• facebook
  • whatsapp
  • telegram

మానవాభివృద్ధిలో భారతదేశం

మాదిరి ప్రశ్నలు

1. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ప్రకారం మానవాభివృద్ధి సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?

 1) 130        2) 131         3) 136         4) 140


2. మానవాభివృద్ధి సూచీలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?

 1) బిహార్‌        2) కేరళ       3) తమిళనాడు        4) ఆంధ్రప్రదేశ్‌


3. మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్‌ ఏ స్థానంలో ఉంది?

1) 27         2) 28          3) 29           4) 30


4. యూఎన్‌డీపీ ప్రపంచ మానవాభివృద్ధి సూచికను ఏ అంశాల ఆధారంగా లెక్కిస్తుంది?

ఎ) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచిక 
బి) విజ్ఞాన సూచిక (చదువుకునే అంచనా సంవత్సరాలు ్ఘ చదువులో పిల్లలు కొనసాగే సగటు సంవత్సరాలు)
సి) GNP per capita 

 1) ఎ, బి         2) బి, సి        3) సి, ఎ         4) అన్నీ 


5. యూఎన్‌డీపీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (దీన్ని 1965 నవంబరు 22న స్థాపించారు)

 1) న్యూయార్క్‌        2) పారిస్‌        3) జెనీవా         4) దిహేగ్‌

6.  కిందివాటిని జతపరచండి.
I)  యూఎన్‌డీపీ హెచ్‌డీఐ ప్రకటన ప్రారంభం             A)  మహబూబ్‌ - ఉల్‌ - హక్‌ 
II) మానవ అభివృద్ధి సూచిక రూపకర్త                          B) 1990 నుంచి      
III)  హెచ్‌డీఐ - 2020 భారత్‌ ర్యాంక్‌                             C) అమర్త్యకుమార్‌ సేన్‌
IV) హెచ్‌డీఐ రూపకల్పనకు సహకారం అందించింది     D) 131వ స్థానం

1) I - B, II - A, III - D, IV - C.         2) I - A, II - D, III - C, IV - B.
3) I - D, II - C, III - B, IV - A.         4) I - C, II - D, III - A, IV - B.


7.  కిందివాటిలో సరైనవి ఏవి?
A) తక్కువ మానవ అభివృద్ధి చెందిన దేశాల హెచ్‌డీఐ విలువ 0.350 నుంచి 0.549
B) మధ్యస్థాయి మానవ అభివృద్ధి చెందిన దేశాల హెచ్‌డీఐ విలువ 0.550 నుంచి 0.699
C) అధిక మానవ అభివృద్ధి చెందిన దేశాల హెచ్‌డీఐ విలువ 0.700 నుంచి 0.799
D) అత్యధిక మానవ అభివృద్ధి చెందిన దేశాల హెచ్‌డీఐ విలువ 0.800 నుంచి 1.000

1) A, B సరైనవి      2) B, C సరైనవి  
3) C, D సరైనవి     4)  అన్నీ సరైనవి


8. మానవ అభివృద్ధి సూచికను అంచనా వేయడానికి పరిగణనలోకి తీసుకునే అంశాలు ఏవి?
1) ఆయుర్దాయం         2) విద్య సూచిక  
3) తలసరి స్థూల జాతీయాదాయం     4) అన్నీ 


9. హెచ్‌డీఐ - 2020 నివేదిక ప్రకారం భారతదేశ మానవ అభివృద్ధి సూచిక విలువ? 

1) 0.645       2) 0.745      3) 0.845      4) 0.945

10.  యూఎన్‌డీపీ 2020, డిసెంబరు 15న ప్రకటించిన హెచ్‌డీఆర్‌ - 2020 నివేదిక ప్రకారం హెచ్‌డీఐలో మొదటిస్థానాల్లో ఉన్న దేశాలు ఏవి?

A) నార్వే, ఐర్లాండ్‌        B) స్విట్జర్లాండ్, హాంకాంగ్, చైనా (ఎస్‌ఏఆర్‌)
C) ఐస్‌లాండ్, జర్మనీ   D) స్వీడన్, ఆస్ట్రేలియా
1) A  సరైంది          2) B, C సరైనవి     3) C, D సరైనవి     4) అన్నీ 


11.  యూఎన్‌డీపీ - హెచ్‌డీఆర్‌ - 2020 ప్రకారం హెచ్‌డీఐలో చివరి స్థానంలో ఉన్న దేశాలు?
1) బురుండి, దక్షిణ సూడాన్‌        2) చాద్‌ సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌
3) నైగర్‌                                      4) అన్నీ


12.  యూఎన్‌డీపీ 2018లో ప్రకటించిన మానవాభివృద్ధి నివేదికలో భారత్‌ స్థానం?
1) 129        2) 130        3) 131        4) 132


13. హెచ్‌డీఐ  2020 నివేదిక ప్రకారం నార్వే హెచ్‌డీఐ విలువ ఎంత?
1) 0.957        2) 0.958        3) 0.959         4) 0.960


14.   హెచ్‌డీఆర్‌ 2020 నివేదిక ప్రకారం మానవ అభివృద్ధి సూచీలో బ్రిక్స్‌ దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం 
1) చైనా      2) రష్యా      3) దక్షిణాఫ్రికా      4) బ్రెజిల్‌

సమాధానాలు: 1-1;  2-2;  3-1;  4-4;  5-1,  6-1; 7-4; 8-4; 9-1; 10-4; 11-4; 12-2; 13-1; 14-2.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌