1. ఆకలి కోరికలకు కారణమయ్యే హార్మోన్?
A) లెప్టిన్ B) ఘ్రెలిన్
C) కొలిసిస్టోకైనిన్ D) సెక్రెటిన్
జవాబు : B
2. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక నాడీవ్యవస్థ పేరు?
A) కేంద్రనాడీవ్యవస్థ B) పరిధీయ నాడీవ్యవస్థ
C) జీర్ణనాడీవ్యవస్థ D) సహానుభూతపర నాడీవ్యవస్థ
జవాబు : C
3. జీర్ణాశయం నుంచి కొద్ది కొద్ది మొత్తాల్లో ఆహారం చిన్నపేగుల్లోకి విడుదల కావడానికి కారణం?
A) పైలోరిక్ సంవరిణి B) పాయు సంవరిణి
C) ఎంటరిక్ సంవరిణి D) పెరిస్టాలిసిస్
జవాబు : A
4. జీర్ణాశయం నుంచి ఆంత్రమూలంలోకి ప్రవేశించే ఆహార ముద్ద పేరు?
A) బోలస్ B) మలం C) శ్లేష్మం D) ఖైమ్
జవాబు : D
5. మానవుల్లో సాధారణ దంత ఫార్ములా?
A) కుంతకాలు - 2, రదనికలు - 1, అగ్రచర్వణకాలు - 2, చర్వణకాలు - 3
B) కుంతకాలు - 3, రదనికలు - 1, అగ్రచర్వణకాలు - 2, చర్వణకాలు - 3
C) కుంతకాలు - 2, రదనికలు - 1, అగ్రచర్వణకాలు - 2, చర్వణకాలు - 2
D) కుంతకాలు - 2, రదనికలు - 2, అగ్రచర్వణకాలు - 2, చర్వణకాలు - 2
జవాబు : A
6. మనలో ఆకలి కోరికలను పెంచేవి?
A) ఆహారపు వాసన, ఆహారపు రుచి
B) ఆహారాన్ని చూడటం, అలసట, నీరసం
C) ఆహార అవసరం, ఆహారాన్ని గురించిన ఆలోచన
D) పైవన్నీ
జవాబు : D
7. వాసనకు సంబంధించిన గ్రాహకాలు?
A) ఘ్రాణ గ్రాహకాలు B) దృష్టి గ్రాహకాలు
C) నాసీసెప్టార్స్ D) మెకనోరిసెప్టార్స్
జవాబు : A
8. సాధారణంగా మానవులు?
A) నిశాచరులు B) దివాచరులు
C) కాథెమెరల్ D) ఏదీకాదు
జవాబు : B
9. ఆకలి కోరికలను మెదడుకు తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషించే కపాల నాడి ఏది?
A) అబ్డూసెన్స్ B) వెస్టిబ్యులో కాక్లియర్
C) గ్లాసోఫెరెంజియల్ D) వేగస్
జవాబు : D
10. ఆంత్రచూషకాల పని?
A) జీర్ణమైన ఆహారాన్ని శోషించడానికి పేగు గోడల వైశాల్యాన్ని పెంచడం
B) చిన్న పేగుల్లో నుంచి ఆహారాన్ని పెద్ద పేగుల్లోకి వదలడం
C) జీర్ణంకాని ఆహారాన్ని మలంగా మార్చడం
D) పెద్దపేగులోని ఉపయోగకర పదార్థాల పునఃశోషణ
జవాబు : A
11. జీర్ణనాళం చివరి భాగం?
A) పురీషనాళం B) ఉండూకం
C) పెద్దపేగు D) పాయువు
జవాబు : D