• facebook
  • whatsapp
  • telegram

Verbs

ఆంగ్ల వ్యాకరణంలోని అన్ని అంశాలు దేనికవే ప్రాధాన్యమైనవి. అందులో క్రియ (Verb) కూడా ఒకటి. ఒక వాక్యానికి క్రియ (Verb) గుండెలాంటిది. క్రియ అంటే ఏమిటి? ఇవి ఎన్ని రకాలు? వాటిని ఏయే సందర్భాల్లో ఎలా ఉపయోగించాలి? పాటించాల్సిన నియమాలేంటి మొదలైన విషయాలను తెలుసుకుందాం.
 

క్రియ ( The Verb)

ఒక వాక్యంలో subject స్థానంలో ఉపయోగించిన పదం చేసే పనిని/స్థితిని తెలియజేసే పదాన్ని Verb అంటారు.

* He has a car - Possession
Verbsని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి: 1) Main Verbs 2) Helping Verbs

Main Verbs: ఒక వాక్యంలో ఒకే క్రియ(Verb) ఉన్నట్లయితే దాన్ని ప్రధాన క్రియ(Main Verb)గా పరిగణించాలి.
e.g.:  * I sent a mail to you yesterday.
* He is in Hyderabad.
* I have a bike.
Main verbs ని తిరిగి రెండు విధాలుగా విభజించవచ్చు.
1) Strong Verbs
2) Weak Verbs

 

1) Strong Verbs: క్రియలోని ప్రధాన Vowel letter ని మారుస్తూ ఇతర రూపాల్లో ఉపయోగించే వాటిని Strong Verbs అంటారు.

2) Weak Verbs: క్రియ(Verb) 'base form' కి "d/ed/ied" అనే suffix చేర్చడం ద్వారా ఇతర రూపాల్లో ఉపయోగించే క్రియలను Weak Verbs అంటారు.

 

Some troublesome verbs in English

కొన్ని క్రియలను Strong form, Weak form రూపాల్లో విభిన్న అర్థాలు వచ్చే విధంగా ఉపయోగించవచ్చు.
1) a) Bear (to give birth(జన్మనివ్వడం)) - bore - born
e.g.: Gandhiji was born on 2nd October, 1869.
b) Bear (to carry (మోయడం)/ tolerate (భరించడం)) - bore - borne
e.g.: The machine was so heavy that it could be borne with great difficulty.
2) a) Wind - wound → To turn a key or to coil something round (గుండ్రంగా చుట్టడం)
e.g.: Haven't you wound your watch yet? (not winded)
b) Wind - winded - make somebody unable to breathe easily for a short time( ఒక క్షణం పాటు శ్వాస ఆడకుండా చేయడం)
e.g.: Police dogs winded all the criminals (not wound)
3) a) Lie - lied - lied → speaking false hood (అబద్ధం మాట్లాడటం)
e.g.: He lied that he had never seen them before.
b) Lie - Lay - Lain → to rest (పడుకోవడం)
e.g.: The old man lay on the bed and rested for a while.


Helping Verbs/Auxiliary Verbs

ఒక వాక్యంలో రెండు క్రియలను ఉపయోగించినప్పుడు మొదటిదాన్ని సహాయక క్రియగా, రెండోదాన్ని ప్రధాన క్రియగా పరిగణించాలి.
e.g.: * He has taken lunch.
                H.V . M.V.
* He is watching TV. (see H.V. table)
        H.V. M.V.

క్రియలను తిరిగి రెండు రకాలుగా విభజించవచ్చు.
 

1) Transitive Verbs: Object తోపాటుగా ఉపయోగించిన క్రియలను Transitive Verbs అంటారు.
(Verb కు ఎవరిని (whom)/ ఎవరికి (who to) / దేన్ని (what) /దేనికి (what to) అని ప్రశ్న వేసుకున్నప్పుడు జవాబు వస్తే దాన్ని Transitive Verb అంటారు.)
e.g.: * Sita drew a picture.
(పై ఉదాహరణలో Verb drew. సీత దేన్ని గీసింది అనే ప్రశ్న వేసుకుంటే బొమ్మ (picture)ను అనే సమాధానం వస్తుంది.)
* Ravi teaches English.

 

2) Intransitive Verbs: Object లేకుండా ఉపయోగించిన క్రియలను Intransitive Verbs అంటారు.
(Verb కు ఎవరిని (whom)/ ఎవరికి (who to )/ దేన్ని (what) / దేనికి (what to) అని ప్రశ్న వేసుకున్నప్పుడు జవాబు రాకపోతే దాన్ని Intransitive Verb అంటారు.)
e.g.: * The water level in the river is rising.
* The bell rang loudly.

కొన్ని క్రియలను Transitive, Intransitive రూపాల్లో కూడా ఉపయోగిస్తారు.


Subject - Verb agreement:

1) రెండు లేదా అంతకంటే ఎక్కువ Singular Nounsను 'and' తో కలిపి, ఒకే అంశాన్ని/భావనను తెలియజేస్తున్నప్పుడు Singular Verb ఉపయోగించాలి.
e.g: * Knowledge and wisdom makes a man great.
* Slow and steady wins the race.


2) రెండు పదాలను 'and' తో కలిపి, మొదటి పదం ముందు article 'the' ఉపయోగిస్తే అది ఒకే అంశాన్ని సూచిస్తుంది. కాబట్టి వాటితోపాటు Singular Verb ఉపయోగించాలి.
e.g.: * The District magistrate and collector is on leave today.
* The principal and teacher of biology is explaining blood system.


3) రెండు Singular Nounsను "and"తో కలిపి, వాటి ముందు each లేదా every అనే పదాలను ఉపయోగించినప్పుడు కూడా Singular Verb ఉపయోగించాలి.
e.g.: Every boy and every girl was present.


4) With, together with, as well as, accompanied by అనే పదాలతో రెండు Nouns ను కలిపినప్పుడు మొదటి పదం ఆధారంగా క్రియను ఉపయోగించాలి.
e.g.: * The mother with her children is here.
(ఇక్కడ mother sigula rకాబట్టి verb కూడా singular.)
* The children with their mother are here.
(ఇక్కడ children plural కాబట్టి verb కూడా plural.)
* The Chief Minister together with cabinate ministers is invited to this function.
* Mr. Naveen accompanied by his wife and children, is arriving to night by the train.


5) Distance, weight, time, amount కి సంబంధించిన అంశాల ముందు numerical number ఉపయోగించి ఒక యూనిట్‌గా చెప్పినప్పుడు Singular Verb ఉపయోగించాలి.
e.g.: * Ten thousand rupees was donated by him to the charity.
* Fifteen minutes is allowed to each speaker.


6) One of, none of, each of, every one of, either of, neither of తర్వాత Plural subject, Singular Verb ఉపయోగించాలి.
e.g.: * One of my friends works in infosys.
* Each of the boys has been given a prize.
* Neither of his two sons is clever.


7) The number of - Singular
    A number of - Plural
e.g.: * The number of boys in the team was seven.
* A number of students are absent today.


8) Either - or, Neither - nor అనే వాటితో కలిపినప్పుడు రెండో పదం ఆధారంగా క్రియను ఉపయోగించాలి.
e.g.: * Either Ramya or Priya is beautiful.
* Either Chief Minister or the Cabinet
Ministers are responsible for this problem.

 

Choose the correct verb form to fill in the blank in the given sentence.

1. The doctor wanted the patient to be ..... on the bed.
1) lied 2) laid 3) slept 4) laying
Ans: (2)

 

2. Her heart ..... (swell) with pride at her success.
1) swollen 2) swelled 3) swells 4) swelling
Ans: (2)

 

3. Identify the part of the sentence that has an error.
a) A police officer b) together with ten conistables c) were killed in a landmine d) triggered by militants
1) a 2) b 3) c 4) d
Ans: (3)

 

4. Choose the grammatically correct sentence.
a) peace and prosperity are the need of the day. b) Rice and Curry is my favourite dish.
1) only statement 'a' is correct
2) only statement 'b' is correct
3) both a & b are correct
4) Both a & b are wrong
Ans: (2)

 

5. Identify the part of the sentence that has an error. Most of the rivers in
Allahabad (1)/ has over flown (2)/ their banks and plunged (3)/ a large number of villages. (4)
Ans: (2)

 

6. Choose the suitable phrase to make grammatically correct sentence.
* Rajani abided by all the rules which was explained to him before the programme.
1) all the rule which were 2) all the rules which were 3) all rules which were 4) No error
Ans: (2)

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌