• facebook
  • whatsapp
  • telegram

అనాలజీ     

                అనాలజీ అంటే పోలిక అని అర్థం. ఈ అనాలజీలో అడిగే ప్రశ్నల్లో రెండు సంఖ్యలు ఇస్తారు. ఆ సంఖ్యల మధ్య సంబంధం ఉంటుంది. దానిని అర్థం చేసుకుని, ఇచ్చిన ఛాయిస్ నుంచి అదే సంబంధమున్న సంఖ్యను కనుగొనాల్సి ఉంటుంది. దీనిలో అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన వాటిని గుర్తుంచుకోవాలి.

* ఒక సంఖ్యను ఇంకో సంఖ్యతో గుణించవచ్చు.
* ఒక సంఖ్య వర్గం లేదా వర్గమూలం మరో సంఖ్య వర్గం లేదా వర్గమూలం కావచ్చు.
* ఒక సంఖ్య ఘనం లేదా ఘనమూలం మరో సంఖ్య ఘనం లేదా ఘనమూలం కావచ్చు.
* ఇచ్చిన రెండు సంఖ్యలు వరుస సరి, బేసి లేదా ప్రధాన సంఖ్యలుగా ఉండొచ్చు.

 

1. 7 : 14 :: 9 : --
   a) 11         b) 14          c) 18           d) 19 
జవాబు:  (c) అవుతుంది. ఈ ప్రశ్నలో మొదటి రెండు సంఖ్యలు అంటే 7 : 14 మధ్య ఉన్న సంబంధం 7 ను 2తో గుణిస్తే 14 వస్తుంది. ఈ విధమైన సంబంధమే 9 ని '2' తో గుణిస్తే 9×2 = 18 అవుతుంది. కాబట్టి సమాధానం C అవుతుంది.

 

2. 24 : 15 :: 63 : -- 
   a) 56          b) 38           c) 58           d) 48 
జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో 24, 15 సంఖ్యలకున్న సంబంధం కనుగొని 63 తర్వాత సంఖ్యకు కూడా అదే సంబంధం కనుగొనాలి. 24 = 52-1, 15 = 42-1. ఇక్కడ 52-1, 42-1 అంటే వరుసగా తగ్గే సంఖ్యలను వర్గంచేసి -1 చేశారు. అలాగే 63 = 82-1 తర్వాత 72-1 = 49-1 = 48 అవుతుంది.

 

3. 2 : 7 :: 6 : -- 
   a) 39           b) 37           c) 25          d) 18
జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో 2, 7 అయ్యేందుకు.. 22 + 3 = 4 + 3 = 7 అయింది. అదే విధంగా 62+3 = 36+3 = 39 అవుతుంది.

 

4. 37 : 73 :: 46 : -- 
   a) 82           b) 64           c) 84           d) 68
జవాబు: (b) అవుతుంది. ఈ ప్రశ్నలో 37, 73 అయింది. దీనిలో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 37ను తిప్పి రాశారు. అదే విధంగా 46ను తిప్పి రాస్తే 64 అవుతుంది.

 

5. 8 : 81 :: 10 : -- 
   a) 100           b) 125           c) 200           d) 121

జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో 8 తర్వాత 81 రావడానికి 8 తర్వాత సంఖ్యను (9) వర్గం చేశారు = 92 = 81. అదే విధంగా 10 తర్వాత సంఖ్యను (11) వర్గం చేస్తే = 112 = 121.
 

6. 1 : 4 :: 25 : --
   a) 27         b) 29          c) 30             d) 36
జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో 1, 4 మధ్య సంబంధం 1=12 4 = 22, 25 = 52. 12, 22 వరుసగా పెరిగితే సహజ సంఖ్య వర్గాలు అదే విధంగా 52, 62 అవుతాయి. అంటే 62= 36 అవుతుంది.

 

7. 3 : 24 :: 5 : -- 
a) 128             b) 125             c) 120             d) 123
జవాబు: (c) అవుతుంది ఈ ప్రశ్నలో 3, 24 అయ్యేందుకు సంబంధం 33-3 = 27-3. అంటే ఇచ్చిన సంఖ్యను ఘనం చేసి అదే సంఖ్యను తీసేయాలి. ఇదేవిధంగా 5ను ఘనం చేసి 5ను తీసేయాలి. అంటే 53-5 = 125-5 = 120.

 

8. 8 : 24 :: -- : 32 
a) 5          b) 6             c) 10             d) 8
జవాబు: (b) అవుతుంది. ఈ ప్రశ్నలో మొదటి సంఖ్యను కనుక్కోవడానికి రెండో సంఖ్య నుంచి సంబంధం కనుక్కోవచ్చు. అదేవిధంగా నాలుగో సంఖ్యనుంచి మూడో సంఖ్యను కనుక్కోవచ్చు. ఇప్పుడు రెండో సంఖ్య 24 దానిని 2×4 చేస్తే 8 వస్తుంది. అదే విధంగా 32.. 3×2 = 6 అవుతుంది.

9. 63 : 9 :: -- : 14 
   a) 68             b) 42             c) 96             d) 56
జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో మొదటి సంఖ్యనుంచి రెండో సంఖ్య వస్తుంది. అదేవిధంగా ఇచ్చిన ఛాయిస్‌లో ఒకదానిని ఉపయోగించి నాలుగో సంఖ్య రావాలి. 63 నుంచి 9 రావడానికి 6+3 = 9 అవుతుంది. ఇచ్చిన ఛాయిస్‌లో 68నుంచి 6+8 = 14.

 

10. 6 : 18 :: 4 : -- 
    a) 2             b) 6             c) 8            d) 16
జవాబు: (c) అవుతుంది. ఈ ప్రశ్నలో మామూలుగా ఆలోచిస్తే 6×3 = 18 అవుతుంది. కానీ 4×3 = 12 లేదు కాబట్టి మరో సంబంధాన్ని కనుక్కోవాలి. మొదటి సంఖ్యను వర్గంచేసి దాన్ని '2' తో భాగిస్తే 18 వస్తుంది. అదే విధంగా 4ను వర్గం చేసి దాన్ని '2'తో భాగిస్తే 8 వస్తుంది.
             62 = 36    = 18
             42 = 16     = 8

 

11. 8 : 28 :: 27 : -- 
    a) 8             b) 28             c) 64             d) 65       

జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో 8ని 23గా అర్థం చేసుకోవచ్చు. 28 రావడానికి 33+1 = 27+1. అంటే 23 తర్వాత 33+1 ను తీసుకున్నారు. అదే విధంగా 33 తర్వాత 43 తీసుకుని +1 కలపాలి. 
                 23 : 33+1 = 8 : 28
                 33 : 43+1 = 27 : 65 అవుతుంది.

 

12. 583 : 293 :: 488 : -- 
    a) 291             b) 378             c) 487             d) 581
జవాబు: (b) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని చూస్తే వర్గాలుకాని, ఘనంగాని, గుణించినా, భాగించినా మనకు కావాల్సిన సమాధానం రావడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అప్పుడు కొన్ని ప్రశ్నలకు మామూలుగా సమాధానం చేయవచ్చు. ఈ ప్రశ్న కూడా అదే విధంగా ఉంది. 583 అంకెల మొత్తం కలిపిచూస్తే 5+8+3 = 16 అవుతుంది. 293 కూడా పై విధంగా చేస్తే 2+9+3 = 14. ఈ రెండింటి మొత్తాల మధ్య తేడా 16-14 = 2 అవుతుంది. మిగతావాటిని కూడా ఇదే విధంగా చేస్తే 4+8+8 = 20 అవుతుంది. దీనిలోంచి తేడా 2 తీసేస్తే మొత్తం 18 కావాలి. అప్పుడు 
                 378   3+7+8 = 18 
                 5+8+3 = 16        2+9+3 = 14 
                 4+8+8 = 20       3+7+8 = 18

 

13. (18, 8, 2) కిందివాటిలో ఏ సమాధానం సరైనది? 
    a) (3, 7, 1)             b) (11, 12, 10)             c) (17, 19, 3)             d) (24, 22, 4)
జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన set (18, 8, 2). ఇందులో అన్ని సరి సంఖ్యలు ఉన్నాయి. ఇచ్చిన ఛాయిస్ అన్నింటిలో సరి సంఖ్యలు ఉన్న సమాధానం (d) అవుతుంది (24, 22, 4).

 

14. (8, 3, 2) కిందివాటిలో ఏ సమాధానం సరైనది? 
    a) (10, 6, 5)             b) (63, 8, 3)             c) (95, 24, 5)             d) (168, 15, 4)
జవాబు: (b) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన set (8, 3, 2). ఇందులో ఉన్న సంబంధాన్ని కనుక్కుని కింద ఇచ్చిన ఛాయిస్‌లో కూడా అదే సంబంధం ఉన్న ఛాయిస్‌ను ఎన్నుకోవాలి. ఇప్పుడు ఇచ్చింది (8, 3, 2). ఇందులో 2, 3 అవడానికి 22 = 4 - 1 = 3, తర్వాత 3, 8 అవడానికి 32 = 9 - 1 = 8 అలాగే కిందివాటిలో 3, 8 అవడానికి 3= 9 - 1 = 8. 8, 63 అవడానికి 82 = 64 - 1 = 63 అవుతుంది.
                   (8, 3, 2) = 22-1 = 3, 32-1 = 8
                  (63, 8, 3) = 32-1 = 8, 82-1 = 63.

 

15. 363,  489,  579 ఈ సంఖ్యలకు సరైన సమాధానం కనుక్కోండి. 
    a) 562             b) 471             c) 382             d) 281
జవాబు: (b) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యలను ఇలా రాయవచ్చు. 
           సంఖ్య         sum of digits                    new sum of digits 
           363          3+6+3 = 12                          1+2 = 3 
           489          4+8+9 = 21                         2+1 = 3      

           579             5+7+9 = 21          2+1 = 3 
           471           4+7+1 = 12           1+2 = 3

 

16.   : 61 :: 

 : --
     a) 85             b) 86             c) 87             d) 89
జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో ఒక భిన్నం ఇచ్చి దాని విలువ 61 ఇచ్చారు. భిన్నంలోని సంఖ్యలను వర్గంచేస్తే - 52 = 25, 62 = 36. ఈ రెండింటిని కూడితే 25+36 = 61 వస్తుంది. మిగిలిన భిన్నానికి కూడా ఇదే విధంగా చేస్తే సమాధానం వస్తుంది. 
                 =  =  = 25 + 36 = 61 
                  =  =  = 36 + 49 = 85
 

17. 4 : 9 :: 25 : -- 
    a) 49             b) 50            c) 38             d) ఏదీకాదు
జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన విలువలు వరుసగా 4 = 22, 9 = 32, 25 = 52 తర్వాత సంఖ్య 62 = 36 కాని ఇచ్చిన వాటిలో లేదు. కాబట్టి మరొక సంబంధం కనుక్కోవాలి. దీనిలో వరుస ప్రధాన సంఖ్యల వర్గాలను చూస్తే అప్పుడు               

                  4 = 22, 9 = 32, 25 = 52, 49 = 72 
                  22,  32,  52,  72

 

18. 123 : 6 :: 234 : -- 
    a) 22             b) 23            c) 24             c) ఏదీకాదు
జవాబు: (c) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన 123, 6 అవడానికి ఉన్న సంబంధమే 234కు కూడా వర్తించాలి.            
                123 = 1×2×3 = 6 
                234 = 2×3×4 = 24

 

19. 123 : 14 :: 234 :-- 
    a) 25             b) 27             c) 29             d) ఏదీకాదు
జవాబు: (c) అవుతుంది. ఈ ప్రశ్నలో 123ను 14 గా మార్చారు. అంటే 123లో ఉన్న ప్రతి అంకెను వర్గం చేసి కలిపారు. అదే విధంగా 234లో ప్రతి అంకెను వర్గం చేసి కలిపితే మనకు కావాల్సిన సమాధానం వస్తుంది. 
                  123 = 12+22+32 = 1+4+9 = 14 
                  234 = 22+32+42 = 4+9+16 = 29

 

20.  : 125 ::   : -- 
    a) 343             b) 527             c) 216             d) ఏదీకాదు

జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో  ను 125గా రాశారు. అంటే లవ, హారాలను కలిపి ఘనం చేశారు. అదే విధంగా  లో లవ, హారాలను కూడి ఘనం చేయాలి. 
              = 2+3 = 5   53 = 125 
              = 3+4 = 7   73 = 343

 

21. 34 : 912 :: 45 : -- 
    a) 1215             b) 1825             c) 5040             d) ఏదీకాదు
జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో 34 తర్వాత 912 వచ్చింది. అంటే 34లో ఉన్న ప్రతి అంకెను 3తో గుణించారు. అదే విధంగా 45లో ఉన్న ప్రతి అంకెను 3తో గుణిస్తే మనకు కావాల్సిన సంఖ్య వస్తుంది. 
            34 

  3×3, 4×3 = 912 
            45   4×3, 5×3 = 1215
 

22. 123 : 2 :: 639 : -- 
    a) 3             b) 4             c) 5             d) 6
జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో 123 తర్వాత 2 వచ్చింది. అంటే 123లో ఉన్న అంకెలను కలిపి 3తో భాగించారు. అదే విధంగా 639లో ఉన్న ప్రతి అంకెను కలిపి వచ్చిన మొత్తాన్ని 3తో భాగించాలి. 
            123   1+2+3 =  = 2 
            639   6+3+9 =  = 6.

Posted Date : 28-08-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌