• facebook
  • whatsapp
  • telegram

లాభనష్టాలు     

* వ్యాపారం చేసేవారు వస్తువులను కొని, అమ్ముతుంటారు. ఒక వస్తువును కొనడానికి చెల్లించిన ధరను ' కొనవెల ' (C.P.) అంటారు.
* ఆ వస్తువును వ్యాపారి ఏ వెలకు అమ్ముతాడో దాన్ని ' అమ్మినవెల ' (S.P.) అంటారు.
* వ్యాపారులు వస్తువులను కొన్నవెల కంటే ఎక్కువ ధరకు అమ్ముతారు. అమ్మినవెల, కొన్నవెల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని 'లాభం' అంటారు. 
ఉదా:  ఒక వ్యాపారి ఒక పుస్తకాన్ని రూ. 5 కు కొని, రూ. 6 కు అమ్మాడు. అయితే అతడి లాభమెంత?
సాధన:  పుస్తకం కొన్నవెల = రూ. 5
            పుస్తకం అమ్మినవెల = రూ. 6
అమ్మినవెల, కొన్నవెల కంటే ఎక్కువగ ఉంది కాబట్టి పుస్తకం అమ్మడం వల్ల వచ్చిన లాభం = రూ. 1 

 లాభం = అమ్మినవెల (అ.వె) - కొన్నవెల (కొ.వె) 
            అ.వె. = కొ.వె. + లాభం 
            కొ.వె. = అ.వె. - లాభం.

¤* ఒక్కొక్కప్పుడు వ్యాపారులు వస్తువులను కొన్న తరువాత ఆ వస్తువుల ధరలు తగ్గిపోవచ్చు. అప్పుడు కొన్నవెల కంటే తక్కువ ధరకు అమ్మవలసి వస్తుంది. ఇలా తగ్గిన సొమ్మును 'నష్టం' అంటారు.
 

ఉదా: ఒక వ్యాపారి ఒక సెల్ ఫోన్ ను రూ. 1000 కు కొన్నాడు. దాని ధర తగ్గడంతో రూ. 850కు అమ్మాడు. అయితే అతడి నష్టమెంత?
సాధన: సెల్ ఫోన్ కొన్నవెల = రూ. 1000
       సెల్ ఫోన్ అమ్మినవెల = రూ. 850 
వ్యాపారికి తగ్గిన ధర = 1000 = 50 = రూ. 150
కాబట్టి నష్టం = రూ. 150

నష్టం = కొన్నవెల (కొ.వె) - అమ్మినవెల (అ.వె.)
అమ్మిన వెల = కొన్నవెల - నష్టం
కొన్నవెల = అమ్మినవెల + నష్టం
గమనిక: అమ్మినవెల, కొనవెల కంటే ఎక్కువగా ఉంటే 'లాభం' వచ్చినట్లు. అమ్మినవెల, కొన్నవెల కంటే తక్కువగా ఉంటే 'నష్టం' వచ్చినట్లు.

      వ్యాపారి వస్తువులను కొన్న తరువాత కూలి ఖర్చులు, రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తుంది. వీటిని అదనపు ఖర్చులు అంటారు. ఈ ఖర్చులను కొన్న వెలలో భాగంగా చేర్చాలి. గిట్టుబాటు ధర = వస్తువు కొన్నవెల + అదనపు ఖర్చులు.
* సాధారణంగా లాభాన్ని లేదా నష్టాన్ని శాతంలో తెలుపుతారు. ఇలా తెలిపేటప్పుడు వీటిని కొనవెలలో శాతాలుగా తెలుపుతారు. లాభాన్ని లేదా నష్టాన్ని కొన్నవెలమీదే శాతంగా తెలుపుతారు.
వ్యాపారుల్లో వచ్చిన లాభం లేదా నష్టాలను పోల్చడానికి శాతాల్లో సూచిస్తారు. లాభాన్ని కొనవెలలో భిన్నంగా రాస్తే...
           లాభశాతం = లాభం / కొన్నవెల × 100 
           నష్టశాతం = నష్టం / కొన్నవెల × 100
* ఒక వస్తువును కొనధర రూ. c అమ్మిన ధర రూ. s అనుకోండి. లాభశాతం = g % అయితే వీటి మధ్య సంబంధం

                

ఉదా: ఒక్కో కొబ్బరికాయను ఒక్కొక్కటి రూ.6 చొప్పున అమ్మితే, 20% లాభం వచ్చింది. అయితే వంద కొబరికాయలను ఎన్ని రూపాయలుకు కొన్నట్లు?
సాధన: ఒక్కొకటి అమ్మిన ధర (s) = రూ. 6            లాభశాతం = 20% 
              

∴ వంద కొబ్బరికాయలను కొన్న ధర = 100 × 5 = రూ. 500

* ఒక వస్తువును కొన్నధర రూ. c, అమ్మిన ధర రూ. s అనుకోండి. నష్టశాతం = l % అయితే వీటి మధ్య సంబంధం  

      

* ఒక వ్యాపారి రెండు వస్తువులను విడివిడిగా ఒకే ధరకు అమ్మాడు. మొదటిదానిపై x % లాభం, రెండో దానిపై x % నష్టం వచ్చింది. మొత్తంమీద అతడికి   నష్టం (ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడూ నష్టమే ఉంటుంది).

ఉదా: ఒకడు రెండు సైకిళ్లను ఒక్కొక్కటి రూ. 1,188 లకు అమ్మాడు. మొదటి దానిపై 10% లాభం, రెండో దానిపై 10% నష్టం వచ్చింది. మొత్తంమీద లాభమా? నష్టమా? ఎంత శాతం?
సాధన: మొదటి సైకిల్ అమ్మినవెల = రూ. 1,188 
                         లాభం = 10%
                

రెండో సైకిల్ అమ్మినవెల = రూ. 1,188
                 నష్టం = 10%        


రెండు సైకిళ్ల మొత్తం కొన్నవెల = 1080 + 1320 = రూ. 2400
మొత్తం అమ్మినవెల = 1188 + 1188 = రూ. 2376
నష్టం  = కొన్నవెల - అమ్మినవెల
          = 2400 - 2376 = రూ. 24.

         = 1%      నష్టం = 1%

* ఒక వ్యాపారి రెండు వస్తువులను కొని ఒకేధరకు అమ్మాడు. మొదటి దానిపై x % లాభం, రెండోదానిపై x % నష్టం వచ్చింది. మొత్తంమీద అతడికి లాభంగానీ, నష్టంగానీ ఉండదు.

వర్తక రుసుం: వస్తువులు తయారుచేసేవారు తమకు ఆ వస్తువు గిట్టిన వెల (కొన్నవెల) పై కొంతలాభం వేసుకుని ప్రకటన వెల నిర్ణయిస్తారు. దీన్నేలిఖితమూల్యం అంటారు. కొనేవారిని ఆకర్శించేందుకు ఆ ప్రకటన వెలపై కొంత తగ్గించి అమ్ముతారు. ఈ తగ్గింపునే రుసుం, డిస్కౌంట్ అంటారు.
రుసుం ఎల్లప్పుడూ ప్రకటన వెలపై లెక్కిస్తారు.
* అమ్మినవెల = ప్రకటన వెల - రుసుం.
* ప్రకటన వెల రూ. M, రుసుం d % అయితే రుసుం  
అమ్మకం వెల = ప్రకటన వెల - రుసుం           
                    
* వర్తకులు వస్తువుల నిజ బరువు లేదా నిజ పొడవు (true value) లో x భాగం తగ్గించి అమ్మితే వారి లాభశాతం  

ఉదా: ఒక వ్యాపారి వస్తువులను కొన్న ధరకు అమ్ముతానని చెప్పి బరువు 1 కే.జి. కి బదులుగా 900 గ్రాములే తూచాడు. అతడి లాభశాతం ఎంత?
సాధన: బరువులో తేడా x = 1000 - 900 = 100 గ్రాములు. నిజబరువు y = 1000.
లాభశాతం = 
                   

Posted Date : 29-08-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌