• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యోల్బణం నియంత్ర‌ణ‌

1. ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు లాభపడేవారు...

1) రుణదాత         2) రుణగ్రహీత      3) వినియోగదారులు    4) అందరూ

జ: 2


2. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగిత, తక్కువ స్థాయి ఆర్థికవృద్ధి రేటు, మిశ్రమ స్థితిని ఏమంటారు?

1) ప్రతిద్రవ్యోల్బణం    2) రిఫ్లేషన్‌      3) స్తబ్దత ద్రవ్యోల్బణం       4) డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం

జ: 3


3. ద్రవ్య సప్లయ్‌ వృద్ధిరేటు పెరిగితే ద్రవ్యోల్బణ వృద్ధిరేటు......

1) తగ్గుతుంది        2) పెరుగుతుంది    3) హెచ్చు తగ్గులు ఉంటాయి    4) పాక్షికంగా పెరుగుతుంది

జ: 2


4. వస్తు సేవల ఉత్పత్తి కంటే వాటి డిమాండ్‌ ఎక్కువైనప్పుడు ధరలు పెరిగితే అది.....

1) డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం            2) వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం

3) ప్రతిద్రవ్యోల్బణ సూచీ              4) సప్లయ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం

జ: 1


5. ద్రవ్యోల్బణం సంభవించినప్పుడు నష్టపోయేది?

1) ఉత్పత్తిదారులు       2) రుణదాత      3) పెట్టుబడిదారులు       4) దళారులు

జ: 2


6. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణ గణాంకాలను లెక్కించడానికి పరిగణనలోకి తీసుకుంటున్న మూలాధార సంవత్సరం/ ప్రాతిపదిక సంవత్సరం (Base Year)?

1) 2004-05           2) 2011-12       3) 1999-2000          4) 1993-94

జ: 2


7. మనదేశంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడానికి ఏ కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు?

1) టోకు ధరల సూచీ            2) వినియోగదారుల ధరల సూచీ

3) 1, 2                     4) ఆహార ద్రవ్యోల్బణ సూచీ

జ: 3


8. ఉత్పత్తిదారుల ధరల సూచీని (Producer Price Index) ఏమంటారు?

1) టోకు ధరల సూచీ (Wholesale Price Index)

2) వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI)

3) జీవన ప్రమాణ వ్యయ సూచీ 

4) మూలధన వస్తువుల ధరల సూచీ

జ: 1


9. ప్రభుత్వ, ప్రైవేట్‌ వ్యయాల మార్పు వల్ల సమష్టి డిమాండ్‌ పెరుగుతుంది. దీనివల్ల ఏర్పడే ధరల పెరుగుదల...

1) సప్లయ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం            2) డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం

3) కోశ సంబంధ ద్రవ్యోల్బణం                 4) ప్రతిద్రవ్యోల్బణం

జ: 2


10. ఉత్పత్తికారకాల ధరలు పెరిగి, సమష్టి డిమాండ్‌ తగ్గడం వల్ల వచ్చేది?

1) కోశ సంబంధ ద్రవ్యోల్బణం         2) సప్లయ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం

3) ప్రతిద్రవ్యోల్బణం               4) ఆహార ద్రవ్యోల్బణం

జ: 2


11. ద్రవ్యోల్బణ నియంత్రణకు ఏ బడ్జెట్‌ విధానం ఉపయోగపడుతుంది?

1) అసంతులిత బడ్జెట్‌          2) సంతులిత బడ్జెట్‌ విధానం

3) లోటు బడ్జెట్‌        4) విత్త లోటు 

జ: 2


12. ద్రవ్యోల్బణ గణాంకాలను లెక్కించడానికి  ఇంతకు ముందు 2004-05 ఆధార సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకునేవారు. దీని  స్థానంలో ప్రస్తుతం దేన్ని ఆధార సంవత్సరంగా మార్చారు?

1) 1999-2000      2) 2011-12           3) 1993-94             4) 1970-71

జ: 2


13. ధరల్లోని మార్పు వల్ల ద్రవ్య విలువలో కలిగే హెచ్చుతగ్గులను కొలిచే విలువ......

1) ప్రతిద్రవ్యోల్బణ సూచీ      2) జీవన ప్రమాణ సూచీ

3) ఉత్పత్తిదారుల ధరల సూచీ        4) వినియోగదారుల ధరల సూచీ

జ: 1


14. ప్రభుత్వ రాబడి కంటే వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం...

1) కోశ సంబంధ ద్రవ్యోల్బణం     2) సప్లయ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం

3) ఆహార ద్రవ్యోల్బణం          4) పరిగెత్తే ద్రవ్యోల్బణం

జ: 1


15. ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించడానికి  2016-17 నుంచి ఏర్పాటు చేసిన నిధి..

1) ధరల స్థిరీకరణ నిధి         2) వ్యవసాయ నిధి

3) రుణ విమోచన నిధి           4) శ్రీనిధి

జ: 1


16. ప్రభుత్వం ద్రవ్యోల్బణ నిరోధక చర్యలను విస్తృతంగా చేపట్టిన కాలం.....

1) 1970-75 మధ్య             2) 1970-74 మధ్య 

3) 1970-73 మధ్య         4) 1971-75 మధ్య

జ: 1


17. 2004-05 ఆధార సంవత్సరాన్ని కింది ఏ కమిటీ సూచనల మేరకు ప్రవేశపెట్టారు?

1) అభిజిత్‌ సేన్‌ కమిటీ                 2) జయతి ఘోష్‌ కమిటీ

3) రఘురామ్‌రాజన్‌ కమిటీ                     4) డాక్టర్‌ ఉర్జిత్‌ పటేల్‌ కమిటీ

జ: 1


18. సంపూర్ణ ఉద్యోగితా స్థాయి వద్ద సమష్టి డిమాండ్, సమష్టి సప్లయ్‌ కంటే ఎక్కువగా ఉండే స్థితిని ఏమంటారు?

1) ప్రతిద్రవ్యోల్బణం              2) ద్రవ్యోల్బణం         3) ద్రవ్యోల్బణ విరామం        4) ఆహార ద్రవ్యోల్బణం

జ: 3


19. బేస్‌ ధర లేదా ద్రవ్యోల్బణ ప్రారంభ దశ వద్ద ఉన్న ఉత్పత్తి స్థాయి కంటే, ప్రణాళికా యుతమైన వ్యయం అధికంగా ఉండటాన్ని ద్రవ్యోల్బణ విరామంగా పేర్కొంది ఎవరు?

1) జె.ఎం.కీన్స్‌          2) మార్షల్‌        3) ఆడమ్‌ స్మిత్‌         4) పాల్‌ శామ్యూల్‌సన్‌

 జ: 1


20. ద్రవ్యోల్బణ రేటు, నిరుద్యోగిత రేటు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేది.....

1) లోరెంజ్‌ వక్రరేఖ           2) ఫిలిప్స్‌ రేఖ        3) దారిద్య్రరేఖ       4) పేదరిక రేఖ

జ: 2


21. ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం వల్ల వస్తు ఉత్పత్తి వ్యయం పెరిగి, వస్తు ధరలు పెరిగే స్థితిని తెలిపేది?

1) డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం                2) వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం

3) వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం              4) ప్రతిద్రవ్యోల్బణం

జ: 2


22. స్టాగ్‌ఫ్లేషన్‌ (స్తబ్దత ద్రవ్యోల్బణం) అంటే?

1) ఆర్థిక వృద్ధిరేటులో ఏ విధమైన మార్పు లేకుండా, ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగిత రేటు కూడా పెరిగే స్థితి.

2) వస్తు - సేవల ధరలు తగ్గడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం

3) మిశ్రమ ద్రవ్యోల్బణం

4) సమష్టి డిమాండ్‌ పెరగడం

జ: 1


23. సమష్టి డిమాండ్‌ కొరత వల్ల ధరలు తగ్గుతూ ఉండే స్థితిని ఏమంటారు?

1) ప్రతిద్రవ్యోల్బణం         2) ద్రవ్యోల్బణం           3) రిఫ్లేషన్‌        4) స్టాగ్‌ఫ్లేషన్‌

జ: 1


24. ద్రవ్యోల్బణం అంటే?

1) వస్తు - సేవలకు ఉన్న అత్యధిక డిమాండ్‌ వల్ల ద్రవ్య విలువ తగ్గి, ధరలు పెరగడం.

2) వస్తు - సేవల ఉత్పత్తి కంటే డిమాండ్‌ ఎక్కువై ధరలు పెరగడం.

3) వస్తు - సేవల ఉత్పత్తి కంటే ధరల పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం.

4) పైవన్నీ

జ: 4


25. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుసరించే విధానం?

1) కోశ విధానం     2) ద్రవ్య విధానం          3) పన్నుల విధానం          4) ధరల విధానం

జ: 2


26. మొత్తం వ్యయం, మొత్తం రాబడి కంటే ఎక్కువగా ఉంటే అది బడ్జెట్‌ లోటు. ఈ మేరకు ప్రభుత్వం కరెన్సీని ముద్రించి అభివృద్ధి కార్యక్రమాలపై వ్యయం చేయడం వల్ల ఏర్పడే స్థితి...

1) ప్రతిద్రవ్యోల్బణం        2) ద్రవ్యోల్బణం       3) ద్రవ్య సప్లయ్‌ తగ్గుదల        4) రిఫ్లేషన్‌

జ: 2


27. అంతర్లీన ద్రవ్యోల్పణం (Built in Inflation) అంటే?

1) వేతనాల పెరుగుదలను కోరుకునే కార్మికులు, ఉద్యోగుల ఆశలు ద్రవ్యోల్బణానికి ప్రేరణ ఇస్తాయి. దీన్ని ధర/ వేతన విస్ఫోటనం అంటారు.

2) ఎక్కువ స్థాయిలో ధరలు తగ్గుతాయి

3) ఎక్కువ స్థాయిలో ధరలు పెరుగుతాయి

4) ఉత్పత్తి కారకాల ధర పెరుగుదల వల్ల ఏర్పడుతుంది. 

జ: 1


28. కింది అంశాలను జతపరచండి.

  జాబితా - I                               జాబితా - II

i) పాకుతున్న ద్రవ్యోల్బణం         a) సంవత్సరంలో ధరలు  పెరుగుదల 34%  మధ్యలో ఉంటుంది.

ii) నడుస్తున్న ద్రవ్యోల్బణం        b) సంవత్సరంలో ధరల పెరుగుదల 3 శాతానికి మించకుండా ఉంటుంది

iii) పరిగెత్తే  ద్రవ్యోల్బణం           c) ధరల పెరుగుదల చాలా ఎక్కువ స్థాయిలో 100% ఉంటుంది

iv) దూకుతున్న ద్రవ్యోల్బణం    d) సంవత్సరంలో ధరల పెరుగుదల 10%  వరకు ఉంటుంది

1) i-b, ii-a, iii-d, iv-c                2) i-a, ii-d, iii-c, iv-b
3) i-d, ii-c, iii-a, iv-b               4) i-c, ii-a, iii-b, iv-d
జ: 1

Posted Date : 10-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌