• facebook
  • whatsapp
  • telegram

అయస్కాంతత్వం

1. కిందివాటిలో అయస్కాంత ధర్మం ఏది?

A) స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర-దక్షిణ దిశలను సూచిస్తుంది.

B) అయస్కాంతం కేవలం ఆకర్షణ ధర్మాన్ని కలిగి ఉంటుంది.

C) అయస్కాంత ధ్రువాలను వేరుపరచడం అసాధ్యం.

D) అయస్కాంతం ప్రేరణ ధర్మాన్ని కలిగిస్తుంది.

1) A, B, D         2) A, C, D   

3) A, B, C          4) B, C, D


2. అయస్కాంతంతో బలహీనంగా వికర్షితమయ్యే పదార్థాలను ఏమంటారు?

1) ఫెర్రో అయస్కాంత పదార్థాలు  

2) పారా అయస్కాంత పదార్థాలు

3) డయా అయస్కాంత పదార్థాలు

4) ఏదీకాదు


3. శాశ్వత అయస్కాంతాల తయారీలో వినియోగించేది?

1) ఉక్కు      2) మొత్తని ఇనుము    3) రాగి       4) విద్యుదయస్కాంతాలు


4. కరెంట్‌ ప్రవహిస్తున్న వృత్తాకార లూపు (ఉచ్చు) విషయంలో సరైంది?

1) అది అయస్కాంత కర్పరంలా పనిచేస్తుంది.

2) విద్యుత్‌ సవ్యదిశలో ప్రవహిస్తున్నట్లు కనిపించే ఉపరితలం దక్షిణ ధ్రువంగా ప్రవర్తిస్తుంది.

3) విద్యుత్‌ అపసవ్యదిశలో ప్రవహిస్తున్నట్లు కనిపించే ఉపరితలం ఉత్తర ధ్రువంగా ప్రవర్తిస్తుంది.

4) పైవన్నీ


5. స్వల్ప విద్యుత్‌ ప్రవాహాలను గుర్తించే పరికరం?

1) కంపన అయస్కాంత మాపకం

2) అపవర్తన అయస్కాంత మాపకం

3) టాంజెంట్‌ గాల్వానామీటర్‌

4) మాగ్నటోమీటర్‌


7. అయస్కాంత బలరేఖల విషయంలో సరైంది?

A)  ఇవి ఊహాత్మక రేఖలు       B) ఉత్తర ధ్రువం నుంచి వెలువడతాయి 

C) దక్షిణ ధ్రువం వద్ద అంతమవుతాయి   D) ఆది, అంతం లేని సంవృత వలయాలు

1) A, B, C                 2) A, D  

3) A, C, D                 4) C, D


8. అయస్కాంతత్వానికి సరైన పరీక్ష?

1) ఆకర్షణ       2) వికర్షణ     3) ఆకర్షణ, వికర్షణ     4) ఆకర్షణ లేదా వికర్షణ


9. D.C. విద్యుత్‌ను దేని ద్వారా పంపితే అది దండాయస్కాంతంలా పనిచేస్తుంది?

1) సోలినాయిడ్‌         2) టొరాయిడ్‌ 

3) వృత్తాకార తీగచుట్ట    4) ఏదీకాదు


10. అయస్కాంత ధ్రువసత్వానికి ప్రమాణం?

1) ఆంపియర్‌      2) ఆంపియర్‌.మీటర్‌      3) ఆంపియర్‌ (మీటర్)‌2     4) వెబర్‌


11. విద్యుదయస్కాంతాలను దేంతో తయారు చేస్తారు?

1) ఉక్కు          2) ఆల్నికో    3) మెత్తని ఇనుము      4) నికెల్‌


12. రెండు అయస్కాంత బలరేఖలు...

1) ఎల్లప్పుడూ సమాంతరంగా ఉంటాయి.     2)ఖండించుకోవు    3) ఖండించుకుంటాయి  4) ఏదీకాదు


13. అయస్కాంత ప్రేరణం(Magnetic induction) ప్రమాణం..?

1) వెబర్‌/మీ.2      2) టెస్లా  

3) గాస్‌              4)పైవన్నీ


14. ఏకరీతి అయస్కాంత క్షేత్రానికి సంబంధించి బలరేఖలు...

1) సమాంతరంగా ఉంటాయి  

2) వికేంద్రీకరణం చెంది ఉంటాయి

3) కేంద్రీకరణం చెంది ఉంటాయి 

4) ఏదీకాదు 


15. భూ అయస్కాంతత్వానికి కారణమైన నికెల్, ఇనుము (ద్రవస్థితిల్శో భూమి ఏ ప్రాంతంలో నిక్షిప్తంగా ఉంటాయి?

1) బాహ్య కేంద్రకం (Outer core) 

2) అంతర్‌ కేంద్రకం (inner core)

3) మధ్యపొర (ప్రవారం) (Mantle)

4) బాహ్య పొర (పటలం) ( Crust)


16. అయస్కాంత ప్రవేశ్యశీలతను అత్యధికంగా కలిగి ఉండే పదార్థాలు ఏవి?

1) పారా అయస్కాంత పదార్థాలు

2) ఫెర్రో అయస్కాంత పదార్థాలు

3) డయా అయస్కాంత పదార్థాలు

4) ఫెర్రీ అయస్కాంత పదార్థాలు


17. కిందివాటిలో పారా అయస్కాంత పదార్థం?

1) ప్లాటినం        2) అల్యూమినియం    

3) సోడియం       4) పైవన్నీ


18. ఏ రెండు అయస్కాంత స్థితుల మధ్య ఉండే పరివర్తన ఉష్ణోగ్రతను క్యూరీ ఉష్ణోగ్రత అంటారు?

1) ఫెర్రో - పారా    2) ఫెర్రో - డయా    3) డయా - పారా   4) డయా - ఫెర్రో


19. అయస్కాంత ప్రవేశ్యశీలతకు ప్రమాణం ఏది?

1) హెన్రీ        2) హెన్రీ.మీటర్‌     3) హెన్రీ/ మీటర్‌   4)  ప్రమాణాలు లేవు


20. ‘గిల్బర్ట్‌’ దేనికి ప్రమాణం?

1) విద్యుత్‌ చాలకబలం(emf) 

2) అయస్కాంత చాలకబలం (Mmf)

3) అయస్కాంత భ్రామకం

4) సాపేక్ష ప్రవేశ్యశీలత


21. ఒక దండాయస్కాంతానికి రాగి తీగను చుట్టి, దాని ద్వారా ఎ.సి. విద్యుత్‌ను ప్రసారం చేస్తే అయస్కాంతత్వం...

1) తగ్గుతుంది       2) పెరుగుతుంది    3) శూన్యమవుతుంది     4) మారదు


22. కిందివాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థం?

1) టంగ్‌స్టన్‌       2) అల్యూమినియం    3) రాగి          4) నికెల్‌


23. అయస్కాంతత్వం పరోక్షంగా దేనివల్ల ఏర్పడుతుంది?

1) విద్యుత్‌        2) గురుత్వం   3) పదార్థం        4) బలం


24. దండాయస్కాంతం  మధ్య బిందువు వద్ద అయస్కాంతత్వం..

1) గరిష్ఠం           2) శూన్యం   3) మధ్యస్థం         4) ఏదీకాదు


25. భూమి వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం దిశ?

1) భౌగోళిక దక్షిణం నుంచి ఉత్తరం

2) భౌగోళిక ఉత్తరం నుంచి దక్షిణం

3) భౌగోళిక తూర్పు నుంచి పడమర

4) భౌగోళిక పడమర నుంచి తూర్పు


26. విద్యుదయస్కాంతాలను వేటిలో ఉపయోగిస్తారు?

1) లౌడ్‌స్పీకర్‌      2) విద్యుత్‌ మోటార్‌  3) కాలింగ్‌బెల్‌     4) పైవన్నీ


27. 100 Am2 భ్రామకంతో ఉండే ఒక దండాయస్కాంతాన్ని దాని అక్షీయ రేఖకి సమాంతరంగా రెండు సమాన ముక్కలుగా కోస్తే ఒక్కో అయస్కాంత భ్రామకం ఎంత?

1) 50 Am2      2) 100 Am2

3) 10Am2     4) 25 Am2


28ప్రతిపాదన(A): మెత్తని ఇనుమును ఉక్కు కంటే సులభంగా తాత్కాలిక అయస్కాంతంగా మార్చొచ్చు.

 కారణం(R): ఉక్కు కంటే మెత్తని ఇనుముకు ప్రవేశ్యశీలత ఎక్కువ, కానీ అయస్కాంతత్వాన్ని నిలుపుకొనే ధర్మం మెత్తని ఇనుముకు తక్కువ.

1) A, R రెండూ సరైనవి. A కు R సరైన వివరణ 

2) A సరికాదు, R సరైంది 

3) A సరైంది, R సరైంది కాదు 

4) A, R లు రెండూ సరికావు


29. ‘డొమైన్ల’ను కలిగి ఉండే అయస్కాంత పదార్థాలు?

1) పారా అయస్కాంత పదార్థాలు

2) డయా అయస్కాంత పదార్థాలు

3) ఫెర్రో అయస్కాంత పదార్థాలు

4) పైవన్నీ


30. స్వేచ్ఛగా తిరిగే అయస్కాంత సూచీ ఎల్లప్పుడూ ఉత్తర-దక్షిణ దిశనే సూచించడానికి ప్రధాన కారణం...

1) భూమి అయస్కాంతత్వం 

2) విశ్వం అయస్కాంతత్వం

3) దండాయస్కాంతంలోని ద్విధ్రువాలు

4) పైవన్నీ


31. భూమి అయస్కాంత ప్రేరణ క్షేత్రం సుమారుగా?

1) 10 T     2) 103  T   3) 10 T     4) 105  T


32. భూఅయస్కాంత భూమధ్యరేఖ భారతదేశంలోని ఏ ప్రాంతం నుంచి వెళ్తుంది?

1) చెన్నై       2) తుంబా  3) కటక్‌       4) అహ్మదాబాద్‌


33. భూ అయస్కాంత ధ్రువాల వద్ద అయస్కాంత సూచీ ఏ దిశను సూచిస్తుంది?

1) ఉత్తర - దక్షిణ    2) తూర్పు - పడమర   3) ఏ దిశనైనా సూచించొచ్చు   4) ఏదీకాదు


34. ధ్రువాలు, భూమధ్యరేఖ వద్ద అవపాతం విలువలు వరుసగా.. 

1) 300, 60    2) 00, 900    3) 00, 1800     4) 900, 00


35. ఒక పదార్థం అయస్కాంత వశ్యత (Magnetic Susceptibility) విలువ స్వల్పం, ధనాత్మకం అయితే ఆ పదార్థం ఏ కోవకి చెందింది?

1) పారా అయస్కాంతం         2) డయా అయస్కాంతం

3) ఫెర్రో అయస్కాంతం        4) ఏదీకాదు


36. అయస్కాంతీకరణానికి అత్యంత అనువైన పద్ధతి?

1) విద్యుత్‌ పద్ధతి    2) ప్రేరణ పద్ధతి   3) ఏక స్పర్శ పద్ధతి    4) వేడిచేసి చల్లార్చే పద్ధతి


37. క్యూరీ నియమం విషయంలో సరైంది ఏది?

A) అయస్కాంత వశ్యత పదార్థ పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.

B) అయస్కాంత వశ్యత పదార్థ పరమ ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది.

C)  ఈ నియమం ఆధారంగా అయస్కాంత థర్మామీటర్‌ పనిచేస్తుంది.

D) పదార్థ అయస్కాంతీకరణం (maznetization) దాని పరమ ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది.

1) A, C, D      2) B, C, D   3) A, C        4) A, D 
 

38. కిందివాటిని జతపరచండి.

1) I-D, II-B, III-C, IV-A 

2) I-A, ii-B, iii-C, IV-D 

3) I-D, II-C, III-B, IV-A  

4) I-B, II-A, III-D, IV-C 


39. దండయస్కాంతం అక్షీయరేఖపై కొన్ని రంధ్రాలను చేస్తే, దాని అయస్కాంత భ్రామకం..

1) పెరుగుతుంది     2) తగ్గుతుంది    3) మారదు      4) ఏదీకాదు


40. అయస్కాంతం ఏ సందర్భంలో తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది?

1) వేడిచేసినప్పుడు   2) సజాతీయ ధ్రువాలు కలిసి ఉండేలా మరో అయస్కాంతంతో కలిపి బంధించినప్పుడు

3) కొంత ఎత్తు నుంచి గచ్చుపై పడేసినప్పుడు    4) పై అన్ని సందర్భాల్లో


సమాధానాలు: 

 1-2  2-3 3-1 4-4  5-3 6-1 7-2 8-2 9-1 10-2

11-3 12-2 13-4 14-1 15-1 16-2 17-4 18-1 19-3 20-2  

21-3 22-4 23-1 24-2 25-1 26-4 27-1 28-1 29-3 30-1

31-4 32-2 33-3 34-4 35-1 36-1 37-2 38-1 39-3 40-4 

                   

మాదిరి ప్ర‌శ్న‌లు

1. దండాయస్కాంత కేంద్రం వద్ద అయస్కాంతత్వం
జ: శూన్యం

 

2. విద్యుదయస్కాంతం తయారీకి వాడేది-
జ: మెత్తటి ఇనుము

 

3. అయస్కాంత ససెఫ్టబిలిటీ ప్రమాణాలు
జ: ప్రమాణాలు లేవు

 

4. అల్యూమినియం ఏ రకమైన పదార్థం?
జ: పారా

 

5. అయస్కాంత బల రేఖలు-
జ: సంవృతాలు

 

6. విద్యుదయస్కాంతాలను దేనిలో ఉపయోగిస్తారు?
1) విద్యుత్ గంట         2) టెలిఫోన్         3) డైనమో         4) అన్నీ
జ: 4(అన్నీ)

 

7. ధ్రువసత్వానికి ప్రమాణాలు-
జ: A.m

 

8. భారతదేశంలో అయస్కాంత భూమధ్యరేఖ కిందివాటిలో ఏ ప్రాంతానికి దగ్గరగా వెళుతుంది?
1) తిరువనంతపురం         2) శ్రీహరికోట         3) అలహాబాద్         4) శ్రీనగర్
జ: 1(తిరువనంతపురం)

 

9. అయస్కాంతత్వానికి కచ్చితమైన పరీక్ష
జ: వికర్షణ

 

10. కిందివాటిలో ఏ రకమైన పదార్థాలు ఘనస్థితిలో లభిస్తాయి?
1) డయా         2) పారా         3) ఫెర్రో         4) అన్నీ
జ: 3(ఫెర్రో)

 

11. గుర్రపునాడ అయస్కాంతాన్ని ఏ పరికరంలో వాడతారు?
జ: టెలిగ్రాం

 

12. పాదరసం, నీరు ఏ రకమైన అయస్కాంత పదార్థాలు?
జ: డయా

 

13. అయస్కాంత పదార్థాలను మొదట ఏ ప్రాంతంలో కనుక్కున్నారు?
జ: మెగ్నీషియా

 

14. 1 m పొడవు ఉన్న దండాయస్కాంతం మధ్య బిందువు వద్ద ఉన్న అయస్కాంత ధ్రువాల సంఖ్య-
జ: 0

 

15. అయస్కాంత సూచిని మొదటిసారి ఎవరు తయారుచేశారు?
జ: చైనీయులు

 

16. 'భూమి పెద్ద అయస్కాంత గోళం' అని ప్రతిపాదించినవారు-
జ: గిల్‌బర్ట్

 

17. అయస్కాంత పదార్థాలను కలిగి ఉండని పరికరం-
జ: ట్యూబ్‌లైట్

 

18. అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత సూచి అపవర్తనం చెందని బిందువులు-
జ: తటస్థ బిందువులు

 

19. అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం-
జ: త్రిమితీయం

 

20. అయస్కాంత ససెప్టెబిలిటి χ  = .........
జ:  

 

21. శూన్యంలో అయస్కాంత ప్రవేశ్యశీలత ఎంత?
జ: 4π × 10-7 H/m

 

22. కిందివాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థం-
1) బంగారం         2) కోబాల్టు            3) రాగి 
జ: కోబాల్టు


23. కింది ప్రవచనాలను పరిశీలించండి- 
ఎ) భూ అయస్కాంత క్షేత్ర అక్షం, భూ భౌగోళిక అక్షానికి 231/2º లోపల ఉంటుంది
బి) ఉత్తరార్థ గోళంలో భూఅయస్కాంత ధ్రువం, ఉత్తర కెనడాలోని ద్వీపకల్పం మీద ఉంది
సి) భూఅయస్కాంత భూమధ్యరేఖ, దక్షిణ భారతదేశంలోని తుంబా మీదుగా పోతుంది
పై ప్రవచనాల్లో సరైంది/ సరైనవి?
జ:  బి, సి


24. కిందివాటిలో అయస్కాంత పదార్థం ఏది?
1) కోబాల్టు          2) కాగితం        3) ఇత్తడి 
జ:  కోబాల్టు

Posted Date : 17-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌