• facebook
  • whatsapp
  • telegram

ప్రత్యుత్పత్తి

1. స్త్రీలలో అనుసరించే కుటుంబ నియంత్రణ పద్ధతి?
A) వేసెక్టమీ        B) ట్యూబెక్టమీ
C) హిస్టరెక్టమీ          D) అపెండెక్టమీ
జవాబు : B


2. గర్భస్త శిశువు లింగ నిర్ధారణ కోసం చేసే స్కానింగ్‌?
A) CT స్కానింగ్‌           B) MRI స్కానింగ్‌
C) CAT స్కానింగ్‌            D) అల్ట్రాసౌండ్‌ స్కాన్‌
జవాబు : D


3. కిందివాటిలో గర్భనిరోధక సాధనం కానిది?
A) కాపర్‌-టి          B) కండోమ్‌
C) ART           D) లూప్‌
జవాబు : C


4. కణచక్రంలో DNA సంశ్లేషణ జరిగే దశ?
A) G1 దశ         B) S దశ         C) G2 దశ            D) M దశ
జవాబు : B


5. DNA నిర్మాణాన్ని కనుక్కున్నది ఎవరు?
A) ఫ్లెమింగ్, రౌక్స్‌           B) వీజ్‌మన్, బొవేరి
C) వాట్సన్, క్రిక్‌             D) రాబర్ట్‌ రిమాక్, మెండెల్‌
జవాబు : C


6. ద్విఫలదీకరణం జరిగే మొక్కలు?
A) శైవలాలు, శిలీంధ్రాలు          B) బ్రయోఫైటా, టెరిడోఫైటా
C) ఏకదళబీజాలు, ద్విదళబీజాలు      D) వివృత బీజాలు, టెరిడోఫైటా
జవాబు : C

 

7. సాధారణంగా కణచక్రం (G1, S, G2, M దశలు) పూర్తి కావడానికి 22 నుంచి 26 గంటలు పడుతుంది. ఇందులో దశకు పట్టే సమయం?
A) 10.5 గంటలు           B) 5.5 గంటలు
C) 3.5 గంటలు            D) 1 గంట
జవాబు : D

 

8. స్వపరాగసంపర్కం అంటే...
A) ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడం
B) ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే మొక్కలోని వేరే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరడం
C) ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి చెందిన ఇతర మొక్కల్లోని పుష్ప కీలాగ్రాన్ని చేరడం
D) A, B
జవాబు : A


9. కిందివాటిలో ఏది పిండానికి సంబంధించింది కాదు?
A) పరాయువు          B) ముష్కగోణి
C) అల్లంటాయిస్‌         D) ఉల్బం
జవాబు : B


10. పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం?
A) రక్షకపత్రావళి           B) ఆకర్షణపత్రావళి
C) కేసరావళి          D) అండకోశం
జవాబు : D

 

11. మానవుల్లో సంయోగబీజాల కలయిక/ ఫలదీకరణం జరిగే ప్రదేశం?
A) అండాశయం/ స్త్రీబీజకోశం          B) ఫాలోపియన్‌ నాళాలు
C) గర్భాశయం            D) యోని
జవాబు : B


12. పురుష లైంగిక హార్మోన్‌?
A) ఈస్ట్రోజెన్‌         B) ప్రొజెస్టిరాన్‌
C) టెస్టోస్టిరాన్‌           D) సెమెనోస్టిరాన్‌
జవాబు : C


13. శుక్రకణంలోని ఏ భాగం అండంతో కలవడంలో తోడ్పడుతుంది?
A) తల         B) కేంద్రకం
C) మైటోకాండ్రియా           D) ఆక్రోసోమ్‌
జవాబు : D


14. కింద పేర్కొన్నవాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
A) విచ్ఛిత్తి - పేరమీసియం           B) కోరకీభవనం - ఈస్ట్‌
C) ముక్కలవడం - అమీబా          D) పునరుత్పత్తి - ప్లనేరియా
జవాబు : C


15. పాలు పెరుగుగా మారడంలో పాల్గొనేది?
A) బ్యాక్టీరియా         B) వైరస్‌           C) శిలీంద్రాలు          D) శైవలాలు
జవాబు : A


16. ప్రతి పరాగరేణువులో ఎన్ని పురుష బీజాలుంటాయి?
A) ఒకటి          B) రెండు        C) మూడు          D) నాలుగు
జవాబు : B


17. స్త్రీ సంయోగ బీజదంలోని పరిణతి చెందిన పిండ కోశంలో ఉండేవి?
A) 7 కణాలు, 8 కేంద్రకాలు         B) 8 కణాలు, 7 కేంద్రకాలు
C) 7 కణాలు, 7 కేంద్రకాలు        D) 8 కణాలు, 8 కేంద్రకాలు
జవాబు : A


18. కింద పేర్కొన్న మొక్కల్లో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకునేవి?
A) శిలీంద్రాలు           B) ఫెర్న్‌లు
C) A, B            D) ఆవృతబీజాలు
జవాబు : C


19. కింద పేర్కొన్న వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
A) వాలిస్‌నేరియా - స్టోలన్‌లు 
B) ఉల్లిగడ్లలు - లశునములు
C) పసుపు, అల్లం - కొమ్ము
D) బంగాళదుంప/ ఆలుగడ్డ - వేరు దుంపలు
జవాబు : D


20. వాంఛనీయ లక్షణాలున్న మొక్కలను ఉత్పత్తి చేయాలంటే ఉపయోగించాల్సిన శాఖీయ ప్రత్యుత్పత్తి?
A) చేధనం         B) అంటుతొక్కడం
C) అంటుకట్టడం         D) అన్నీ
జవాబు : C

Posted Date : 25-06-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌