• facebook
  • whatsapp
  • telegram

పజిల్‌ టెస్ట్‌

సూచనలు (ప్ర. 1 - 2 వరకు): ఒక కంపెనీ ఉన్నతాధికారులు న్యూదిల్లీలో ఒక మీటింగ్‌ను నిర్వహించారు.

I. A  హిందీ, తమిళంలలో మాట్లాడగలడు.

II. B హిందీ, ఇంగ్లిష్‌లలో మాట్లాడగలడు.

III. C  ఇంగ్లిష్, తమిళంలలో మాట్లాడగలడు.

IV. D   బెంగాలీ, హిందీలలో మాట్లాడగలడు.

V. E తమిళనాడు వాస్తవ్యుడు, బెంగాలీ కూడా మాట్లాడగలడు.

       పైన ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. 

1.    C, D లు మాట్లాడుకోవాలంటే ఏ అనువాదకుడు ఉండాలి?

1) కేవలం A      2)  కేవలం B    3) కేవలం E     4)  మిగతా ముగ్గురిలో ఎవరైనా ఒకరు.

సమాధానం: 4

 

2.    ఏ అనువాదకుడు లేకుండా మాట్లాడుకోలేని వారు ఎవరు?
1) B & E     2) A & B    3) A & C     4) B & D

సమాధానం: 1

వివరణ:

సూచనలు (ప్ర. 3 - 5 వరకు): ఒక తరగతిలో A, B, C, D, E, F, G అనే ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. వారు బెంచీలు I, II, III లపై, ప్రతి బెంచీపై కనీసం ఇద్దరు చొప్పున, ప్రతి బెంచీపై కనీసం ఒక అబ్బాయి, ఒక అమ్మాయి చొప్పున కూర్చున్నారు. C అనే బాలిక A, E, D లతో కలిసి కూర్చోదు. F అనే బాలుడు కేవలం B తోనే కూర్చుంటాడు. A అనే విద్యార్థి బెంచీ I పై తన ఆప్తమిత్రులతో కలిసి కూర్చుంటారు. G, బెంచీ IIIపై కూర్చుంటారు. E, C కి సోదరుడు.

 పై సమాచారం ఆధారంగా కింది వాటికి జవాబులు గుర్తించండి.


3. ఆ ఏడుగురిలో ఎంతమంది బాలికలు ఉన్నారు?
1) 3       2) 2      3) 4       4) 3 లేదా 4
సమాధానం: 4


4. C తో కలిసి ఎవరు కూర్చుంటారు?
1) B        2) D      3) E        4) G
సమాధానం: 3


5. ఏ బెంచీపై ఇద్దరు బాలురు కూర్చునే అవకాశం ఉంది?
 1) I     2) II    3) III     4) II లేదా III  
సమాధానం: 1

వివరణ:

 

6. A జరిగితే కింది వాటిలో ఏది జరుగుతుంది?

I) F & G     II) E & H    III) D

1) కేవలం I        2)  కేవలం II       3) కేవలం III

4) 4) I & III లేదా II & III , కానీ రెండూ మాత్రం కాదు.
సమాధానం: 4

 

7. J జరిగిందంటే కచ్చితంగా ఏది జరిగి ఉండాలి?
1) E      2) E & F      3) B లేదాC     4) G

సమాధానం: 3

 

8.    ఏది జరగకపోయినా (దేని మీద ఆధారపడకుండా) జరిగేది ఏది?
I) D      II) A       III) F
 1) కేవలం I        2)  కేవలం II       3) I & II      4) II & III

సమాధానం: 3

వివరణ:

సూచనలు (ప్ర. 9 - 11 వరకు): ఏడుగురు సోదరీమణులైన దీప, గయ, మమత, నీతు, ప్రియ, రీట, సరితల వయసులు 4, 5, 6, 7, 8, 9, 10 సంవత్సరాలు.

I.   రీట, సరిత కంటే ఒక సంవత్సరం చిన్నది.

II.  రీట కంటే గయ 3 సంవత్సరాలు పెద్దది.

III.  ప్రియ అందరికంటే పెద్దదికాదు, చిన్నది కూడా కాదు.

IV. నీతు, దీప కంటే చిన్నది.

V.  మమత కంటే ఎంతమంది సోదరీమణులు పెద్దవారో, అంతేమంది చిన్నవారిని కూడా కలిగి ఉంది.

9.    మమత, ప్రియల మధ్య వయసుల భేదం ఎంత?

 1) 0 సంవత్సరాలు        2) 1 సంవత్సరం      3)  2 సంవత్సరాలు       4) 4 సంవత్సరాలు
సమాధానం: 2

 

10. అందరి కంటే చిన్నవారు ఎవరు?
 1) నీతు      2) రీట       3)  గయ      4)  దీప

సమాధానం: 1


11. అందరికంటే పెద్దవారు ఎవరు?

1) నీతు       2)  సరిత       3)  రీట       4)  గయ

                                        సమాధానం: 2


వివరణ:


సూచనలు (ప్ర. 12 - 13 వరకు): నలుగురు యువకులు అనిల్, ముఖేష్, పీయూష్, యోగేష్‌లను మున్నా, బాబు, ప్రిన్స్, పప్పు అనే ముద్దుపేర్లతో పిలుస్తారు. వీరు మధు, సునంద, జ్యోతి, ఆర్తి అనే స్త్రీలను వివాహం చేసుకున్నారు.

I.   ఆర్తి, మధు అనేవారు పీయూష్‌ లేదా అనిల్‌ అనేవారిని వివాహం చేసుకోలేదు. వారి భర్త బాబు కాదు.

II. బాబు సునందను వివాహం చేసుకోలేదు, మరియు అతడు పీయూష్‌ కాదు.

III. సునంద, మున్నాను వివాహమాడలేదు.

IV. ముఖేష్‌ అనేవ్యక్తి మున్నా కాదు, ప్రిన్స్‌ కాదు. అలాగే మధును వివాహం చేసుకోలేదు.

 

12. కింది వారిలో భార్యభర్తల జంట కానిది ఎవరు?

1) మున్నా, మధు         2)  బాబు, జ్యోతి     3) పప్పు, ఆర్తి         4) పైవేవీకావు

                                          సమాధానం: 4

 

13. ముఖేష్‌ ముద్దుపేరు ఏమిటి?

1) బాబు    2)  పప్పు    3) మున్నా   4)  ప్రిన్స్‌

                                         సమాధానం: 2


వివరణ: 


సూచనలు (ప్ర. 14 - 15 వరకు): A, B, C అనేవారు నలుపు, నీలం, ఆరెంజ్‌ రంగుల చొక్కాలను, ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్‌ రంగుల ప్యాంట్లు వేసుకున్నారు. ఏ వ్యక్తి కూడా ఒకే రంగు ప్యాంట్, చొక్కా వేసుకోలేదు.

I.  A నలుపు రంగు చొక్కా వేసుకోలేదు.

II. B నీలం రంగు చొక్కా వేసుకోలేదు.

III. C ఆరెంజ్‌ రంగు చొక్కా వేసుకోలేదు.

IV. A ఆకుపచ్చ రంగు ప్యాంట్‌ వేసుకోలేదు.

V. B ఆరెంజ్‌ రంగు ప్యాంట్‌ను ధరించాడు.


14. C ధరించిన ప్యాంట్, చొక్కాల రంగు ఏమిటి?

1) ఆరెంజ్, నలుపు     2) ఆకుపచ్చ, నీలం    3) పసుపు, నీలం         4) పసుపు, నలుపు

సమాధానం: 2

 

15. A ధరించిన చొక్కా, ప్యాంట్‌ల రంగులు ఏమిటి?

1) నలుపు, పసుపు     2)  ఆరెంజ్, ఆకుపచ్చ    3)  ఆరెంజ్, పసుపు     4)  పసుపు, ఆరెంజ్‌
సమాధానం: 3

వివరణ: 


సూచనలు (ప్ర. 16 - 17 వరకు): ఒక పరీక్షలో A, B, C, D, E, F అనే ఆరుగురు మిత్రులు వేర్వేరు మార్కులు పొందారు. C అనే వ్యక్తి A, E ల కంటే మాత్రమే ఎక్కువ మార్కులు సాధించాడు.  D అనే వ్యక్తి కేవలం B కంటేనే తక్కువ మార్కులు పొందాడు.  E అందరి కంటే తక్కువ మార్కులు పొందిన వ్యక్తి కాదు. అందరికంటే ఎక్కువ మార్కులు పొందిన వారిలో మూడో వ్యక్తికి 81 మార్కులు వచ్చాయి. ని అనే వ్యక్తికి 62 మార్కులు వచ్చాయి.

ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు తెలపండి.


16.  కిందివాటిలో ది మార్కులు ఏవి అయి ఉండొచ్చు?

1) 81     2) 86    3) 61     4) 70

సమాధానం: 4

 

17. కిందివాటిలో ఏది సత్యం?

1) D అనే వ్యక్తి కచ్చితంగా 70 కంటే తక్కువ మార్కులు పొందాడు.

2) F అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాడు.

3) C కంటే కేవలం ఇద్దరే ఎక్కువ మార్కులు సాధించారు.

4) పైవేవీ కావు.

సమాధానం: 4


వివరణ: C మార్కులు 62 కంటే ఎక్కువ, 81 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి 70 అయ్యే అవకాశం ఉంది.


సూచనలు (ప్ర. 18 - 19 వరకు): A, B, C, D, E, F అనే ఆరుగురు ఉన్న ఒక కుటుంబంలో లాయర్, డాక్టర్, టీచర్, సేల్స్‌మేన్, ఇంజినీర్, అకౌంటెంట్‌ వృత్తులు నిర్వహిస్తున్నారు. ఇందులో రెండు వివాహం చేసుకున్న      జంటలు ఉన్నాయి. D అనే సేల్స్‌మేన్‌కు మహిళా టీచర్‌తో వివాహమైంది. డాక్టర్, లాయర్‌ను వివాహం చేసుకున్నారు. F అనే అకౌంటెంట్‌  B కి కుమారుడు మరియు E కి సోదరుడు అవుతాడు. C అనే లాయర్‌  A కి కోడలు. E ఒక అవివాహిత ఇంజినీర్‌. A అనే వ్యక్తి F కి అమ్మమ్మ/నాన్నమ్మ అవుతుంది.

అయితే కిందివాటికి సమాధానాలను గుర్తించండి.


18. E, F కి ఏమవుతారు?

1) సోదరుడు   2)  సోదరి  3)  కజిన్‌   4)  చెప్పలేం

సమాధానం: 4


19. B వృత్తి ఏమిటి?

1)  టీచర్‌      2)  డాక్టర్‌      3)  లాయర్‌     4) చెప్పలేం

సమాధానం: 2

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌