• facebook
  • whatsapp
  • telegram

యుద్ధాలు

మాదిరి ప్రశ్నలు

1. సాహు, తారాబాయికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో సాహు విజయానికి తోడ్పడిన వ్యక్తి ఎవరు?
ఎ) బాజీరావు బి) బాలాజీ విశ్వనాథ్ సి) రఘునాథరావు డి) మల్హర్ రావ్ హోల్కర్
జ: (బి)

 

2. గైక్వాడ్‌లు ఏ ప్రాంతం కేంద్రంగా పరిపాలించారు?
ఎ) బరోడా బి) నాగపూర్ సి) ఇండోర్ డి) గ్వాలియర్
జ: (ఎ)

 

3. మొదటి బాజీరావు బస్సైన్, సాల్‌సెట్టిలను ఎవరి నుంచి ఆక్రమించాడు?
ఎ) ఆంగ్లేయులు బి) పోర్చుగీసువారు సి) ఫ్రెంచివారు డి) డచ్చివారు
జ: (బి)

 

4. మొదటి బాజీరావు, నిజాం ఉల్ ముల్క్‌ను ఏ యుద్ధంలో ఓడించాడు?
ఎ) హైదరాబాద్ బి) భోపాల్ సి) నాగపూర్ డి) విజయవాడ
జ: (బి)

 

5. నానాసాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన పీష్వా ఎవరు?
ఎ) బాలాజీ బాజీరావు బి) బాలాజీ విశ్వనాథ్ సి) మొదటి బాజీరావు డి) రెండో బాజీరావు
జ: (ఎ)

 

6. 1752లో పీష్వాతో ఒప్పందం కుదుర్చుకున్న మొగలు చక్రవర్తి ఎవరు?
ఎ) మహమ్మద్ షా బి) అహ్మద్ షా సి) బహుదూర్ షా డి) ఔరంగజేబు
జ: (బి)

 

7. చివరి పీష్వా ఎవరు?
ఎ) మాధవరావు బి) నారాయణరావు సి) బాలాజీ బాజీరావు డి) రెండో బాజీరావు
జ: (డి)

 

8. బాలాజీ బాజీరావు ఎప్పుడు మరణించాడు?
ఎ) 1759 బి) 1760 సి) 1761 డి) 1762
జ: (సి)

 

9. నాదిర్ షా తర్వాత ఆఫ్ఘనిస్థాన్ పాలకుడు ఎవరు?
ఎ) తైమూరు బి) అహ్మద్ షా అబ్దాలీ సి) షేర్‌ఖాన్ డి) అదీనా బేగ్ ఖాన్
జ: (బి)

 

10. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాలకు సహకరించింది ఎవరు?
ఎ) జాట్‌లు బి) రాజపుత్రులు సి) సిక్కులు డి) ఎవరూ కాదు
జ: (డి)

 

11. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాల ఓటమికి ప్రధాన కారకుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) కాశీ రాజ పండిట్ బి) సదాశివరావు భావే సి) విశ్వాసరావు డి) మల్హర్ రావు హోల్కర్
జ: (బి)

 

12. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసింది?
ఎ) సల్బాయ్     బి) దురాయ్ సరాయ్      సి) పాల్కేడ్      డి) బస్సైన్
జ: (ఎ)

 

13. పీష్వా రెండో బాజీరావు సైన్య సహకార ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేశాడు?
ఎ) 1800      బి) 1801       సి) 1802       డి) 1803
జ: (సి)

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌