• facebook
  • whatsapp
  • telegram

Parts of Speech

టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగ పరీక్షల్లో అభ్యర్థుల కనీస ఆంగ్ల భాష స్థాయిని పరీక్షించడానికి బేసిక్ ఇంగ్లిష్ విభాగాన్ని జనరల్ స్టడీస్ పేపరులో చేర్చారు. దీనికి సంబంధించి Parts of Speech, Tenses, Articles, Prepositions, Voices, Speech, Types of Sentence, Spelling, Vocabulary పై అవగాహన ఏర్పరుచుకోవాలి.
స్పీచ్ (Speech) అంటే Spoken words of a person. మనం భావాలను అర్థవంతమైన వాక్యరూపంలో వ్యక్తీకరిస్తాం. తెలుగుభాషలో వాక్యాన్ని Sub + Obj + Verb రూపంలో ఉపయోగిస్తే ఇంగ్లిష్‌లో Sub + Verb + Object రూపంలో రాస్తాం.
ఒక వాక్యం (Sentence)లోని పదాలు నిర్వర్తించే విధులనుబట్టి వాటిని 8 భాగాలుగా విభజించారు. వీటినే Parts of Speech అంటారు. అవి
1) Noun 2) Pronoun 3) Adjective 4) Verb 5) Adverb 6) Preposition 7) Conjunction 8) Interjection

 

1) NOUN (నామవాచకం): పేర్లను తెలియజేసేదాన్ని నామవాచకం అంటారు. ఉదాహరణకు వ్యక్తులు, ప్రాంతాలు, వస్తువులు, జంతువులు, పక్షుల పేర్లు.
Tagore, India, Table, Peacock, Tiger, Democracy, Kindness.

 

2) Pronoun (సర్వనామం): నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. (Pronoun is used instead of noun.)
e.g.: * Suman said that he was good at Mathematics.
* Only you and me can do this work fast.

 

3) Verb (క్రియ): సాధారణంగా చేసే పనిని గురించి తెలిపేదాన్ని క్రియ అంటారు. పని (action), స్థితి (condition), కలిగి ఉండటం (possession) అనే మూడు అంశాలను గురించి స్పష్టంగా వివరించేదే క్రియ (Verb).
* He is a teacher. (State)
* Children ate chocolates. (Action)
* Kiran has a car. (Possession)

 

4) Adjective (విశేషణం): నామవాచకం గుణాలను (రంగు, రుచి, సంఖ్య) తెలియజేసేదే Adjective.
* Sachin is a great cricketer.
* Monalisa is a beautiful painting.
* The Adigrand is the holy book of Sikhs.

 

5) Adverb (క్రియా విశేషణం): Verb/adjective/ adverb పనులను విశదీకరించి చెప్పే పదాన్ని Adverb అంటారు.
* Bolt is running very fast.
                    verb       adv.
* He read very fast.
                  adv. adv.
* Suma is a very intelligent girl.
                        adv       adj

 

6) Preposition (విభక్తి): ఒక వాక్యంలో ఉపయోగించిన పదాలతో నామవాచకం (Noun) లేదా సర్వనామానికి (Pronoun) మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తూ వాడే పదాన్ని Preposition అంటారు.
e.g.: * He speaks Telugu besides English.
* The theif was beaten by the police man.
* He is at work.

 

7) Conjunction (సముచ్ఛయం): రెండు పదాలు లేదా రెండు వాక్యాలను (sentences) కలిపే భాషాభాగాన్ని Conjunction అంటారు.
* Don't come until I call you.
* Ramu and Sita are good students.
* He was fat so that he could not run.

 

8) Interjection (ఆశ్చర్యార్థకం): మనసులో కలిగే బలమైన భావావేశాలను (joy, sorry, grief, applaud, surprise) ను తెలియజేసే పదాన్ని Interjection అంటారు.
* Hurrah! India won the match.
* Alas! Iam done.
* Wow! what a beatiful flower it is!
I) Noun: Nouns are five types:
      1) Common Noun
      2) Proper Noun
      3) Collective Noun
      4) Material Noun
      5) Abstract Noun
II) వీటిని ప్రధానంగా రెండు విధాలుగా విభజించవచ్చు.
      1) Concrete Noun
      2) Abstract Noun

 

1) Concrete Noun: It is the name of an object that can be seen, touched, heard, smelt or tasted.
(ఏదైనా ఒక అంశాన్ని చూస్తూ, స్పర్శిస్తూ, వింటూ, పరిశీలించదగిన అంశాన్ని Concrete Noun అంటారు)
e.g.: deer, boy, tree, ocean, mountain, plateau etc.,

 

2) Abstract Noun: It is name of a quality, action or state belonging to an object.
అమూర్త భావాలైన quality, action, స్థితిని తెలియజేసేదాన్ని Abstract Noun అంటారు.
e.g.: honesty, democracy, childhood, equality, happiness.
III) Nouns ని countable, uncountable nouns గా విభజించవచ్చు.
1) లెక్కించడానికి వీలుగా ఉన్నవాటిని countable noun అంటారు.
e.g.: pen, boy, apple, bird, table, kite.
2) లెక్కించడానికి వీల్లేని వాటిని uncountable noun అంటారు.
e.g.: rice, hair, wood, honey, sand, air, cold.
i) కొన్ని పదాలను కేవలం singular రూపంలోనే ఉపయోగించాలి.
advice, scenery, machinery, stationery, granary, imaginary, poetry, justice, hair, information, equipment, furniture, baggage, health, business, commerce, grain, clothing, pollution, weather etc.,
e.g.: We findout different kinds of pollution in cities.
ii) కొన్ని పదాలు Plural రూపంలో ఉన్నప్పటికీ singular గా మాత్రమే ఉపయోగించాలి.
news, classics, innings, summons, athletics, gymnastics, billiards, mechanics, mathematics, economics etc.,
e.g.: * The Indian team defeated the Australia by an innings.
* The Apex court has issued summons.
iii) కొన్ని పదాలు Singular రూపంలో ఉన్నప్పటికీ Plural రూపంలో ఉపయోగించాలి.
people, police, vermin, cattle, gentry, peasantry, clergy, company, artillery
e.g.: The clergy are in the church.
The gentry of village have taken decision to ban consumption of liquor in their village.
iv) కొన్ని పదాలను కేవలం Plural లో మాత్రమే ఉపయోగించాలి.
trousers, jeans, pyjamas, pants, scales, scissors, glasses, spectacles, binaculars, measles, alms, premises, thanks.
e.g.: The beggar is begging for alms.
My spectacles are good.
v) కొన్ని పదాలు singular, pluralలో కూడా ఒకే విధంగా ఉపయోగించాలి.
e.g.: sheep, deer, aircraft, salmon.

Rule No-5: length, measurement, money లేదా weightను సూచించే Noun ముందు number వచ్చినట్లయితే వాటిని యథావిధిగా ఉపయోగించాలి.
Million, dozen, metre, year, score.
* It is a five year plan

 

Rule no-6: 's' అనే అక్షరంతో plural form ఉన్న nounని possesive form లోకి మార్చడానికి apostrophe (') ను s తర్వాత చేర్చాలి.
e.g.: Boys' hostel

 

Rule No-7: s అనే అక్షరాన్ని చేర్చకుండా pluar form లో ఉన్న Nounని possesive formలోకి మార్చడానికి apstrophe ('), s చేర్చాలి.
e.g.: Children's park, Men's parlour

 

Bits
I) Identify the part of speech of the word underlined in the following sentences.

1. Out of ten students three were absent.
1) Noun 2) Pronoun 3) Adjective 4) Adverb
Ans: (2)

 

2. Ramanujan made several important discoveries in Mathematics.
1) Noun 2) Pronoun 3) Adjective 4) Adverb
Ans: (3)

 

3. He says he often visits my place.
1) Noun 2) Adverb 3) Preposition 4) Adjective
Ans: (2)

 

4. He asked me whether I had taken breakfast.
1) Noun 2) Adverb 3) Conjunction 4) Interjection
Ans: (3)

 

5. Distribute these sweets among children.
1) Noun 2) Preposition 3) Conjunction 4) Interjection
Ans: (2)

 

6. My teacher gave me many advices. This sentence may be edited as..
1) My teacher gave me many advices
2) My teacher gave me some advices
3) My teacher gave me many pieces of advice
4) My teacher gave me much advice
Ans: (3)

Posted Date : 20-05-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు