• facebook
  • whatsapp
  • telegram

నేలలు/ మృత్తికలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. శివాలిక్ కొండల పాదాల వెంబడి, హిమాలయ నదుల వల్ల నిక్షేపితమైన గ్రావెల్‌తో కూడిన సచ్ఛిద్ర మండలాన్ని ఏమంటారు?
జ‌: భాబర్

 

2. కిందివాటిలో ప్రపంచంలోనే అతిపెద్ద, సారవంతమైన డెల్టాను ఏర్పరచిన నదులను గుర్తించండి.
     1) గంగా - సింధూ      2) గంగా - బ్రహ్మపుత్ర      3) యూరల్ - టైగ్రిస్      4) ముర్ర - డార్లింగ్
జ‌: 2(గంగా - బ్రహ్మపుత్ర)

 

3. భారతదేశంలో ఉన్న నేలల్లో ఎర్ర నేలలు విస్తీర్ణపరంగా ఎన్నో స్థానాన్ని ఆక్రమించాయి?
జ‌: రెండో

 

4. ఉష్ణమండల చెర్నోజమ్‌గా పేరు పొందిన నేలలు ఏవి?
జ‌: రేగర్ నేలలు

 

5. కాల్షియం కార్బొనేట్ కలిగిన నేలలను ఏమని పిలుస్తారు?
జ‌: కాంకర్ నేలలు

 

6. గాలి లాంటి క్రమక్షయ కారకం ద్వారా ఏర్పడే నేలలు ఏవి?
జ‌: ఎడారి నేలలు

 

7. పత్తి, పొగాకు, చెరకు మొదలైన పంటలకు అత్యధిక దిగుబడిని అందించే నేలలు ఏవి?
జ‌: నల్లరేగడి నేలలు

 

8. 'లేటరైట్' అనే పదంలో లేటర్ అంటే అర్థం ఏమిటి?
జ‌: ఇటుక

 

9. మంచు నేలలు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఏది?
జ‌: గ్రేటర్ హిమాలయాలు

 

10. పెడల్ ఫార్ అంటే ఏమిటి?
జ‌: అధిక తేమ, సహజ ఉద్భిజం ఉన్న ప్రాంతంలోని నేలలు

 

11. pH విలువ ఏడు కంటే ఎక్కువ ఉన్న నేలలను ఏమంటారు?
జ‌: క్షార నేలలు

 

12. నేలల నిర్మాణాన్ని బట్టి వాటి వయసు, స్వభావాలు, లక్షణాలను చెప్పడాన్ని ఏమంటారు?
జ‌: నేలల ఆకృతి

 

13. 'తమను తాము దున్నుకుంటాయి' అనే లోకోక్తి ఉన్న నేలలు ఏవి?
జ‌: నల్లరేగడి నేలలు

 

14. ఆమ్లక్షార నేలలకు ఉదాహరణ ...... 
     1) రే      2) కల్లార్      3) ఊసర్      4) పైవన్నీ
జ‌: 4(పైవన్నీ)

Posted Date : 18-05-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు