• facebook
  • whatsapp
  • telegram

Degrees of Comparison

నిత్య జీవితంలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో, ఒక అంశాన్ని మరొక అంశంతో పోల్చి చెప్పడం సర్వసాధారణం. పోలికల స్థాయుల్లోని భేదాలను తేలియజేయడానికి Degrees of Comparison ను ఉపయోగిస్తారు.
వీటిని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

 

1. Positive Degree: ఒక వ్యక్తి లేదా అంశం లక్షణాన్ని తెలియజేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.
e.g.: * He is as intelligent as his friend.
        * No other animal is as tall as the Giraffe.

 

2. Comparative Degree: ఇద్దరు అంతకంటే ఎక్కువ వ్యక్తులు లేదా రెండు అంతకంటే ఎక్కువ అంశాల మధ్య ఒక లక్షణాన్ని పోల్చడానికి దీన్ని ఉపయోగిస్తారు.
e.g.: * The Giraffe is taller than the Elephant.
        * He is more intelligent than any other boy in the class.

 

3. Superlative Degree: ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులు/ రెండింటి కంటే ఎక్కువ అంశాల మధ్య ఒక లక్షణాన్ని పోల్చడానికి దీన్ని ఉపయోగిస్తారు.
e.g.: * He is the most intelligent student in the class.
        * The Nile is the longest of all rivers in the world.
e.g.: * Kiran is a student.
Formation of Comparatives and Superlatives

 

1. సాధారణంగా Adjectives కు - 'r' లేదా 'er' అనే అక్షరాలను చేర్చడం ద్వారా Comparative Degree; 'st' లేదా 'est' అనే అక్షరాలు చేర్చడం ద్వారా Superlative Degree గా మారతాయి.

 

2. రెండు కంటే ఎక్కువ Syllables ఉన్న కొన్ని Adjectives కి more అనే పదం చేర్చడం ద్వారా Comparative, 'Most' అనే పదం చేర్చడం ద్వారా Superlative Degreeగా మారతాయి.

 

Model No: 1

Positive Degree లోని వాక్యం No other ... as .. as తో ప్రారంభించినప్పుడు Comparative Degree లో than any other / all other ఉపయోగించాలి. Superlative Degree లో... adj-III ముందు article 'the' ఉపయోగించాలి.
Positive Degree: No other river in the world is as long as the Nile.
Comparative Degree: The Nile is longer than any other river in the world.
Superlative Degree: The Nile is the longest of all rivers in the world.

 

Model No: II

Positive Degree లోని వాక్యం ''very few'' తో ప్రారంభించినప్పుడు Comparative Degreeలో than most other, Superlative Degree లో one of the + adj - III + noun + s ఉపయోగించాలి.
Positive Degree: Few cities in India are as big as Chennai.
Comparative Degree: Chennai is bigger than most other cities in India.
Superlative Degree: Chennai is one of the biggest cities in India.

 

Model No: III

Positive Degree లోని వాక్యం atleast ... as .. as తో ప్రారంభించినప్పుడు Comparative Degree లో not ...adj-II... than ఉపయోగించాలి.
Positive Degree: Ravi is atleast as clever as Kiran.
Comparative Degree: Kiran is not cleverer than Ravi.

 

3. ఇద్దరు వ్యక్తులు, రెండు వస్తువుల మధ్య ఒక లక్షణాన్ని పోల్చి చెప్పడానికి Superlative Degree ఉపయోగించకూడదు.
e.g.: He is the better of the two brothers (not the best).

 

4. ఒకే వ్యక్తిలోని లేదా ఒకే వస్తువులోని రెండు లక్షణాలను Comparative degree లో 'r' లేదా 'er'కు బదులుగా adj-I ముందు 'more' ఉపయోగించాలి.
e.g.: Sharma is more wise than intelligent.

 

5. Empty, extreme, universal, round, square, eternal, full, parallel, unmatched లాంటి పదాలను Positive Degree రూపంలో మాత్రమే ఉపయోగించాలి.
e.g.: * Aishwarya's beauty is un matched.

 

6. Senior, junior, superior, inferior, prior, posterior, prefer తర్వాత than కు బదులుగా 'to' ఉపయోగించాలి.
e.g.: * I prefer coffee to tea (not than tea)
* He is junior to me (Not than me)

 

7. Enough అనే పదం ముందు ఎప్పుడూ Positive degree ని ఉపయోగించాలి.
e.g.: He is smart enough to get selected for this prestigious post.

 

Model Questions

 

1. Identify an error in the given sentence.
Internet has done most harm (1)/ than good (2)/ to our younger (3)/ generation. (4)
Ans: (1)

 

2. Anil is not taller than Tirupathi. If you change the above sentence into the Positive Degree correctly, you will get...
(1) Tirupathi is taller than Anil
(2) Tirupathi is so tall as Anil
(3) Anil is atleast as tall as Tirupathi
(4) Tirupathi is at least as tall as Anil
Ans: (4)

 

3. The Taj Mahal is one of the most beautiful monuments in the world. Change the above sentence into Comparative Degree.
(1) Very few monuments in the world are as beautiful as the Taj Mahal.
(2) The Taj Mahal is more beautiful than most other monuments in the world.
(3) The Taj Mahal is beautiful than most other monuments in the world.
(4) The Taj Mahal is beautiful than some other monuments in the world.
Ans: (2)

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌