• facebook
  • whatsapp
  • telegram

Adjective

వ్యాకరణంలోని భాషా భాగాల్లో మరో ముఖ్యమైన విభాగం 'Adjective'. ఇది ఎన్ని విధాలుగా ఉంటుంది? ఏ సందర్భంలో ఏ విధంగా ఉపయోగించాలి? ప్రయోగంలో తప్పులు ఎలా జరుగుతాయి? తదితర అంశాలపై అభ్యర్థులు తగిన అవగాహన ఏర్పరచుకోవాలి.
నామవాచకం/సర్వనామం గుణాలను విశదీకరించి తెలియజేసేదాన్ని Adjective అంటారు
e.g.: * Kiran is a student.
       * Kiran is a  clever    student.
                            adj        noun

మొదటి వాక్యంలో Kiran అనే అబ్బాయి ఒక విద్యార్థి (student) అనే అర్థాన్ని ఇవ్వగా, రెండో వాక్యంలో clever అనే పదం కిరణ్ ఏ రకమైన విద్యార్థి అనేది తెలియజేస్తుంది.
* 'Adjective'వ్యక్తుల/వస్తువుల Appearance, Size, Colour, Shape, Nature లను విశదీకరిస్తుంది.

 

1. Adjective ని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. అవి:
i) Attributive use - Adjective + Noun
ii) Predicative use - Verb + Adjective

* కొన్ని Adjectivesను కేవలం Attributive, మరికొన్ని Adjectivesను కేవలం Predicativeరూపంలోనే ఉపయోగించాలి.

e.g.: * He is afraid of fire works.
       * This baby seems asleep.
       * He feels well now.
       * This is the main problem.
* Cancer has to be detected in initial stage.

 

2. Present Participle forms (-ing forms), Past Participle forms (-ed forms, some Past Participles are formed irregularly)
రూపంలోని కొన్ని క్రియలను adjective రూపంలో ఉపయోగిస్తారు.

* It is an interesting book on current politics.
* He is an experienced teacher.

 

3. కొన్ని Adjectives ను క్రియల నుంచి, మరికొన్నింటిని ఇతర Adjectives నుంచి రూపొందిస్తారు. కానీ చాలా Adjectives నామవాచకం నుంచే రూపొందుతాయి. (see table - 3)
 

4. Some, enough, all, any, little, few etc. adjectives of quantity ని తెలియజేస్తాయి.
వస్తువు/వస్తువుల పరిమాణం, స్థాయిని తెలియజేయడానికి affirmative sentence లో some అనే పదాన్ని, negative లేదా interrogative sentences లో Any అనే పదాన్ని ఉపయోగించాలి.

e.g.: * I will buy some oranges.
       * I will not buy any oranges (Not some oranges)
       * Did you buy any oranges (Not some oranges)
Note: Request
రూపంలో రూపొందించిన Interrogative Sentence లో 'Some' అనే పదాన్ని ఉపయోగించాలి.
* Will you please give me some milk? (not any milk) (see table - 4)

INCORRECT: The few persons can keep a secret.
CORRECT: Few persons can keep a secret.
INCORRECT: Little milk that is in the pot may be used for the patient.
CORRECT: The little milk that is in the pot may be used for the patient.

 

5. Adjective of numberని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు (I, II, III etc.,) + Cardinals (1, 2, 3 etc.,) + Multiplicative orderలో ఉపయోగించాలి.
e.g.: The first six tickets of the event are given to the orphanage children.
 

6. Many, a great many, a good many తర్వాత plural noun, plural verb ఉపయోగించాలి.
e.g.: A great many people died in the cyclone.
* My brother has a good many friends.

 

7. Use of elder - older
Older
అనే పదాన్ని వ్యక్తులు, వస్తువులను పోల్చడానికి ఉపయోగిస్తారు.
Elder అనే పదాన్ని ఒకే కుటుంబంలోని సభ్యుల వయసును పోల్చడానికి ఉపయోగిస్తారు.
Older - Persons as well as things
Elder - Members of the family
e.g.: * Kiran is older than all other boys of this colony.
* Srinivas is my elder brother.

 

8. Every, Each and every అనే పదాలను రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాలను తెలియజేయడానికి; Either లేదా Neither'' అనే పదాలను రెండు వస్తువుల మధ్య లేదా రెండు అంశాల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేయడానికి ఉపయోగిస్తారు.
e.g.: There were five singers participating in the competition. Each of them sang well.
There are two pieces of scenery on the wall. Either scenery is beautiful.
Difference between less and fewer
Fewer
అనే పదాన్ని సంఖ్యను తెలియజేయడానికి, less అనే పదాన్ని పరిమాణాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు.
Fewer - number Less - quantity
e.g.: * No fewer than twenty students were participated in Quiz competition. (Not no less than)
* There is no less than five litres of water in the jug (not no fewer than)

 

Model Questions
Identify an error in the given sentences.

1. This book is undoubtedly (1)/ preferable than other books in many (2)/ respects and its priniting (3)/ is also comparatively good. (4)
Ans: (2)

 

2. She is one of (1)/ the tall girls (2)/ in the class (3)/ No error (4)
Ans: (4)

 

3. Gandhiji appeared on the scene (1)/ of the freedom struggle (2)/prior than the 1930s (3)/ No error (4)
Ans: (3)

 

4. Internet has done most harm (1)/ than good (2)/ to our younger (3)/ generation. (4)
Ans: (1)

 

5. The two first (1)/ chapters of this book (2)/ are very important (3)/ No error (4)
Ans: (1)

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌