• facebook
  • whatsapp
  • telegram

పోషణ

1. స్వయం పోషకాలకు ఉదాహరణ?
A) ఉభయజీవులు         B) సరీసృపాలు
C) ఆకుపచ్చ మొక్కలు       D) క్షీరదాలు
జవాబు : C


2. పత్రహరితంలో ఉన్న మూలకపు అణువు....
A) ఐరన్‌          B) మెగ్నీషియం         C) బోరాన్‌          D) నికెల్‌
జవాబు : B


3. బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సంయోగక్రియలో వెలువడేది?
A) సల్ఫర్‌          B) ఆక్సిజన్‌        C) కార్బన్‌డైఆక్సైడ్‌         D) హైడ్రోజన్‌
జవాబు : A


4. పత్రహరిత అణువు ..... లో కరగదు.
A) ఈథర్‌           B) ఎసిటోన్‌      C) మిథైలేటెడ్‌ స్పిరిట్‌          D) నీరు
జవాబు : D


5. ఆమ్లజని వాయువుకు ఆ పేరు పెట్టింది ఎవరు?
A) ప్రీస్ట్లీ         B) లెవోయిజర్‌       C) ఇంజెన్‌ హాజ్‌         D) హిల్‌
జవాబు : B


6. కిరణజన్యసంయోగక్రియకు కార్బన్‌డైఆక్సైడ్‌ అవసరమని నిరూపించే ప్రయోగంలో పొటాషియం హైడ్రాక్సైడ్‌ ఉపయోగం?
A) ఆక్సిజన్‌ను విడుదల చేయడం
B) కార్బన్‌డైఆక్సైడ్‌ను శోషించడం
C) పత్రహరితాన్ని కరిగించడం
D) పిండిపదార్థాలను ఏర్పరచడం
జవాబు : B


7. పత్రహరితానికి ఆ పేరు పెట్టింది?
A) కావెన్షూ, పెల్లీటర్‌        B) లెవోయిజర్, ప్రీస్ట్లీ
C) ఇంజెన్‌ హజ్, హిల్‌           D) ఏంగెల్‌మన్, వాన్‌ నీల్‌
జవాబు : A


8. కస్క్యూటాలో ఉండే ప్రత్యేకమైన వేర్లు?
A) పాకే వేర్లు          B) బొడిపెలున్న వేర్లు
C) నిమాటోఫోర్‌లు         D) హాస్టోరియాలు
జవాబు : D

 

9. లాలాజలంలో ఉండే ఎంజైమ్‌?
A) ట్రిప్సిన్‌           B) సుక్రేజ్‌
C) టయలిన్‌       D) పెప్సిన్‌
జవాబు : C


10. ఎంజైమ్‌లు లేని జీర్ణరసం?
A) క్లోమరసం          B) పైత్యరసం
C) జఠరరసం          D) ఆంత్రరసం
జవాబు : B


11. జీర్ణాశయంలో స్రవించబడే ఆమ్లం?
A) నత్రికామ్లం       B) సల్ఫ్యూరికామ్లం
C) ఆస్కార్బిక్‌ ఆమ్లం          D) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం
జవాబు : D


12. జీర్ణం కాని ఆహారపదార్థాలను శరీరం బయటికి పంపడం...
A) విసర్జన           B) శ్వాసక్రియ          C) మల విసర్జన          D) జీర్ణక్రియ
జవాబు : C


13. మెరాస్మస్‌ వ్యాధికి కారణం?
A) ప్రోటీన్‌ల లోపం         B) ప్రోటీన్, కేలరీల లోపం
C) అతిగా తినడం          D) కేలరీల లోపం
జవాబు : B


14. రక్తహీనతకు కారణం?
A) పైరిడాక్సిన్‌            B) ఫోలిక్‌ ఆమ్లం
C) A, B           D) సయనకోబాలమైన్‌
జవాబు : C

 

15. వంధ్యత్వాన్ని నిరోధించే విటమిన్‌?
A) రెటినాల్‌          B) కాల్సిఫెరాల్‌
C) టోకోఫెరాల్‌          D) ఫిల్లోక్వినోన్‌
జవాబు : C

 

16. నీటిలో కరిగే విటమిన్‌లు?
A) A, B            B) B, C            C) A, D             D) A, D, E, K
జవాబు : B

 

17. రక్తస్కందనం సరిగా జరగకుండా నిరోధించే విటమిన్‌?
A) A          B) D           C) E           D) K
జవాబు : D


18. కిరణజన్యసంయోగక్రియలోని ఏ దశలో ఆక్సిజన్‌ విడుదల అవుతుంది?
A) కాంతి దశ           B) నిష్కాంతి దశ
C) కాంతి, నిష్కాంతి దశ           D) ఏదీకాదు
జవాబు : A

 

19. ATP ని విశదీకరించండి:
A) All Type Proteins           B) All The Phenomenon
C) Adenosine Tri Phosphate           D) Assimilatory Tri Power

జవాబు : C


20. పారమీషియంలో ఆహారం లోపలికి వెళ్లే భాగం
A) సైటోస్టోమ్‌          B) నోరు         C) విల్లి          D) గ్రసని
జవాబు : A


21. పైత్యరసం ఆహారంలో కలిసే చోటు?
A) జీర్ణాశయం         B) నోరు
C) ఆంత్రమూలం           D) చిన్నపేగులు
జవాబు : C

Posted Date : 25-06-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌