• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - పర్యటక రంగం

1. భారత ప్రభుత్వం 1966లో స్థాపించిన ‘ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) ముంబయి       2) న్యూదిల్లీ    3) అహ్మదాబాద్‌     4) బెంగళూరు


2. 2019 జాతీయ టూరిజం వార్షిక నివేదిక ప్రకారం అత్యధిక పర్యటకులను ఆకర్షించిన రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి.
1) ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌     2) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ 
3)  కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌            4)  ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు


3.  మొగల్‌ గార్డెన్స్‌ న్యూదిల్లీలో ఉన్నాయి. అయితే రాక్‌ గార్డెన్‌ ఏ ప్రాంతంలో ఉంది?
1) హిమాచల్‌ప్రదేశ్‌       2) ఉత్తరాఖండ్‌    3) చండీగఢ్‌          4) పంజాబ్‌


4.  ‘ఇండియన్‌ నయగారా’ అని ఏ జలపాతానికి పేరు?
1) డుడూమా జలపాతం         2) చిత్రకూట్‌ జలపాతం 
3) బొగత జలపాతం               4) జోగ్‌ జలపాతం


5.  గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ‘పర్యటన్‌ పర్వ్‌’ జాతీయ ఉత్సవాలను ఎప్పుడు నిర్వహించారు?
1) 2019 అక్టోబరు      2) 2020 అక్టోబరు    3) 2018 అక్టోబరు      4) 2019 జనవరి


6.  2019 గణాంకాల ప్రకారం అత్యధిక విదేశీ పర్యటకులు సందర్శించిన రాష్ట్రం ఏది?
1) ఉత్తర్‌ప్రదేశ్‌             2) మహారాష్ట్ర     3) తమిళనాడు            4) పశ్చిమ్‌ బెంగాల్‌


7.  భారతదేశ ‘తెలుపు ఎడారిగా’ పేరు పొందింది?
1) జోధ్‌పూర్‌        2) కచ్‌     3) బార్మర్‌ లోయ     3) సియాచిన్‌


8.  దేశంలో అత్యంత ఎత్తయిన, ప్రకృతి రమణీయ జలపాతం ఏది?
1) జోరేస్పా జలపాతం         2) కుంచికల్‌ జలపాతం 
3) చిత్రకూట్‌ జలపాతం      4) హొగెనక్కల్‌్ జలపాతం


9.  నిర్మలమైన లోయ పువ్వులకు ప్రసిద్ధి చెందిన పర్యటక ప్రాంతం ఎక్కడ ఉంది?
1) లద్దాఖ్‌         2) జమ్మూ కశ్మీర్‌     3) హిమాచల్‌ ప్రదేశ్‌         4) ఉత్తరాఖండ్‌


10.  2019 నివేదిక ప్రకారం విదేశీ పర్యటకుల సందర్శనలో హైదరాబాద్‌ నగరం ఏ స్థానంలో ఉంది?
1) 3వ       2) 6వ       3) 8వ        4) 10వ 


11.  ‘తెలంగాణ ఊటీ’ అని కిందివాటిలో ఏ ప్రాంతానికి పేరు?
1) అనంతగిరి కొండలు        2) పాండవుల గుట్ట    
3) బైసన్‌ కొండలు               4) రాఖీ కొండలు


12.  పర్యటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న అరకులోయ, లంబసింగి ప్రాంతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) ఒడిశా        2) చత్తీస్‌గఢ్‌      3) ఆంధ్రప్రదేశ్‌     4) కర్ణాటక


13. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ‘తాజ్‌ మహల్‌’ ఏ నది ఒడ్డున ఉంది?
1) గంగానది     2) యమునా నది    3) సరస్వతి నది     4) సోన్‌ నది


14.  కళా శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ‘ఖజురహో’ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర          2) మధ్యప్రదేశ్‌    
3) ఒడిశా                4) ఉత్తర్‌ప్రదేశ్‌


15.  కిందివాటిలో సంగీతానికి ప్రసిద్ధి చెందిన కోట ఏది?
1) హంపి        2) గోల్కొండ    3) పిత్తోర్‌గఢ్‌    4) శ్యామ్‌గఢ్‌


16. సహజ, సాంస్కృతిక, మిశ్రమ పర్యటక కేంద్రానికి నిలయమైన ‘కాంచన్‌డిజోంగా’  ఏ రాష్ట్రంలో ఉంది?

1) సిక్కిం       2) కేరళ       3) ఉత్తరాఖండ్‌          4) హిమాచల్‌ ప్రదేశ్‌


17.  జల విహారకేంద్రంగా ప్రసిద్ధి చెందిన పాపికొండలు ఏ నదిపై ఉన్నాయి?

1) ప్రాణహిత      2) శబరి    3) ఇంద్రావతి     4) గోదావరి


18.  కింది అంశాలను పరిశీలించండి.
ఎ) దేశంలో రెండో అతిపెద్ద, పొడవైన బెలూమ్‌ గుహలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్నాయి.
బి) అతి ప్రాచీన ప్రకృతి రమణీయ భైరవకోన రాతి గుహ ప్రకాశం జిల్లాలో ఉంది.
1) ఎ సరైంది            2) బి సరైంది
3) ఎ, బి రెండూ సరైనవి        4) ఎ, బి రెండూ సరైనవి కావు


19. కింది అంశాలను పరిశీలించండి.
ఎ) ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన జలపాతం ‘తలకోన’. 
బి) తెలంగాణలో ఎత్తయిన జలపాతం ‘కుంతల’.

1) ఎ సరైంది             2) బి సరైంది

3) ఎ, బి రెండూ సరైనవి       4) ఎ, బి రెండూ సరైనవి కావు


20.  కిందివాటిని జతపరచండి.
ప్రాంతం            ప్రాధాన్యత
i) గయ              a) క్రైస్తవ మతం
ii) కొలనుపాక    b) హిందూ మతం
iii) ఒంటిమిట్ట    c) జైన మతం
iv) జెరుసలేం    d) బౌద్ధ మతం
1) i - a, ii - b, iii - c, iv - d        2) i - d, ii - c, iii - b, iv - a

3) i - d, ii - b, iii) - a, iv - c       4) i - a, ii - c, iii - d, iv - b


21.  2016 ట్రావెల్‌ మ్యాగజైన్‌ నివేదిక ప్రకారం ప్రపంచ ముఖ్యమైన సాంస్కృతిక పర్యటక ప్రాంతాల్లో రెండో ప్రాధాన్యతను సంతరించుకున్న భారతీయ నగరం ఏది?

1) బెంగళూరు      2) హైదరాబాద్‌        3) ముంబయి     4) జైపూర్‌


22.  కిందివాటిని జతపరచండి.    

జాబితా - I               జాబితా - II
i) మున్నార్‌          a) తమిళనాడు
ii) తాజ్‌మహల్‌     b) కర్ణాటక
iii) నాగర్‌హోల్ ‌  c) ఆగ్రా
iV) కొడైకెనాల్‌      d) కేరళ
                            e) తెలంగాణ
1) i - a, ii - b, iii - c, iv - d       2) i - e, ii - d, iii - c, iv - b

3) i - d, ii - c, iii - b, iv - a       4) i - a, ii - e, iii - c, iv - d


23.  భారతదేశంలో అతిపెద్ద ప్రకృతి సిద్ధమైన హిమనీనదం ఏది?

1) బియోర్డ్‌మోర్‌     2) సియాచిన్‌    3) టైగర్‌ హిల్‌     4) చమోలి


24. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం ఏ రాష్ట్రంలో ఉంది?

1) కేరళ      2) అండమాన్‌    3) తమిళనాడు     4) లక్షద్వీప్‌


25.  ప్రసిద్ధి చెందిన షిరిడీ మందిరం ఏ పీఠభూమిలో ఉంది?

1) దక్కన్‌     2) కొడెర్మ    3) దండకారణ్య     4) విదర్భ


26.  కోణార్క్‌ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది?

1) చత్తీస్‌గఢ్‌     2) ఒడిశా    3) కర్ణాటక    4) మధ్యప్రదేశ్‌


27.   అయిదో శక్తిపీఠమైన జోగులాంబ అలంపూర్‌ ఏ నది ఒడ్డున ఉంది?

1) కృష్ణానది     2) తుంగభద్ర    3) బీమా    4) శారావతి


28. కిందివాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.

1) అజంతా గుహలు - మధ్యప్రదేశ్‌        2) బొగత జలపాతం - తెలంగాణ    

3) అరసవెల్లి - ఆంధ్రప్రదేశ్‌          4) ఊటీ - తమిళనాడు


29. భారతదేశంలో అత్యంత పొడవైన పర్యటక బీచ్‌ ఏది?

1) జుహూ బీచ్‌          2) మెరీనా బీచ్‌      

3) రామకృష్ణ బీచ్‌         4) మంగినపూడి బీచ్‌


30. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన సర్దార్‌ పటేల్‌ విగ్రహం (దీన్ని ఐక్యతా విగ్రహంగా  పిలుస్తున్నారు) ఎక్కడ ఉంది?

1) గుజరాత్‌       2) ఉత్తర్‌ ప్రదేశ్‌      3) రాజస్థాన్‌     4) దిల్లీ


31. కిందివాటిలో ఆంధ్రప్రదేశ్‌లో లేని పర్యటక ప్రాంతం ఏది?

1) అరకు వ్యాలీ        2) జంగిల్‌బెల్‌ - త్యాడ     3) ఆరోగ్యవరం       4) పర్ణశాల


32.  ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుట్టపర్తి ప్రశాంత నిలయం ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఆంధ్రప్రదేశ్‌       2) తెలంగాణ     3) కర్ణాటక     4) తమిళనాడు


33. పిర్‌పంజాల్, దౌల్‌దార్‌ శ్రేణుల మధ్య ఉన్న మనాలి వేసవి విడిది కేంద్రం ఎక్కడ ఉంది?

1) లద్దాఖ్‌       2) హిమాచల్‌ ప్రదేశ్‌     3) ఉత్తరాఖండ్‌    4) పశ్చిమ్‌బెంగాల్‌


34. కిందివాటిలో కాఫీని ఉత్పత్తి చేసే వేసవి విడిది కేంద్రం ఏది?

1) కన్యాకుమారి           2) ఊటీ    3) కూర్గ్‌      4) టైగర్‌హిల్‌


35. సరస్సుల నగరం, ‘వెనిస్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అని కింది వాటిలో దేనికి పేరు?

1) కొచ్చిన్‌      2) ఉదయ్‌పూర్‌     3) జైపూర్‌     4) ఆగ్రా


36. భారతదేశ పర్యటక వలయంలో గోల్డెన్‌ ట్రయాంగిల్‌లో లేని ప్రాంతం ఏది?

1) దిల్లీ       2) ఆగ్రా     3) జైపూర్‌     4) జోధ్‌పూర్‌


37. ప్రపంచంలోని పురాతన జీవన నగరం లేదా City of life అని ఏ నగరానికి పేరు?

1) ఇండోర్‌       2) హైదరాబాద్‌    3) మధుర      4) వారణాసి


38.  కిందివాటిని జతపరచండి.    

జాబితా - 1                 జాబితా - 2

i) పింక్‌ సిటీ                 a) జైసల్మీర్‌
ii) గోల్డెన్‌ సిటీ              b) జైపూర్‌
iii) సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌     c) బెంగళూరు
iv) గార్డెన్‌ సిటీ              d) ముంబయి

1) i - a, ii - b, iii - c, iv - d       2) i - d, ii - c, iii - b, iv - a 

3) i - b, ii - a, iii - d, iv - c       4) i - a, ii - b, iii - d, iv - c


39. ‘ద బ్లూ సిటీ’, ‘సన్‌ సిటీ’, ‘థార్‌ ఎడారి ముఖద్వారం’ అని ఏ నగరానికి పేరు?

1) కచ్‌      2) జోధ్‌పూర్‌     3) శ్రీనగర్‌     4) వాగా


40. బ్రిటిష్‌ ఇండియా ‘వేసవి రాజధాని’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

1)లేహ్‌          2) మనాలి      3) సిమ్లా      4) శ్రీనగర్‌


41. కిందివాటిలో ‘భూలోక స్వర్గం’ అని దేనికి పేరు?

1) దిల్లీ         2) శ్రీనగర్‌     3) కాశీ         4) గాంగ్‌టక్‌


42. ‘సుందరమైన ముఖద్వారంలో కొండల రాణి’, ఈస్ట్‌ ఇండియా కంపెనీ వేసవి ప్రధాన కార్యాలయం అని దేనికి పేరు?

1) కొచ్చిన్‌          2) కొడైకెనాల్‌      3) ఊటీ      4) డార్జిలింగ్‌


43. అజంతా, ఎల్లోరా రాతి గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

1)మహారాష్ట్ర      2) మధ్యప్రదేశ్‌     3) దిల్లీ      4) కర్ణాటక


44. కింది వాటిలో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌లకు ప్రసిద్ధి చెందిన పార్క్‌ ఏది?

1) కన్హా జాతీయ పార్క్‌          2) హెమీస్‌ జాతీయ పార్క్‌ 
3) కేబీఆర్‌ జాతీయ పార్క్‌        4) శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్‌


45. ‘ఫ్లెమింగో బర్డ్‌ ఫెస్టివల్‌’ను ఎక్కడ నిర్వహిస్తారు?

1) నేలపట్టు      2) సలీం ఆలీ    3) కొల్లేరు      4) గ్రేట్‌ ఇండియన్‌ బర్డ్‌


46.  కింది ఏ ప్రాంతానికి కశ్మీర్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని పేరు?

1) మదనపల్లి           2) లంబసింగి    3) అరకులోయ       4) హర్సిలీ హిల్స్‌


47.  హిమాలయ రాణి అని దేనికి పేరు?

1) డార్జిలింగ్‌      2) కాంచన్‌జంగా    3) కోల్‌కతా         4) డాంగ్‌ శ్రేణి


48. ‘ధర్మశాల’ శీతల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?

1) లద్దాఖ్‌        2) హిమాచల్‌ పదేశ్‌    3) ఉత్తరాఖండ్‌      4) తమిళనాడు


49. బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) మధ్యప్రదేశ్‌      2) కర్ణాటక         3) మహారాష్ట్ర    4) ఉత్తర్‌ప్రదేశ్‌


సమాధానాలు: 1-2; 2-1; 3-3; 4-2; 5-1; 6-3; 7-2; 8-2; 9-4; 10-3; 11-1; 12-3; 13-2; 14-2; 15-2; 16-1; 17-4; 18-3; 19-3; 20-2; 21-2; 22-3; 23-2; 24-3; 25-4; 26-2; 27-2; 28-1; 29-2; 30-1; 31-4; 32-1; 33-2; 34-3; 35-2; 36-4; 37-4; 38-3; 39-2; 40-3; 41-2; 42-3; 43-1; 44-1; 45-1; 46-2; 47-1; 48-2; 49-2. 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌