• facebook
  • whatsapp
  • telegram

కోర్సులు, ఉన్న‌త విద్యావ‌కాశాలు

కోర్సులు

మూడేళ్ల కోర్సులు
సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ), ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్.

మూడున్నరేళ్ల కోర్సులు
మెటలర్జికల్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్, కెమికల్(ఆయిల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), సిరామిక్, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ.

ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు
ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో క‌లిపి 248 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 70620 సీట్లున్నాయి. వీటికోసం ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది పోటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఉన్న‌త విద్యావ‌కాశాలు

పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ, రెగ్యులర్ కోర్సులు చేయవచ్చు. తద్వారా కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడే ఉన్నత సాంకేతిక విద్యావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ఈసెట్ (ఎఫ్.డి.హెచ్.): ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -ఫర్ డిప్లొమా హోల్డర్స్ (ఈసెట్-ఎఫ్‌డీహెచ్)గా వ్యవహరించే ఈ ప్రవేశపరీక్ష ద్వారా ఇంజినీరింగ్ చేయవచ్చు. కాల వ్యవధి మూడేళ్లు. లేటరల్ ఎంట్రీ అని పిలిచే ఈ విధానంలో నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరవచ్చు. అయితే ఈ విధానం ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లోనే ఉంది. యూనివర్సిటీల అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచి చదవాల్సిందే. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో 10 శాతం సీట్లను ఈసెట్ (ఎఫ్‌డీహెచ్)కు కేటాయించారు.

పాలిటెక్నిక్ చదివినవారు ఎంసెట్ రాయడానికీ అర్హులే. ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా తమకు ఆసక్తి ఉన్న బ్రాంచీల్లో చేరవచ్చు.

జేఈఈ(మెయిన్) రాసి, ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్ లేదా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేయవచ్చు.

'ఎస్‌డీసీ' శిక్షణ: ఎంసెట్ కోచింగ్ తీసుకుంటూ ఇంటర్మీడియట్ చదివి, ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులతో పోలిస్తే పాలిటెక్నిక్ చేసి లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ డిగ్రీలో చేరిన విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్, ఇతర నైపుణ్యాలు తక్కువే అనేది పారిశ్రామిక వర్గాలు తరచూ వెల్లడించే అభిప్రాయం. అందుకే పాలిటెక్నిక్ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, ఆంగ్లభాషణ లాంటి అంశాల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాలను చేపట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో పోలిస్తే, టెక్నికల్ సబ్జెక్టుల్లో దీటుగా ఉన్నా, సాఫ్ట్ స్కిల్స్ లాంటి కొన్ని నైపుణ్యాల్లో వెనుకబడి ఉంటారు. ఈ లోపాన్ని సవరించడానికి పాలిటెక్నిక్ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను (ఎస్‌డీసీ) ఏర్పాటుచేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నందువల్ల వారికి సాఫ్ట్‌స్కిల్స్, ఇతర అవసరమైన అంశాల్లో శిక్షణనిచ్చి పారిశ్రామిక వర్గాల అంచనాలకు అనుగుణంగా తయారుచేయడమే ఈ కేంద్రాల లక్ష్యం.

Posted Date : 02-07-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌