• facebook
  • whatsapp
  • telegram

అనువంశికత

1. జన్యుశాస్త్ర పిత అని ఎవరిని అంటారు?
A) వీజ్‌మన్‌        B) మెండెల్‌         C) లామార్క్‌          D) డార్విన్‌
జవాబు : B


2. డార్విన్‌ ఎవరి వల్ల ప్రభావితుడయ్యాడు?
A) సర్‌ చార్లెస్‌ లయేల్‌        B) మాల్థస్‌          C) A, B           D) లామార్క్‌
జవాబు : C


3. కిందివాటిలో డార్విన్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది?
A) మనుగడ కోసం పోరాటం
B) యోగ్యతమముల సార్థక జీవనం
C) ప్రకృతి వరణం
D) పైవన్నీ
జవాబు : D


4. నడుస్తున్న అవశేషాల మ్యూజియం అని దేన్ని అంటారు?
A) బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌
B) మానవులు
C) నెహ్రూ జంతు ప్రదర్శనశాల
D) బీఎం బిర్లా ప్లానెటోరియం
జవాబు : B


5. ఆర్కియాప్టెరిక్స్‌ అనేది ............, ............... మధ్య వారధిగా భావిస్తున్నారు.
A) సరీసృపాలు, పక్షులు
B) పక్షులు, క్షీరదాలు
C) ఉభయచరాలు, పక్షులు
D) చేపలు, పక్షులు
జవాబు : A


6. శిలాజాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ............. అంటారు.
A) పరాగరేణు శాస్త్రం
B) పురాజీవశాస్త్రం
C) జీవశాస్త్రం
D) భూగర్భశాస్త్రం
జవాబు : B


7. మెండెల్‌ ప్రయోగాలు చేసిన మొక్క ఏది?
A) బఠాణీ          B) వేరుశెనగ        C) శనగ         D) మామిడి
జవాబు : A


8. మెండెల్‌ ఏకసంకర ప్రయోగాల్లో F2 తరంలో దృశ్యరూప నిష్పత్తి?
A) 1 : 3          B) 1 : 2 : 1         C) 3 : 1           D) 1 : 1 : 2
జవాబు : C


9. మెండెల్‌ ఏక సంకర ప్రయోగాల్లో F2 తరంలో జన్యురూప నిష్పత్తి?
A) 1 : 3       B) 1 : 2 : 1           C) 3 : 1            D) 1 : 1 : 2 
జవాబు : B


10. బఠాణి మొక్కల కాయల్లో ................ రంగు బహిర్గత గుణాన్ని కలిగి ఉంటుంది.
A) పసుపు వర్ణం           B) నారింజ వర్ణం         
C) ఆకుపచ్చ వర్ణం          D) ఎరుపు వర్ణం
జవాబు : C


11. అనువంశికత అంటే....?
A) విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుంచి సంతతికి చేరడం
B) ఒక తరం నుంచి మరొక తరానికి లక్షణాలను అందించడం
C) A, B రెండూ
D) ఏదీకాదు
జవాబు : A


12. మానవుల్లోని క్రోమోజోమ్‌ల సంఖ్య?
A) 22 జతలు         B) 23      C) 23 జతలు          D) 46 జతలు
జవాబు : C


13. స్త్రీలలో ఉన్న క్రోమోజోమ్‌ల సంఖ్య?
A) 22 జతల శారీరక క్రోమోజోమ్‌లు, XX
B) 23 జతల శారీరక క్రోమోజ్‌మ్‌లు, XX
C) 23 జతల శారీరక క్రోమోజోమ్‌లు, XY
D) 46 జతల శారీరక క్రోమోజోమ్‌లు, XX
జవాబు : A


14. గెలపాగస్‌ దీవుల సందర్శనకు వెళ్లేందుకు డార్విన్‌ ఉపయోగించిన నౌక పేరేంటి?
A) HMS ఎండీవర్‌          B) RMS టైటానిక్‌
C) HMS బీగిల్‌          D) CSS వర్జీనియా
జవాబు : C


15. లామార్క్‌ తాను ప్రతిపాదించిన ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతానికి ఉదాహరణగా చూపించిన జంతువు?
A) జిరాఫీ           B) ఎలుక            C) పక్షులు         D) ఆర్కియాప్టెరిక్స్‌
జవాబు : A


16. ఎలుకలపై ప్రయోగాలు చేసి, లామార్క్‌ సిద్ధాంతం తప్పని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు?
A) డార్విన్‌             B) ఆగస్ట్‌ వీజ్‌మన్‌
C) ఆల్ఫ్రెడ్‌ రసెల్‌ వాలేస్‌          D) పాల్‌ మాల్థస్‌
జవాబు : B


17. గెలపాగస్‌ దీవుల్లో డార్విన్‌ ........ జీవుల్లోని వైవిధ్యాలను పరిశీలించి, పరిశోధనలు చేశారు.
A) ఎలుకలు          B) జిరాఫీ
C) బఠాణీ మొక్కలు         D) ఫించ్‌ పక్షులు
జవాబు : D


18. అవయవాల నిర్మాణంలో వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఒకే రకమైన పనిని నిర్వర్తించే రకమైన పరిణామక్రమం?
A) అపసారి పరిణామక్రమం          B) అభిసారి పరిణామక్రమం
C) సమాంతర పరిణామక్రమం            D) ఉత్పరివర్తన పరిణామక్రమం
జవాబు : B


19. ప్రస్తుత మానవుడి శాస్త్రీయ నామం?
A) హోమో ఎరెక్టస్‌           B) హోమో హాబిలస్‌
C) హోమో నియాండెర్తలెన్సిస్‌            D) హోమోసెపియన్స్‌
జవాబు : D


20. నిర్మాణంలో ఒకేరకంగా ఉండి, వేర్వేరు పనులు నిర్వర్తించే అవయవాలను .......... అంటారు.
A) నిర్మాణస్వామ్య అవయవాలు
B) క్రియాస్వామ్య అవయవాలు
C) ఇంటెగ్యుమెంటరీ అవయవాలు
D) మస్కులర్‌ అవయవాలు
జవాబు : A

Posted Date : 25-06-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌