి లోయ, తుంగభద్రా నదుల అంతర్వేది, ఆదిలాబాద్ జిల్లాలో ఇనుప గనులు ఉండేవి. జగిత్యాల, నిర్మల్, యెలగర్పు ఉక్కు పరికరాల నిర్మాణానికి ప్రసిద్ధి.
ఖమ్మం మెట్టు                         -          అభ్రకం
పాల్వంచ                                 -         కురువిందం, కెంపురాయి
హసనాబాద్                             -        నల్ల సీసం
వరంగల్                                  -         తివాచీలు, పత్రంజీలు
కరీంనగర్                                -         వెండి, బంగారు తీగ పని
అలంపురం                              -         జంపఖానాలు
పెంబర్తి                                    -         ఇత్తడి పాత్రలు
సిద్దిపేట                                  -         పట్టు వస్త్రాలు
జనగామ                                -         నక్షత్ర కనుమలు
పోచంపల్లి                                -         చిట్టి రుమాళ్లు
ఆర్మూరు, నారాయణపేట         -         సిల్క్ చీరలు
రఘునాథపురం, కార్వాన్        -         అరబ్బు లుంగీలు
గద్వాల్, సిద్దిపేటల్లో నేత పరిశ్రమలుండేవి. నిర్మల్‌లో కుటీర పరిశ్రమలు, సిర్పూరులో కాగితం పరిశ్రమ (కాగజ్‌నగర్), బోధన్‌లోని చక్కెర కర్మాగారం, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, దివాన్ బహదూర్ రాంగోపాల్ మిల్స్, వరంగల్ లోని అజంజాహీ మిల్లులు ప్రసిద్ధమైనవి.

 

సాంఘిక పరిస్థితులు:

తెలంగాణలోని మొత్తం భూమి వివిధ భూస్వాముల కింద ఉండేది. వీరు బలవంతపు వసూళ్లు చేసేవారు. ప్రజలతో నిర్బంధంగా చాకిరీ చేయించుకునేవారు.

వెట్టి విధానం:
వెట్టి విధానం తెలంగాణ అంతటా ఉండేది. ప్రజల్లోని అన్ని వర్గాల వారికి తమ తమ స్థాయుల్లో ఇది వర్తించేది. ప్రతి హరిజన కుటుంబం నుంచి ఒకరిని వెట్టి చాకిరీ చేయడానికి కేటాయించాల్సి ఉండేది. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచీ ఒకరిని పంపేవారు. వెట్టి చాకిరి రెండు విధాలుగా అమలయ్యేది. మొదటిది అధికారులకు చేసే వెట్టి చాకిరి. రెండోది గ్రామంలోని దొరలు, పటేల్, పట్వారీలకు చేసే వెట్టి చాకిరి. ప్రభుత్వాధికారులు గ్రామంలోకి వస్తే వివిధ వృత్తులవారు వెట్టి చాకిరి చేసి వారికి కావలసిన అవసరాలు తీర్చేవారు. ఇంకా పటేల్, పట్వారీ, మాలీ పటేల్ ఇళ్లలో గృహ సంబంధమైన పనులు చేయడం, పోలీసు, తాలుకా ఆఫీసులకు రికార్డులు మోసుకుపోవడం, గ్రామ చావడి, బందెల దొడ్డికి కాపలా కాయడం రోజువారీ పనిలో భాగంగా ఉండేది.
ఆడపాపలు:
ఇది వెట్టి చాకిరీ పద్ధతిలో దారుణమైంది. భూస్వాముల ఇళ్లలో పని చేయడానికి బానిసలుగా బాలికలను పంపించే పద్ధతి. భూస్వాములు తమ కుమార్తెలకు పెళ్ల్లి చేసినప్పుడు బానిసలుగా ఈ బాలికలను బహుకరించేవారు. వీరు పెళ్లికూతురి అత్తవారింట్లో పని చేయాల్సి ఉండేది.
భూస్వాములు అతిహీన స్థితిలో ఉన్న రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి అయ్యే ఖర్చును రైతుల నుంచి రాబట్టేవారు. 1923 మార్చి 20న తన జన్మదినం సందర్భంగా నిజాం ఉస్మాన్ అలీఖాన్ వెట్టిచాకిరీని నిషేధిస్తూ ఫర్మానా జారీ చేశాడు.

 

చారిత్రక నేపథ్యం
తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. క్రీ.పూ. 6వ శతాబ్దంలో విలసిల్లిన షోడశ మహాజనపదాల్లో ఇదీ ఒకటిగా ఉండేది. తెలంగాణలోని పోడన (బొధన్) రాజధానిగా అస్మక రాజ్యం ఉండేది. శాతవాహనులు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల రాజధానిగా తమ పాలనను ప్రారంభించారు. వీరి తర్వాత వరుసగా ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, పశ్చిమ, వేములవాడ, ముదిగొండ చాళుక్యులు, రాష్ట్రకూటులు తెలంగాణను పాలించారు. ఈ రాజవంశాల కాలంలో ఫణిగిరి, గాజులబండ, వర్దమానుకోట, నాగారం, ఇంద్రపురి, పాషిగాం, ధూలికట్ట, కొండాపూర్, నేలకొండపల్లి, తంబాలపల్లి, గీసుకొండ మొదలైన ప్రాంతాలు ప్రముఖ బౌద్ధ స్థావరాలుగా విలసిల్లాయి.
క్రీ.శ. 1000 నుంచి 1323 వరకు తెలంగాణ కాకతీయుల పాలనలో ఉండేది. తర్వాత ఢిల్లీ సుల్తాన్‌లు, బహమనీలు తక్కువకాలం తెలంగాణను పాలించారు. కుతుబ్‌షాహీలు గోలకొండ రాజధానిగా క్రీ.శ. 1512 నుంచి 1687 వరకు పాలించారు. వీరి కాలంలోనే హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. అనేకమంది విదేశీయులు, ముస్లింలు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఫలితంగా హిందూ ముస్లిం సంస్కృతులతో కూడిన మిశ్రమ సంస్కృతి హైదరాబాద్ నగరంలో ఏర్పడి, భిన్న మతాల శాంతియుత సహజీవనం సాగింది. క్రీ.శ. 1724లో హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించారు. 1948లో భారత ప్రభుత్వం పోలీస్ చర్య జరిపి భారతదేశంలో కలిపే వరకు ఇది కొనసాగింది.
హైదరాబాద్ సంస్థానం మొత్తం వైశాల్యంలో 50 శాతం తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణ ,¸ 28 శాతం మరాఠీ, 11 శాతం కన్నడం మాట్లాడే ప్రాంతాలు ఉండేవి. తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు కోటిమంది ఉండేవారు. ఉర్దూ మాట్లాడేవారు 12 శాతం అంటే 21 లక్షల మంది ఉండేవారు. మతపరంగా చూస్తే హిందువులు 88 శాతం, మిగిలిన వారు ముస్లింలు, క్రైస్తవులు తదితరులు ఉండేవారు.
అసఫ్‌జాహీ రాజ్య స్థాపకుడైన నిజాం-ఉల్-ముల్క్ కాలంలో బేరార్, హైదరాబాద్, ఔరంగాబాద్, బీజాపూర్, బీదర్, ఖాందేష్ అనే 6 సుబాలుండేవి. మొత్తం సంస్థానంలోని ప్రజల్లో అక్షరాస్యులు 4.8 శాతం మాత్రమే.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహనులు

       శాతవాహన వంశం శ్రీముఖుడితో ఆరంభమై చివరి శాతవాహన రాజు మూడో పులోమావితో అంతరించింది. శాతవాహనులు ఆంధ్రులే అనడానికి ఆధారాలు, వాటిని సమర్థిస్తూ లభించిన స్తూపాలు, శాసనాలు, నాణేలు; గ్రంథాలు; రచయితలు, చరిత్రకారుల అభిప్రాయాలు... ఇంకా శాతవాహన కాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు; విద్యా, వాస్తు, కళారంగాల అభివృద్ధి... ఇలా మరెన్నో ఆసక్తికర అంశాల సమాహారమే ఈ 'శాతవాహనులు' పాఠం. 
       ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర శాతవాహనులతో ప్రారంభమవుతుంది. వీరు బ్రాహ్మణులైనప్పటికీ రాజకీయంగా సమర్థవంతమైన పాలనను అందించడమే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఆంధ్రదేశ ఔన్నత్యానికి ఎంతో కృషి చేశారు.
ఆధారాలు: శాతవాహనుల చరిత్రను పునఃనిర్మించడానికి ఉన్న ఆధారాలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు. అవి: 1) పురావస్తు ఆధారాలు 2) వాఞ్మయ లేదా లిఖిత ఆధారాలు. పురావస్తు ఆధారాల్లో శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పాత్రలు లాంటివి ఉన్నాయి. లిఖిత ఆధారాల్లో దేశీయ, విదేశీ రచనలు ఉన్నాయి.

పురావస్తు ఆధారాలు
అనేక శాసనాలు శాతవాహనుల రాజకీయ, సాంస్కృతిక చరిత్రను వివరిస్తున్నాయి. దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనం ఆమె భర్త మొదటి శాతకర్ణి విజయాలను వివరిస్తుంది. గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను, వివిధ బిరుదులను తెలుపుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి వేయించిన కార్లే శాసనం, వాశిష్ఠీపుత్ర పులోమావి/ రెండో పులోమావి వేయించిన అమరావతి శాసనం, యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన చినగంజాం శాసనం, మూడో పులోమావి కాలంలో వేసిన మ్యాకదోని శాసనాలు శాతవాహనుల చరిత్రను వివరిస్తున్నాయి. ఇవే కాకుండా వారి సమకాలీన పాలకుల శాసనాల్లో కూడా అనేక ఆధారాలు లభిస్తున్నాయి. అశోకుడి 13వ శిలాశాసనం, ఎర్రగుడి శాసనాలు, ఖారవేలుడి హతిగుంఫా శాసనం, చస్తనుడి అంథే శాసనం, రుద్రదాముని జునాగఢ్ శాసనాల్లో కూడా అనేక ఆధారాలు లభిస్తున్నాయి.
       శాతవాహనుల కాలంలో సీసం-రాగితో తయారుచేసిన ఫోటేన్ నాణేలతోపాటు అనేక రోమన్ నాణేలు, జోగల్ తంబి నాణేలు నాటి ఆర్థిక, మత పరిస్థితులను వివరిస్తున్నాయి. శాద్వాహణ శ్రీముఖ పేరుతో ఉన్న నాణేలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, మునులగుట్ట ప్రదేశాల్లో లభించాయి. నహపాణుడిని ఓడించి గౌతమీపుత్ర శాతకర్ణి పునర్ముద్రించిన జోగల్ తంబి నాణేలు మహారాష్ట్ర ప్రాంతంలో లభించాయి. రెండో పులోమావి వేయించిన ఓడ బొమ్మ నాణేలు, యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన తెరచాప ఓడ బొమ్మ నాణేలు నాటి నౌకా వాణిజ్య అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిని తెలియజేస్తున్నాయి. శాతవాహనుల కాలంనాటి ప్రధాన బంగారు నాణెం సువర్ణం కాగా నాటి వెండి నాణెం కర్షాపణం.

 నాడు ఒక సువర్ణం 35 కర్షాపణాలతో సమానమని తెలుస్తోంది. శాతవాహన రాజు అపీలకుని నాణెం చత్తీస్‌గఢ్ ప్రాంతంలో లభించింది. నాటి కట్టడాల్లో ముఖ్యమైన అమరావతి, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, శాలిహుండం లాంటి స్తూప, చైత్య విహారాలు శాతవాహన కాలం నాటి వాస్తు, కళారంగాల అభివృద్ధిని తెలియజేస్తున్నాయి. కోటిలింగాల ప్రాంతంలో బట్టి ఇటుకలతో నిర్మించిన బావులు బయల్పడినవి.
 

లిఖిత/ వాఞ్మయ/ సాహిత్య ఆధారాలు
* శాతవాహనుల చరిత్రను తెలియజేస్తూ అనేక రచనలు వెలువడ్డాయి. పురాణాలు, జైన, బౌద్ధ సాహిత్యం, విదేశీయుల రచనలు అనేకం శాతవాహనుల గురించి వివరిస్తున్నాయి. మత్స్యపురాణం 30 మంది శాతవాహన చక్రవర్తులు 400 సంవత్సరాలు ఆంధ్ర దేశాన్ని పాలించారని వివరిస్తుంది. ప్రాకృత భాషలో హాలుడు రచించిన గాథాసప్తశతి, గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ, శాతవాహన కాలంనాటి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులను వివరిస్తున్నాయి.  

* శాతవాహనుల సాంఘిక, మత పరిస్థితులు తెలుసుకోవడానికి ఉన్న ప్రధాన ఆధారం గాథాసప్తశతి, శర్వవర్మ సంస్కృత భాషలో రచించిన కాతంత్ర వ్యాకరణం, కుతూహలుడి రచన - లీలావతి పరిణయం, సోమదేవసూరి రచించిన కథా సరిత్సాగరం నాటి ప్రధాన సాహిత్య ఆధారాలు. ఇవే కాకుండా విదేశీయులు, గ్రీకు నావికులు, రచయితలు రచించిన గ్రంథాలు కూడా ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ప్లినీ రచించిన నేచురల్ హిస్టరీ, టాలమీ గ్రంథం జాగ్రఫీ, పేరు తెలియని గ్రీకు నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథాలు కూడా ఎంతో సమాచారాన్ని ఇస్తున్నాయి. 
 

శాతవాహనుల జన్మస్థలం, రాజధానులపై ఉన్న భిన్నాభిప్రాయాలు
           శాతవాహనుల జన్మస్థలం, రాజధానులపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శాసన, సాహిత్య ఆధారాలను అనుసరించి శాతవాహనులు ఆంధ్రులని అనేకమంది చరిత్రకారులు చెప్పారు. ముఖ్యంగా స్మిత్, రాప్సన్; భండార్కర్, గుత్తి వెంకటరావు, నేలటూరి వెంకట రామయ్య, మల్లంపల్లి సోమశేఖర శర్మ... వీరంతా శాతవాహనులు ఆంధ్రులు అనే అభిప్రాయాన్ని వెల్లడించారు. 'శాతవాహనులు ఆంధ్రులకు భృత్యులు' అని భండార్కర్ పేర్కొన్నాడు. కానీ, శ్రీనివాస అయ్యంగార్, పుసాల్కర్ లాంటి చరిత్రకారులు శాతవాహనులు మహారాష్ట్రులు అని పేర్కొన్నారు. సుక్తాంకర్ లాంటి చరిత్రకారులు మాత్రం శాతవాహనులను కన్నడిగులు అన్నారు. వి.వి.మిరాసి అనే చరిత్రకారుడు శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని తెలిపాడు. అయితే పురావస్తు, సాహిత్య ఆధారాలను అనుసరించి చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శాతవాహనులు ఆంధ్రులే. ఇక రాజధాని విషయంలో కూడా అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బార్నెట్, బర్జెస్, స్మిత్ లాంటి చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం అని పేర్కొన్నారు. ఆర్.జి.భండార్కర్ ధాన్యకటకాన్ని శాతవాహనుల రాజధాని అని వివరించాడు. రాయ్ చౌదరి ప్రకారం శాతవాహనుల రాజధాని విజయవాడ. కానీ జైన వాఞ్మయం ప్రకారం శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్ఠానపురం లేదా పైఠాన్. ఆధునిక చరిత్రకారులు కొందరు శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల అని పేర్కొంటున్నారు. ఈ భిన్నాభిప్రాయాలను పరిశీలించిన తర్వాత అత్యధికులు శాతవాహనుల తొలి రాజధాని నేటి మహారాష్ట్రలోని పైఠాన్ లేదా ప్రతిష్ఠానపురం అని, మలి రాజధాని అమరావతి లేదా ధాన్యకటకం (గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్) అని అంగీకరిస్తున్నారు. శాతవాహనుల పరిపాలన ప్రారంభకాలం గురించి కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బి.ఎస్.ఎల్.హనుమంతరావు శ్రీముఖుడి పాలన క్రీ.పూ.271లో ప్రారంభమైనట్లు పేర్కొనగా, బుహ్లర్, ఖండవల్లి లక్ష్మీరంజనం లాంటి చరిత్రకారులు క్రీ.శ.225లో ప్రారంభమైనట్లుగా పేర్కొన్నారు. 

 

రాజకీయ చరిత్ర
శాతవాహనులు బ్రాహ్మణ కులానికి చెందినవారు. వైదిక మతస్తులు. ఆంధ్ర అనేది జాతి శబ్దం కాగా, శాతవాహన అనేది వంశ నామం. శాతవాహనుల పాలన శ్రీముఖుడితో ప్రారంభం కాగా, చివరి శాతవాహన రాజు మూడో పులోమావితో వంశం అంతరించింది.

శ్రీముఖుడు 
శాతవాహన వంశ మూలపురుషుడు శ్రీముఖుడు. ఇతడిని బ్రహ్మాండ పురాణం సింద్రకుడు అని, విష్ణుపురాణం బలిపుచ్ఛక అని, మత్స్య పురాణం సిమకుడు అని, 'భాగవత పురాణం' బలి అని పేర్కొంటున్నాయి. ఇతడు క్రీ.పూ.271 నుంచి 248 వరకు పరిపాలించినట్లు బీఎస్ఎల్ హనుమంతరావు పేర్కొన్నారు. 23 సంవత్సరాలు పాలన చేశాడు. తన కుమారుడు మొదటి శాతకర్ణికి మహారథి త్రణకైరో కుమార్తె నాగానికతో వివాహం జరిపించాడు. 'శాద్వాహణ' పేరుతో ముద్రించిన నాణేలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, మెదక్ జిల్లాలోని కొండాపూర్ ప్రాంతాల్లో లభించాయి. శ్రీముఖుడు తొలుత జైనమతాభిమాని. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రంశిక గ్రంథం శ్రీముఖుడు జైనుడని పేర్కొంది. శ్రీముఖుడి కాలంలో కుంద కుందాచార్యుడు/కొండ కుందాచార్యుడు దిగంబర జైనాన్ని ప్రచారం చేశాడు.

 

కృష్ణ (లేదా) కన్హ (248 - 230 BC)
శ్రీముఖుడి అనంతరం అతడి సోదరుడు కన్హ రాజ్యానికి వచ్చాడు. ఇతడు మౌర్య చక్రవర్తి అశోకుడికి సమకాలికుడు అని చరిత్రకారులు పేర్కొంటారు. కన్హ నాసిక్‌లో శ్రమణులకు గుహాలయాలు తవ్వించాడు. కన్హేరి గుహాలయాలు నిర్మించాడు. మాళ్వాను జయించిన తొలి శాతవాహన చక్రవర్తి ఇతడే.

 

మొదటి శాతకర్ణి
తొలి శాతవాహన చక్రవర్తుల్లో గొప్పవాడు మొదటి శాతకర్ణి. ఇతడి విజయాలను తెలుపుతూ ఇతడి భార్య దేవి నాగానిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేసిన శాతవాహన రాజు ఇతడే. మొదటి శాతకర్ణికి దక్షిణాపథపతి, అప్రతిహతచక్ర బిరుదులున్నాయి. కళింగ పాలకుడు ఖారవేలుడు ఇతడిని ఓడించినట్లు హతిగుంఫా, గుంటుపల్లి శాసనాలు పేర్కొంటున్నాయి. మొదటి శాతకర్ణిని పుష్యమిత్ర శుంగునికి సమకాలీనుడిగా పేర్కొంటారు. శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి నాణేలపై ఉజ్జయిని ముద్ర ఉంది. మొదటి శాతకర్ణి తర్వాత పూర్ణోత్సుంగుడు అనే రాజు పాలనకు వచ్చాడు.

 

రెండో శాతకర్ణి
ఆంధ్రదేశాన్ని అతి ఎక్కువకాలం అంటే 56 సంవత్సరాలు పాలించిన శాతవాహన చక్రవర్తి రెండో శాతకర్ణి. శక-శాతవాహన ఘర్షణలు ఇతడి కాలంలోనే ప్రారంభమయ్యాయి. ఇతడు మగధపై దండెత్తి సాంచీ స్తూప దక్షిణ ద్వారంపై శాసనం వేయించినట్లుగా యుగపురాణం పేర్కొంటుంది. ఇతడు పాటలీపుత్రాన్ని ఆక్రమించాడు.  విదిశ, కళింగలను ఓడించాడు. ఇతడి కాలంనాటి శక-శాతవాహన ఘర్షణల గురించి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ గ్రంథం వివరిస్తుంది. భిల్సా శాసనంలో పేర్కొన్న శాతవాహనరాజు రెండో శాతకర్ణే. 

 

మొదటి పులోమావి
కణ్వ చక్రవర్తి సుశర్మను చంపి మగధను ఆక్రమించిన శాతావాహన రాజు మొదటి పులోమావి. (కానీ పురాణాల ప్రకారం శ్రీముఖుడే సుశర్మను చంపి మగధను ఆక్రమించాడు). మొదటి పులోమావినే కుంతల శాతకర్ణి అని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే కుంతల శాతకర్ణి తర్వాత మొదటి పులోమావి పాలకుడయ్యాడని మరికొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.

 

కుంతల శాతకర్ణి
కుంతల శాతకర్ణిని 13వ శాతవాహన చక్రవర్తిగా పేర్కొంటారు. ఇతడి ఆస్థానంలో గుణాఢ్యుడు, శర్వవర్మ అనే పండితులు ఉండేవారు. గుణాఢ్యుడు పైశాచి ప్రాకృత భాషలో బృహత్‌కథను రచించగా, శర్వవర్మ సంస్కృత భాషలో కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించాడు. సంస్కృత భాషకు ప్రాధాన్యం ఇచ్చిన తొలి శాతవాహన చక్రవర్తి కుంతల శాతకర్ణి. ఇతడికి సంస్కృత భాష నేర్పడానికే శర్మవర్మ కాతంత్ర వ్యాకరణంను రచించాడు. కుంతల శాతకర్ణి కరిర్త అనే కామక్రీడ ద్వారా భార్య మరణానికి కారకుడయ్యాడని ఏటుకూరి బలరామమూర్తి పేర్కొన్నారు. క్రీ.పూ.58లో శకులను ఓడించి ఉజ్జయినిని జయించి విక్రమ శకం ప్రారంభించిన విక్రమాదిత్యుడే కుంతల శాతకర్ణి అని కాలకాచార్య కథానిక(జైన గ్రంథం) పేర్కొంటుంది.

 

హాలుడు
శాతవాహన 17వ చక్రవర్తి హాలుడు. ఇతడు ప్రాకృత భాషలో గాథాసప్తశతి (సట్టసి) అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది. హాలుడి వివాహం సింహళ రాకుమారితో సప్తగోదావరి (ద్రాక్షారామం)లో జరిగినట్లు కుతూహలుడు రచించిన లీలావతి పరిణయం గ్రంథం వివరిస్తుంది. ఇతడు క్రీ.శ.7 నుంచి 12 వరకు (5 సంవత్సరాలు) పాలన చేశాడు. రాధను గురించి ప్రస్తావించిన తొలి వాజ్ఞ్మయం గాథాసప్తశతి.

 

గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ.75 - 110)
శాతవాహన చక్రవర్తులందరిలోకి గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతడి విజయాలను వివరిస్తూ తల్లి గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాలు వేయించింది. బాలశ్రీ నాసిక్ శాసనాన్ని తన మనుమడు వాసిష్ఠీపుత్ర పులోమావి 19వ పాలనా సంత్సరంలో వేయించింది. ఈ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణిని ఆగమనిలయ, ఏకబ్రాహ్మణ, త్రిసముద్రతోయ పీతవాహన (త్రిసముద్రలోయ శాతవాహన), వర్ణాశ్రమ ధర్మోద్ధారక, క్షత్రియ దర్పమానమర్థన లాంటి బిరుదులతో ప్రస్తావించారు. క్షహరాట పాలకుడు (శకరాజు) నహపాణుడిని ఓడించి 'క్షహరాట వంశ నిరవశేషకర' బిరుదు పొందాడు. నహపాణుడి నాణేలను పునర్ముద్రించాడు. వాటినే జోగల్ తంబి నాణేలు అంటారు. నాసిక్ శాసనాన్ని శివస్వామి, మహాగుప్తులు రచించారు. గౌతమీపుత్ర శాతకర్ణికి బెనకటక స్వామి అనే బిరుదు కూడా ఉంది. ఇతడి కాలంలోనే రాజధానిని ప్రతిష్ఠానపురానికి మార్చారని తెలుస్తోంది. రుద్రదాముని చేతిలో గౌతమీపుత్ర శాతకర్ణి ఓడిపోయినట్లుగా జునాగఢ్ శాసనం పేర్కొంటుంది. తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్న తొలి శాతవాహన రాజు ఇతడే. ఇతడు 23వ శాతవాహన రాజు.

 

వాసిష్ఠీపుత్ర పులోమావి (రెండో పులోమావి)
గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత అతడి కుమారుడు రెండో పులోమావి 24వ శాతవాహన రాజుగా వచ్చాడు. నాసిక్ శాసనంలో ఇతడిని దక్షిణా పథేశ్వరుడుగా పేర్కొనడమైంది. నవనగర స్వామి అనే బిరుదు కూడా ఉంది. ఇతడు వేయించిన అమరావతి శాసనంలోనే తొలి తెలుగు పదం నాగబు ఉంది. ఓడ గుర్తు ఉన్న నాణేలను ముద్రించిన తొలి శాతవాహన రాజు కూడా ఇతడే. ఇతడి 19వ పాలనా సంవత్సంలోనే ఇతడి నానమ్మ గౌతమీ బాలాశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. ఈ శాసనాన్ని రచించినవారు శివస్వామి, మహాగుప్తులు. చస్తనుడు అనే పశ్చిమ క్షాత్రపురాజు (శకరాజు) రెండో పులోమావిని ఓడించి కథియవాడ్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు అంధే శాసనం తెలియజేస్తుంది.

 

యజ్ఞశ్రీ శాతకర్ణి
చివరి గొప్ప శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతడి ఆస్థానంలోనే ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. నాగార్జున కొండ లేదా శ్రీపర్వతం వద్ద ఆచార్య నాగార్జునుడి కోసం పారావతి విహారంను నిర్మించాడు. బాణుడు తన హర్ష చరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని 'త్రిసముద్రాధీశ్వరుడు' అనే బిరుదుతో ప్రస్తావించాడు. సంగం సాహిత్యంలో యజ్ఞశ్రీని పోసోండ సత్తాన్‌గా వ్యవహరించారు. ఆచార్య నాగార్జునుడు ధాన్యకటక మహాస్తూపానికి శిలాప్రాకారం నిర్మించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి అమరావతి స్తూపాన్ని నిర్మించి చలువరాయితో బుద్ధుడి విగ్రహాన్ని రూపొందింపజేశాడు. (వాస్తవానికి అమరావతి స్తూపానికి పునాది వేసింది నాగాశోకుడనే యక్షుడు). యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన చినగంజాం శాసనంలో మోటుపల్లిరేవు ప్రస్తావన ఉంది. జునాగఢ్ శాసనం ప్రకారం రుద్రదాముడితో యుద్ధం చేసింది గౌతమీపుత్ర శాతకర్ణి కాగా, పురాణాల ప్రకారం యజ్ఞశ్రీ శాతకర్ణి రుద్రదాముడితో యుద్ధం చేసినట్లు తెలుస్తోంది. రుద్రదమనికను శివశ్రీ శాతకర్ణి వివాహం చేసుకున్నాడు. (శివశ్రీనే వాసిష్టీపుత్ర శాతకర్ణి అని, అతడు యజ్ఞశ్రీ కంటే ముందు శాతవాహన రాజ్యాన్ని పాలించాడని బి.ఎస్.ఎల్. హనుమంతరావు పేర్కొన్నారు). ఆచార్య నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో హత్యకు గురైనట్లు సోమదేవుడి కథాసరిత్సాగరం గ్రంథం తెలియజేస్తోంది.

 

మూడో పులోమావి
చివరి శాతవాహన చక్రవర్తి మూడో పులోమావి లేదా శ్రీ పులోమావి. ఇతడి కాలంలోనే మ్యాకదోని శాసనం వేశారు. శ్రీ పులోమావి ఎనిమిదో పాలనా సంవత్సరంలో వేసిన ఈ శాసనం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో లభించింది. దీని ప్రకారం శాతవాహన ఆహారం (రాష్ట్రం) పాలకుడు ఖండనాగుడు లేదా కుబేరనాగుడు వేపుర గ్రామ అధిపతి. వేపుర గ్రామంలోని కాంత తెగ అధిపతి/ గాహపతి సమ్హ. సమ్హ తన తెగ ప్రజల అభివృద్ధికి వేపుర గ్రామంలో చెరువు తవ్వించినట్లు ఈ శాసనం వివరిస్తుంది.

 

పాలనాంశాలు
 శాతవాహనుల కాలంనాటి పాలనా విశేషాలను ఉన్నాఘర్ శాసనం వివరిస్తుంది. వీరు ఎక్కువగా మౌర్యుల పాలనా విధానాలనే అనుసరించారు. కౌటిల్యుని అర్థశాస్త్రం, మనుధర్మ శాస్త్రాల ఆధారంగా పాలన కొనసాగించారు. సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించారు. పితృస్వామిక, వంశ పారంపర్య రాచరిక విధానాన్ని పాటించారు. శాతవాహనులు తమ రాజ్యాన్ని ఆహారాలు (రాష్ట్రాలు), విషయాలు (జిల్లాలు), గ్రామాలుగా విభజించారు. సామంతరాజ్యాలు కూడా వీరి ఆధీనంలో ఉండేవి. ఆహారానికి అధిపతి అమాత్యుడు. కేంద్రంలో రాజుకు పాలనలో సహాయపడటానికి మంత్రిమండలి, ఉద్యోగ బృందం ఉండేది. నాటి మంత్రిమండలిని రాజోద్యోగులు అనేవారు. ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమితులైన మంత్రులను మహామాత్యులు అని, రాజు సమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహాలిచ్చే మంత్రులను రాజామాత్యులు అని, అధికార, అనధికార రహస్యాలను కాపాడే మంత్రులను విశ్వాసామాత్యులని పిలిచేవారు. రాష్ట్రాలు/ ఆహారాల పాలకులను అమాత్యులు అనేవారు. వస్తురూపంలో వచ్చే ఆదాయాన్ని భద్రపరిచే అధికారిని భండాగారికుడు అని, ద్రవ్యరూపంలో వచ్చే ఆదాయాన్ని భద్రపరిచే అధికారిని హేరణికుడు అని పిలిచేవారు. వీరే కాకుండా ప్రభుత్వ రికార్డులను భద్రపరిచే కార్యాలయ ఉద్యోగులుగా నిబంధనకార అక్షపటలిక (శ్రవణామాత్యులు) అనే ఉద్యోగులు ఉండేవారు. నాటి సామంత రాజ్యాల పాలకుల గురించి కార్లే, కన్హేరి శాసనాలు వివరిస్తున్నాయి. సామంత రాజులను మహారథి, మహాభోజక లాంటి బిరుదులతో ప్రస్తావించారు. విషయం (జిల్లా) అధిపతిని విషయపతి అని, గ్రామ అధిపతిని గ్రామిఖ/ గ్రామణి అని పిలిచేవారు. నగర పాలనకు నిగమసభలు ఉండేవి.
ఈ నిగమసభలు ప్రముఖ వర్తక కేంద్రాలుగా పనిచేసేవి. నిగమ సభ సభ్యులైన పెద్దలను గాహపతులు అనేవారు. గ్రామాల్లో మత వ్యవహారాలు చూసే అధికారిని మహా ఆర్యక అని పిలిచేవారు. సామంత రాజ్యాల్లో శాంతి భద్రతలు కాపాడే వ్యక్తిని మహాతలవరి అనేవారు. ఆహార పాలకులైన అమాత్యులకు వంశపారంపర్య హక్కులు లేవు. వారు బదిలీ అయ్యేవారు. మ్యాకదోని శాసనంలో పేర్కొన్న గౌల్మిక అనే పదం నాటి భూస్వాములు, సామంత రాజ్య పాలనాధికారులను సూచిస్తుంది.

 

సైనిక పాలన
శాతవాహనుల సైనిక పాలన గురించి హతిగుంఫా శాసనం, అమరావతి శిల్ప ఫలకాలు, విదేశీ, దేశీయ సాహిత్యాలు వివరిస్తున్నాయి. హతిగుంఫా శాసనం నాటి చతురంగ బలగాల గురించి పేర్కొంటుంది. నాటి యుద్ధ వ్యూహ రచనను అమరావతి శిల్ప ఫలకం వివరిస్తుంది. యుద్ధసమయంలో పదాతిదళానికి పార్శ్వ భాగంలో అశ్వ, గజ దళాలు; పృష్ట భాగంలో ధనుష్క దళం ఉండేవని తెలుస్తోంది. నాటి తాత్కాలిక సైనిక శిబిరాల (camps) ను స్కంధావరాలు అని, సైన్యాగారాల (కంటోన్మెంట్ల)ను కటకాలు అని పిలిచేవారు. ఖారవేలుడు శాతవాహన రాజ్యంపై దండెత్తి వచ్చి పిథుండ నగరాన్ని ధ్వంసం చేసినట్లు హతిగుంఫా శాసనం వివరిస్తుంది.

 

ఆర్థిక పరిస్థితులు
శాతవాహనులు వ్యవసాయ, వాణిజ్య పరిశ్రమల రంగాలను సమపాళ్లలో వృద్ధి చేయడం ద్వారా రాజ్య ఆర్థిక సౌష్ఠవాన్ని పెంపొందించారు. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. పంటలో 1/6వ వంతు భూమి శిస్తు (భాగ)గా వసూలు చేసేవారు. కారుకర అనే వృత్తి పన్నును వసూలు చేసేవారు. రాజు సొంత భూమిని రాజ కంఖేట అనేవారు. ప్రజలు రాజుకు చెల్లించే శిస్తును దేవమేయ/ రాజమేయ/ దాయమేయ అనేవారు (భూమిశిస్తు - భాగ, రాజు సొంత భూమి వాడుకున్నందుకు చెల్లించే శిస్తు - దేవమేయ). పంటలు పండే పొలాలను సీతాక్షేత్రాలు అని వాటి అధిపతిని సీతాధ్యక్షుడు అని పిలిచేవారు. మొదటి శాతకర్ణి అధికంగా పశువులను దానం చేశాడు. వ్యవసాయ అభివృద్ధికి, నీటి పారుదల సౌకర్యాల కల్పనకు కృషి చేశాడు. శాతవాహనుల కాలంలో వాణిజ్యం ఎంతో అభివృద్ధి చెందింది. దేశీయంగా అనేక రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేశారు. మచిలీపట్నం, వినుకొండ - హైదరాబాద్ రహదారుల గురించి ప్లీట్ పండితుడు పేర్కొన్నాడు. తూర్పు తీరంలో మైసోలియా (మచిలీపట్నం), ఘంటశాల లాంటి రేవులు, పశ్చిమ తీరంలో సోపార, కళ్యాణి, బరుకచ్ఛ లాంటి ఓడ రేవులు విదేశీ వాణిజ్యానికి తోడ్పడేవి. శాతవాహనులు రోమ్, వియత్నాం దేశాలతో విరివిగా విదేశీ వాణిజ్యం నిర్వహించేవారు. మద్రాస్ వద్ద ఉన్న అరికమేడు ప్రాంతంలో అనేక రోమన్ బంగారు నాణేలు లభించాయి. కరీంనగర్ జిల్లాలోని పెద్దబంకూరు, దూళికట్ట, కడప జిల్లాలోని అత్తిరాల ప్రాంతాల్లో కూడా రోమన్ నాణేలు లభించాయి. నాటి సంచార వ్యాపారులను సార్థవాహులు అనేవారు. తూర్పు తీరంలోని కోడూరు, కోరంగి/ అల్లోసిగ్ని ఓడరేవులు కూడా ప్రధానమైనవే. నాటి శ్రేణులు బ్యాంకులుగా కూడా పనిచేసేవి. 12% వడ్డీ చెల్లించేవి. ఋషభదత్తుడు చెల్లించిన వడ్డీతో గోవర్థన ఆహారంలోని కోలిక శ్రేణి శ్రమణులకు వస్త్రదానం చేసేది. నాటి ప్రధాన రవాణా సాధనం ఎడ్లబండి. అల్లూరు శాసనం ప్రకారం అక్కడి బౌద్ధ సంఘం ఎడ్లబండ్లకు దానంగా స్వీకరించింది. ప్లినీ, టాలమీల రచనలతోపాటు నాటి శాతవాహనుల విదేశీ నౌకా వాణిజ్యం గురించి విపులంగా వివరించిన మరొక ప్రధాన గ్రంథం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రయన్ సీ (ఎర్ర సముద్రపు డైరీ). 
              శాతవాహనుల కాలంలో పరిశ్రమల అభివృద్ధి కూడా బాగా జరిగింది. లోహ, వస్త్ర, వజ్ర పరిశ్రమలతోపాటు అనేక చేతి వృత్తి పరిశ్రమలు కూడా వృద్ధి చెందాయి. నాటి కులారుల (కుమ్మరుల) పనితనం గురించి పేర్కొంటూ కళా దృష్టిలో శిల్పులకు ఏ మాత్రం తీసిపోరు' అని యజ్ధానీ పండితుడు పేర్కొన్నాడు. శాతవాహనుల కాలంలో గూడూరు సన్నని వస్త్రాలకు, వినుకొండ లోహ పరిశ్రమకు, పల్నాడు వజ్ర పరిశ్రమకు ఎంతో పేరుగాంచాయి. మచిలీపట్నం మజ్లిన్ వస్త్రాలకు పేరొందింది. శాతవాహనుల కాలంలో శుల్క, బలి, కర లాంటి ఇతర పన్నులు వసూలు చేసేవారు. యజ్ఞాల సమయంలో వసూలు చేసే పన్నును బలి, నీటి తీరువా పన్నును శుల్క, కూరగాయలు, పండ్ల తోటలపై విధించే పన్నును కర అని పిలిచేవారు.

 

సాంఘిక పరిస్థితులు
 శాతవాహనుల కాలంలో పితృస్వామిక, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. సమాజంలో చాతుర్వర్ణ, కుల వ్యవస్థలు ఉండేవి. దక్షిణ భారత దేశంలో తొలిసారిగా వీరి కాలంలోనే వృత్తిని బట్టి కుల వ్యవస్థ ఆవిర్భవించింది. నాటి శాసనాల్లో, సాహిత్యంలో అనేక కులాలు, వృత్తుల గురించి ప్రస్తావనలు ఉన్నాయి.
 స్త్రీలు సతీసహగమనం, బాల్య వివాహలు, బహు భార్యత్వం, వేశ్యావృత్తి లాంటి సాంఘిక దురాచారాలను ఎదుర్కొనప్పటికి, గౌరవ స్థానం పొందిన సంఘటనలు ఉన్నాయి. నాగానిక, గౌతమీ బాలశ్రీ లాంటివారు పాలకులుగా పనిచేశారు. నాటి శాసన, సాహిత్య ఆధారాల్లో ఆరు రకాల స్త్రీ ధనం గురించి పేర్కొన్నారు. అమరావతి శిల్పం, గాథాసప్తశతి నాటి సాంఘిక వ్యవస్థను తెలుపుతున్నాయి. కులాలు మారకుండా సమయ ధర్మం పాటించేవారు. అనులోమ, విలోమ వివాహాలు అమల్లో ఉండేవి. అగ్రవర్ణం వరుడు నిమ్నవర్ణం వధువును వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అని, అగ్రవర్ణ వధువు నిమ్నవర్ణ వరుడిని వివాహం చేసుకుంటే విలోమ వివాహం అని పేర్కొనేవారు. అనులోమ వివాహం చేసుకున్న దంపతులకు జన్మించినవారిని ఉగ్ర సంతానం అనేవారు. హాలుని గాథాసప్తశతిలో మాధవి, శ్రోత, ఆంగిక లాంటి రచయిత్రుల గురించి పేర్కొన్నారు. నాటి ప్రజలు బంగారు, వెండి ఆభరణాలు ధరించేవారు. నాట్యగత్తెలు అరదళం అనే మైపూతను వాడేవారు. రామిరెడ్డిపల్లి, గుమ్మడిదుర్రు, అమరావతి, నాగార్జున కొండ ప్రాంతాల్లో నాడు వాడిన హారాలు, ఆభరణాలు లభించాయి. అగస్త్యుడి ద్వారా ఆర్య సంస్కృతి దక్షిణానికి విస్తరించింది.

 

మత పరిస్థితులు
శాతవాహనుల కాలంలో వైదిక, జైన, బౌద్ధ మతాలను ఆదరించారు. తొలి శాతవాహనులు జైన మతాన్ని అవలంబించారు. శాతవాహనులది వైదిక మతం. నాడు రాజులు వైదిక మతాన్ని అవలంబిస్తే, రాణులు, వైశ్యులు, సామాన్య ప్రజలు బౌద్ధమతాన్ని ఆచరించారు. తొలి శాతవాహన చక్రవర్తి శ్రీముఖుడు జైనుడని కొరవి గోపరాజు రచన సింహాసన ద్వాత్రంశిక పేర్కొంటుంది. కొండ కుందాచార్యుడు అనే జైన పండితుడు అతడి కాలంలోనే నివసించాడు. కృష్ణ లేదా కన్హ నాసిక్‌లో శ్రమణులకు గుహాలయాలు తవ్వించాడు. కానీ మొదటి శాతకర్ణి అశ్వమేధ, రాజసూయ లాంటి వైదిక క్రతువులను నిర్వహించాడు. మహా ఆర్యకుడు అనే బౌద్ధ సన్యాసి ఇతడి ఆస్థానంలో ఉండేవాడు. రాజధానిలో జైనులకు చైత్యాలను నిర్మించాడు. రెండో శాతకర్ణి సాంచీ స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు. గౌతమీ బాలశ్రీ భద్రనీయ బౌద్ధ శాఖకు నాసిక్ గుహలను దానం చేసింది. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. శాతవాహనులు అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, గుడివాడ, శాలిహుండం మొదలైన చోట్ల స్తూప, చైత్య, విహారాలు నిర్మించారు. నాడు ధాన్యకటకాన్ని - పూర్వ శైలం, జగ్గయ్యపేట - ఉత్తర శైలం , నాగార్జున కొండ - అపరశైలం, గుంటుపల్లి - రాజగిరిక, గుడివాడను - సిద్దార్థిక అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్‌లో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం భట్టిప్రోలు (ప్రతీపాలపురం). శాతవాహనులు వేదశ్రీ, యజ్ఞశ్రీ లాంటి వైదిక నామాలను ఉపయోగించారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఆగమనిలయ, ఏక బ్రాహ్మణ లాంటి బిరుదులు ధరించాడు. నానాఘాట్ శాసనంలో ఇంద్ర, వాసుదేవ, సూర్యచంద్ర, యమ, వరుణ, కుబేర లాంటి వైదిక దేవతల పేర్లున్నాయి. హాలుడి గాథాసప్తశతి శివస్తోత్రంతో ప్రారంభమవుతుంది. క్రీ.శ.మొదటి శతాబ్దంలోని లకులిశ శివాచార్యుడి (లకులీశుడు) పాశుపత శైవధర్మం ప్రచారం పొందింది. శాతవాహనుల కాలంలో పూజలందుకున్న గుడిమల్లం శివలింగం నేటి చిత్తూరు జిల్లాలో ఉంది. కానీ, నానాఘాట్ శాసనంలో శివుడి ప్రస్తావన లేదు. అశోకుడి మనుమడైన సంప్రతి వల్ల దక్షిణ దేశంలో జైనం ప్రచారమైంది. అమరావతి సమీపంలో వడ్డమాను కొండ వద్ద సంప్రతి విహారం ఏర్పడింది. కొండ కుందాచార్యుడు అనంతపురం జిల్లాలోని కొనగండ్ల వద్ద ఆశ్రమం (జైనం) నడిపి సమయసార అనే గ్రంథాన్ని రచించాడు.
 శాద్వాద తాంత్రిక సంప్రదాయం ప్రచారం చేసి శాద్వాద సింహ బిరుదు పొందాడు. పద్మనంద భట్టారకుడనే మరొక జైన మతాచార్యుడు నాడు జీవించాడు. కాలసూరి ప్రబంధం అనే గ్రంథం శాతవాహనుల కాలంనాటి జైనమతాన్ని గురించి వివరిస్తుంది. ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక, శూన్యవాదాలను ప్రచారం చేశాడు (బౌద్ధ మతం). శంకరుడి మాయావాదానికి మార్గదర్శి ఆచార్య నాగార్జునుడే. ఈ విధంగా శాతవాహనుల కాలంలో జైన, బౌద్ధ, వైదిక మతాలను ఆదరించి, పరమత సహనాన్ని చూపారు.

 

విద్య, సారస్వతాల అభివృద్ధి
తవాహనుల అధికార భాష ప్రాకృతం. నాడు ప్రజలు మాట్లాడేది దేశీభాష. కుంతల శాతకర్ణి కాలం నుంచి సంస్కృత భాషకు ప్రాధాన్యం లభించింది. మత్స్యపురాణంను యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రచించారని పారిట్జర్ అనే పండితుడి అభిప్రాయం. నాటి శాసనాలు ప్రాకృత భాషలో, బ్రాహ్మీలిపిలో ఉన్నాయి. శాతవాహనుల కాలాన్ని ప్రాకృత భాషకు స్వర్ణయుగంగా వర్ణించారు. రత్నావళి రాజపరికథ గ్రంథంలో శ్రేయోరాజ్య సిద్ధాంతాన్ని నాగార్జునుడు ప్రతిపాదించాడు. సుహృల్లేఖ గ్రంథాన్ని ప్రతి విద్యార్థి కంఠస్తం చేసేవాడని ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు పేర్కొన్నాడు. ఇండియన్ ఐన్‌స్టీన్‌గా, భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడిగా నాగార్జునుడు పేరుగాంచాడు. వాత్సాయన కామసూత్రాలు శాతవాహనుల కాలంలోనే రాశారని చరిత్రకారుల అభిప్రాయం. ఇంకా నాటి గ్రంథాల్లో సోమదేవుడి కథాసరిత్సాగరం, బుద్ధస్వామి బృహత్ కథాశ్లోక సంగ్రహ, ప్రవరసేనుడి సేతుబంధం, జయవల్లభుడి వెజ్జలగ్గ లాంటివి ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు వేదలి అనే గ్రామానికి చెందినవాడని లంకావతార సూత్ర గ్రంథం తెలుపుతోంది. సోమదేవుడి కథాసరిత్సాగరం గ్రంథం ఆచార్య నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించినట్లు వివరిస్తోంది.

వాస్తు, కళారంగాల అభివృద్ధి

శాతవాహనుల కాలంలో వాస్తుశిల్పం, చిత్రలేఖనం లాంటి కళారంగాలు ఎంతో అభివృద్ధి చెందాయి. అనేక స్తూప, చైత్య, విహారాలు, గుహాలయాలు నిర్మితమయ్యాయి. బుద్ధుడి శారీరక అవశేషాలపై నిర్మించిన పొడవాటి స్తంభాన్ని స్తూపం అంటారు. స్తూపాలు మూడు రకాలు. అవి (1) ధాతుగర్భాలు (2) ఉద్దేశిక స్తూపాలు (3) పారిభోజకాలు. బుద్ధుడి శారీరక అవశేషాలపై నిర్మించిన వాటిని ధాతుగర్భాలు అంటారు. భట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, ఘంటశాల, శాలిహుండం లాంటివి ధాతుగర్భాలు. బుద్ధుడు ఉపయోగించిన వస్తువులపై నిర్మించిన వాటిని పారిభోజకాలు అంటారు. ధాతువులు/ వస్తువులు లేకుండా నిర్మించేవి ఉద్దేశిక స్తూపాలు. లింగాలమెట్టు (విశాఖ జిల్లా), గుంటుపల్లి (పశ్చిమ గోదావరి జిల్లా) ఉద్దేశిక స్తూపాలకు ఉదాహరణ. అమరావతి స్తూపంపై బుద్ధుడి జీవితానికి చెందిన పంచ కళ్యాణాలను (జననం, మహాభినిష్క్రమణం, సంబోధి, ధర్మచక్ర పరివర్తన, మహాపరి నిర్యాణం) చిత్రించారు. 
బుద్ధుడి ప్రతిమలను ఉంచి పూజించే గృహాన్ని చైత్యం అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో అతి ప్రాచీన చైత్యం గుంటుపల్లి. బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలను విహారాలు అంటారు. స్తూపం, చైత్యం, విహారం ఒకేచోట ఉంటే దాన్ని ఆరామం అంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ బౌద్ధారామం నాగార్జున కొండ. అక్కడ ఒక స్తూపం, రెండు చైత్యాలు, మూడు విహారాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా శంకరంలో బౌద్ధ గుహాలయాలున్నాయి. ఆంధ్రదేశంలో 40 సంఘారామాలు ఉన్నాయని హుయాన్‌త్సాంగ్ (Huyantsang) పేర్కొన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునకొండపై తొలిపించిన ఏడు అంతస్తుల విహారంలో 1500 గదులున్నాయని పాహియాన్ పేర్కొన్నాడు. అజంతా గుహల్లోని 9, 10, 12, 13 గుహలు వీరి కాలానికి చెందినవి. 8, 12, 13 గుహలు విహారాలు కాగా, 9, 10 గుహ చిత్రాలు. శాతవాహనుల కాలంనాటి అమరావతి శిల్పాలపై పెర్గుసన్ అనే చరిత్రకారుడు పరిశోధనలు చేశాడు. 1797లో కల్నల్ మెకంజీ అనే ఆంగ్లేయుడు అమరావతి స్తూపాన్ని కనుక్కున్నాడు. ధాన్యకటకం తూర్పున వజ్రపాణి ఆలయం ఉందని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు. అజంతా 10వ గుహలో ఉన్న శ్వేత గజ జాతక చిత్రం శాతవాహనుల కాలానిదే. అమరావతి శిల్పంలోనే నలగిరి ఏనుగును బుద్ధుడు శాంతింపజేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. అమరావతి శిల్పం నగర జీవనాన్ని వివరించగా సాంచి, బార్పూత్ శిల్పాలు గ్రామీణ జీవనవిధాన్ని వివరిస్తున్నాయి. స్త్రీ, పురుషులిద్దరూ జంటలుగా నాట్యం చేస్తున్న 12 దృశ్యాలు కార్లే గుహల్లో ఉన్నాయి. మెదక్ జిల్లాలోని కొండాపూర్‌లో శాతవాహనుల కాలంనాటి టంకశాల బయల్పడింది. బర్మాలోని ప్రోం స్తూప శిల్పాలు అమరావతి శైలిని పోలి ఉన్నాయి. జావాలోని బోరోబుదురు బౌద్ధ స్తూపం సంకరం/ లింగాలమెట్ట (విశాఖ జిల్లా) నమూనాలో నిర్మించారు. శాతవాహనుల అధికార చిహ్నం పంజా ఎత్తిన సింహం, సూర్యుడు.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బౌద్ధ మతం

* బుద్ధుడి తొలి జీవితం గురించి బౌద్ధ జాతక కథలు వివరిస్తాయి.
* బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు పాళీ భాషలో ఉన్నాయి.
* భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ మతంగా అభివృద్ధి చెందింది.
* వినయ పీటకం బౌద్ధ సంఘ నియమ నిబంధనలను, సుత్త పీటకం బుద్ధుడి బోధనలను, అభిదమ్మ పీటకం బౌద్ధ దమ్మ వేదాంతాన్ని వివరిస్తాయి.
* బౌద్ధ మతానికి చెందిన ముఖ్య నిర్మాణాలు
1. స్తూపం
2. చైత్యం
3. విహారం
* బుద్ధుడి ధాతువులపై నిర్మించిన పొడవైన స్తంభాన్ని స్తూపం అంటారు. ఇది బుద్ధుడి మహా నిర్యాణానికి ప్రతీక.
* బౌద్ధ మతస్తుల పూజా గృహాన్ని చైత్యం అంటారు. ఇది మహాయానులకు చెందింది.
* బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలను విహారాలు అంటారు.
* స్తూప, చైత్య, విహారాలు ఒకే చోట ఉంటే దాన్ని బౌద్ధ ఆరామంగా పేర్కొన్నారు.
* బౌద్ధ ఆరామాలు నాడు ప్రసిద్ధ విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
* భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా నాగార్జున కొండ విశ్వవిద్యాలయం పేరొందింది.
* భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం తక్షశిల, ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం నలంద.
* విహార దేశంగా పేరొందిన రాష్ట్రం బిహార్
* గాంధార, అమరావతి శిల్ప కళలు బౌద్ధ మత ప్రేరణతో అభివృద్ధి చెందాయి.
* సాంచీ స్తూపం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ దగ్గర ఉంది.
* సారనాథ్ స్తూపం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
* పిప్రావహని భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం అని పేర్కొంటారు.
* ఆంధ్రదేశం / దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపంగా భట్టిప్రోలు పేరుగాంచింది.
 బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం వల్ల బౌద్ధ మతాన్ని మధ్యేమార్గంగా పేర్కొంటారు.
* బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాన్ని ప్రతీయ - సముత్పాద సిద్ధాంతం అంటారు.
* బుద్ధుడి జననం, జ్ఞానోదయం కలగడం, మహాపరినిర్యాణం పౌర్ణమి రోజునే జరిగాయి.
* బుద్ధుడి మరణం తర్వాత బౌద్ధ మత అభివృద్ధి కోసం నిర్వహించిన సభలను బౌద్ధ సంగీతులు అంటారు (మొత్తం నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి.)
 మొదటి బౌద్ధ సంగీతి - రాజగృహం - అజాతశత్రువు కాలం - మహాకాశ్యపుడు అధ్యక్షుడు.
* రెండో బౌద్ధ సంగీతి కాలాశోకుడి కాలంలో వైశాలిలో జరిగింది. సబకామి దానికి అధ్యక్షుడు.
* మూడో బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. మొగ్గలిపుతతిస్స అధ్యక్షుడు.
* నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కశ్మీర్/ కుందనవనంలో జరిగింది. వసుమిత్రుడు అధ్యక్షుడు.
* మాధ్యమిక సాంప్రదాయ వాదాన్ని ఆచార్య నాగార్జునుడు ప్రబోధించారు.
* మైత్రేయనాథుడు యోగాచారవాదాన్ని ప్రారంభించాడు.
* మాధ్యమికవాదాన్నే శూన్యవాదంగా కూడా పేర్కొంటారు.
* యోగాచార వాదాన్ని విజ్ఞానవాదంగా కూడా పేర్కొంటారు.
 యోగాచార వాదం హీనయానానికి చెందిన వాస్తవిక వాదాన్ని పూర్తిగా తిరస్కరించి, పరమ ఆదర్శవాదాన్ని అంగీకరిస్తుంది.
* ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమితిక శాస్త్ర మహాయానుల పవిత్ర గ్రంథంగా పేరుగాంచింది.
* అసంగుడు, వసుబంధు లాంటి రచయితలు కూడా మహాయాన సంప్రదాయాన్ని అనుసరించారు.
* సూత్రాలంకార గ్రంథాన్ని రాసింది అసంగుడు.
* మహాయానులు సంస్కృత భాషలో ఉన్న సొంత త్రిపీటకాలను అభివృద్ధి చేసుకున్నారు.
* మహాయానులు వైపుల్య సూత్రాలను బుద్ధుడి ప్రకటనలుగా భావించి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* సధర్మపుండరీకం, లలిత విస్తార, వజ్రచేధిక, సుఖవతి లాంటి గ్రంథాలను పవిత్రంగా భావించి, అనుసరించారు.
* బౌద్ధ మతంలో వజ్రయానం అనే మరొక శాఖ తర్వాత కాలంలో ఏర్పడింది.
* ఇంద్రజాలిక శక్తులు పొందడం ద్వారా మోక్షం సాధించడం ఈ వాదం వారి ఆశయం.
* వజ్రయాన శాఖవారు బౌద్ధులు, బోధిసత్వుల భార్యలైన తారలను ప్రధాన దైవాలుగా భావించి పూజించారు.
* వీరు తాంత్రిక పూజా విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు (తంత్ర నిర్వహణ ద్వారా మంత్రం వల్లెవేయడం)
* పాల వంశీయులు, సేన వంశీయుల కాలంలో తూర్పు భారతదేశంలో వజ్రయాన శాఖ బాగా విస్తరించింది.
* సరాహుడు రచించిన దోహకోశ వజ్రయానానికి చెందిన ప్రసిద్ధ గ్రంథం.
* కనిష్కుడు మహాయాన బౌద్ధాన్ని ఆచరించాడు.
* గాంధార శిల్పకళ కనిష్కుడి కాలంలో మహాయాన బౌద్ధ మతం ప్రేరణతో అభివృద్ధి చెందింది.
* భాగవతుడు అంటే ఆరాధనీయమైన వారిని ఆరాధించేవ్యక్తి అని అర్థం. చాందోగ్యోపనిషత్తు కృష్ణ వాసుదేవుడిని దేవకీ పుత్రుడిగా పేర్కొంది.
* పాణిని రచన అష్టాధ్యాయిలోను, మెగస్తనీస్ ఇండికా (హెరాక్లెస్) లోను, బెస్‌నగర్ స్తంభ శాసనంలో భాగవత మత ఆరాధన గురించిన ప్రాస్తావన ఉంది.
* బెస్ నగర స్తంభ శాసనాన్ని కాశీపురానికి చెందిన శుంగరాజు భాగభద్రుడు వేయించాడు.
* బెస్ నగర స్తంభ శాసనం గ్రీకు రాయబారి హీలియో డోరస్‌ను భాగవతుడిగా పేర్కొంది.
* గుప్తుల కాలంలో భాగవత మతం అభివృద్ధి చెందింది.
* నాగులు, యక్షులు, గ్రామదేవతల ఆరాధన నుంచి బ్రాహ్మణవాదం అభివృద్ధి చెందింది.
* పంచాయతన పూజా విధానంలో గణేశుడికి అగ్రస్థానం ఇచ్చారు.
* గుప్తయుగానంతరం భాగవత మతాన్ని వైష్ణవ మతంగా పేర్కొన్నారు. అవతార సిద్ధాంతానికి అధిక ప్రాధాన్యం లభించింది.
* భాగవత మతం భగవద్గీత మీద ఆధారపడింది. వైష్ణవానికి క్రమంగా భాగవత పురాణం, విష్ణు పురాణాలు ప్రధాన గ్రంథాలుగా మారాయి.
* క్రీ.శ. 100వ సంవత్సరంలో 'శాండిల్యుడు' పంచరాత్రాలను ప్రబోధించారు. ఇందులో వాసుదేవ కృష్ణుడి కుటుంబం మొత్తాన్ని తాదాత్మ్యీకరించారు.
* కృష్ణుడి సోదరుడు సంకర్షణ, కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు, కృష్ణుడి మనువడు అనిరుద్ధుడు.
* విఖాననుడు ప్రబోధించిన వైఖానన సంప్రదాయాన్ని అత్రి, మరీచి, భృగు, కశ్యపుడు అనే మహార్షులు ప్రచారం చేశారు.
* వైఖానన సంస్కార సిద్ధాంతం విష్ణువుకు చెందిన అయిదు రూపాల భావనపై ఆధారపడి ఉంది.
* బ్రహ్మ, పురుషుడు, సత్యం, అచ్యుతం, అనిరుద్ధుడు అనేవి విష్ణువు అయిదు రూపాల భావనలు.
* తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయం, కంచి దేవాలయాలలో సంస్కృత భాషలో పూజలు నిర్వహిస్తున్న పూజారులు వైఖాననశాఖకు చెందినవారే.
* దక్షిణ భారతదేశంలో వైష్ణవ భక్తులను ఆళ్వారులు అంటారు. వీరు మొత్తం పన్నెండుమంది.
* నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ వారిలో ముఖ్యమైనవారు.
* ఆళ్వార్‌లలో ఉన్న ఏకైక మహిళ ఆండాళ్.
* ఆండాళ్ అనే తమిళ కవయిత్రి గురించి శ్రీకృష్ణ దేవరాయలు తన 'ఆముక్తమాల్యద' గ్రంథంలో ప్రస్తావించారు.
 ఆళ్వార్లు రాసిన పద్యాలు, పాటలను పాశురాలు లేదా 'ప్రబంధాలు' అంటారు.
* 'తండ్రివి నీవే ఓ పరమాత్మా! అగ్ని, నీరు, ఆకాశం నీ సృష్టేనయ్యా!' అనే పాటను నమ్మాళ్వార్ రాసి పాడారు.
* నాకేల ఇవ్వవు నీ దర్శన భాగ్యము? దాగుడు మూతలు ఏల' అని నమ్మాళ్వార్ భగవంతుడిని ప్రశ్నిస్తూ పద్యాలు రాశారు.
* శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మద్వాచార్యులు, త్రిమతాచార్యులు/ వైష్ణవాచార్యులుగా పేరొందారు.
 శంకరాచార్యులు 'అద్వైత' మత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. (కేరళలో జన్మించారు, 8వ శతాబ్దం.)
* 'జీవాత్మ, పరమాత్మ ఒకటే. మోక్షసాధనకు జ్ఞానమార్గం అనుసరించడం ఒక్కటే మార్గం' అని శంకరాచార్యులు ప్రబోధించారు.
* రామానుజాచార్యులు క్రీ.శ. 11వ శతాబ్దంలో విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు.
* 'విష్ణువు మీద గాఢమైన భక్తి కలిగి ఉండటమే ముక్తికి ఉన్న ఏకైక మార్గం' అని రామానుజాచార్యులు పేర్కొన్నారు.
* రామానుజాచార్యులపై ఆళ్వార్లు అధిక ప్రభావాన్ని చూపారు.
* భారతదేశంలో భక్తి ఉద్యమ ప్రారంభికుడిగా, నిమ్నకులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించిన తొలి వ్యక్తిగా రామానుజాచార్యులు పేరొందారు.
* రామానుజులు ప్రచారం చేసిన విశిష్టాద్వైతాన్ని 'శ్రీవైష్ణవం' అని పేర్కొంటారు. మధ్వాచార్యులు ద్వైత మతాన్ని, వల్లభాచార్యుడు శుద్ధా ద్వైతాన్ని, నింబార్కుడు ద్వైతాద్వైతాన్ని ప్రచారం చేశారు.
* బౌద్ధమతంలో చేరిన తొలి మహిళ ప్రజాపతి గౌతమి.
* బౌద్ధమతంలో చేరిన వేశ్యగా ఆమ్రపాలిని పేర్కొంటారు.
* బుద్ధుడు అంగుళీమాలుడు అనే బందిపోటు దొంగను బౌద్ధమతంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడు కపిలవస్తు నగరంలో ఆనందుడు, దేవదత్తుడు, ఉపాలి (మంగలి) అనే వారిని బౌద్ధ సంఘంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడి తొలి శిష్యుడిగా ఆనందుడిని పేర్కొంటారు.
* బుద్ధుడి ప్రధాన శిష్యులు ఆనందుడు, ఉపాలి.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జైనమతం

క్రీ.పూ. 6 వ శతాబ్దం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే మతపరమైన ఉద్యమాల అవతరణకు దోహదం చేసింది. చైనాలో కన్‌ఫ్యూజియనిజం, టావోయిజాలు, పర్షియాలో జొరాస్ట్రియనిజం అనే మతాలు ఏర్పడ్డాయి. ఈ శతాబ్దంలోనే గంగానదీ పరివాహ ప్రాంతంలో ఎంతోమంది మతాచార్యులు ఆవిర్భవించారు. వైదిక మతాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగింది. ఈ కాలంలో వచ్చిన మతాల్లో జైనమతం ఒకటి. ఈ మతం ఏర్పడిన విధానం, అందులోని విశేషాల గురించి పరిశీలిద్దాం.

 

క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే భారతదేశంలో 62 మత శాఖలు ఉన్నట్లు చరిత్రకారుల అంచనా. వీటిలో చాలావరకు ఈశాన్య భారతదేశంలో నివసించే ప్రజల మత సంప్రదాయాలు, క్రతువుల మీద ఆధారపడినవే. ఈ కాలంనాటి మత గురువుల్లో మొదటివాడు పురాణ కశ్శపుడు. ఇతడు మంచి నడవడిక మనిషి కర్మల మీద ఎలాంటి ప్రభావం చూపదని బోధించాడు. అజీవక శాఖకు నాయకుడైన గోసాల మస్కరిపుత్ర కూడా పురాణ కశ్శపుడి వాదనతో అంగీకరించి, నియతి వాదాన్ని బోధించాడు. మరో గురువు అజిత కేశ కాంబలిన్ 'ఉచ్ఛేద వాదం' అనే భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఈ సిద్ధాంతం నుంచే లోకాయత, చార్వాక అనే మత శాఖలు ఏర్పడ్డాయి.
 

* మరో మతాధికారైన పకుధ కాత్యాయన భూమి, నీరు, వెలుతురు ఎలాగైతే సమూలంగా నాశనం చేయడానికి వీల్లేని అంశాలో, అదే విధంగా జీవితం, ఆనందం, విషాదం కూడా నాశనం చేయలేని అంశాలని అభిప్రాయపడ్డాడు. అతడి భావాల నుంచే వైశేషిక వాదం పుట్టిందని చరిత్రకారుల భావన. కానీ ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన మతశాఖల్లో కేవలం బౌద్ధ, జైన మతాలు మాత్రమే స్వతంత్ర మతాలుగా పేరుపొందాయి. దీంతో ఈ శతాబ్దం భారతదేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

 

జైనమతం - ఆవిర్భావం 
జైనమత స్థాపకుడు రుషభనాథుడు. రుగ్వేదంలో రుషభనాథుడు (మొదటి తీర్థంకరుడు), అరిష్టనేమి (22 వ తీర్థంకరుడు)ల ప్రస్తావన ఉంది. రుషభనాథుడి గురించి విష్ణుపురాణం, భాగవత పురాణాల్లో పేర్కొన్నారు. వీటిలో రుషభనాథుడిని విష్ణుదేవుడి అవతారంగా వివరించారు. జైనమతంలో 24 మంది తీర్థంకరులు (ప్రవక్తలు లేదా గురువులు) ఉన్నట్లు జైనులు విశ్వసిస్తారు. అయితే మొదటి 22 మంది తీర్థంకరులకు చెందిన చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. చివరి ఇద్దరు మాత్రమే చారిత్రక పురుషులు. తీర్థంకరులందరూ క్షత్రియ వంశానికి చెందినవారే కావడం విశేషం. ఇరవైమూడో తీర్థంకరుడైన పార్శ్వనాథుడు మహావీరుడి కంటే 250 సంవత్సరాల ముందు జీవించాడు. ఇతడు బెనారస్ రాజైన అశ్వసేనుడి కుమారుడు. పార్శ్వనాథుడి కాలం నాటికే జైనమతం వ్యవస్థీకృతమైనట్లు తెలుస్తోంది. వర్థమానుడి తల్లిదండ్రులు పార్శ్వనాథుడి అనుచరులుగా ఉండేవారు. చివరి తీర్థంకరుడు వర్థమానుడు.

 

మహావీరుడి జీవితం, బోధనలు:
వర్థమానుడు వైశాలి నగరానికి దగ్గరలో ఉన్న కుంద గ్రామం (ప్రస్తుత బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా)లో క్రీ.పూ. 540 లో జన్మించాడు. ఇతడి తండ్రి సిద్ధార్థుడు. ఇతడు జ్ఞత్రిక తెగకు అధిపతి, తల్లి త్రిశల. ఈమె వైశాలి పాలకుడైన అచ్చవి రాజు చేతకుని సోదరి. మగధ రాజైన బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లనను వివాహం చేసుకోవడం వల్ల మహావీరుడికి మగధను పాలించిన హర్యంక వంశంతో చుట్టరికం ఏర్పడింది. మహావీరుడి భార్య యశోద. వీరి కుమార్తె అనొజ్ఞ (ప్రియదర్శన), అల్లుడు జమాలి. ఇతడే మహావీరుడి మొదటి శిష్యుడు.
* వర్థమానుడు తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత సత్యాన్వేషణ కోసం ఇంటిని వదిలిపెట్టాడు. అప్పుడు అతడి వయసు 30 ఏళ్లు. మొదటి రెండు సంవత్సరాలు పార్శ్వనాథుని మతశాఖలో సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత దాన్ని వదలి మరో 10 ఏళ్లపాటు అజీవక మతస్థాపకుడైన గోసాల మస్కరిపుత్రతో గడిపాడు. 42 ఏళ్ల వయసులో తూర్పు భారతదేశంలోని జృంభిక గ్రామంలో సాల వృక్షం కింద కైవల్యం (సంపూర్ణ జ్ఞానం) పొందాడు. అప్పటి నుంచి జినుడు, జితేంద్రియుడు (జయించినవాడు), మహావీరుడని ప్రసిద్ధి చెందాడు. ఇతడి అనుచరులను జైనులు అంటారు. ఇతడు క్రీ.పూ. 468 లో తన 72 వ ఏట రాజగృహం దగ్గర ఉన్న పావపురిలో మరణించాడు.
* మహావీరుడి మరణం తర్వాత చంద్రగుప్త మౌర్యుడి పాలనాకాలంలో తీవ్రమైన కరవు సంభవించింది. దాంతో జైన సన్యాసులు గంగాలోయ నుంచి దక్కనుకు వలస వెళ్లారు. ఈ వలస జైనమతంలో చీలికకు దారితీసింది. మహావీరుడు చెప్పినట్లు దిగంబరత్వాన్ని పాటించాలని భద్రబాహు పేర్కొన్నాడు. ఉత్తర భారతదేశంలో ఉన్న జైనులకు నాయకుడైన స్థూలభద్ర తన అనుచరులను తెల్లబట్టలు ధరించాలని కోరాడు. ఇది జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులుగా చీలిపోవడానికి కారణమైంది.

 

పంచ మహావ్రతాలు:
జైనమతంలో అయిదు ముఖ్య సూత్రాలున్నాయి. వీటినే పంచ మహావ్రతాలు అంటారు. అవి.
1) అహింస,
2) సత్యం,
3) అస్తేయం (దొంగిలించకూడదు),
4) అపరిగ్రహ (ఆస్తి కలిగి ఉండకూడదు),
5) బ్రహ్మచర్యం.

అంతకుముందున్న నాలుగు సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్యం అనే అయిదో సూత్రాన్ని చేర్చాడు. ఈ అయిదు సూత్రాలను సన్యాసులు కఠినంగా ఆచరిస్తే మహావ్రతులని, సామాన్య అనుచరులు ఆచరిస్తే అనువ్రతులని పిలుస్తారు. జైనమతంలో నిర్వాణం సాధించడానికి సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన అనే త్రిరత్నాలను పాటించాలి.
మహావీరుని బోధనలు: మహావీరుడు వేదాల ఆధిపత్యాన్ని ఖండించాడు. జంతు బలులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇతడు ప్రతి చిన్న వస్తువుకు ఆత్మ ఉంటుందని చెప్పాడు. అందుకే జైనులు అహింసను కచ్చితంగా పాటిస్తారు. జైనమతం దేవుడి ఉనికిని ఖండించలేదు కానీ, విశ్వం పుట్టుక, కొనసాగడానికి దేవుడే కారణం అనే వాదాన్ని తిరస్కరించింది. దేవుడికి జైనమతంలో తీర్థంకరుల కంటే తక్కువ స్థానాన్ని కల్పించారు. వీరికి వర్ణవ్యవస్థపై విశ్వాసంలేదు. అందుకే వారు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటించారు. మహావీరుడు మోక్షసాధనకు పవిత్రమైన, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని బోధించాడు. అలాగే కఠోర తపస్సు అవసరాన్ని నొక్కి చెప్పాడు.

* మొదటి జైనమత కౌన్సిల్ పాటలీపుత్రంలో క్రీ.పూ. 3 వ శతాబ్దంలో ప్రారంభమైంది. దీనికి అధ్యక్షుడు స్థూలభద్రుడు. ఈ కౌన్సిల్‌లో జైన గ్రంథాలైన 12 అంగాలను క్రోడీకరించారు. అయితే ఈ గ్రంథాలను శ్వేతాంబరులు మాత్రమే అంగీకరించారు. రెండో జైన కౌన్సిల్ సౌరాష్ట్రలోని వల్లభిలో క్రీ.శ. 5 వ శతాబ్దంలో జరిగింది. దీనికి దేవర్ది క్సమశ్రమణ అధ్యక్షత వహించాడు. ఇందులో 12 అంగాలు, 12 ఉపాంగాలను క్రోడీకరించారు.
జైనమత వ్యాప్తి, అభివృద్ధి: మహావీరుడు, జైన సన్యాసులు సంస్కృతానికి బదులు సామాన్య ప్రజలు మాట్లాడే భాషను వాడటం, సులభమైన నైతిక నియమావళి, జైన సన్యాసుల కార్యకలాపాలు, రాజుల ఆదరణ మొదలైనవి జైనమత వ్యాప్తికి తోడ్పడ్డాయి. మహావీరుడి అనుచరులు దేశమంతటా విస్తరించారు. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు జైన సన్యానులు సింధు నది ఒడ్డున ఉన్నట్లు తెలుస్తోంది.

* జైన సంప్రదాయం ప్రకారం అజాతశత్రువు తర్వాత మగధను పాలించిన ఉదయనుడు జైనమతాభిమాని. నంద వంశరాజులు కూడా జైనమతాన్ని పోషించారు. క్రీ.పూ. 1 వ శతాబ్దంలో ఉజ్జయిని గొప్ప జైనమత కేంద్రంగా ఉండేది. క్రీ.పూ. 4 వ శతాబ్దం చివరినాటికి భద్రబాహు ఆధ్వర్యంలో కొంతమంది జైన సన్యాసులు దక్కనుకు వలస వెళ్లారు. దీంతో మైసూరులోని శ్రావణ బెళగొల కేంద్రంగా జైనమతం దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చెందింది.

 

రాజుల ఆదరణ 
చంద్రగుప్త మౌర్య జైనమతాన్ని పోషించిన వారిలో ప్రముఖుడు. భద్రబాహు దక్కనుకు వలస వెళ్లినప్పుడు, చంద్రగుప్తుడు అతడితోపాటు దక్షిణానికి వెళ్లాడు. ఇతడు ఒక కొండపై ఉన్న గుహను చంద్రగుప్తుడికి అంకితం చేయడంతోపాటు ఆ కొండకు చంద్రగిరి అని నామకరణం చేశాడు.
* క్రీ.పూ. 2 వ శతాబ్దంలో కళింగను పాలించిన ఖారవేలుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఇతడు జైనుల విగ్రహాలను ఏర్పాటుచేసి జైనమత వ్యాప్తికి కృషి చేశాడు.
* కుషాణుల కాలంలో మధురలో, హర్షవర్థనుడి కాలంలో తూర్పు భారతదేశంలో జైనమతం ప్రధాన మతంగా ఉండేది. క్రీ.శ. ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని మధుర, దక్షిణ భారత దేశంలోని శ్రావణ బెళగొల ప్రధాన జైనమత కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడ లభించిన శాసనాలు, విగ్రహాలు, ఇతర కట్టడాలే ఇందుకు నిదర్శనం.
* క్రీ.శ. 5 వ శతాబ్దంలో దక్షిణ భారతదేశానికి చెందిన గంగ, కదంబ, చాళుక్య, రాష్ట్రకూట రాజవంశాలు జైనమతాన్ని పోషించాయి.
* మాన్యఖేటను కేంద్రంగా చేసుకుని తమ పరిపాలనను సాగించిన రాష్ట్రకూటులు జైనమతంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. వారు జైన కళలు, సాహిత్యం అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించారు. రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుడి కాలంలో జినసేనుడు, గుణభద్రుడు మహాపురాణం అనే గ్రంథాన్ని రచించారు. అమోఘవర్షుడు రత్నమాలిక అనే జైన గ్రంథాన్ని రచించాడు.
* క్రీ.శ. 1110 నాటికి గుజరాత్‌లో జైనమతం వ్యాప్తి చెందింది. అన్హిల్‌వారా (Anhilwara) పాలకుడు, జయసింహగా ప్రసిద్ధిచెందిన చాళుక్యరాజు సిద్ధరాజు, కుమారపాల జైనమతాన్ని ఆదరించారు. వారు జైనమతాన్ని స్వీకరించి, జైనుల సాహిత్యాన్ని, దేవాలయాల నిర్మాణ కార్యకలాపాలను ప్రోత్సహించారు. కుమారపాలుడి ఆస్థానంలోని జైనపండితుడు హేమచంద్రుడు రచించిన త్రిషష్టి సలక పురుష చరిత అనే గ్రంథం ప్రసిద్ధిచెందింది.

 

జైనమత పతనం: భారతదేశంలో జైనమతం పతనం కావడానికి ప్రధాన కారణం అహింసకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడమేనని చరిత్రకారుల అభిప్రాయం. అనారోగ్యం పాలైనప్పుడు మందులు వాడితే సూక్ష్మక్రిములు చనిపోతాయి కాబట్టి ఎవరూ మందులు వాడకూడదని జైనులు పేర్కొన్నారు. చెట్లు, కూరగాయల్లో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి వాటికి ఎలాంటి హాని చేయకూడదని నమ్మారు. ఇలాంటి పద్ధతులు సామాన్య ప్రజలకు అంతగా నచ్చలేదు. మొదట్లో జైనమతానికి రాజులనుంచి ఆదరణ లభించినా, తర్వాతికాలంలో ఈ మతానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

 

జైన మతం
      క్రీ.పూ.6వ శతాబ్దంలో భారతదేశంలో జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి. నాటి దేశ ఆర్థిక, సామాజిక, మత, రాజకీయ రంగాల్లో ఉన్న పరిస్థితులే నూతన మతాల ఆవిర్భవానికి దోహదం చేశాయి. ప్రపంచంలో అనేక మంది నూతన మతాలను స్థాపించి కొత్త సిద్ధాంతాలను అందించారు. చైనాలో కన్ఫ్యూషియస్, లౌత్సలు; పర్షియా (ఇరాన్‌)లో జొరాస్టర్‌ లాంటి తత్త్వవేత్తలు నూతన మత సిద్ధాంతాలను ప్రచారం చేశారు.

 

నూతన మతాల ఆవిర్భవానికి కారణాలు  
ప్రధానంగా అన్ని రంగాల్లోనూ రాజుల కంటే బ్రాహ్మణులకే ఆధిక్యత ఉండటం వల్ల వజ్జి, మల్ల గణ రాజ్యాల్లో యువరాజులుగా ఉన్న వర్ధమాన మహావీరుడు జైనమతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించారు. ఈ కాలంలో అజీవకులు, చార్వాకులు అనే నూతన మతాలు వచ్చినప్పటికీ ప్రజలు మహావీరుడు, గౌతమబుద్ధుడి వ్యక్తిత్వం వల్ల జైన, బౌద్ధ మతాలనే ఆదరించారు.  భారతదేశంలో క్రీ.పూ.6వ శతాబ్దంలో ఉన్న ఆధ్యాత్మిక అశాంతి, బ్రాహ్మణ ఆధిక్యత, యజ్ఞ యాగాల నిర్వహణ లాంటి మత కారణాలతోపాటు షోడశ మహాజనపథాలు ఆవిర్భవించడం; రాచరిక, గణ రాజ్యాల పాలనలోని వ్యత్యాసాలు నూతన మతాల ఏర్పాటుకు దోహదం చేశాయి. నగరాలు, పట్టణాలు ఆవిర్భవించడం; చేతివృత్తుల వారు వివిధ శ్రేణులుగా ఏర్పడటం, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడం, నాణేలు చలామణిలోకి రావడం, వ్యవసాయ రంగంలో ఇనుము వాడకం ద్వారా అధిక వృద్ధిని సాధించడం వంటి ఆర్థిక పరిణామాలు కూడా ఈ నూతన మతాల పుట్టుకకు కారణమయ్యాయి. ముఖ్యంగా నాటి సమాజంలో వర్ణ వ్యవస్థ/కుల వ్యవస్థ విస్తరించడం, వివిధ నూతన వర్గాల ఆవిర్భావం లాంటి సామాజిక పరిణామాలు కూడా దోహదపడ్డాయి. వైదిక మతాచారాలకు (అధిక వ్యయంతో కూడుకున్న యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ, బ్రాహ్మణ ఆధిక్యత, జంతుబలి లాంటి మతాచారాలు), నూతనంగా విజృంభిస్తున్న సాంఘిక వర్గాల ఆలోచనా విధానానికి మధ్య ఉండే తేడా వల్ల ఘర్షణలు మొదలై జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి.

        జైనమత స్థాపన విషయంలో చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. చారిత్రకంగా జైనమత స్థాపకులు రుషభనాథుడు, పార్శ్వనాథుడని; వాస్తవంగా స్థాపించింది మాత్రం వర్ధమాన మహావీరుడని అనేకమంది చరిత్రకారులు సిద్ధాంతీకరించారు.

 

శాఖలు
      జైనమతంలో క్రమంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులు అనే రెండు శాఖలుగా చీలిపోయింది. వస్త్రాలు ధరించని వారిని దిగంబరులు అంటారు. వీరికి నాయకుడు భద్రబాహుడు. తెల్లని వస్త్రాలు ధరించే జైనులను శ్వేతాంబరులు అంటారు. వీరికి నాయకుడు స్థూలబాహుడు/స్థూలభద్రుడు. ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఇరువర్గాల మధ్య తలెత్తిన భిన్నాభిప్రాయాలు చీలికకు కారణమయ్యాయి.

 

పంచవ్రతాలు
జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు.
1. అసత్యం: అబద్ధం ఆడకూడదు/సత్యమునే పలకాలి
2. అహింస: జీవహింస చేయరాదు/అహింసను పాటించాలి.
3. అస్తేయ: దొంగతనం చేయకూడదు. 
4. అపరిగ్రాహ:  ఆస్తిని కలిగి ఉండరాదు.
5. బ్రహ్మచర్యం: ప్రతి వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

       జైనమత గ్రంథాలను అంగాలు అంటారు. ఇవి మొత్తం 12 కాబట్టి ద్వాదశాంగాలు అని కూడా పిలుస్తారు. ప్రతి జైనుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను త్రిరత్నాలు అంటారు. అవి సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక. అంటే తీర్థంకరుల బోధనల పట్ల విశ్వాసాన్ని, వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, అవి పాటించడం ద్వారా ప్రతి జైనుడు మోక్షాన్ని పొందుతాడని జైనుల నమ్మకం. త్రిరత్నాలను జైన, బౌద్ధ మతాలు రెండింటిలోనూ ప్రస్తావించారు. బౌద్ధమతంలో బుద్ధుడు, ధర్మం, సంఘం అనే వాటిని త్రిరత్నాలుగా పేర్కొన్నారు.

 

తీర్థంకరులు
         జైనమత గురువులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరుడు అంటే ‘జీవన స్రవంతిని దాటడానికి వారధి’ లాంటివాడని అర్థం. జైనమత సాహిత్యం, సంప్రదాయంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. ఇందులో మొదటి తీర్థంకరుడు రుషభనాథుడు, 21వ తీర్థంకరుడు నేమినాథుడు, 22వ తీర్థంకరుడు అరిష్టనేమి, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు.

తీర్థంకరులు గుర్తు
రుషభనాథుడు ఎద్దు
నేమినాథుడు నీలి గులాబి
 అరిష్టనేమి శంఖం
 పార్శ్వనాథుడు పాము
 వర్ధమాన మహావీరుడు సింహం

 

     జినుడు (వర్ధమానుడు) పేరు మీదుగా జైనమతం అనే పేరు వచ్చింది కాబట్టి జైన మత స్థాపకుడు వర్ధమన మహావీరుడు అని చెబుతారు. కానీ జైనమత తొలి తీర్థంకరుడు రుషభనాథుడు అని కొంతమంది చరిత్రకారులు పేర్కొంటారు. జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు. 
        దీనిలో మొదటి నాలుగు వ్రతాలైన అహింస, అస్థేయ, అసత్య, అపరిగ్రాహలను 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు తెలియజేశాడు కాబట్టి అతడే జైనమతాన్ని స్థాపించాడని మరికొంతమంది చరిత్రకారులు పేర్కొన్నారు. అయిదో వ్రతం బ్రహ్మచర్యాన్ని వర్ధమాన మహావీరుడు తెలియజేశాడు.

 

పరిషత్తులు
     జైనమత అభివృద్ధికి రెండు ముఖ్యమైన సమావేశాలు (పరిషత్తులు) నిర్వహించారు. మొదటి జైన పరిషత్తు పాటలీపుత్రంలో స్థూలభద్రుడి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోనే జైనమత గ్రంథంగా ఉన్న 14 పర్వాల స్థానంలో 12 అంగాలను ప్రవేశపెట్టారు.
    రెండో జైన పరిషత్తును వల్లభిలో క్షమశ్రవణుడు/దేవార్థి క్షమపణ నిర్వహించాడు. ఈ సమావేశంలో 12 ఉపాంగాలను సంకలనం చేశారు.

 

వర్ధమాన మహావీరుడు
 నమత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. ఈయన క్రీ.పూ.540లో ప్రస్తుత బిహార్‌లోని కుంద గ్రామంలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల. భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని/అనోజ్ఞ. ఇతడు వైశాలి రాజ్యానికి చెందిన (వజ్జి గణ రాజ్యం) జ్ఞాత్రిక క్షత్రియ వంశస్థుడు. వర్ధమానుడు తన 30వ ఏట ఇల్లు విడిచి 12 ఏళ్లపాటు రిజుపాలిక నదీతీరంలోని జృంభిక అనే గ్రామంలో సాలవృక్షం కింద తపస్సు చేసి 42వ ఏట ‘జినుడు’ అయ్యాడు. జినుడు అంటే కోర్కెలను/ఇంద్రియాలను జయించినవాడని అర్థం. వర్ధమానుడు మహావీరుడు, కేవలి, నిర్గంగ్రథుడు లాంటి బిరుదులను పొందాడు. తన అనుచరులను జైనమతంగా ఏర్పరిచి, మత సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ క్రీ.పూ.468లో బిహార్‌లోని పావాపురి ప్రాంతంలో నిర్యాణం చెందాడు.  

 

బోధనలు
      పంచవ్రతాల్లో చివరిదైన బ్రహ్మచర్యాన్ని ప్రతిపాదించింది వర్ధమానుడే. ఇతడు ద్వైత సిద్ధాంతాన్ని లేదా సాద్వాదాన్ని విశ్వసించాడు. దీని ప్రకారం సృష్టిలో ఆత్మ, పదార్థం అనే రెండు అంశాలు ఉంటాయని తెలిపాడు. పదార్థం నశించిపోతుంది కానీ కోరికల వల్ల ఆత్మ అనేది జన్మ, పునర్జన్మ చట్రంలో ఇరుక్కుపోయి స్వేచ్ఛను కోల్పోతుందని పేర్కొన్నాడు. ఈ చక్రబంధనం నుంచి విముక్తి పొందడం ఎలా అనే దానికి సమాధానం కనుక్కోవడానికే అతడు పరివ్రాజకుడయ్యాడు. సత్యాన్ని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్లడాన్ని పరివ్రాజకుడు అంటారు. వర్ధమానుడు 30వ ఏట, గౌతమ బుద్ధుడు 29వ ఏట పరివ్రాజకులయ్యారు. వేదాలు ప్రామాణికంకాదని, యజ్ఞ యాగాల వల్ల మోక్షం రాదని, జీవహింస చేయరాదని ప్రచారం చేశాడు. ముఖ్యంగా వర్ధమానుడు ప్రచారం చేసిన సిద్ధాంతాన్ని సల్లేఖన వ్రతం అంటారు. అంటే వ్యక్తి అన్న పానాదులు మాని శరీరం శుష్కించేవరకు కఠోరమైన తపస్సు చేస్తే మోక్షం వస్తుందని బోధించాడు.

     మహావీరుడికి గణధారులు (పీఠాధిపతులు) అనే 11 మంది సన్నిహితులైన శిష్యులు/ధర్మదూతలు ఉండేవారు. వారిలో ఆర్య సుధర్ముడు వర్ధమానుడి అనంతరం జైనమతానికి ప్రధాన గురువు (థేరా) కాగా ఈయన తర్వాత జంబు మతగురువు అయ్యాడు. ముఖ్యంగా ధననందుడి పాలనాకాలంలో వర్ధమానుడి తర్వాత సంభూత విజయ గొప్ప జైన మతాచార్యుడిగా పేరొందాడు. ఒక వ్యక్తి కేవలం జ్ఞానాన్ని పొందడానికి 14 ఆధ్యాత్మిక దశలు (పూర్వాలు) దాటాలని పేర్కొన్నారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఆరో మతగురువు (థేరా)గా పేరొందిన వ్యక్తి భద్రబాహుడు. ఇతడు కల్పసూత్రాలు అనే గ్రంథాన్ని రాశాడు.

 

వాస్తుకళాభివృద్ధి
  జైనమతం భారతదేశ మత, సాహిత్య, వాస్తుకళా రంగాల్లో ఎన్నో మార్పులకు కారణమైంది. ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుడు, ఖారవేలుడు; కదంబులు, గాంగులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు లాంటి రాజవంశాలు జైనమతాన్ని అవలంబించి అనేక జైన దేవాలయాలను నిర్మించారు. కవులను పోషించి జైన సాహిత్యాభివృద్ధికి  కృషిచేశారు. కర్ణాటకలోని శ్రావణబెల్గోళ (గోమఠేశ్వర మఠం), ఒడిశాలోని ఉదయగిరి గుహాలయాలు, రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూ పర్వతంపై ఉన్న దిల్వారా జైన దేవాలయాలు, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాలు జైనమతం వల్ల అభివృద్ధి చెందాయి.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విష్ణుకుండినులు

విష్ణుకుండినులు క్రీ.శ. 5, 6 శతాబ్దాల్లో తెలంగాణను పాలించారు. వీరి వంశ స్థాపకుడు ఎవరనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. వీరి కులదైవం శ్రీపర్వతస్వామి, మల్లికార్జునుడు అని చెబుతుండగా.. ఇద్దరూ ఒకటేనని కీల్ హారన్ అనే పండితుడు పేర్కొన్నాడు. శ్రీపర్వతస్వామి అంటే బుద్ధదేవుడు అని నేలటూరు వేంకటరమణయ్య అభిప్రాయపడ్డారు.


మహా రాజేంద్రవర్మ
చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎక్కువగా లభించే సమాచారం ప్రకారం మహా రాజేంద్రవర్మ విష్ణుకుండిన వంశ స్థాపకుడు. గోవిందవర్మ వేయించిన ఇంద్రపాల నగర తామ్ర శాసనంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. మహా రాజేంద్రవర్మ క్రీ.శ. 358లో విష్ణుకుండిన రాజ్యాన్ని స్థాపించాడు. ఇంద్రపాల నగరాన్ని (తుమ్మల గూడెం, నల్గొండ జిల్లా) నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. రామతీర్థ శాసనం వేయించాడు.


మొదటి మాధవవర్మ
మహా రాజేంద్రవర్మ కుమారుడు మొదటి మాధవవర్మ. అమరాబాద్, కీసర, భువనగిరి ప్రాంతాల వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇంద్రపాల నగర తామ్రశాసనంలో ఇతడి గురించి ప్రశంస ఉంది. పాలమూరు శాసనం ప్రకారం ఇతడికి విక్రమ మహేంద్ర అనే బిరుదు ఉండేది.


గోవిందవర్మ
మొదటి మాధవవర్మ కుమారుడు గోవిందవర్మ. విష్ణుకుండిన వంశ తొలిరాజుల్లో అగ్రగణ్యుడు. ఇంద్రపాల నగర తామ్ర శాసనాన్ని వేయించాడు. పణిగిరి లాంటి ప్రాంతాల్లో బౌద్ధారామాలను నిర్మించాడు. హైదరాబాద్ నగర సమీపాన చైతన్యపురిలోని మూసీనది తీరంలో లభించిన ప్రాకృత శాసనం ఈ రాజు పేరున వెలసిన గోవింద రాజవిహారం, చైత్యాలయాల గురించి తెలుపుతుంది. అనంతర కాలంలో ఈ నిర్మాణాలు శిథిలం కాగా, శాసనం మాత్రమే మిగిలింది. గోవిందవర్మ పట్టపురాణి పరమ మహాదేవి పేరున ఇంద్రపురిలో చాతుర్ధశౌర్య సంఘ బౌద్ధ భిక్షువులకు మహావిహారాన్ని నిర్మించారు. ఈ విహార పోషణకు గోవిందవర్మ పెణ్కపర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.


రెండో మాధవవర్మ
విష్ణుకుండినుల్లో గొప్పవాడు రెండో మాధవవర్మ. వైదిక మతాభిమాని. అశ్వమేధ, రాజసూయ, వాజపేయ అగ్నిష్టోమ, నరమేధ లాంటి క్రతువులు నిర్వహించాడు. ఇతడు పురుషమేధం అనే యజ్ఞాన్ని హైదరాబాద్ సమీపంలోని కీసరలో నిర్వహించినట్లు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయల్పడింది. రెండో మాధవవర్మ కాలంలో తెలంగాణలో అనేక దేవాలయాలను నిర్మించారు. ఇంద్రపాల నగరంలో అమరేశ్వరాలయం, రామేశ్వరాలయం, మల్లికార్జునాలయం; చెరువుగట్టులో జడల రామలింగేశ్వరాలయం, షాద్‌నగర్ సమీపంలో ఉత్తర రాజలింగేశ్వరాలయం, పులిగిళ్లలో రామలింగేశ్వరా లయాలు ముఖ్యమైనవి. ఈయన కాలంలోనే విష్ణుకుండినుల రాజచిహ్నం పేరున కేసరి రామలింగేశ్వరాలయాన్ని కీసరలో నిర్మించారు.


మూడో మాధవవర్మ
మూడో మాధవవర్మ ఈవూరు తామ్రశాసనం వేయించాడు. త్రికూట 'మలయాధిపతి అనే బిరుదు ఉండేది. ఇంద్రవర్మ, అగ్నివర్మ అనే బ్రాహ్మణులకు మ్రుతుకలి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినట్లు శాసనం ఉంది.


ఇంద్ర భట్టారకవర్మ
ఇంద్ర భట్టారకవర్మ అనేక ఘటికాస్థానాలను (హిందూ విద్యాకేంద్రాలు) స్థాపించాడు. కీసర సమీపంలో ఉన్న ఘటకేశ్వరం (ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా) ఇంద్ర భట్టారకవర్మ నెలకొల్పిన ఘటికాస్థానమే. ఇతడు అనేక ఘటికలు స్థాపించినట్లు ఉద్దంకుడు 'సోమవేదం అనే గ్రంథంలో తెలిపాడు. ఇంద్ర భట్టారక వర్మకి 'సత్యాశ్రయుడు అనే బిరుదు ఉండేది. విష్ణుకుండినుల్లో చివరి పాలకుడు మంచన భట్టారకుడు. ఇతడిని తరిమివేసి చాళుక్యులు రాజ్యాన్ని ఆక్రమించారు.


ఆర్థిక పరిస్థితులు
విష్ణుకుండినులు ముద్రించిన నాణేల్లో నాణ్యత లోపించింది. వీటి తయారీకి ఉపయోగించిన లోహం రాగి మలామాతో చేసిన ఇనుము. పరిశ్రమలు, వాణిజ్యం క్షీణించడంతో ప్రాచీన నగరాలు వాటిని అనుసంధానం చేసే రహదారులు నష్టపోయాయి. వీరు లంఘించు సింహపు గుర్తులున్న నాణేలు వేశారు. ఏలేశ్వరంలో విక్రమేంద్ర వర్మ వేయించిన నాణేలు దొరికాయి. ఇందులోని నాణేలు రాగి, సత్తుల మిశ్రమం. కుంభం, సింహం అనే అక్షరాలు కనిపిస్తాయి. భువనగిరి, సుల్తానాబాద్ తాలూకాల్లో రాగి నాణేలు దొరికాయి.


వాణిజ్యం
బర్మా, సయాం, కంబోడియా, చైనా, జపాన్, సిలోన్ దేశాలతో విదేశీవ్యాపారం చేసేవారు. రెండో మాధవవర్మ త్రిసముద్రాధిపతి. ఇతడి రాజ్యానికి ఉత్తరాన రేవా నది ఉండేది. నగదుతో స్వదేశీ వ్యాపారం జరిగేది. మొదటిసారిగా సామంత రాజులను పన్ను వసూలు యంత్రాంగంలో భాగంగా చూడటం వీరి కాలంలోనే ప్రారంభమైంది.


సాంఘిక పరిస్థితులు
విష్ణుకుండినులు బ్రాహ్మణులు. వైదిక మతాన్ని అనుసరించారు. వీరి కాలంలో కుల వ్యవస్థ బాగా బలపడింది. రెండో మాధవవర్మ అశ్వమేధ యాగాలు చేశాడు. కొంత మంది ప్రభువులు తమను తాము పరమ మహేశ్వరులుగా చెప్పుకున్నారు. 18 మత శాఖల సిద్ధాంతాలు పూర్తిగా తెలిసి మానవ జాతిని జీవన, మరణ, దుఃఖాల నుంచి కాపాడేందుకు యజ్ఞాలు, కర్మలు చేసే దశ బలబలి అనే పండితుడు గోవిందవర్మ ఆస్థానంలో ఉండేవాడు. ఆ పండితుడికి గోవిందవర్మ వెంకపర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. విష్ణుకుండినుల కులదైవం శ్రీపర్వతస్వామి కొండమోటు నరసింహ శిల్పం జనాదరణ పొందింది.


బౌద్ధమతం
విష్ణుకుండినుల కాలంలో బౌద్ధమతం రాజాదరణ, ప్రజాదరణ పొందింది. గోవిందవర్మ బౌద్ధమతాన్ని ఆదరించి అనేక నిర్మాణాలు చేశాడు. వీరి కాలంలో పణిగిరి, గాజులబండ, ఏలేశ్వరం, తుమ్మలగూడెం, నాగారం, వర్థమాన కోట, నేలకొండపల్లి, ముదిగొండ, హైదరాబాద్ సమీపంలో చైతన్యపురిలోని మూసీ తీరంలో బౌద్ధ నిర్మాణాలు జరిగాయి. క్రమంగా బౌద్ధంలో వజ్రాయాన శాఖ వ్యాపించింది. ఈ శాఖ నుంచి తాంత్రికాచారాలు, శక్తి పూజలు వచ్చాయి. వజ్రాయాన శాఖ వారి దుర్నీతి, నీతి బాహ్యచర్యల వల్ల బౌద్ధమతం ప్రజాదరణను కోల్పోయింది.


విద్య.. సాహిత్యం
విష్ణుకుండినుల రాజభాష సంస్కృతం. వీరు ఘటికలను (హిందూ విద్యాకేంద్రాలు) స్థాపించి వేద విద్యలను ప్రోత్సహించారు. తెలంగాణలో వీరు మొదటిసారిగా ఘటికలను స్థాపించారు. ఘటిక ఎలా స్థాపించాలో ఉదంకుడు సామవేదంలో పేర్కొన్నట్లు ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. రెండో విక్రమేంద్రవర్మ భగవంతుడు, త్రయంబకుడు అయిన సోమగిరీశ్వరనాథుడికి నతవాడి (పాలన) విషయంలో రెగొన్ర అనే గ్రామాన్ని దానం చేశాడు. ఘటికల్లో చతుర్దశ విద్యలను బోధించేవారు. శాసనాల్లో విష్ణుకుండినులు దక్షిణాపథపతి, త్రికూట మలయాధిప, శ్రీపర్వతస్వామి పాదానుద్యాతలుగా పేర్కొన్నారు.
విష్ణుకుండినుల శాసనాల్లో తెలుగు పదాలు కనిపిస్తాయి. చిక్కుళ్ల తామ్ర శాసనంలో 'విజయరాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు పదం కనిపిస్తుంది. భవశర్మ అనే కవి వేదాంగాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేశాడని తాండవ శాసనంలో వర్ణించారు. దగ్గుపల్లి దుగ్గన 'నచికేతోపాఖ్యానం రచించాడు. 'జనాశ్రయచ్ఛందోవిచ్ఛిత్తి అనే పురాతన సంస్కృత ఛందోగ్రంథం మాధవవర్మ కాలంలో రచించారని ప్రతీతి. ఈ గ్రంథ రచయిత గుణస్వామి. ఈ గ్రంథంలో కాళిదాసు వరరుచి, సుందరపాండ్య, శూద్రకుల పద్యాలు ఉదాహరణగా పేర్కొన్నారు.


వాస్తు శిల్పాలు
విష్ణుకుండినులు తెలంగాణ ప్రాంతంలో రామలింగేశ్వర దేవాలయాల పేరిట శివాలయాలు నిర్మించారు. వీరి శిల్పాల్లో నాగార్జునకొండ రీతి కనిపిస్తుంది. వారి కాలంలో వివిధ దేశాలకు తమ సంస్కృతిని వ్యాపింపజేశారు. బర్మా దేశంలోని తైలాంగ్‌లు తెలంగాణ వారేనని 'ఫెరే బ్రహ్మచరిత్ర తెలుపుతుంది. విష్ణుకుండినులు ఆంధ్రప్రాంతంలో అనేక దేవాలయాలు నిర్మించారు. బుజ్జన్నకొండ, మొగల్‌రాజపురం, విజయవాడ, ఉండవల్లి భైరవ కొండ గుహాలయాలు, శివాలయాలను వీరు నిర్మించారు.


పాలనా స్వరూపం
విష్ణుకుండినులు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలుగా విభజించారు. రాష్ట్రాలకు రాష్ట్రీకులు, విషయాలకు విషయాధిపతులు అనే అధికారులుండేవారు. హస్తికోశుడు గజబలాలపై, వీరకోశుడు పదాతిదళాలపై సైనికాధికారులుగా ఉండేవారు. వీరిద్దరూ తమ ప్రభువుల తరపున దానాలు చేసేవారు. రజ్జుక అనే అధికారి భూములను కొలిచేవాడు. ఫలదారు భూమిశిస్తును నిర్ణయించేవాడు. గుల్మికుడు సరిహద్దు రాష్ట్రాలపై నియమించిన సైనిక ప్రతినిధి. సెట్టి ప్రభుత్వ ఆదాయాన్ని కొలిచేవాడు. అక్షపటలాధికృతుడు లేదా అక్షపటలాధికారి అనేవాడు రాజాజ్ఞలను రాయించేవాడు.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వేములవాడ చాళుక్యులు

* కన్నడ భాషకు స్వర్ణయుగం
వేములవాడను పేరులోనే ఇముడ్చుకున్న చాళుక్యులది తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం. రాష్ట్ర కూటులకు సామంతులైన వీరి కాలంలో ఎందరో కవులు కీర్తిని పొందారు. కన్నడ రాజభాష మాత్రమే కాదు.. ఆ భాషకు స్వర్ణయుగం వీరి పాలనాకాలం. దేవాలయాల నిర్మాణంలో చాళుక్యుల కృషి చరిత్ర లిఖితం. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసిన వేములవాడ చాళుక్యుల కాలంలో పాలన, కీర్తి, సాహిత్యం తదితర అంశాలు ఆసక్తికరం..
వేములవాడ చాళుక్యులు తెలంగాణ ఉత్తర ప్రాంత (నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు) పరిధిలో.. క్రీ.శ. 7వ శతాబ్దపు ఉత్తరార్ధం నుంచి 11వ శతాబ్దపు పూర్వార్ధం వరకు పాలించారు. వీరు రాష్ట్ర కూటులకు సామంతులుగా పాలన సాగించారు. జైన, శైవ మతాలను ఆదరించి, పోషించి తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేసిన చాళుక్యులు బోధన్, గంగాధర, వేములవాడ పట్టణాలను రాజధానులుగా చేసుకుని పారిపాలించారు. వీరు అనేక దేవాలయాలను నిర్మించడమే కాకుండా బహుభాషా కవులను పోషించారు. వీరి చరిత్రకు సంబంధించి వివిధ ఆధారాలున్నాయి.


చారిత్రక ఆధారాలు

శాసనాలు

   1) కొల్లిపర తామ్ర శాసనం - మొదటి అరికేసరి
   2) పర్భిణి తామ్ర శాసనం - మూడో అరికేసరి
   3) కురిక్క్యాల శాసనం - జిన వల్లభుడు
 
  7) కురవగట్టు శాసనం - బీర గృహుడు


గ్రంథాలు
పంపకవి రచించిన విక్రమార్జున విజయం, సోమదేవ సూరి రచించిన యశస్తిలక చంపూ కావ్యం.


రాజధాని పేరుతోనే..
వీరు వేములవాడను రాజధానిగా చేసుకుని పాలించారు. అందువల్లే వేములవాడ చాళుక్యులుగా పేరుపొందారు. వేములవాడను పూర్వం 'లేంబులవాడ' అనేవారు. పోదనపురం (బోధన్) పూర్వం అశ్మక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ రాజ్యాన్ని సపాదలక్ష దేశంగా పిలిచేవారు. సపాదలక్ష దేశం అంటే 1,25,000 బంగారు నాణేలు ఆదాయం వచ్చే భూమి అని అర్థం.


చాళుక్య రాజులు

వినయాదిత్య యుద్ధమల్లుడు
వినయాదిత్యుడు వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు. ఇతడు పోదనపురం(బోధన్)ను రాజధానిగా చేసుకుని పాలించాడు. రాష్ట్రకూట రాజ్యస్థాపకుడు దంతిదుర్గుడి సేనాపతిగా అనేక యుద్ధాల్లో పాల్గొని విజయాలు సాధించాడు. దానికి ప్రతిఫలంగా దంతిదుర్గుడు బోధన్ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా ఇచ్చాడు.
బిరుదులు: విశ్వవిరాట్టకి, రామవిక్రమ, నృపాంకుష.


మొదటి అరికేసరి
మొదటి అరికేసరి కృష్ణా నదీతీరంలో ఉన్న ఏలేశ్వర క్షేత్రాన్ని దర్శించి, ఆ క్షేత్రంలో ఉన్న కాలాముఖ శైవాచార్యుడైన ముగ్ధ శివాచార్యుడికి బెల్మొగ గ్రామాన్ని విద్యాదానంగా ఇస్తూ, కొల్లిపర తామ్రశాసనాన్ని వేయించాడు. ఏలేశ్వరంలో వేదవిద్యను బోధించేవారు.
బిరుదులు: సమస్తలోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర, సాహసరామ.


మొదటి బద్దెగడు
బద్దెగడు 42 యుద్ధాలు చేసి 'సొలగదండడు' అనే బిరుదు పొందాడు. సొలగదండడు అంటే పరాజయాన్ని ఎరుగని వీరుడు అని అర్థం. ఇతడు వేములవాడలో బద్దెగేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు.


రెండో అరికేసరి
రెండో అరికేసరి వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడు. ఇతడి సేనాపతి పెద్దన వేములవాడలో ఆదిత్యాలయాన్ని నిర్మించాడు. పెద్దన కోరికపై అరికేసరి ఆ దేవాలయం నిర్వహణకు 100 నివర్తనముల భూమిని దానంగా ఇచ్చి, వేములవాడ శిలాశాసనాన్ని వేయించాడు.
బిరుదులు: పాంబరాంకుష, అమ్మనగందవారణ, అరూఢసర్వజ్ఞ, ఉదాత్తనారాయణ, గుణనిధి, గుణార్ణవ, త్రిభువనమల్ల.


వాగరాజు
అరికేసరి కుమారుడు వాగరాజు. ఇతడు తన రాజధానిని బోధన్ నుంచి కరీంనగర్ పట్టణానికి సమీపంలో ఉన్న గంగాధర పట్టణానికి మార్చాడు.


మూడో అరికేసరి
మూడో అరికేసరి తన రాజధానిని గంగాధర నుంచి వేములవాడకు మార్చాడు. ఇతడు క్రీ.శ. 968లో రేపాక గ్రామంలో ఒక జినాలయాన్ని నిర్మించాడు. వేములవాడ చాళుక్యుల్లో మూడో అరికేసరి చివరి పాలకుడు. ఈ రాజ్యాన్ని కల్యాణి చాళుక్యులు ఆక్రమించారు.


సాంఘిక పరిస్థితులు
చాళుక్యుల కాలంలో వర్ణవ్యవస్థ స్థిర రూపాన్ని పొందడం వల్ల సంఘంలో కట్టుబాట్లు సడలలేదు. బ్రాహ్మణులు వేదాధ్యయనంతో పాటు రాజుల దగ్గర ముఖ్య ఉద్యోగాల్లో ఉండేవారు. క్షత్రియులు రాజధర్మాన్ని నిర్వహించేవారు. వైశ్యులు వర్తక వ్యాపారాలు చేసేవారు. వీరిని 'కోమట్లు' అంటారు. ప్రాచీన జైన ఆధ్యాత్మిక వీరుడైన గోమఠేశ్వరుడి పదం నుంచి కోమటి అనే పదం వచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బోధన్ ఒకప్పుడు గోమఠేశ్వర ఆరాధనకు కేంద్రంగా ఉండేది. అక్కడి గోమఠేశ్వర విగ్రహం నమూనాగానే శ్రావణ బెళగోళలోని విగ్రహాన్ని చెక్కారని ఒక ఐతిహ్యం. వైశ్యులు (కోమట్లు) జైనాన్ని బాగా ఆదరించారు. శూద్రులు వ్యవసాయాది వృత్తులు చేసేవారు. విశ్వకర్మ కులస్థులకు శిల్పకారులుగా, రాజశాసనాలను చెక్కేవారిగా సమాజంలో విశేష గౌరవాదరణలు ఉండేవి. వీరు మొదట జైన మతస్థులు. వీరికి బాల్య వివాహాలు, అంజనం వేయించడం లాంటి మూఢ విశ్వాసాలుండేవి.


మతం
చాళుక్యుల కాలంలో జైన, వైదిక మతాలకు ఆదరణ లభించింది.
జైన మతం: అనేక మంది పాలకులు జైనమతాన్ని అనుసరించి, పలు జినాలయాలను, జైన బసదులను నిర్మించారు. జైనులు ఇతర మతాలవారిని తమవైపు ఆకర్షించడానికి వర్ణ వ్యవస్థను అంగీకరించారు. వర్ణభ్రష్టత లేకుండా జైనంలోకి వెళ్లిన వివిధ మతాలవారు తాము పూర్వం అనుసరించిన మతాచారాలనే పాటించేవారు. వీరి కాలంలో వేములవాడ గొప్ప జైనక్షేత్రంగా ఉండేది. ఈ మతాన్ని అనుసరించిన రాజులు, ఇతరులు జిన విగ్రహాలను కూష్మాండినీ దేవి విగ్రహాలను చెక్కించారు. జైన బసదులకు, మఠాలకు భూదానాలు చేశారు. రెండో అరికేసరి, మరికొంతమంది రాజులు శైవ మతాన్ని అనుసరించారు. వీరి కాలంలో వైష్ణవ పూజలు, శైవమత ఆరాధన ఉండేవి. శాసనశిలలపై వైదిక మత చిహ్నాలయిన శివలింగం, సూర్యచంద్రులు, వృషభం, డాలు, ఆవు, లేగదూడలను చెక్కారు.


విద్యా సారస్వతం
కన్నడం నాటి రాజభాషగా ఉండేది. వీరి కాలంలో శాసనాలు ఎక్కువగా కన్నడ భాషలోనే ఉండేవి. శివాలయాలకు అనుబంధంగా మఠాలుండేవి. మఠాలు, జైనబసదులు ఉన్నత విద్యాలయాలుగా పనిచేసేవి. వీటిలో వేద వేదాంగాలు, ఆగమాలు, శాస్త్రపురాణాలను బోధించడానికి విద్వాంసులుండేవారు. ఇక్కడ పనిచేసే అధ్యాపకుల జీవనోపాధికి నాటి రాజులు భూదానాలు చేశారు. శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఏలేశ్వరంలో ఒక కాలాముఖ శైవ మఠం ఉన్నట్లు, అందులో సద్వోశివాచార్య, ముగ్ద శివాచార్యులనే గురు శిష్యులైన సన్యాసులన్నట్లు కొల్లిపర తామ్ర శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ శాసనాన్ని మూడో అరికేసరి విద్యాదానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. జైన వాఙ్మ‌యం సంస్కృతం తర్వాత కన్నడ భాషలో ఎక్కువగా లభించింది. వీరి కాలం కన్నడ భాషకు స్వర్ణయుగం లాంటిది.


పంపకవి
పంపకవి రెండో అరికేసరి ఆస్థాన కవి. ఇతడికి 'కవితా గుణార్ణవుడు' అనే బిరుదుండేది. అరికేసరికి దండనాయకుడుగా కూడా పనిచేశాడు. పంపకవి కన్నడ భాషలో ఆదికవి. ఇతడు మహాభారతాన్ని 'విక్రమార్జున విజయం' పేరుతో కన్నడ భాషలో రచించాడు. ఇది జైనమతపరంగా ఉంటుంది. అరికేసరికి అంకితమిచ్చాడు. ఈ గ్రంథంలో అరికేసరిని మహాభారతంలో అర్జునుడితో పోల్చాడు. రెండో అరికేసరి పంపకవికి ధర్మపురం (ధర్మపురి, కరీంనగర్ జిల్లా)ను అగ్రహారంగా ఇచ్చాడు. పంపకవి జైన మతాభిమాని. ఇతడు తాను రచించిన 'ఆదిపురాణం'లో జైన తీర్థంకరుల చరిత్రలను వర్ణించాడు.


సోమదేవ సూరి
ఈ జైనకవి క్రీ.శ. 950 ప్రారంభంలో గంగాధర పట్టణంలో నివసించేవాడు. వాగరాజు ఆస్థాన కవి. 'యశస్తిలక' అనే చంపువును రచించాడు. ఈ గ్రంథంలో దక్షిణాపథంలోని ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు తెలిపాడు. ఇతడు 'నీతి వాక్యామృత' అనే రాజనీతి గ్రంథాన్ని రచించాడు. 'యుక్తి చింతామణీసూత్ర' గ్రంథం కూడా సోమదేవసూరిదే. ఇతడి బిరుదులు - శ్యాద్వాదచలసింహ, తార్కిక చక్రవర్తి, కవిరాజు.


కన్నడ రత్నత్రయం (కవి త్రయం)
పొన్నకవి (శాంతిపురాణం, భువనైక రామాభ్యుదయం), రన్నకవి (గదాయుద్ధం, అజిత పురాణం), పంపమహాకవిని కన్నడ రత్నత్రయం అనేవారు.
జిన వల్లభుడు: పంప మహాకవి సోదరుడు. జిన భవనాలను నిర్మించడంలో నేర్పరి. జిన వల్లభుడు కురిక్క్యాల శాసనాన్ని సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల్లో వేయించాడు. తెలుగు భాషలోని మొదటి మూడు కంద పద్యాలు జిన వల్లభుడి కురిక్క్యాల శాసనంలో ఉన్నాయి. ఇతడి మిత్రుడు మల్లియరేచన 'కవిజనాశ్రయం' అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడు గంగాధర గ్రామంలో జైన తీర్థంకరుల విగ్రహాలను పెట్టించాడు.


నిర్మాణాలు
వేములవాడ చాళుక్యులు పోదన(బోధన్) నగరంలో జైన తీర్థంకరుల విగ్రహాలను చెక్కించారు. ఇందులోని ఒక విగ్రహం ఎత్తు 56 అడుగులు. ఇది విరిగిపోయి శిరస్సు మాత్రమే ఉంది. ఈ విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకుని కర్ణాటకలోని శ్రావణ బెళగోళలోని విగ్రహాన్ని చాముండరాయ రూపొందించాడు. వీరు వేములవాడ, బోధన్, చెన్నూరు, కాళేశ్వరం, కురిక్క్యాల, గంగాధరలలో జైనాలయాలను నిర్మించారు.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కాక‌తీయులు

11 - 15 శతాబ్దాల మధ్య ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులు
కాకతీయుల తొలి ప్రస్తావన తూర్పు చాళుక్య రాజు దానార్ణవుడి మాగల్లు శాసనం (క్రీ.శ. 950)లో ఉంది. ఇది గుండియ - ఎరియ - కాకర్త్య గుండనల గురించి వివరిస్తుంది. గణపతి దేవుడి చెల్లెలు మైలాంబ బయ్యారం చెరువు శాసనం వెన్న భూపతి వంశీయులే కాకతీయులని పేర్కొంటుంది. కాకతీయులు మొదట రాష్ట్రకూటుల వద్ద, తర్వాత కల్యాణి చాళుక్యుల వద్ద సేనానులుగా పనిచేశారు. రాష్ట్రకూటులది గరుడకేతనం. రాష్ట్రకూట అనేది ఉద్యోగనామం. కాకతీయులు కల్యాణి చాళుక్యుల వరాహ లాంఛనాన్ని స్వీకరించారు. కాకతి అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులు అయ్యారు. కాకతి అంటే కూష్మాండం/ గుమ్మడి అనే అర్థం కూడా ఉంది. 22వ తీర్థంకరుడైన నేమినాథుడి శాసనాధికారిణి పేరు కూష్మాండిణి. కాకతీయులు మొదట జైనులు కాబట్టి కూష్మాండి దేవతను కూడా పూజించారు. ఆంధ్రరాజులగా కీర్తి నొందారు.


         కాకతి వంశ ప్రతిష్ఠకు పునాది వేసింది మొదటి బేతరాజు. ఇతడికి కాకతి పురాధినాథ అనే బిరుదు ఉంది. మొదటి ప్రోలరాజుకు కాకతి వల్లభ అనే బిరుదుంది. సిద్ధేశ్వర చరిత్ర గ్రంథంలో కాకతీయ మూలపురుషుడు మాధవవర్మ అని ఉంది. కాకతీయుల కాలంలో చేబ్రోలును మహాసేనం అని, అనుమకొండను రుద్రేశ్వరం అని పిలిచేవారు. అనుమకొండ రాజు పద్మసేనుడు సిద్ధేశ్వరుడిని గుమ్మడిపూలతో పూజించడం వల్ల సంతానం కలిగింది. కాబట్టి వారి సంతానాన్ని గుమ్మడితీగ సంతానం అని పిలిచేవారు. కాకతీయులను ఆంధ్రదేశాధీశ్వరులు, మహామండలేశ్వరులు, స్వయంభూ దేవతారాధకులు అని పిలుస్తారు. రట్టడి (గ్రామపెద్ద) పదవితో వీరి రాజకీయ ప్రస్థానం మొదలైంది.

 

మొదటి బేతరాజు (క్రీ.శ. 992 - 1052):
 కాకతీపురాధినాథ బిరుదాకింతుడు. ఇతడు వేయించిన శనిగరం శాసనం ద్వారా సెబ్బిమండలం (కరీంనగర్)లో కొంత భాగం ఇతడి పాలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు. మొదటి బేతరాజు మంత్రి నారణయ్య శనిగరంలోని యుద్ధమల్ల జైనాలయాన్ని పునర్ నిర్మించాడు.

 

మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1052 - 1076):
ఇతడు అరికేసరి/ అరిగజకేసరి బిరుదు పొందాడు. ఓరుగల్లు సమీపంలో కేసరి తటాకాన్ని తవ్వించాడు. చాళుక్య మొదటి సోమేశ్వరుడికి కొప్పం యుద్ధంలో సహకరించి అతడి నుంచి అనుమకొండ ప్రాంతాన్ని పొందాడు.

 

రెండో బేతరాజు (1076 - 1108):
త్రిభువనమల్ల, విక్రమచక్ర రెండో బేతరాజు బిరుదులు. మంత్రి వైజదండాధిపుడు. రెండో బేతరాజు మరణానంతరం పెద్ద కుమారుడు దుర్గరాజు పాలనకు వచ్చాడు. మొదటి బేతరాజు నిర్మించిన బేతెశ్వరాలయానికి దుర్గరాజు రామేశ్వర పండితుడి పేరుమీద దానధర్మాలు చేసినట్లు ఖాజీపేట దర్గాశాసనం తెలుపుతోంది. దుర్గరాజు పాలనా కాలం 1108 - 1116 (గురువు - ధ్రువేశ్వరుడు)

 

రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116 - 1157):
మొదటి కాకతీయుల్లో సుప్రసిద్ధుడు రెండో ప్రోలరాజు. రుద్రదేవుడి అనుమకొండ శాసనం ఇతడి విజయాలను తెలుపుతోంది. ఇతడు ఓరుగల్లు పట్టణ నిర్మాణం ప్రారంభించాడు. అందులో స్వయంభూ దేవాలయాన్ని నిర్మించాడు.

      మహామండలేశ్వర బిరుదుతో పాలించాడు. శ్రీశైలంలో విజయస్తంభాన్ని నాటాడు. అనుమకొండలో పద్మాక్షి, సిద్ధేశ్వర, కేశవ ఆలయాలను నిర్మించాడు. ఓరుగల్లును క్రీడాభిరామం గ్రంథం ఆంధ్రనగరి అని పేర్కొంది. దీన్ని ఏకశిలానగరం అని కూడా అంటారు. మైలమ అనుమకొండలో కడలాలయ జైన బసదిని నిర్మించింది. రెండో ప్రోలరాజు కాలం నుంచే వరాహం అధికార చిహ్నమైంది.
 

రుద్రదేవుడు/ మొదటి ప్రతాపరుద్రుడు (1157 - 1195):

స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపకుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసాడు. వేయిస్తంభాల గుడిని నిర్మించాడు. కాలచూరి బిజ్జలుడు ఇతడి చేతిలో ఓడినట్లు బిజ్జలుని లక్ష్మీశ్వర శాసనం తెలుపుతోంది. 1176 - 82 సంవత్సరాల మధ్య జరిగిన పలనాటి యుద్ధంలో కాకతిరుద్రుడు నలగాముడి పక్షాన పోరాడాడు. త్రిపురాంతకం శాసనాన్ని 1185లో వేయించాడు. 1186లో ద్రాక్షారామ శాసనం వేయించాడు. యాదవరాజు జైత్రపాలుడి చేతిలో మరణించాడు. ఇతడి కాలంలోనే శైవ - జైన సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. జైనాచార్యుడైన ఉపమన్యముని సహాయంతో మహాదేవుడు రుద్రుడిపై తిరుగుబాటు చేశాడు. మల్లిఖార్జున పండితారాధ్యుడు రుద్రుడి సమకాలికుడు. రుద్రుడు అనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు. రుద్రుడి మంత్రి గంగాధరుడు బుద్ధదేవుడి ఆలయం నిర్మించాడు. రుద్రదేవుడు సంస్కృత భాషలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. రుద్రదేవుడికి విద్యాభూషణం అనే బిరుదు ఉంది. అనుమకొండ శాసనాన్ని రచించిన కవి అచితేంద్రుడు. తోలు బొమ్మలాట అభివృద్ధి గురించి పేర్కొన్న గ్రంథం - ప్రతాపరుద్రీయం.

 

మహదేవుడు (1195 - 1199):
         శైవ మతాభిమాని. ఇతడి గురువు ధృవేశ్వర పండితుడు. ప్రతాపరుద్రుడి ఖండవల్లి శాసనం ప్రకారం రుద్రదేవుడే మహాదేవుడికి రాజ్యం అప్పగించాడు. మహదేవుడి భార్య భయ్యాంబిక, కుమారుడు గణపతి దేవుడు, కుమార్తెలు - మైలాంబ, కుందమాంబ. ఇతడు కూడా యాదవరాజు జైతుగి చేతిలో మరణించాడు. అతి తక్కువ కాలం పాలించిన పాలకుడు ఇతడే.

 

గణపతిదేవుడు (1199 - 1262):
         అతి ఎక్కువ కాలం పాలించిన వ్యక్తి. తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఏకం చేసి పాలించిన కాకతీయ రాజు. జైతుగి కుమారుడు సింఘనకు తెలుగు రాయస్థాపనాచార్య అనే బిరుదు ఉంది. గణపతి దేవుడి గురువు విశ్వేశ్వర శంభు. రేచర్ల రుద్రుడికి కాకతీయ రాజ్యస్థాపనాచార్య, కాకతీయరాజ్య భారధేరేయ అనే బిరుదులు ఉన్నాయి. 1199 నాటి గణపతి దేవుడి మంథెన శాసనంలో అతడి బిరుదు సకలదేశ ప్రతిష్ఠాపనాచార్య. గణపతి సేనాని ముత్యాల చెండరాయడు వెలనాడు, దివిసీమ ప్రాంతాలపై దాడిచేసి విజయం సాధించాడు. చందోలు పాలకుడు పృథీశ్వరుడిని, దివిసీమ అయ్యవంశానికి చెందిన ఫిన్నచోడుడిని ఓడించాడు. ఫిన్న చోడుడి కుమార్తెలు నారమ, పేరమలను గణపతి వివాహం చేసుకున్నాడు. వారి సోదరుడు జాయపను తన గజసాహిణిగా నియమించుకున్నాడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం ప్రకారం ఛోడతిక్కన పృథీశ్వరుడి శిరస్సుతో ఆటలాడినట్లు తెలుస్తోంది. గణపతి దేవుడికి పృథ్వీశ్వర శిరఃకందుక క్రీడా వినోద అనే బిరుదు కూడా ఉంది. అతడు 1254లో రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్లుకు మార్చాడు. కుమార్తెలు రుద్రమదేవిని నిడదవోలు - వీరభద్రుడికి, గణపాంబను కోట పాలకుడు బేతరాజుకు ఇచ్చి వివాహాలు చేశాడు.

       సోదరి మేళాంబికను నతవాడి పాలకుడు పృథ్వీరాజుకిచ్చి వివాహం చేశాడు. మనుమసిద్ధి ఆస్థానంలోని తిక్కన రాయభారం వల్ల మోటుపల్లి రేవును పొందాడు. మోటుపల్లికి - దేశీయ కొండాపురం అనే పేరుంది. బమ్మెర పోతన (ఒంటిమిట్ట - కడప) ఇతడి కాలం వాడే. కానీ గణపతి 1262లో జటావర్మ సుందర పాండ్యుడి చేతిలో ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోయాడు. జాయప దక్షిణ దండయాత్రలను చేబ్రోలు శాసనం తెలియజేస్తుంది. గణపేశ్వర శాసనం కూడా జాయప విజయాలను తెలుపుతోంది. గణపతి దేవుడికి చోడకటక చూరకార బిరుదు కూడా ఉంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణం ఛోడ తిక్కన కురువులూరు యుద్ధం గురించి వివరిస్తుంది. గణపతి నెల్లూరు ఛోడతిక్కన కుమారుడైన మనుమసిద్ధి (వీరగండ గోపాలుడు)కి సాయంచేశాడు. ఈ విషయాన్ని న్యాయనిపల్లి శాసనం తెలుపుతోంది. గణపతి గురువు విశ్వేశ్వర శంభు (శివదేవుడు) గోళకీమఠాలు ఏర్పాటు చేశాడు. రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. శిల్పి రామప్ప గణపతి దేవుడు అభయశాసనం, మోటుపల్లి శాసనాలు వేయించాడు. నాటి మోటుపల్లి పాలకుడు సిద్ధయ దేవుడు. గణపతి దేవుడు వరంగల్లులో స్వయంభూదేవాలయాన్ని నిర్మించాడు. మోటుపల్లి, అభయ శాసనాలు వేయించాడు. తిక్కన గణపతి దేవుడి సమకాలీనుడు.


 

రుద్రమదేవి (1262 - 1289):
         ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి మహిళ. శాసనాల్లో రుద్రదేవ మహారాజు, రాయగజకేసరి లాంటి బిరుదులతో ఈమెను ప్రస్తావించారు. కాయస్థ అంబదేవుని దుర్గి శాసనం రుద్రమను కఠోధృతి/ పట్లోధృతిగా వర్ణిస్తుంది. రుద్రమ సేనాని రేచర్ల ప్రసాదిత్యుడికి రాయపితామహాక, కాకతీయ రాజ్యస్థాపనాచార్య బిరుదులు ఉన్నాయి.

        ఓరుగల్లు కోట లోపల మెట్లు కట్టించింది. కులశేఖర పాండ్యుడిని ఓడించింది. కానీ, కాయస్థ అంబదేవుడు ఈమెను యుద్ధభూమిలోనే వధించినట్లు చందుపట్ల శాసనం (నల్గొండ జిల్లా) ద్వారా తెలుస్తోంది. త్రిపురాంతకం శాసనం కూడా అంబదేవుని విజయాలను వర్ణిస్తోంది. అంబదేవుడు కొప్పెరుంజింగని వధించి కాడవరాయి విధ్వంసక బిరుదు పొందాడు. యాదవరాజులపై రుద్రమ విజయాన్ని బీదర్ శాసనం తెలుపుతుంది. హేమాద్రి తన వ్రతఖండం గ్రంథంలో రుద్రమదేవిని ఆంధ్రమహారాణి అని పేర్కొన్నాడు. బీదర్‌కోట శిలాశాసనంలో రాయగజకేసరి బిరుదును ప్రస్తావించడమైంది. రుద్రమ మల్కాపురం శాసనం (నల్గొండ) ప్రసూతి వైద్యకేంద్రాల గురించి వివరిస్తుంది. విశ్వేశ్వర శివాచార్యులకు మందడం అనే గ్రామాన్ని దానం చేసింది.
 

రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289 - 1323):
         చివరి కాకతీయ రాజు. ఇతడు రుద్రమ కుమార్తె ముమ్మిడమ్మ కుమారుడు. రాజ్యాన్ని 77 నాయంకరాలుగా విభజించాడు. తురుష్కులు కాకతీయ రాజ్యంపై 8 సార్లు దండెత్తినట్లు విలస తామ్రశాసనం, కలువ చెరువు శాసనాలు పేర్కొంటున్నాయి. కానీ ముస్లిం రచనలు మాత్రం 5 దండయాత్రలనే తెలుపుతున్నాయి. 1303లో కాకతీయ, ఖిల్జీ సైన్యాలు కరీంనగర్‌లోని ఉప్పరపల్లి వద్ద తలపడ్డాయి. రేచర్ల వెన్నసేనాని, పోలుగంటి మల్లి మాలిక్ ఫక్రుద్దీన్ జునాను ఓడించారు. 1309లో మాలిక్ కపూర్ దండయాత్రను అమీర్ ఖుస్రూ పేర్కొన్నాడు. తర్వాత ముబారక్ ఖిల్జీ ఖుస్రూఖాన్‌ను పంపాడు. ఘియాసుద్దీన్ తుగ్లక్ ఉలూగ్/ జునాఖాన్/ మహ్మద్ బిన్ తుగ్లక్‌ను పంపాడు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం 'బొబ్బారెడ్డి' అనే సేనాని కాకతీయ సైన్యం నుంచి వైదొలగి ద్రోహం చేసినట్లు తెలుస్తోంది. 1323లో ప్రతాపరుద్రుడిని ఖాదర్‌ఖాన్ దిల్లీకి తీసుకుపోతుండగా నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

          ఆంధ్రనగరి లేదా ఓరుగల్లును సుల్తాన్‌పూర్‌గా పేరు మార్చారు. గంగాదేవి మధురా విజయం, ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం ప్రతాపరుద్రుడి ఆత్మహత్య గురించి పేర్కొన్నాయి. వరంగల్‌లో బుర్హనుద్దీన్‌ను పాలకుడిగా నియమించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గన్నమనాయుడు తుగ్లక్‌ల ఆస్థానంలో ఉప ప్రధాని (మాలిక్ మక్బూల్)గా పనిచేశాడు. ఇతడు తెలంగాణ బ్రాహ్మణుడు. అనితల్లి కలువచేరు శాసనం కూడా ముస్లిం దండయాత్రలను వివరిస్తోంది. ప్రతాపరుద్రుడి ప్రధాని ముప్పిడినాయకుడు.
 

కాకతీయుల పాలన:
         బద్దెన - నీతిశాస్త్ర ముక్తావళి, శివదేవయ్య - పురుషార్థసారం, మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారం, మడికిసింగన - సకలనీతి సమ్మతం లాంటి గ్రంథాలు కాకతీయుల పాలనా విశేషాలను వివరిస్తాయి. రాచరికం సప్తాంగ సమన్వితం. మహాప్రధాన, ప్రధాన, ప్రెగ్గడ, అమాత్య, మంత్రి అనే ఉద్యోగుల పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి. 18 మంది తీర్థుల గురించి సకలనీతి సమ్మతం పేర్కొంటోంది. రాజు - మంత్రులు, తీర్థులతో తరచూ సంప్రదిస్తూ ఉండాలని పురుషార్థసారం పేర్కొంది. రాజోద్యోగులను 72 నియోగాలుగా విభజించారు. బహత్తర నియోగాధిపతి 72 నియోగాలపై పర్యవేక్షకుడిగా ఉండేవాడు. కాకతీయులు మహామండలేశ్వర  బిరుదు ధరించారు.
           రాజ్యాన్ని నాడులు - స్థలాలు - గ్రామాలుగా విభజించారు. నాడులకు సీమ, పాడి, భూమి అనే పర్యాయ పదాలున్నాయి. గ్రామంలో 12 మంది ఆయగాండ్రు ఉండేవారు. కరణం, రెడ్డి (పెదకాపు), తలారి మాత్రమే ప్రభుత్వ ప్రతినిధులు. మిగిలిన 9 మంది తమ వృత్తుల ద్వారా విధులు నిర్వహించేవారు. న్యాయ విషయాల్లో ప్రాడ్వివాక్కులు రాజుకు సలహాలిచ్చేవారు.

          గ్రామాల్లో తగాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక ఉద్యోగులను నియమించేవారని దుగ్గిరాల శాసనం పేర్కొంది. సమయసభలు అనే న్యాయ సభలు ఉండేవి. ప్రత్యేక నేరాల విచారణకు నిపుణులతో ధర్మాసనాలు ఏర్పాటు చేసినట్లు క్రీడాభిరామం పేర్కొంది. ఆయగాండ్రు రైతుల నుంచి పంటలో కొంత భాగం 'మేర' వసూలు చేసేవారు. రాచపొలాన్ని కౌలు (కోరు)కు తీసుకున్న రైతులను అర్థశీరి అనేవారు. పెనుంబాకం మానదండం, కేసరిపాటిగడలు ఉపయోగించి పొలాన్ని సర్వే చేయించేవారు. రాచపొలం, నీరుపొలం, వెలిపొలం, తోటపొలం అని భూములను వర్గీకరించేవారు. సన్నిగండ్ల శాసనం కొలగాండ్రు, కరణాలను ప్రస్తావించింది. గొర్రెల మందలపై అడ్డవట్ల పన్ను విధించేవారు. కోటగణపాంబ వేయించిన మొగలుట్ల శాసనం వృత్తి పన్నుల గురించి వివరిస్తోంది. వడ్రంగులను తక్షక అనేవారు. రేవు పట్టణాలను కర పట్టణాలు అనేవారు. పన్నులు వసూలు చేసే స్థలాలను ఘట్టాలు అని పిలిచేవారు.
           సైనిక వ్యవస్థలో దుర్గాలకు అధిక ప్రాముఖ్యం ఉందని పురుషార్థసారం, నీతిసారం తెలుపుతున్నాయి. రథాలు వాడుకలో లేవు. చతురంగ బలాలన్నీ మహారాజ పట్టసాహిణి పర్యవేక్షణలో ఉండేవి. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యంలో వెలమల ప్రాబల్యం అధికంగా ఉండేది. రాజు అంగరక్షకదళం (వెంకి) గురించి సకలనీతి సమ్మతం తెలుపుతోంది. ప్రతాపరుద్రుడి కాలంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టారు. 75 మంది నాయంకరులు ఉన్నట్లు బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి తెలుపుతోంది. రాజుతోపాటు స్వచ్ఛందంగా మరణించే సైనిక బృందాలు లెంకలు.

 

ఆర్థిక పరిస్థితులు:
        వ్యవసాయం ప్రధాన వృత్తి. మొదటి ప్రోలరాజు కేసరి సరస్సును, రేచర్ల రుద్రుడు పాకాల చెరువును తవ్వించారు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండించేవారు. కందిపప్పు వాడకంలో లేదు. పాల్కురికి సోమనాథుడు 'పండితారాధ్య చరిత్ర'లో 20కి పైగా వస్త్ర రకాలను పేర్కొన్నాడు. మచిలీపట్నం వస్త్రాల గొప్పతనం గురించి మార్కోపోలో తెలియజేశాడు. ఓరుగల్లులో రత్నకంబళ్లు, మఖమల్ వస్త్రాలు నేసేవారు. నిర్మల్ కత్తులు డమాస్కస్‌కు ఎగుమతి అయ్యేవి. త్రిపురాంతకంలో పంచలోహ స్తంభాన్ని బ్రహ్మనాయుడు ఎత్తించినట్లు పల్నాటి వీరచరిత్ర పేర్కొంటోంది.
          ఆదిలాబాద్ జిల్లా కూనసముద్రం కత్తులకు ప్రసిద్ధి. మోటుపల్లి (ప్రకాశం), కృష్ణపట్నం (నెల్లూరు), హంసలదీవి (గుంటూరు), మైసోలియా లాంటి రేవు పట్టణాల ద్వారా విదేశీ వాణిజ్యం జరిగేది. విదేశీ వర్తకాన్ని ప్రోత్సహించాలని నీతిసారం గ్రంథం పేర్కొంది. గోల్కొండ ప్రాంత వజ్రపు గనుల గురించి మార్కోపోలో పేర్కొన్నాడు. వర్తకులు నకరం - స్వదేశీ - పరదేశీ - నానాదేశీ పెక్కుండ్రు అనే శ్రేణులుగా ఏర్పడేవారు. త్రిపురాంతకంలో అయ్యావళి అయినూరరు (500) అనే కన్నడదేశ వర్తక శ్రేణి ఉంది. యనమదల శాసనం వర్తక శ్రేణుల గురించి పేర్కొంది. నాటి నాణేలన్నింటిలో పెద్దది గద్యాణం. ఇది బంగారు నాణెం. దీన్ని నిష్క లేదా మాడ అని కూడా పిలిచేవారు. రూక అనేది వెండి నాణెం. ఒక మాడకు పది రూకలు అని బాపట్ల శాసనం పేర్కొంది. రూకలో విభాగాలైన అడ్డుగ, పాదిక, వీస, చిన్నం అనే నాణేలు ఉండేవి.

 

మత, సాంఘిక పరిస్థితులు:
       కాకతీయులు మొదట జైన మతాన్ని అనుసరించారు. హనుమకొండలో అనేకమంది జైనులు ఆశ్రయం పొందారు. ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ హనుమకొండపై జైనాలయ బసది (కడలాలయ బసది) నిర్మించింది. రెండో ప్రోలరాజు హనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో ప్రారంభమవుతుంది. కానీ రెండో బేతరాజు, దుర్గరాజులు రామేశ్వర పండితుడి (శ్రీశైల మఠాధిపతి)ని గురువుగా భావించారు. నాడు ఆలంపురం గొప్ప కాళాముఖ శైవ క్షేత్రం. పండితారాధ్యుడు పానగల్లురాజును శపించినట్లు తెలుస్తోంది. బ్రహ్మయ అనే శైవుడు గోవూరు(కోవూరు-నెల్లూరు)లోని జైనబసదులను నేలమట్టం చేశాడు. పొట్ల చెరువు, తిరువూరుల్లో బసదులను కూల్చి జైనులను హింసించారు. సిద్ధేశ్వర చరిత్ర ప్రకారం గణపతిదేవుడు హనుమకొండలోని జైనులను క్రూరంగా హింసించాడు. గణపతి గురువు విశ్వేశ్వరశివుడు 36 జైన గ్రామాలను నాశనం చేశాడు. దాహళ దేశంలో సద్భావశంభు గోళకీమఠాన్ని స్థాపించగా ఆంధ్రలో విశ్వేశ్వర శివదేవుడు ప్రధానాచార్యుడయ్యాడు. ఆంధ్రలోని ప్రసిద్ధ గోళకీ మఠ కేంద్రం మందడం. వైష్ణవం కూడా ఆదరణకు నోచుకుంది. శ్రీకూర్మం, శ్రీకాకుళం, తిరుపతి, మంగళగిరి, సింహాచలం నాటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు. రామానుజాచార్యులు శైవ క్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలుగా మార్చినట్లు శ్రీపతి భాష్యం తెలుపుతోంది. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు విష్ణు భక్తుడు. తిక్కన ప్రభావం వల్ల గణపతిదేవుడు వైదిక మతాభిమాని అయ్యాడు. విశ్వేశ్వర శివుడు మందడంలో వేద పాఠశాల నెలకొల్పాడు. ప్రతాపరుద్రుడి కాలానికి బ్రాహ్మణాధిక్యం పెరిగినట్లు పిడుపర్తి సోముడి బసవపురాణం తెలుపుతోంది. మైలారదేవుని ఆరాధనలో తలలు కత్తిరించుకునేవారు. ఆలయ ఉద్యోగ బృందంలో స్థానాపతులు ప్రధానాధికారులు. నాడు ఆలయ ఉద్యోగి బృంద పర్యవేక్షణకు బహత్తర నియోగాధిపతి ఉండేవాడు.

       నాటి కుల సంఘాలను సమయములు అనేవారు. బ్రాహ్మణ సమయానికి మహాజనులు అనీ, వైశ్య సంఘానికి నకరము అనే ప్రత్యేక పేర్లు ఉన్నాయి. సానుల వృత్తి సంఘాలను సానిమున్నూరు అనేవారు. రుద్రదేవుడి కాలం నుంచే కాకతీయులు వైదిక మతాభిమానులు అయ్యారు. వీరి కాలంలోనే వెలమ, రెడ్డి కులాల మధ్య అధికారం కోసం పోటీ ప్రారంభమైంది. సమయాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించినవారికి సమయ దండన విధించేవారు. బాపట్ల శాసనం సమయ సేనాపతి అనే ఉద్యోగిని పేర్కొంటోంది.
  అరిగాపులు అంటే పన్ను కట్టాల్సిన రైతులు. కొలగాండ్రు అంటే పన్ను వసూలు చేసేవారు. పట్టప హుండీ - ధన రూపంలో విధించే పన్ను, పట్టు కొలచు - ధాన్య రూపంలో విధించే పన్ను.

 

పన్నులు:
          దర్శనం - రాజు దర్శనం కోసం చెల్లించే పన్ను. అప్పణం - రాజు అకారణంగా వేసేది. ఉపకృతి - యువరాజు ఖర్చుల కోసం చెల్లించే పన్ను. అడ్డు సుంకం - యాదవ వర్గాలపై పన్ను. కాకతీయుల కాలంలో పన్ను 1/6 వ వంతు. రాజన్నశాలి అనేది ఒక వరి వంగడం. ఇటీవల తవ్వకాల్లో బయల్పడిన ద్రెక్మ నాణెం గ్రీకు నాణేలను పోలి ఉంది. కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్లే ముందు మొగిలిచర్లలో ఉన్న ఏకవీరాదేవిని ఆరాధించేవారు. ప్రధాన వినోదం తోలుబొమ్మలాట. మాడ అనే బంగారు నాణేన్ని కాకతీయులు ప్రవేశపెట్టారు.

 

భాష - సాహిత్యాలు:
        కాకతీయుల అధికార భాష సంస్కృతం. విద్యామంటపాలను ఏర్పాటు చేశారు. మందడం వేద పాఠశాలను విశ్వేశ్వర శివుడు నిర్మించాడు. పాకాల శాసన రచయిత కవి చక్రవర్తి గణపతిదేవుడి ఆస్థాన కవి. రుద్రదేవుడు నీతిసారంను రచించాడు. ప్రతాపరుద్రుడి ఆస్థానంలోని అగస్త్యుడు నలకీర్తి కౌముది, బాలభారత మహాకావ్యం, కృష్ణచరిత మొదలైన గ్రంథాలు రాశాడు. గంగాదేవి మధురా విజయంలో అగస్త్యుడిని తన గురువుగా కీర్తించింది. మరో కవి శాకల్య మల్లుభట్టు ఉత్తర రాఘవకావ్య, నిరోష్ట్య రామాయణం లాంటి కావ్యాలు రాశాడు. విద్దనాచార్యులు ప్రమేయచర్చామృతం గ్రంథాన్ని రాశాడు. గంగయభట్టు శ్రీహర్షుడి ఖండన ఖండ ఖాద్య గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు. ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాశాడు.
గమనిక: విద్యానాథుడు, అగస్త్యుడు ఒక్కరే అని కొందరి భావన. కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యాత అయిన మల్లినాథుడే విద్యానాథుడని కొందరి భావన.
         జైన కవి అధర్వణుడు విరాట పర్వతాన్ని అనువదించినట్లు తెలుస్తోంది. అప్పయార్యుడు జైనేంద్ర కళ్యాణాభ్యుదయం కావ్యాన్ని రాశాడు. మల్లికార్జున పండితుడు శివతత్వసారం రచించాడు. యధాహక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం రచించాడు. శివదేవయ్య శివదేవధీమణి మకుటంతో శతకాన్ని రచించాడు. పాల్కురికి సోమనాథుడు (పాలకుర్తి) పండితారాధ్య చరిత్ర, బసవపురాణం గ్రంథాలను రాశాడు. అనుభవసారం అనే పద్య కావ్యాన్ని, వృషాధిప శతకాన్ని కూడా రచించాడు. సంస్కృతంలో రుద్రభాష్యం రచించాడు. హుళక్కి భాస్కరుడు భాస్కర రామాయణం రచించాడు. తిక్కన శిష్యువైన మారన మార్కండేయ పురాణాన్ని తెనిగించి నాగయగన్న మంత్రికి అంకితం చేశాడు.

         మూలఘటిక కేతన దశకుమార చరిత్రను తెనిగించాడు. అభినవ దండిగా పేరొందిన కేతన రచనయే తెలుగులో మొదటి కథాకావ్యంగా ప్రసిద్ధి. మంచన కేయూర బాహుచరిత్రను రాసి గుండనమంత్రికి అంకితమిచ్చాడు. కాకతీయ యుగంలోనే శివకవులు శతక ప్రక్రియను ప్రారంభించారు. తిక్కన సోమయాజి కృష్ణ శతకాన్ని, బద్దెన నీతి శతకాన్ని (సుమతీ శతకం) రచించారు. యాజ్ఞవల్క్యుడి ధర్మశాస్త్రాన్ని కేతన విజ్ఞానేశ్వరీయం పేరుతో అనువదించాడు. ఆంధ్ర భాషా భూషణం గ్రంథం ద్వారా తెలుగు భాషా శాస్త్రానికి పునాదులు వేశాడు. తిక్కన కవి వాగ్బంధం అనే ఛంధో గ్రంథాన్ని రాశాడని ప్రతీతి. బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి ప్రముఖ రాజనీతి గ్రంథం. క్షేమేంద్రుడు ముద్రామాత్యం, శివదేవయ్య పురుషార్థసారం, ఆంధ్రభోజుడు (అప్పనమంత్రి) నీతి భూషణం గ్రంథాలను రచించారు. భోజకవి (భోజుడు) చారుచర్య అనే వైద్య గ్రంథాన్ని రచించాడు. కేతన కాదంబరి, రావిపాటి త్రిపురాంతకుడు మదన విజయం నాటి ప్రధాన శృంగార కావ్యాలు. త్రిపురాంతకుడు (తిప్పన్న) ప్రేమాభిరామం పేరుతో సంస్కృతంలో వీధి నాటకం రచించాడు.
          తిప్పన్న అంబికా శతకం కూడా రాశాడు. వినుకొండ వల్లభామాత్యుడి క్రీడాభిరామం ఓరుగల్లు మత, సాంఘిక జీవితాన్ని; ద్వారసముద్రంలోని నటుల గురించి వివరిస్తుంది. మల్కాపురం శాసనం మందడంలోని విశ్వేశ్వర దేవస్థానంలోని ఆటగత్తెలు (10), పాటగత్తెల (12) గురించి పేర్కొంటుంది. జాయపసేనాని నృత్యరత్నావళి చిందు, కోలాటం లాంటి అనేక జానపద నృత్యాలను పేర్కొంది. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రచించాడు.

 

వాస్తు నిర్మాణాలు:
దేశ రక్షణలో దుర్గాలకు ప్రాముఖ్యం ఉంది. మూడు రక్షణ శ్రేణులతో (పుట్టకోట, మట్టికోట, అగడ్త రాతికోట) ఓరుగల్లు దుర్గాన్ని నిర్మించారు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం రాతికోటలో 77 బురుజులు ఉండేవి. రుద్రమదేవి కాలంలో రాతికోట లోపలి భాగంలో మెట్లను నిర్మించారు. ప్రోలరాజు కాలంలో హనుమకొండలో సిద్ధేశ్వర, పద్మాక్షి ఆలయాలు; ఓరుగల్లులో స్వయంభూ, కేశవ ఆలయాలను నిర్మించారు. 1162లో కాకతి రుద్రుడు హనుమకొండలో వేయిస్తంభాల గుడి (త్రికూటాలయం)ని నిర్మించాడు. రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవులే త్రికూటాధిపతులు. గణపతి దేవుడి కాలంలో ఓరుగల్లు, పాలంపేట, పిల్లలమర్రి, కొండపర్తి, నాగులపాడు మొదలైన ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించారు. పాలంపేట రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం ఓరుగల్లులో 1500 మంది చిత్రకారుల గృహాలు ఉన్నాయి.  రెండో ప్రతాపరుద్రుడి ఆస్థాన నర్తకి మాచల్దేవి చిత్రశాలను నిర్మించినట్లు క్రీడాభిరామం గ్రంథం తెలుపుతోంది. మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు. స్వయంభూ దేవుడి విగ్రహం దిల్లీ మ్యూజియంలో ఉంది. హనుమకొండలో నంది విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఓరుగల్లు గురించి అమీర్ ఖుస్రూ తన రచనల్లో పేర్కొన్నాడు.

 

కాక‌తీయులు - సాంఘీక, ఆర్థిక, సామాజిక ప‌రిస్థితులు

* గ్రామానికో చెరువు
* మూడు శతాబ్దాల చరిత్ర
* వ్యవసాయానికి పెద్దపీట
* వాణిజ్యంలోనూ ప్రత్యేకత

కాకతీయులు తెలంగాణను దాదాపు 300 సంవత్సరాలకు పైగా పాలించారు. వీరి కాలంలో తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించింది. వీరు నిర్మించిన ఎన్నో చెరువులు, దేవాలయాలు నేటికీ తెలంగాణలో కాకతీయుల సుపరిపాలనకు సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి.
 

గ్రామ పరిపాలన
గ్రామ పరిపాలనను 'మహాజనులు' అనే సభ నిర్వహించేది. ఈ సభ నిర్ణయాలను అమలుపరచడానికి 12 మంది ఆయగార్లు ఉండేవారు. వీరిలో కరణం, రెడ్డి, తలారి అనేవారు ప్రభుత్వోద్యోగులు. కరణం భూమిశిస్తును నిర్ణయించేవాడు. రెడ్డి భూమిశిస్తును వసూలు చేసేవాడు. తలారి గ్రామ రక్షకభటుడు. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేవాడు. మిగిలిన 9 మంది వివిధ వృత్తులను చేసే గ్రామ సేవకులు. ఆయగార్లకు పన్నులు లేని భూములు ఇచ్చేవారు. కొన్నిసార్లు పంటలో కూడా భాగముండేది.

 

రాజ్య ఆదాయం: భూమిశిస్తు రాజ్యాదాయంలో ప్రధానమైంది. పండిన పంటలో 1/6వ వంతు భూమిశిస్తుగా వసూలు చేసేవారు. భూమిశిస్తును 'అరి' అనీ, చెల్లించే వారిని 'అరిగాపులు' అనీ వ్యవహరించేవారు.

 

సంప్రదాయ పన్నులు
రాజును దర్శించినప్పుడు ఇచ్చే కానుకలను 'దరిశనం' అని, రాజు లేదా ఇతర అధికారులు మేలు చేసినప్పుడు చెల్లించే కానుకను 'ఉపకృతి' అని అనేవారు.

ప్రతి పొలాన్ని గడ లేదా దండ లేదా కొలతో కొలిచేవారు. ఈ గడ 32 జానల పొడవుండేది. నీరు పొలంపై పన్నును 'కోరు' అనీ, వెలిపొలంపై పన్నును 'పుట్టిహండి' అనీ వ్యవహరించేవారు. 'కొలకాండ్రు' అనే అధికారులు పన్నులు వసూలు చేసేవారు. ప్రతి గ్రామంలో రాజు సొంత పొలానికి 'రాచదొడ్డి' అని పేరుండేది. ఈ భూమిని రైతులకు 'కోరు' లేదా అర్ధాదాయానికి కౌలుకు ఇచ్చేవారు. ఇలా తీసుకునే రైతులను 'అర్ధశిరీ' అనేవారు. సంత పట్టణాల వర్తక సామగ్రిపై విధించే సుంకానికి 'పెంట సుంకం' లేదా 'మగమ' అని పేరు. వేశ్యలపై విధించే పన్నును 'గుణాచార పన్ను' అనేవారు.
 

చెరువుల నిర్మాణం
కాకతీయులు వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. ఈ క్రమంలో చెరువుల నిర్మాణాన్ని ప్రోత్సహించారు. ఇందులో భాగంగానే కాకతీయుల కాలంలో తెలంగాణలోని అన్ని గ్రామాల్లో చెరువుల నిర్మాణం జరిగింది. చెరువును నిర్మించిన వ్యక్తికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందనే నమ్మకం ఉండేది. చెరువుల నిర్మాణాన్ని సప్త సంతానాల్లో ఒకటిగా భావించేవారు. సప్త సంతానాల గురించి గంగాధరుడి కరీంనగర్ శాసనం, గణపతిదేవుడి గణపేశ్వర శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు నిర్మించిన చెరువుల్లో కేసరి సముద్రం, రుద్ర సముద్రం, ఉదయచోడుని చెరువు, పాకాల చెరువు, రామప్ప చెరువు, లక్నవరం చెరువు, బయ్యారం చెరువు, కుంద సముద్రం ముఖ్యమైనవి. కాకతీయులు 'దశబంధ ఈనాం' అని ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. చెరువు కింద సాగయ్యే పంటలో పదో వంతు రాజుకు ధన లేదా ధాన్యరూపంలో చెల్లించే షరతుపై ఇచ్చిన ఈనాంనే దశబంధ ఈనాం అనేవారు.

మూసేటి కాల్వ, ఇమ్మడి కాల్వ, కృష్ణవేణి కాల్వ, అంతర్‌గంగ కాల్వలకు నదుల నుంచి నీరు సరఫరా అయ్యేది. ప్రతాపరుద్రుడి కాలంలో అడవులను నరికించి, కొత్త భూములను వ్యవసాయ యోగ్యంగా చేశారు. ఈ కాలంలో గోధుమలు, వరి, కొర్రలు, పెసలు, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు పంటలను పండించేవారు.
 

పరిశ్రమలు
ప్రాచీన కాలం నుంచీ కలంకారీ చీరలకు, సన్నని వస్త్రాలకు తెలంగాణ ప్రసిద్ధి చెందింది. కాకతీయుల కాలంలో 20కి మించిన వివిధ వస్త్రాలను పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు. ఓరుగల్లు రత్న కంబళ్లు, ముఖమల్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. గోల్కొండలో వజ్రాలు దొరికేవి.

 

వాణిజ్యం
వాణిజ్యాన్ని వైశ్యులు, బలిజశెట్టులు నిర్వహించేవారు. వర్తకులు 'శ్రేణి' వ్యవస్థ ద్వారా వ్యాపారం చేసేవారు. ఈ కాలంనాటి పెద్దశ్రేణి 'సర్వదేశీయ సహస్రతెలికి'. ఈ కాలంలో వడ్డీ వ్యాపారం ఉండేది. వడ్డీ 12 శాతం మించరాదని 'విజ్ఞానేశ్వరం' చెబుతుంది. దేశీయ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రధాన కేంద్రం. అక్కడ ప్రతివారం మడిసంత, మైలసంత జరిగేవి. 'గద్యాణం' అనే బంగారు నాణెం, 'రూక' అనే వెండి నాణెం అమల్లో ఉండేవి.

అలంపురం, పానగల్లు, మంథెన, తంగెడ, మాచర్ల, వెల్పూరు, త్రిపురాంతకం, నెల్లూరు దేశీయ వాణిజ్య కేంద్రాలు. వీటిని రేవు పట్టణాలైన మోటుపల్లి, మచిలీపట్టణాలతో కలుపుతూ రహదారులుండేవి. మోటుపల్లి నుంచి త్రిపురాంతకం మీదుగా బళ్లారి మార్గం ఉండేది. చైనా, సింహళం, పర్షియా, అరేబియా దేశాలతో విదేశీ వాణిజ్యం జరిగేది. మోటుపల్లి ప్రధాన ఓడరేవుగా ఉండేది. గణపతిదేవుడు ఇక్కడ విదేశీ వర్తకులకు అభయహస్తమిస్తూ మోటుపల్లి అభయశాసనాన్ని వేయించాడు. మోటుపల్లిని దేశీయకొండ పట్టణం అనేవారు.

 

సాంఘిక జీవనం
కాకతీయుల కాలంలో కులవ్యవస్థ బాగా ప్రబలి పోయింది. కాకతీయుల కులం గురించి స్పష్టత లేదు. కానీ శూద్రులనే భావన ఉంది. వర్ణాంతర వివాహాలు కేవలం ఉన్నత వర్గాల వారిలో ఉండేవి. వివిధ వర్ణాల మధ్య సామరస్యం ఉండి గ్రామీణ జీవితం ప్రశాంతంగా సాగింది. అయితే రెడ్డి, వెలమ కులాల మధ్య అధికార ప్రాబల్యం కోసం పోరాటాలు జరిగాయి. సమాజంలో బ్రాహ్మణులకు రాజకీయ ప్రాబల్యం తగ్గింది. అధికారం శూద్రుల హస్తగతం కావడంతో వారు రాజులయ్యారు. శూద్రులతో క్షత్రియులు సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను రక్షించడానికి పుళింద వర్గాన్ని బ్రహ్మ సృష్టించినట్లు కాకతీయ ప్రోలరాజు సేనాని మల్లెనాయకుడు 'మాటేడు శాసనం'లో పేర్కొన్నాడు. వైశ్యులు వర్తక వ్యాపారాలు చేసేవారు. మనువు తర్వాత మొదటిసారిగా స్త్రీకి ఆస్తిహక్కును గుర్తించింది ఈ కాలంలోనే. విజ్ఞానేశ్వరం స్త్రీధనాన్ని అయిదు రకాలుగా వర్ణిస్తుంది.

 

దురాచారాలు
కాకతీయుల కాలంనాటి సమాజంలో నిర్బంధ వైధవ్యం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం, సతీసహగమనం లాంటి దురాచారాలుండేవి. సామాన్య ప్రజల్లో మద్యపానం, జూదం, కోడిపందేలు, పొట్టేళ్ల పందేలు లాంటి వ్యసనాలుండేవి. దేవదాసీలకు, బసివిరాండ్రకు, వేశ్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. ప్రభువులు, ఉన్నతవర్గాల వారు దేవాలయాలకు దేవదాసీలను, నాట్యగత్తెలను బహూకరించేవారు.

క్రీ.శ.1182లో జరిగిన పల్నాటి యుద్ధం తర్వాత ఓరుగల్లులో కూడా పల్నాటి వీరులకు జాతర చేయడం ఆచారమైంది. పల్నాటి బ్రహ్మనాయుడు కులవ్యవస్థను ఖండించి సహపంక్తి భోజనాలను, చాపకూళ్లను ప్రోత్సహించాడు. అతడు వీరవైష్ణవాన్ని అనుసరించి.. అనేక మంది నిమ్న కులస్థులను అందులో చేర్చాడు. దళితులకు దేవాలయ ప్రవేశం చేయించాడు. శివుడి ఉగ్రరూపాలైన భైరవ, మైలారు దేవతలను పూజించినట్లు క్రీడాభిరామం తెలుపుతోంది. మైలారు దేవుడిని యుద్ధదేవుడిగా వీరులు ఆరాధించేవారు.
 

మత జీవనం
నాటి సమాజంలో వీరశైవ, వీరవైష్ణవ శాఖల మధ్య తరచుగా ఘర్షణ జరిగేది. హరిహరులు (శివుడు, విష్ణువు) ఇద్దరూ ఒకటేనని మహాకవి తిక్కన ప్రచారం చేసి ప్రజల్లో సఖ్యత కల్పించాడు. ఏకవీర, రేణుక, భైరవుడు, చాముండేశ్వరి, వీరభద్రుడు, కుమారస్వామి, మైలారుదేవుడు, ముద్దరాలు ముసానమ్మ లాంటి దేవతలను పూజించేవారు.

 

జైనమతం
తొలి కాకతీయులు దిగంబర జైనమతాన్ని అనుసరించారు. వేంగి రాజ్యంలో హింసకు గురైన జైనులు హనుమకొండకు వలస వచ్చినట్లు ఓరుగల్లు కైఫీయత్తు (గ్రామ చరిత్ర) వివరిస్తుంది. క్రీ.శ.800 నాటికే హనుమకొండ ప్రముఖ జైనకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. రాజరాజ నరేంద్రుడు అనే వేంగి చాళుక్యరాజు హింసించగా వృషభనాథుడనే జైనాచార్యుడు హనుమకొండకు వచ్చినట్లుగా ఓరుగల్లు కైఫీయత్తు ద్వారా తెలుస్తోంది. హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం జైన దేవాలయంగా ఉండేది. హనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో మొదలవుతుంది. ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ హనుమకొండలో కడలాలయ జైనబసదిని నిర్మించింది. తర్వాతి కాలంలో జైనులను శైవులు హింసించినట్లు, వారి దేవాలయాలను నేలమట్టం చేసినట్లు పండితారాధ్యం తెలుపుతోంది. హనుమకొండలోని జైన మతస్థులను గణపతి దేవుడు తన గురువైన విశ్వేశ్వర శివుడి ప్రోత్సాహంతో హింసించినట్లుగా సిద్ధేశ్వర చరిత్ర ద్వారా తెలుస్తోంది. విశ్వేశ్వర శివుడు 36 జైన గ్రామాలను నాశనం చేశాడు. అయినప్పటికీ జైనమతం పూర్తిగా పతనం కాలేదు. బోధన్, పొట్లచెరువు (పటాన్ చెరువు), వేములవాడ, కొల్లిపాక (కొలనుపాక), హనుమకొండ ప్రముఖ జైన కేంద్రాలుగా ఉండేవి.

 

శైవం
కాకతీయుల కాలంలో శైవం విశేష ఆదరణ పొందింది. ఈ కాలంలో కాలాముఖ శైవం ఎక్కువగా జనాదరణ పొందింది. గణపతిదేవుడి కాలం నుంచి గోళకీ మఠం ఆదరణ పొందింది. గోళకీ మఠ ప్రధానాచార్యుడైన విశ్వేశ్వర శంభు గణపతిదేవుడి శివదీక్షా గురువు. క్రీ.శ.1261లో విశ్వేశ్వర శంభునికి రుద్రమదేవి మందారం (మందడం) గ్రామాన్ని కృష్ణలంకతో కలిపి దానం చేసినట్లు మలకపురం శాసనం తెలుపుతోంది. ఈ గ్రామానికి ఆయన విశ్వేశ్వర గోళకీ లేదా విశ్వనాధ గోళగిరి అనే కొత్తపేరు పెట్టాడు. మందడంలో వేద పాఠశాలను, సత్రాన్ని, శుద్ధ శైవమఠాన్ని విశ్వేశ్వర శంభు ఏర్పాటు చేశాడు. విశ్వేశ్వర శివుడు ఏలేశ్వరంలో షోడశ ఆవర కాలమఠాన్ని ఏర్పాటు చేశాడు. శివుడి అవతారాలైన 28 మంది యోగాచార్యుల గురించి శివపురాణం, కూర్మపురాణం తెలుపుతున్నాయి. మందడం, ద్రాక్షారామం, పుష్పగిరి, శ్రీశైలం, త్రిపురాంతకం తదితర ప్రాంతాల్లో గోళకీ మఠ శాఖలు ఏర్పడ్డాయి. శైవుల్లో ఎక్కువగా మూఢాచారాలుండేవి. జంతుబలులు, ఆత్మబలిదానాలు ఎక్కువగా ఉండేవి. భక్తులు వీరావేశంతో గండకత్తెరతో తలలు కత్తిరించుకునేవారు. దేవాలయాల్లో ఉత్సవాలు జరిగే సమయంలో జాతరలు నిర్వహించేవారు. గ్రామదేవతలను పూజించేవారు. గణపతిదేవుడు, రుద్రమదేవి కాలంలో పాశుపత, శివశాసన, కాపాలిక, కాలానన, యామిళ తదితర శైవ శాఖలున్నట్లు త్రిపురాంతకం, మల్కాపురం శాసనాల ద్వారా తెలుస్తోంది. అలంపురం గొప్ప కాలాముఖ క్షేత్రంగా ఉండేది.

 

వైష్ణవం
కాకతీయుల కాలంలో వైష్ణవం కూడా గొప్ప ఆదరణ పొందింది. కాకతీయుల రాజలాంఛనం 'వరాహం'. రుద్రమదేవి కాలం నుంచి వైష్ణవం విశేషంగా వ్యాప్తి చెందింది. కాకతీయల సామంతులు వైష్ణవాన్ని ఆదరించారు. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని, నగునూరులో వైష్ణవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు, గణపతిదేవుడు చాతుర్వర్ణ సముద్ధరణ బిరుదు ధరించారు. ఈ కాలంలో దక్షిణాదేశం నుంచి రామానుజ వైష్ణవం తెలంగాణలోకి ప్రవేశించి వ్యాపించింది. నందలూరు, తిరుపతి, మంగళగిరి, మాచర్ల, సింహాచలం, శ్రీకూర్మం, నెల్లూరు, బాపట్ల, శ్రీకాకుళం తదితర ప్రాంతాలు వైష్ణవ కేంద్రాలుగా ఉండేవి. ప్రతాపరుద్రుడు కీ.శ.1321లో చెన్నకేశవస్వామికి కొన్నిదానాలు చేసినట్లు కొలనపల్లి శాసనం తెలుపుతోంది.

 

విద్యా విధానం
కాకతీయుల కాలం నాటి రాజభాష సంస్కృతం. అప్పట్లో విద్యా మండపాలు ఉండేవి. ఇవి ముఖ్య దేవాలయాలకు అనుబంధంగా ఉండి సాహిత్య గోష్ఠులకు, మత చర్చలకు కేంద్రంగా పనిచేసేవి. మందడం, పుష్పగిరి తదితర ప్రాంతాల్లో విద్యా మండపాలతో పాటు వేదపాఠశాలలు కూడా ఉండేవి. ఈ విద్యాకేంద్రాల్లో గణితం, జ్యోతిషం, ఆయుర్వేద విద్యలను నేర్పేవారు. క్రీ.శ.1261 నాటి మల్కాపురం శాసనం నాటి విద్యామండపాల స్థితిగతులను తెలుపుతోంది.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కుతుబ్‌షాహీలు (1512 - 1687)

      కుతుబ్‌షాహీలు 'ఆంధ్ర సుల్తానులు'గా పేరుపొందారు. ఆంధ్ర దేశాన్ని సుమారు 175 సంవత్సరాలు పాలించారు. పర్షియన్ రాజభాషగా ఉండేది. సుల్తాన్ కులీకుతుబ్‌షా గోల్కొండ రాజధానిగా 1512లో కుతుబ్‌షాహీ వంశపాలన ప్రారంభించాడు.  1687లో ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని మొగలు సామ్రాజ్యంలో విలీనం చేశాడు. 

 

సుల్తాన్ కులీ (1512 - 43):
      సుల్తాన్ కులీ 'కారాకునీల్' తెగకు చెందినవాడు. బహమనీ రాజ్యంలోని మూడో మహమూద్ వద్ద ఆస్థాన ఉద్యోగిగా పనిచేశాడు. ఖవాస్‌ఖాన్, కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదులు పొందాడు. గోల్కొండ జాగీర్దారుగా నియమితుడయ్యాడు. చాళుక్య యుగంలో గోల్కొండను 'మంగళవరం' అని పిలిచేవారు. బీజాపూర్, బీదర్, ఒరిస్సా పాలకులను ఓడించి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కోవిల్‌కొండ, మెదక్, బెజవాడ, ఏలూరు, కొండవీడు, బెల్లంకొండ లాంటి అనేక ప్రాంతాలను ఆక్రమించాడు. గజపతుల సామంతుడు చితాబ్‌ఖాన్‌ను ఓడించాడు. ఆరవీటి రామరాయలు కొంతకాలం ఇతడి వద్ద పనిచేశాడు. కులీని 'బడేమాలిక్' అని ప్రజలు పిలిచేవారు. 1543లో ఇతడి కుమారుడు జంషీద్ కులీని వధించి రాజ్యాన్ని ఆక్రమించాడు. శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. హందం వంశస్థుడు.

 

జంషీద్ (1543 - 1550):    
కులీ ఇతడిని దేవరకొండలో రాజప్రతినిధిగా నియమించాడు. మీర్ మహ్మద్ హందనీ ద్వారా తండ్రిని చంపించాడు. చిన్న నేరాలకు సైతం క్రూర శిక్షలు విధించేవాడని 'పెరిస్టా' తన రచనల్లో తెలిపాడు. జంషీద్ సేనాని జగదేవరావు. సోదరుడు ఇబ్రహీం కుతుబ్‌షా బీదర్ పారిపోయి మాలిక్ బరీద్ సాయంతో జంషీద్‌పై తిరుగుబాటు చేశాడు. జంషీద్ క్యాన్సర్ (రాజ క్షయ వ్యాధి)తో మరణించాడు. కవిగా, ఆసుకవితా పండితుడిగా పేరొందాడు.

 

ఇబ్రహీం కులీ కుతుబ్‌షా (మల్కిభరాముడు) (1550 - 1580): 
      జంషీద్ మరణానంతరం రాణి బిల్‌కీస్ జమాన్ తన కుమారుడు సుభాన్ కులీని పాలకుడిని చేసింది. ఇబ్రహీం అతడిని జయించి సుల్తాన్ అయ్యాడు. రామరాయల సాయంతో రాజయ్యాడు. గూఢచారి దళాన్ని (ఖాసాఖైల్) ఏర్పాటు చేశాడు. న్యాయశాఖను పునర్ వ్యవస్థీకరించాడు. తళ్లికోట యుద్ధంలో (1565) ముఖ్యపాత్ర పోషించాడు. అనేక మంది తెలుగు కవులను పోషించి 'మల్కిభరాముడు' అనే బిరుదు పొందాడు. పొన్నగంటి తెలగనార్యుడు, కందుకూరి రుద్రకవులను పోషించాడు. అద్దంకి గంగాధర కవి ఆ కాలం నాటివాడే. హుస్సేన్‌సాగర్, మూసీనదిపై వంతెన; పూల్‌బాగ్, ఇబ్రహీంపట్నం చెరువు, ఇబ్రహీం ఉద్యానవనాలు, గోల్కొండ కోట ప్రాకారాలను నిర్మించాడు. హిందూ వనిత భగీరథిని వివాహం చేసుకుని గోల్కొండకు 'భగీరథీ' నగరం అని పేరుపెట్టాడు. ఇతడి సేనాని మురహరిరావు 'అహోబిలం' దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. 'లంగరులు' అనే భిక్షా గృహాలను నిర్మించాడు.

* అహ్మద్‌నగర్ సుల్తాన్ మొదటి హుస్సేన్ నిజాంషా కుమార్తెను వివాహం చేసుకున్నాడు.
* విజయనగర రాజ్యంలో తలదాచుకున్నాడు.
* గోల్కొండ రాజ్యం రెండో ఈజిప్ట్‌గా పేరొందింది.
* జగదేకరావు (గోల్కొండ)కు రామరాయలు ఆశ్రయం కల్పించడంతో తళ్లికోట యుద్దం జరిగింది.
* వరంగల్లు శాశ్వతంగా గోల్కొండ రాజ్యంలో విలీనం.
* గోల్కొండ దుర్గ ప్రాకారం తిరిగి నిర్మించాడు.
* దక్కనీ ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేశాడు.
* సుగ్రీవ విజయం - తెలుగులో తొలి యక్షగానం, యయాతి చరిత్ర - తొలి అచ్చతెలుగు కావ్యం ఇతడి కాలంలోనివే.
* ''పెట్టెడు బంగారంతో వృద్దురాలైన గోల్కొండ నుంచి బెంగాల్, బీజపూర్‌లకు నిర్భయంగా వెళ్లగలిగేది" - పెరిస్టా.


మహ్మద్ కులీ కుతుబ్‌షా (1580 - 1612):
      ఇతడి కాలాన్ని గోల్కొండ చరిత్రలో 'స్వర్ణయుగం'గా పిలుస్తారు. తెలుగులో కవిత్వం చెప్పిన తొలి ముస్లిం సుల్తాన్ ఇతడే. కులియాత్ - కులి పేరుతో ఉర్దూ భాషలో కవితలు రాశాడు. 'భాగ్యమతి' పేరిట మూసీనది ఒడ్డున భాగ్య నగరాన్ని నిర్మించాడు. తన కుమారుడు హైదర్ పేరుతో 1591లో 'హైదరాబాద్‌'ను నిర్మించాడు. దీని ముఖ్య రూపశిల్పి 'మీర్‌మునీమ్'. ప్లేగు నిర్మూలనకు గుర్తుగా 1591లో 'చార్మినార్' నిర్మాణాన్ని ప్రారంభించాడు.

    జామా మసీదు (ఫలక్‌నుమా ప్యాలస్), దారుల్ పిఫా (ప్రజా వైద్యశాల), దాఢ్ మహల్ (న్యాయస్థానం) నిర్మించాడు. 1611లో ఆంగ్లేయులకు మచిలీపట్నం వద్ద వర్తక కేంద్ర స్థాపనకు అనుమతి ఇచ్చాడు. అక్బర్ ఇతడి ఆస్థానానికి 'మసూద్‌బేగ్‌'ను రాయబారిగా పంపాడు. ట్రావెర్నియర్ (యాత్రికుడు), థేవ్‌నాట్ (వ్యాపారి) అనే ఫ్రెంచి వ్యక్తులు ఇతడి రాజ్యాన్ని సందర్శించారు. 'వైజయంతీ విలాసం' గ్రంథ రచయిత సారంగు తమ్మయ్య ఇతడి ఆస్థానంలోనివాడే. వజీ మహ్మద్ అనే ఉర్దూ కవిని పోషించాడు.
 

సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా (1612 - 1626): 
      మహ్మద్ కులీకుతుబ్‌షాకి కుమారులు లేనందున తన అల్లుడు మహ్మద్ కుతుబ్‌షాను వారసుడిగా ప్రకటించాడు. మొగలు సేనాని మహబత్‌ఖాన్ చేతిలో ఓటమి చెందాడు. హైదరాబాద్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాడు. ఖైరతాబాద్ మసీదును, మక్కా మసీదును నిర్మించాడు. 'భారతదేశ ప్రసిద్ధ నిర్మాణాల్లో మక్కా మసీదు ఒకటి' అని ట్రావెర్నియర్ (నగల వ్యాపారి) పేర్కొన్నాడు. ఇతడి కాలంలో మీర్ మహ్మద్ ముమీన్ తూనికలు, కొలతలపై 'రిసాల మిక్థరీయ' గ్రంథాన్ని, హకీం తకయుద్దీన్ వైద్యశాస్త్రంపై 'మిజానుత్ తబాయీ కుతుబ్‌షాహీ' గ్రంథాన్ని రచించారు. 'తారిక్ ఇ మహ్మద్ కుతుబ్‌షా' అనే చారిత్రక గ్రంథాన్ని కూడా ఇతడి కాలంలోనే రచించారు. 1614లో పారశీక రాయబారి 'మీర్ జయనూర్ అబిదీన్' హైదరాబాద్ సందర్శించాడు.

 

అబ్దుల్లా కుతుబ్‌షా (1626 - 1672): 
      ఇతడు సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా కుమారుడు. ఇతడి తల్లి హయత్ బక్షీ బేగం. ఈ కాలంలో గోల్కొండ రాజ్య క్షీణదశ ప్రారంభమైంది. షాజహాన్‌తో సంధి చేసుకున్నాడు. తర్వాత 1655లో ఔరంగజేబు దాడి చేసి గోల్కొండను దోచుకున్నాడు. 1636లో మొగలు రాయబారి అబ్దుల్ లతీఫ్‌తో సంధి చేసుకున్నాడు. శుక్రవారం ప్రార్థనలో పారశీక చక్రవర్తి పేరు బదులు మొగలు చక్రవర్తి పేరు నమోదు చేయడానికి అంగీకరించాడు. 'అబ్దుల్లా కుతుబ్‌షా మీర్‌జుమ్లా'గా పనిచేసిన 'మహ్మద్ సయ్యద్', ఔరంగజేబుతో రహస్య సంధి చేసుకుని మోసం చేశాడు. 1634లో ఆంగ్లేయులకు బంగారు ఫర్మానా జారీ చేశాడు. నెక్నంఖాన్‌ను కర్ణాటక రాష్ట్ర పాలకుడిగా నియమించాడు. అబ్దుల్లా కాలం ఉర్దూ భాషకు స్వర్ణయుగంగా పేరొందింది. క్షేత్రయ్య ఇతడి స్థానాన్ని సందర్శించాడు. గోల్కొండ వజ్రం ఇతడి కాలంలోనే దొరికింది. మహ్మద్ సయీద్ అనే అధికారిదాన్ని షాజహాన్‌కు సమర్పించాడు.

 

అబుల్ హసన్ తానీషా (1672 - 1687): 
      అబ్దుల్లా అల్లుడు భోగ విలాస పురుషుడు. అందుకే ఇతడిని 'తానీషా'గా పిలిచేవారు. 'తానీషా' అంటే 'బాలయోగి' అనే అర్థంలో గురువు షారజు కట్టాల్ ఆయనకు బిరుదు ఇచ్చినట్లు పేర్కొంటారు. సయ్యద్ ముజఫర్ స్థానంలో మాదన్నను మీర్‌జుమ్లాగా నియమించుకున్నాడు. 1674లో సూర్యప్రకాశరావు బిరుదుతో మాదన్నను నియమించాడు. అక్కన్న సర్వసైన్యాధ్యక్షుడు (సర్ లష్కర్)గా నియమితులయ్యారు. మాదన్న మేనల్లుడు పొదిలి లింగన్న కర్ణాటక పాలకుడిగా, కంచర్ల గోపన్న భద్రాచలం తరఫ్‌దార్‌గా నియమితులయ్యారు. మరో సోదరుడు వెంకన్న రస్తుంరావు బిరుదుతో సైనికోద్యోగిగా నియమితుడయ్యాడు.

      మాదన్న ప్రోత్సాహంతో 1676లో శివాజీ గోల్కొండను సందర్శించి తానీషాతో సంధి చేసుకున్నాడు. మొగల్ రాకుమారుడు మౌజం (షా ఆలం) చేతిలో ఓడి తానీషా సంధి చేసుకున్నాడు. 1686 మార్చి 24న అక్కన్న, మాదన్న హత్యకు గురయ్యారు (షేక్ మిన్హజ్ కుట్ర). 1687లో ఔరంగజేబు స్వయంగా గోల్కొండపై దాడిచేసి 'అబ్దుల్లా ఫాణి' అనే సేనానికి లంచమిచ్చి కోట తలుపులు తెరిపించాడు. అబ్దుల్ రజాక్, లారీ వంటి సేనానులు కోట రక్షణకు పోరాడినా ఫలితం లేకపోయింది. తానీషాను గ్వాలియర్ (దౌలతాబాద్)కు బందీగా పంపించారు. 1687 అక్టోబరులో గోల్కొండ మొగలుల వశమైంది.
 

పాలనా విధానం
బహమనీ పాలనా విధానాలను అనుసరించారు. సుల్తాన్ అత్యున్నత అధికారి. 'మజ్లిస్ దివాన్‌దరి' అనే మంత్రి పరిషత్తు పాలనలో సహాయపడేది. వారిలో పీష్వా (ప్రధాని) ముఖ్యమైనవాడు. ప్రధానినే దివాన్ అనేవారు. ఆర్థికశాఖ మంత్రిని మీర్‌జుమ్లా అనీ, సైనికశాఖ మంత్రిని ఐనుల్‌ముల్క్ అనీ, గణాంక అధ్యక్షుడిని ముజుందర్ అనీ, రక్షణ అధికారిని కొత్వాల్ అని పిలిచేవారు. పీష్వా కింద దబీర్ అనే ఇద్దరు కార్యదర్శులు ఉండేవారు. రక్షకభట శాఖ సమర్థవంతంగా పనిచేసేదని ట్రావెర్నియర్ రాశాడు. మహ్మద్ కులీ 'దాఢ్ మహల్' అబ్దుల్లా కుతుబ్‌షా' 'అమన్ మహల్' అనే న్యాయస్థానాలను నిర్మించారు. మీర్జా ఇబ్రహీం జుబేరి 'బసాటిన్ సలాతిన్' గ్రంథంలో న్యాయనిర్వహణ ఆదర్శప్రాయంగా ఉండేదని రాశాడు. రాజ్యాన్ని 6 రాష్ట్రాలు లేదా తరఫ్‌లుగా విభజించారు. రాష్ట్ర అధిపతి తరఫ్‌దార్. ఇతడికి దివాన్, ఖాజీ, పండిట్ సహాయపడేవారు. సర్కారుకు అధిపతి 'ఫౌజ్‌దార్'. అబుల్‌హసన్ కాలంలో 37 సర్కారులు 517 పరగణాలు ఉండేవి. ఫర్మానాల అమలు బాధ్యతను ఖలీల్ అనే ఉద్యోగి చూసేవాడు. రేవు పట్టణాల్లో హవర్‌దార్, షా బందర్ అనే ఉద్యోగులు ఉండేవారు.

      వేలం పద్ధతి ద్వారా శిస్తు వసూలు అధికారం పొందిన వారిని 'ముస్తజీర్లు' అనేవారు. కుతుబ్‌షాహీలకు అయిదు లక్షల సైన్యం ఉన్నట్లు థేవ్‌నట్ పేర్కొన్నాడు. అంగరక్షక దళాన్ని 'ఖానాఖైల్' అనేవారు. అశ్వికదళం 'నర్‌ఖైల్'. వీరు ఎర్రప్యాంట్లు, నల్ల తలపాగాలు ధరించేవారు. దళాధిపతులను 'నాయక్' అనేవారు. అబుల్‌హసన్ తానీషా కాలం నాటి సైనిక శక్తి గురించి 'తారీఖీ జప్రా (గిరిధర్‌లాల్)' అనే గ్రంథం తెలుపుతోంది.
 

ఆర్థిక పరిస్థితులు
      వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెందాయి. ప్రభుత్వ ఆదాయం 5 కోట్ల హొన్నులనీ, అందులో 19 లక్షల నికరాదాయం ఖజానాలో చేరేదని మెధోల్డ్ రాశాడు. వజ్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, దారు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. కోహినూర్ వజ్రం కొల్లూరు (గుంటూరు) గనుల్లో దొరికింది. ఈ గనిలో 30 వేల మంది పనిచేస్తున్నట్లు మెధోల్డ్ పేర్కొన్నాడు. నిర్మల్, ఇందూర్, ఇందల్‌వాయ్ ఆయుధ పరిశ్రమకు కేంద్రాలు. కొండపల్లి, నర్సాపురం, దారు పరిశ్రమకు కేంద్రాలు. మచిలీపట్నంలో కలంకారీ, తెరచాప గుడ్డ ఎగుమతులు జరిగేవి. ఎగుమతి, దిగుమతుల సుంకం 3 1/2 శాతం ఉండేది. కానీ పులికాట్ రేవులో 2% మాత్రమే ఉండేది. ప్రధాన బంగారు నాణెం హొన్ను (ప్రగోడా). హొన్నులో 16వ వంతు ఫణం. ఫణంలో 32వ వంతు తార్. తార్‌కు రెండు కాసులు. రూపాయి (వెండి) విలువ పన్నులో నాలుగో వంతు.

 

సాంఘిక, మత పరిస్థితులు
      సుల్తానులు షియాలైనప్పటికీ మత సామరస్యాన్ని పాటించారు. వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ సుస్థిరతను కోల్పోయింది. పరదా పద్ధతి, వేశ్యా వృత్తి, మూఢనమ్మకాలు లాంటి దురాచారాలు ఉండేవి. అనేక కులాలున్నట్లు 'హంసవింశతి' గ్రంథం తెలుపుతోంది. హైదరాబాద్ నగరంలో 2 వేలమంది వేశ్యలున్నట్లు ట్రావెర్నియర్ పేర్కొన్నాడు. సతీసహగమన ఆచారం ఉన్నట్లు రాశాడు. నౌరోజ్, వసంతోత్సవాలు, హోలీ, దీపావళి లాంటి పండగల్లో పాల్గొనేవారు. పరమత సహనం పాటించేవారు. మసీదులు నిర్మించడమే కాకుండా హిందూ దేవాలయాలకు, బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇచ్చి ఆదరించారు. తానీషా భద్రాచలం రామాలయానికి భద్రాచలం, శంకరగిరి, పాల్వంచ గ్రామాలను; మల్లేశ్వరస్వామి ఆలయానికి భోగాపురం, చెరుకూరు, వీరన్న పట్టణాలను దానం చేశాడు. మహ్మద్ కులీకుతుబ్ షా ఉద్యోగి అయిన లాల్‌ఖాన్ ఉప్పునూతల గ్రామాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. చిష్టీ శాఖకు చెందిన గురువులు దక్షిణ భారతదేశంలో అనేక మఠాలు స్థాపించారు. షేక్ ఫక్రుద్దీన్ పెనుగొండలో ఒక కంఖాను స్థాపించాడు. బహమనీ కాలంనాటి సూఫీ యోగుల్లో బందెనవాబ్ గెసూధరాజ్ చాలా గొప్పవాడు. సూఫీ గురువులు మత సామరస్యానికి కృషిచేశారు.

 

సాహిత్యం, లలిత కళా వికాసం (సంస్కృతి)
      భాషా సాహిత్యాలను, లలితకళలను బాగా అభివృద్ధి చేశారు. పారశీకం అధికార భాష. సైనిక శిబిర భాషగా ఉర్దూ అభివృద్ధి చెందింది. తెలుగు భాషకు కూడా సముచిత స్థానం ఇచ్చారు. ఖుర్వా అనే పారశీక కవి తన గ్రంథం 'తారిఖ్ ఎల్చి నిజాంషా'ను ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమిచ్చాడు. ఆలీవుర్సీ ఉర్దూ భాషలో 'నసబ్‌నామా కుతుబ్‌షాహీ' గ్రంథాన్ని రచించాడు. మీర్జా మహ్మద్ అమీన్ 'లైలా మజ్ను' గ్రంథాన్ని రచించాడు.

సుల్తాన్ కులీ గజల్ రచనలో సిద్ధహస్తుడు. ఉర్దూ భాషకు కులీ ఛాసర్ లాంటివాడని షేర్వాణీ పండితుడు పేర్కొన్నాడు. అబ్దుల్లా కుతుబ్‌షా పీష్వా అయిన మహ్మద్ ఇబన్ ఖాటూన్ 'ఖుర్వాన్ భాటూన్' అనే పారశీక నిఘంటువును రూపొందించాడు. 'సైపుల్‌ముల్క్ నాబదియుల్ జమాల్' గ్రంథాన్ని రచించిన గవాసీని అబ్దుల్లా కుతుబ్‌షా ఆదరించాడు. 'తూత్‌నామాను' పర్షియన్ భాషలోకి అనువదించాడు. అబ్దుల్లా కూడా స్వయంగా ఉర్దూ భాషలో ద్విపదలు రచించాడు. తానీషా ఆస్థానంలో ఉన్న అలీచిన్ తైపూర్ 'హదైఖుల్ సలాతిన్' గ్రంథాన్ని రచించాడు. మాలిక్ మహ్మద్ జయసి గ్రంథం 'పద్మావత్‌'ని గులాం అలీ ఉర్దూ భాషలోకి అనువదించాడు.
      తెలుగులో శంకర కవి 'హరిశ్చంద్రోపాఖ్యానం' రచించి కోర్కాలను జాగీర్దార్ ఈడూరు ఎల్లయ్యకు అంకితమిచ్చాడు. అద్దంకి గంగాధరుడు 'తపతీ సంవరణోపాఖ్యానం' గ్రంథాన్ని మల్కిభరాముడికి అంకితమిచ్చాడు. కందుకూరి రుద్రకవికి ఇబ్రహీం చింతలపాలెం అగ్రహారాన్ని ఇచ్చాడు (నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం - కందుకూరి). పొన్నగంటి తెలగనార్యుడు తన 'యయాతి చరిత్ర'ను అమీన్‌ఖాన్ (పటాన్ చెరువు పాలకుడు)కు అంకితం ఇచ్చాడు. అమీన్‌ఖాన్ భార్య బడే బీబీ దయాగుణంలో గొప్ప స్త్రీ. మహ్మద్ కులీ ఆస్థాన విద్వాంసుడు గణేష పండితుడు. మహ్మద్ కులీ ఆస్థానంలో ఉన్న సారంగు తమ్మయ్య 'వైజయంతీ విలాసం' గ్రంథాన్ని రచించాడు. బిక్కనవోలు సంస్థానంలో తెలుగు భాషను బాగా ఆదరించారు. షట్చక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తం, పద్మపురాణం లాంటి గ్రంథాలను మల్లారెడ్డి రచించారు. అబ్దుల్లా ఆస్థానాన్ని సందర్శించిన క్షేత్రయ్య 'మువ్వగోపాల' పదాలను రచించాడు. క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. తానీషా కాలంలో జటప్రోలు, గద్వాల సంస్థానాలు తెలుగు భాషాభివృద్ధికి కృషిచేశాయి. కంచర్ల గోపన్న (భక్త రామదాసు) దాశరథి శతకాన్ని రచించాడు. వేమన ఈ కాలానికి చెందినవాడే. క్షేత్రయ్యలో పచ్చి శృంగారం, రామదాసులో భక్తి పారవశ్యం, వేమనలో నీతిబోధనకు, సంఘ సంస్కార ప్రభోధానికి సాధనాలయ్యాయి. ఆటవెలది వృత్తంలో వేమన పద్యాలను రచించాడు. వేమన పద్యాల్లో కబీర్, నానక్‌ల భోదనల ఛాయలు కనిపిస్తాయి. వేదాలు వేశ్యలు లాంటివని, ఎంగిలి విద్యలని వేమన పేర్కొన్నాడు.

      కుతుబ్‌షాహీల నిర్మాణాల్లో పారశీక, పఠాన్, హిందూ సంప్రదాయాల మేళవింపు కనిపిస్తుంది. గుమ్మటాలు, కమానులు, మీనార్లు లాంటి విదేశీ లక్షణాలతోపాటు పక్షి, పుష్పలతాది అలంకారాలు లాంటి భారతీయ లక్షణాలను తమ నిర్మాణాల్లో పొందుపరిచారు. సుల్తాన్ కులీ 'జామా మసీదు'ను నిర్మించాడు. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా హుస్సేన్ సాగర్, మూసీ నదిపై వంతెన (పూల్‌బాగ్)లను నిర్మించాడు. మహ్మద్ కులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగరాన్ని, చార్‌మినార్‌ను నిర్మించాడు. ఉద్యానవనాలు, పండ్లతోటలతో పరివేష్ఠితమైనందున హైదరాబాద్‌ను బాగ్‌నగర్ (ఉద్యానవన నగరం) అన్నారని థేవనట్ పేర్కొన్నాడు. చార్‌మినార్ సమీపంలోనే చార్ కమాన్‌ను నిర్మించారు. మక్కా మసీదు (కచాబా ఆలయంలా)ను మహ్మద్ కుతుబ్‌షా నిర్మించాడు. మక్కా మసీదును దిల్లీలోని 'జామా మసీదు'తో పోల్చవచ్చని షేర్వాణీ పండితుడు పేర్కొన్నాడు. చిత్రలేఖనంలో పారశీక, హిందూ పద్ధతులతోపాటు పాశ్చాత్య సంప్రదాయాలు కూడా ప్రవేశించాయి. దీన్ని 'దక్కనీ వర్ణ చిత్రకళ' అంటారు. దక్షిణాపథంలో సూక్ష్మ వర్ణచిత్రాలకు ఉదాహరణగా పేర్కొనే 'తారిఫ్ హుస్సేన్ షా పాద్‌షాహీ దక్కన్' గ్రంథం నైజాషా ఆస్థానంలో రూపొందింది. దక్కనీ వర్ణ చిత్రకళకు పితామహుడిగా పేరొందిన మీర్‌హసీంను మొగలు చక్రవర్తులు తమ ఆస్థానంలో నియమించుకున్నారు.  తానీషా కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌