• facebook
  • whatsapp
  • telegram

Pronoun

ఆంగ్ల భాషా భాగాల్లో మరో ప్రధానమైన విభాగం Pronoun (సర్వనామం). ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏయే సందర్భాల్లో దీన్ని ఎలా ఉపయోగించాలి? అనే అంశాలపై పరీక్షార్థులు అవగాహన ఏర్పరచు కోవాలి.
Nounకు బదులుగా ఉపయోగించే పదాన్ని Pronoun అంటారు.
e.g.: Ravi is a student. He won a prize in elocution competition.
Pronouns
ని కింది విధంగా విభజించవచ్చు.

 

1. Personal Pronouns: వ్యాకరణాన్ని అనుసరించి ఇది మూడు రకాల Subject పదాలను తెలియజేస్తుంది. అవి..
a) I-Person: Speaker ని సూచించే పదాన్ని I-Person అంటారు.
I am an Indian. We are Indians.
b) II-Person: Speaker తన సంభాషణలో ఎదుటి వ్యక్తిని సూచిస్తూ సంబోధించే you, your, yours అనే పదాలను II-Person అంటారు.
You are an intelligent student.
This book is yours.
c) III-Person: Speaker తన సంభాషణలో ఇతర వ్యక్తి/ వ్యక్తులను ఉద్దేశిస్తూ listenerతో చెప్పే he, she, it, they అనే పదాలను III-Person అంటారు.

Rule-1: ఏదైనా ఒక వాక్యం సానుకూల (పాజిటివ్) భావాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు దానికి సంబంధించినpersonal pronounsను II, III, I వరుసలో ఉపయోగించాలి.
e.g.: You, he and I are participating in Swachh Bharat programme.

 

Rule-2: ఏదైనా ఒక వాక్యం ప్రతికూల (నెగిటివ్) భావాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు personal pronouns ను I, II, III వరుసలో ఉపయోగించాలి.
e.g.: I, you and Kiran are involved in the crime and will be punished by the Government.

 

Rule-3: రెండు singular nounsను "and"తో కలుపుతున్నప్పుడు.... వాటి ముందు 'each' లేదా 'every' అనే పదాలు ఉంటే pronoun singular రూపంలోనే ఉండాలి.
e.g.: Each teacher and each participant is presenting his paper on global warming and its effect on the earth.

 

Rule-4: రెండు పదాలను "and"తో కలిపునప్పుడు, ఆ రెండూ ఒకే అంశాన్ని సూచిస్తున్నప్పుడు... pronoun singular రూపంలో ఉండాలి.
Note: 1) Article 'the' is placed before the first noun. ఇలాంటి వాక్యంలో మొదటి పదం ముందు ,the అనే ఆర్టికల్‌ను ఉపయోగించాలి.
e.g.: The Principal and lecturer in English is delivering his/her speech at the function.
2) రెండు పదాల ముందు the అనే ఆర్టికల్‌ను ఉపయోగిస్తే... ఆ రెండు పదాలు విభిన్నమైన వ్యక్తులు/ అంశాలను సూచిస్తాయి.
e.g.: The P.M. and the Party President delivered their speech at the public meeting.

 

Rule-5: రెండు singular nouns either - or neither - nor అనే పదాలతో సంయోగం చెందినప్పుడు singular pronoun ను ఉపయోగించాలి. ఒకవేళ singular, plural లేదా రెండూ plural nounsతో కలిపి ఉన్నప్పుడు plural pronoun ను ఉపయోగించాలి.
Note: either - or అనే పదాలను పాజిటివ్ అర్థంలోనూ neither - nor లను నెగిటివ్ అర్థంలోనూ ఉపయోగించాలి.
e.g.: 1) Either Modi or KCR has got sucess in creating his mark to get support of common people in clean and green programme.
2) Neither the manager nor the workers have got success in negotiating their problems in a peaceful environment.

 

Rule-6: Preposition, 'let' అనే పదం తర్వాత pronounను objective caseలో ఉపయోగించాలి.
e.g.: He likes none but me (not I).
Let him speak.

 

Rule-7: Ours, yours, hers, its, theirs లాంటి personal pronouns ను apostrophe (') లేకుండా రాయాలి.
e.g.: Yours truly (not your's truly) Yours lovingly (not your's lovingly) It is hers (not it is her's)

 

Rule-8: "than" అనే పదం తర్వాత pronounను 'subjective case'లో ఉపయోగించాలి.
e.g.: 1) He is richer than I. (not me)
2) She walks faster than he. (not him)

 

2. Reflexive Pronouns: Reflexive means bent back. Subject, Object రెండూ ఒకే వ్యక్తిని లేదా వస్తువును సూచించేలా ఉపయోగించే పదాన్ని Reflexive Pronoun అంటారు.
Objective form లో pronounకు self/selves అనే పదాలను చేర్చడం ద్వారా Reflexive Pronoun రూపొందుతుంది.
Myself, ourselves, herself, himself, itself, themselves, yourself/selves.
e.g.: They encouraged themselves. We saw ourselves in the mirror. One should avail oneself of this chance.
Note: కొన్ని verbs ఎల్లప్పుడూ reflexive pronouns లను వాటి objects గా స్వీకరిస్తాయి.
కింది verbs ను పరిశీలించండి.
Acquit, avail, adjust, address, enjoyed, exert, resign, behave, adopt - all take a reflexive object.
e.g.: 1) Ravi adopted himself to the new conditions.
2) We enjoyed ourselves last week.
3) Sita adjusted herself to these changes.
4) She has acquitted herself well as a manager.

 

3. Emphatic Pronouns: These are used for emphasis. ఒక అంశాన్ని నొక్కి చెప్పడానికి ఉపయోగించే pronoun - Emphatic pronoun.
e.g.: 1) He himself prepared the food.
2) You yourself can explain to me.
3) They themselves violated rules.
Note: Reflexive, Emphatic pronouns ఒకేలా ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించే విధానంలో తేడా ఉంటుంది.
e.g.: 1) I myself showed you the way. (correct)
I showed you the way. (correct)
2) He himself prepared notes. (correct)
He prepared notes. (correct)
పై రెండు వాక్యాల్లో myself, himself అనే పదాల ఉపయోగం optional. వీటిని తొలగించినప్పటికీ grammatical గా సరైన వాక్యాలే అవుతాయి.
3) He blamed himself for the delay. (correct)
He blamed for the delay. (incorrect)
పై ఉదాహరణలో himself అనే పదాన్ని తొలగిస్తేగ్రామర్ పరంగా ఆ వాక్యం తప్పు అవుతుంది.
* Myself, yourself, themselves మొదలైన పదాలను optionalగా ఉపయోగిస్తే అవి emphatic pronouns అవుతాయి. అవి లేకుండా వ్యాకరణ దోషంగా రాసినట్లయితే వాటిని reflexive pronounsగా పరిగణించాలి.

 

4. Demonstrative Pronouns:
ఒక వ్యక్తిని లేదా అంశాన్ని ప్రత్యేకంగా వివరించే this, that, these, those అనే పదాలను Demonstrative Pronouns అంటారు.
e.g.: 1) That is the canal dug by Sir Arthur Cotton.
2) This is the book I borrowed from library.
3) These are the paintings of Ravi Varma.

 

5. Reciprocal Pronouns: Reciprocal అంటే mutual(పరస్పరం). ఒకరికొకరు లేదా ఒక అంశం మరో అంశంతో పరస్పరం పనిచేయునట్లు తెలియజేసే one another, each other అనే పదాలను Reciprocal Pronoun అంటారు.
రెండు అంశాలు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర చర్యను తెలియజేసేందుకు 'each other'ను, రెండింటికంటే ఎక్కువ అని తెలియజేసేందుకు 'one another' ను ఉపయోగించాలి.
Each other - Between two persons/ things.
One another - More than two persons/ things.
e.g.: 1) Hindus and Muslims tied rakhis to one another as a symbol of unity during the Swadesh Movement in 1906.
2) India and Pakistan are quarrelling with each other at the border.

 

6. Interrogative Pronouns: ప్రశ్నించడానికి ఉపయోగించే Pronoun ను Interrogative Pronoun అంటారు.
Who, whose, whom, which, what
Usage: Who - subjective case
Whom - objective case
Whose - possessive case
a) Who won the Rejeev Khel Ratna in 2014?
Who is waiting for you?
Note: 'who' అనే పదాన్ని కేవలం persons ను సూచించడానికి మాత్రమే ఉపయోగించాలి.
b) whose అనేది 'who' కు possessive form.
This is the boy whose purse is stolen at the Railway Station.
c) I bought at Koti a book whose pages are all torn.
Note: 'whose' అనే పదాన్ని సజీవులు, నిర్జీవులకు ఉపయోగించవచ్చు.
d) Whom అనేది who అనే పదానికి objective రూపం.
He is the boy whom you would like to meet.
Note: Interrogative pronouns అయిన What, Which లను Noun ముందు ఉపయోగించినప్పుడు అవి Interrogative adjectivesగా మారతాయి.

 

7. Relative Pronouns: రెండు వాక్యాలు లేదా clauses ను కలపడానికి Conjunction గా ఉపయోగించే who, what, which, that, as, but అనే పదాలను Relative Pronouns అంటారు.
e.g.: 1) These are the boys who climbed mount Everest.
2) Those who live in glass houses should not throw stones.
3) This is the car which I bought last year.
* Which is used for animals and inanimate things.
e.g.: 1) The speech Which I heard at the meeting influenced me much.
2) This is the dog Which was used by the police to find out clues.
* That అనే పదాన్ని వ్యక్తులు, వస్తువులకు కూడా ఉపయోగించవచ్చు.
e.g.: 1) This is the boy that I talked about.
2) This is the monument that was built by Tippusultan.
Note: Relative Pronounను ముందస్తుగా (antecedent)) ఉపయోగించిన పనిని అనుసరించి ఉపయోగించాలి.

 

8. Indefinite Pronouns: నిర్దిష్టం (Definite)) గా కాకుండా కొందరు, కొద్దిమంది, అందరూ, చాలామంది అని చెప్పేవాటిని Indefinite Pronoun అంటారు.
one, no one, no body, nothing, none, some, somebody, something, any, all etc.
1. Usage of one
a) For people in general (సాధారణంగా వ్యక్తులను తెలియజేయడానికి)
e.g.: 1) One should love one's neighbour.
2) One should not think too much of one self.
b) Countable noun కు ప్రత్యామ్నాయంగా
e.g.: a) These oranges are sour. I like sweet ones.
b) This phone is damaged. I need to buy a new one.
c) These/those/either/neither/first/last/ next అనే పదాల తర్వాత one/ones ఉపయోగించాల్సిన అవసరం లేదు.
e.g.: 1) Here are two pens you can take either (not either one)
2) These vans are smaller than those (not those ones)
2. Someone, somebody, somethingను పాజిటివ్ అర్థంలో no, nobody, none, nothing నెగటివ్ అర్థంలో ఉపయోగించే Pronouns.
e.g.: 1) Tamanna showed no interest in the new film.
2) The police did nothing to control the mob.
3) Something must be done before it is too late.
'some' అనే పదాన్ని పాజిటివ్ రూపంలో, వాక్యంలో పరిమాణం, స్థాయిని తెలియజేయడానికి 'Any' అనే పదాన్ని negative లేదా interrogative వాక్యాల్లో ఉపయోగించాలి.
e.g.: 1) I shall buy some mangoes.
2) I will not buy any mangoes (Not some mangoes)
3) Did you buy any mangoes?
Note: Some అనే పదాన్ని request రూపంలో ఉన్న Interrogative వాక్యంలో ఉపయోగించవచ్చు.
e.g.: Will you please give me some water?

 

9. Distributive Pronouns: వస్తువులు లేదా వ్యక్తులను ఒక్కోటిగా తీసుకున్నట్లు తెలిపే పదాలను Distributive pronoun అంటారు.
Each, Either, Neither
* Each అనే పదాన్ని 'ప్రతి ఒక్క' అనే అర్థంలో ఉపయోగిస్తాం.
e.g.: 1) Each should love his/her own country.
2) Each of us has a problem.
3) Either , Neither అనే పదాలను రెండు అంశాలు/ఇద్దరు వ్యక్తులను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాం.
Neither → Negative meaning
Either → Positive meaning
* Either of the two proposals is acceptable to him.
* Neither of the allegations is true.
Note: Either, neither singular రూపంలో ఉండాలి.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌