• facebook
  • whatsapp
  • telegram

శ్వాసక్రియ

1.కణశక్త్యాగారాలుగా పేర్కొనే కణాంగం?
A) హరితరేణువు           B) మైటోకాండ్రియా
C) కేంద్రకం          D) రైబోసోమ్‌
జవాబు : B


2. ATP లో నిల్వ ఉన్న శక్తి
A) 7.2 కేలరీలు         B) 72 కేలరీలు
C) 720 కేలరీలు          D) 7200 కేలరీలు
జవాబు : D


3. సాధారణంగా మానవుల్లో అవాయు శ్వాసక్రియ జరిగే ప్రదేశం?
A) నాడీకణజాలం         B) ఎపిథీలియల్‌ కణజాలం
C) కండర కణజాలం         D) హృదయ కణజాలం
జవాబు : C


4. అథ్లెట్లు / క్రీడాకారుల కండర కణజాలంలో వచ్చే నొప్పికి కారణం?
A) లాక్టిక్‌ ఆమ్లం          B) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం
C) సిట్రిక్‌ ఆమ్లం            D) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం
జవాబు : A


5. స్థిరమైన వాయువుగా దేన్ని పేర్కొంటారు?
A) ఆమ్లజని          B) కార్బన్‌డైఆక్సైడ్‌
C) హైడ్రోజన్‌         D) నైట్రోజన్‌
జవాబు : B


6. మానవుల్లో జరిగే వాయుప్రసార మార్గానికి సంబంధించి కింద ఇచ్చిన X, Y, Z ఖాళీలను పూరించండి. నాసికా రంధ్రాలు - నాసికా కుహరం - X - Y - వాయునాళం - శ్వాసనాళాలు - శ్వాసనాళికలు - Z
A) X - గ్రసని, Y - స్వరపేటిక Z - వాయుగోణులు
B) X - స్వరపేటిక, Y - గ్రసని, Z - వాయుగోణులు
C) X - వాయుగోణులు, Y - స్వరపేటిక, Z - గ్రసని
D) X - గ్రసని, Y - వాయుగోణులు, Z - స్వరపేటిక
జవాబు : A


7. మానవుల శ్వాసక్రియలో కీలక పాత్ర పోషించేది?
A) ఉపజిహ్విక         B) జీర్ణాశయం
C) ఉదరవితానం          D) ఆహారవాహిక
జవాబు : C


8. మానవుల రక్తంలో కార్బన్‌డైఆక్సైడ్‌ ఏ రూపంలో రవాణా చేయబడుతుంది?
A) కార్బన్‌డైఆక్సైడ్‌          B) కార్బన్‌ మోనాక్సైడ్‌
C) బైకార్బొనేట్స్‌          D) కార్బొనేట్స్‌
జవాబు : C

 

9. వాయునాళ వ్యవస్థ ఉన్న జీవులు?
A) చేపలు        B) ఉభయజీవులు
C) క్షీరదాలు       D) ఆర్థోపొడా జీవులు
జవాబు : D

 

10. చేపల్లో ఉండే శ్వాస వ్యస్థను ...................... అంటారు.
A) చర్మీయ శ్వాసక్రియ          B) వాయునాళ వ్యవస్థ
C) మొప్పల శ్వాసక్రియ        D) వ్యాపనం
జవాబు : C


11. వ్యాపన పద్ధతిలో శ్వాసక్రియ జరుపుకునే జీవులు?
A) అనెలిడా జీవులు         B) ప్లాటిహెల్మింథిస్‌ జీవులు
C) ప్రోటోజోవన్‌లు       D) పొరిఫెరా జీవులు
జవాబు : C


12. చర్మీయ శ్వాసక్రియ జరుపుకునే జీవులు?
A) చేపలు        B) ఉభయజీవులు
C) క్షీరదాలు       D) ఆర్థోపోడ్స్‌
జవాబు : B


13. కాండంలో వాయుప్రసరణ జరగడానికి దోహదపడేవి?
A) పత్రరంధ్రాలు         B) నిమాటోఫోర్‌లు
C) లెంటీసెల్స్‌          D) హైడథోడ్స్‌
జవాబు : C


14. శ్వాసక్రియ అనేది........?
A) విచ్ఛిన్న క్రియ          B) నిర్మాణాత్మక క్రియ
C) జీవక్రియ          D) A, B
జవాబు : D


15. మనం మాట్లాడగలగడానికి కారణం?
A) ఉపజిహ్విక          B) ఉదరవితానం
C) గ్రసని           D) స్వరపేటిక
జవాబు : D

 

16. మొక్కల్లో శ్వాసక్రియ జరిగే సమయం?
A) రాత్రి          B) పగటివేళ
C) పగలు, రాత్రి         D) ఏదీకాదు
జవాబు : C


17. 100 మీటర్ల పరుగు పందెంలో క్రీడాకారులు.....?
A) వేగంగా శ్వాసిస్తారు           B) నెమ్మదిగా శ్వాసిస్తారు
C) అసలు శ్వాస తీసుకోరు         D) సాధారణంగానే శ్వాస తీసుకుంటారు
జవాబు : C


18. సున్నపుతేటను పాలలా తెల్లగా మార్చేది?
A) హైడ్రోజన్‌         B) ఆక్సిజన్‌
C) కార్బన్‌డైఆక్సైడ్‌        D) నైట్రోజన్‌
జవాబు : C


19. మాంగ్రూవ్‌ మొక్కల్లోని ప్రత్యేకమైన వేర్లు పీల్చే వాయువు?
A) హైడ్రోజన్‌         B) ఆక్సిజన్‌
C) కార్బన్‌డైఆక్సైడ్‌            D) నైట్రోజన్‌
జవాబు : B


20.ఈస్ట్‌ల శ్వాసక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు?
A) లాక్టిక్‌ ఆమ్లం + కార్బన్‌డైఆక్సైడ్‌ + శక్తి
B) ఇథనాల్‌ + కార్బన్‌డైఆక్సైడ్‌ + శక్తి
C) నీరు + కార్బన్‌డైఆక్సైడ్‌ + శక్తి
D) ఏదీకాదు
జవాబు : B

Posted Date : 25-06-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌