• facebook
  • whatsapp
  • telegram

జ‌న్యుశాస్త్రం

1. ఒక క్రోమోజోమ్‌పై ఉన్న జన్యువులన్నీ అదే క్రమంలో తర్వాతి తరానికి అనువంశికత చెందినప్పుడు, ఆ జన్యువులన్నీ దేన్ని ప్రదర్శిస్తాయి?
1) సహలగ్నత        2) సహసంబంధం
3) సమన్వయ అనువంశిక బంధం    4) సమలగ్నత


2. సంపూర్ణ సహలగ్న జన్యువుల మధ్య అనువంశికత జరిగితే వాటి మధ్య దేన్ని గమనించలేం?
1) సమలగ్నత      2) వినిమయం
3) విలోమానుపాతం  4) విలోప సఖ్యత


3. క్రోమోజోమ్‌ భుజాల మధ్య వినిమయం జరిగే దశ.....
1) డయాకైనెసిస్‌ దశ      2) చలన దశ     
3) పేఖిటీన్‌ దశ             4) నెప్టోటీన్‌ దశ


4. డ్రోసోఫిలాలో నాలుగు జతల క్రోమోజోమ్‌లు ఉంటే వాటిలో ఉండే సహలగ్నత సమూహాల సంఖ్య.....

1) 1         2) 2           3) 3           4) 4


5. పరిగణనలోకి తీసుకున్న రెండు జన్యువుల మధ్య వినిమయ శాతం ఎక్కువ ఉంటే....
1) ఆ రెండు జన్యువులు ఒకే క్రోమోజోమ్‌పై ఉన్నప్పటికీ చాలా దూరంగా ఉన్నట్లు భావించాలి.
2) ఆ రెండు జన్యువులు సంపూర్ణ సహలగ్నతను ప్రదర్శిస్తున్నట్లు భావించాలి.
3) ఆ రెండు జన్యువులు రెండు వేర్వేరు కణజాలాలు లేదా కణాల్లో ఉన్నట్లు భావించాలి.
4) ఆ రెండు జన్యువులు వరుసగా ఒక దాని తర్వాత మరొకటి అమరి ఉన్నట్లు భావించాలి.


6. కిందివాటిలో సహలగ్నతకు సంబంధించి సరైనవి ఏవి?

i)  సహలగ్నతను ఒకే క్రోమోజోమ్‌పై క్రమపద్ధతిలో అమరిఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ జన్యువుల మధ్య గమనించవచ్చు.
ii) సహలగ్నత కేవలం బహిర్గత జన్యువుల మధ్య మాత్రమే గమనించవచ్చు.
iii) సహలగ్నత ప్రదర్శించే జన్యువుల మధ్య పునఃసంయోజనాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పడవు.
iv) రెండు జన్యువులు సహలగ్నత ప్రదర్శిస్తే, సాధారణ ద్విసంకర సంకరీకరణ పరీక్షా సంకరణ దృశ్యరూప నిష్పత్తి (1 : 1 : 1 : 1). ఆ జన్యువులను పరీక్షా సంకరణంలో గమనించలేం.
1) i, ii, iii      2) i, iii, iv       3) i, ii, iv       4) i, ii, iii, iv


7. ‘‘రెండు జన్యువులు అన్నివేళలా స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాన్ని పాటించాల్సిన అవసరంలేదు’’ అని పేర్కొన్న శాస్త్రవేత్తలు....
1) బేట్సన్, పన్నెట్‌       2) మెండల్, మోర్గాన్‌
3) మోర్గాన్, బేట్సన్‌       4) మెండల్, డార్విన్‌


8. రెండు జన్యువుల మధ్య వినిమయ శాతం 20 ఉంటే, వాటి మధ్య దూరం.....
1) 50 సెం.మీ.    2) 30 సెం.మీ.
3) 40 సెం.మీ.    4) 20 సెం.మీ.


9. రెండు జన్యువులను క్రోమోజోమ్‌ రేఖాత్మక పటంలో సూచిస్తే, వాటి మధ్య దూరానికి ఉన్న ప్రమాణాలు....
1) సెంటీమీటర్‌    2) సెంటీమెండల్‌
3) సెంటీమోర్గాన్‌   4) సెంటీడార్విన్‌ 


10. క్రోమోజోమ్‌ రేఖాపటాలను తయారు చేయడానికి రెండు జన్యువుల మధ్య జరిగే ఏ శాతాన్ని లెక్కిస్తారు?
1) అలీనతా శాతం        2) వినిమయ శాతం
3) విలీనతా శాతం        4) సంఘటన శాతం


11. రెండు జన్యువుల మధ్య వినిమయ శాతం కిందివాటిలో దేనికి సమానంగా ఉంటుంది?
1) పునఃసంయోజన శాతం 
2) జనకతరం మొక్కల శాతం
3) మొత్తం పిల్లజీవుల శాతం 
4) ప్రయోగంలో ఏర్పడిన కవల జీవుల సంఖ్య


12. డ్రోసోఫిలా పురుష ఈగల్లో సంపూర్ణ సహలగ్నతను గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం...
1) సినాప్సిస్‌ జరగడం 
2) సినాప్సిస్‌ జరగకపోవడం 
3) వినిమయం జరగడం 
4) విలోమం జరగడం


13. ఉత్పరివర్తనాలు కింది ఏ భాగాల్లో జరుగుతాయి?
1) రిక్తిక                2) కణకవచం
3) ప్లాస్మాత్వచం    4) క్రోమోజోమ్‌లు


14. కిందివాటిలో క్రోమోజోమ్‌ల సంఖ్యా సంబంధ ఉత్పరివర్తనాలు....
i) ట్రైసోమి        ii) టెట్రాసోమి      iii) మోనోసోమి        iv) నల్లీసోమి
1) i, ii, iii            2) ii, iii, iv        3) i, iii, iv           4) i, ii, iii, iv 


15. కింది అంశాలను జతపరచండి.
జాబితా- ఎ        జాబితా- బి
i) ట్రైసోమి           a) 2rr - 2 
ii) టెట్రాసోమి       b) 2rr - 1 
iii) మోనోసోమి      c) 2rr + 2 
iv) నల్లీసోమి         d) 2rr + 1 
1) i-d; ii-c; iii-b; iv-a      2) i-c; ii-d ; iii-b; iv-a
3) i-d; ii-c; iii-a; iv-b     4) i-d; ii-b;  iii-c; iv-a 


16. కింది అంశాలను జతపరచండి.
జాబితా- ఎ             జాబితా- బి
i) ద్వయస్థితికం/        a) 5rr 
డిప్లాయిడ్
ii) త్రయస్థితికం/        b) 4rr 
  ట్రిప్లాయిడ్‌
iii) చతుర్‌స్థితికం/      c) 3rr 
   టెట్రాప్లాయిడ్‌
iv) పంచస్థితికం/        d) 2rr 
   పెంటాప్లాయిడ్‌
1) i-d; ii-b; iv-c; iv-a      2) i-d; i-c; iii-b; iv-a
3) i-b; ii-a; iii-d; iv-c      4) i-a; ii-c; iii-d; iv-b 


17. కిందివాటిలో క్రోమోజోమ్‌ల నిర్మాణాత్మక ఉత్పరివర్తనాలు ఏవి? 
i) విలోమాలు       ii) లోపాలు  
iii) స్థానాంతరాలు     iv) ద్విగుణీకృతాలు
1) i, ii, iii        2) ii, iii, iv    3) i, iii, iv      4) i, ii, iii, iv 


18. విలోమాల్లో క్రోమోజోమ్‌ శకలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉత్పరివర్తనానికి కారణం అవుతుంది?  
1) 180°           2) 90°          3) 60°           4) 360° 


19. DNAలోని ఒక జత క్షారాల్లో కలిగే ఉత్పరివర్తనాలను ........ అంటారు   
1) క్రోమోజోమ్‌ ఉత్పరివర్తనాలు    
2) చుక్క ఉత్పరివర్తనాలు
3) బిందు ఉత్పరివర్తనాలు   
4) పింక్‌ ఉత్పరివర్తనాలు


20. జన్యువులోని ఒక యుగ్మవికల్పం సంపూర్ణంగా మరో యుగ్మవికల్పంపై బహిర్గతత్వం ప్రదర్శించకుండా ఉండే దృగ్విషయాన్ని ఏమంటారు?
1) సంపూర్ణ బహిర్గతత్వం    
2) అసంపూర్ణ బహిర్గతత్వం
4) జన్యురూపకత్వం   
4) అనులోమ బహిర్గతత్వం


21. కిందివాటిలో సరైనవి ఏవి?
i) జన్యుసంకేతం కామాలేని సంకేతావళి. అంటే రెండు కోడాన్‌ల మధ్య కామా చిహ్నాలు ఉండవు.
ii) జన్యుసంకేతం సార్వత్రికమైంది. ప్రతి జీవిలోనూ కోడాన్‌ ఒకేరకమైన ఎమైనో ఆమ్లాన్ని గుర్తిస్తుంది.
iii) జన్యుసంకేతం ఒక నిర్దిష్టమైన ఎమైనో ఆమ్లాన్ని గుర్తిస్తుంది.
1) i, ii        2) ii, iii      3) i, iii       4) i, ii, iii 


22. జన్యుసంకేతం ఎన్ని నత్రజని క్షారాలతో ఏర్పడుతుంది?
1) 1          2) 2           3) 3             4) 4 

 

23. కిందివాటిలో ఏకజన్యు సంబంధ ఉత్పరివర్తనాల వల్ల సంభవించే వ్యాధులేవి?
i) సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌     ii) థలసేమియా 
iii) సికెల్‌ సెల్‌ ఎనీమియా 
iv) హీమోక్రోమటోసిస్‌
1) i, ii, iii           2) ii, iii, iv        3) i, iii, iv          4) i, ii, iii, iv


24. కిందివాటిలో బహుజన్యు సంబంధ మార్పుల వల్ల సంభవించే వ్యాధులు....
i) హృద్రోగాలు        ii) అధిక రక్తపోటు   
iii) డయాబెటిస్‌     iv) స్థూలకాయం

1) i, ii, iii, iv       2) i, ii         3) iii, iv         4) i, ii, iv 


25. కింది వ్యాధుల్లో క్రోమోజోమ్‌ సంబంధ ఉత్పరివర్తనాలకు ఉదాహరణలు.....
i) డౌన్‌ సిండ్రోమ్‌      ii) టర్నర్‌ సిండ్రోమ్‌   
iii) క్లినిఫెల్టర్‌ సిండ్రోమ్‌ 
iv) క్రిడుచాట్‌ సిండ్రోమ్‌
1) i, ii, iii      2) ii, iii, iv       3) i, ii, iv      4) i, ii, iii, iv 


26. డౌన్‌సిండ్రోమ్‌ ఉన్న వ్యక్తుల్లో ఏ క్రోమోజోమ్‌లు మూడు ఉంటాయి?
1) 20వ క్రోమోజోమ్‌     2) 21వ క్రోమోజోమ్‌ 
3) 22వ క్రోమోజోమ్‌     4) 14వ క్రోమోజోమ్‌


27. టర్నర్‌ సిండ్రోమ్‌ కలిగిన వ్యక్తిలో ఉండే క్రోమోజోమ్‌ల సంఖ్య....
1) 45       2) 46        3) 44         4) 42


28. క్లినిఫెల్టర్‌ సిండ్రోమ్‌ ఉన్న వ్యక్తిలో ఎన్ని  క్రోమోజోమ్‌లు ఉంటాయి....
1) 45          2) 46         3) 44          4) 42 


29. క్రిడుచాట్‌ సిండ్రోమ్‌ ఉన్న వ్యక్తిలో మొత్తం ఎన్ని క్రోమోజోమ్‌లు ఉంటాయి?
1) 45          2) 46          3) 47          4) 48 


30. కింది అంశాలను జతపరచండి.
జాబితా- ఎ                  జాబితా- బి
i) టర్నర్‌ సిండ్రోమ్‌           a) xx  లేదా  xy; 5p-
ii) క్లినిఫెల్టర్‌ సిండ్రోమ్‌       b) xxy 
iii) క్రిడుచాట్‌ సిండ్రోమ్‌      c) xo 
1) i-a, ii-b, iii-c        2) i-b, ii-c, iii-a
3) i-c, ii-a, iii-b        4) i-c, ii-b, iii-a 

31. కిందివాటిలో మైటోకాండ్రియా సంబంధిత జన్యుఅనువంశిక వ్యాధులు ఏమి?
i)  LHON -   లెబర్స్‌ హెరిడిటరీ ఆప్టిక్‌ న్యూరోపతి
ii) MERRF -   మయోక్లోనిక్‌ ఎపిలెప్సీ విత్‌ రాగ్‌డ్‌ రెడ్‌ ఫైబర్స్‌
iii) MELAS -  మైటోకాండ్రియల్‌ ఎన్‌సెఫలోపతి, లాక్టిక్‌ ఎసిడోసిస్‌ అండ్‌ స్ట్రోక్‌లైవ్‌ ఎపిసోడ్స్‌
iv) CAD - కరోనరీ ఆర్టరీ డిసీజ్‌
1) i, ii         2) ii, iii         3) i, ii, iii        4) i, ii, iii, iv

 

32. మానవ జన్యుశాస్త్రం (హ్యూమన్‌ జెనెటిక్స్‌)ను కుటుంబ అనువంశిక చరిత్రల ఆధారంగా పరిశీలించవచ్చు. ఈ విధానాన్ని ..... అంటారు. 
1) పిడిగ్రీ ఎనాలసిస్‌     2) ఫ్యామిలీ మెట్రిక్స్‌
3) పిడియాట్రిక్‌ ఎనాలసిస్‌ 
4) ప్రీనాటల్‌ ఎనాలసిస్‌


33. కింది వాటిలో బహుళయుగ్మవికల్పకాల ద్వారా అనునవంశికతను ప్రదర్శించేవి?
1) మానవుడి కేశాలు 
2) మానవుడి ABO రక్త సమూహాలు
3) మానవుడి శరీర ఛాయ
4) మానవుడి లింఫ్‌ వ్యవస్థ


34. మానవుడిలో ABO రక్త సమూహానికి సంబంధించిన జన్యు సమాచారం ఆధారంగా కింది అంశాలను జతపరచండి.
రక్త సమూహం        ఉండే జన్యురూపం 
i) ‘O’                      a) IA IB
ii) ‘A’                      b) IB IO, IB IB
iii) ‘B’                     c) IA IO, IA IA
iv) ‘AB’                    d) IO IO
1) i-d, ii-c, iii-b, iv-a       2) i-c, ii-d, iii-a, iv-b
3) i-a, ii-b, iii-c, iv-d       4) i-d, ii-c, iii-a, iv-b 


35. కిందివాటిలో లైంగిక లక్షణాలకు సంబంధించిన సమాచారం ఏ క్రోమోజోముల్లో ఉంటాయి?
1) సోమటోసోమ్‌లు      2) ఆటోసోమ్‌లు 
3) అల్లోసోమ్‌లు          4) ప్లెయోసోమ్‌లు


36. AB రక్తవర్గం, O రక్తవర్గం కలిగిన వ్యక్తుల తర్వాతి సంతతి ఏ రక్త సమూహాలను కలిగి ఉండే అవకాశం ఉంది?
1) AB, B        2) A, B       3) O మాత్రమే       4) AB మాత్రమే


37. కిందివాటిలో అల్లోసోమ్‌ క్రోమోజోమ్‌ల జన్యు సంబంధ వ్యాధులు ....
i) హీమోఫీలియా        ii) రేచీకటి
iii) వర్ణ అంధత్వం    iv) ఆల్బినిజం
1) i, ii, iii      2) ii, iii, iv      3) i, iii        4) i, ii, iii, iv 


38. లింగసంబంధ అనువంశికతను కనుక్కున్న శాస్త్రవేత్త?
1) మోర్గాన్‌      2) క్లింగ్‌      3) మెండల్‌      4) క్లింటాన్‌


సమాధానాలు: 1-1;  2-2;  3-3'; 4-4;  5-1;  6-2;  7-1;  8-4;  9-3;  10-2; 11-1;  12-;2  13-4;  14-4;  15-1;  16-2;  17-4;  18-1;  19-3;  20-2; 21-4;  22-3;  23-4;  24-1;  25-4;  26-2;  27-1;  28-3;  29-2;  30-4; 31-3;  32-1;  33-2;  34-1;  35-3;  36-2;  37-3;  38-1. 

Posted Date : 17-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌