• facebook
  • whatsapp
  • telegram

బీమా రంగం(INSURANCE SECTOR)

1. కింది అంశాలను జతపరచండి.                                      

i) లైఫ్‌ ఇన్సూరెన్స్‌   కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) స్థాపన a) 1972, నవంబరు 22
ii) జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (జీఐసీ) స్థాపన  b) 1956, సెప్టెంబరు 1
iii) ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ) c) బీమా రంగంలో పెట్టుబడులపై అధ్యయనం
iv) ఆర్‌.ఎన్‌.మల్హోత్రా  కమిటీ   d) 1999

 జ: i-b, ii-a, iii-d, iv-c     

2. ఎల్‌ఐసీ ప్రస్తుత ఛైర్మన్‌ ఎవరు?

జ: ఎం.ఆర్‌.కుమార్‌                    

3. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని ఎంత నుంచి ఎంత శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది?

జ: 49 నుంచి 74%   

4. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ప్రధాన ఉద్దేశం ఏమిటి?

1) సాగుకు యోగ్యమైన భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6000 చొప్పున ఆర్థిక సాయం చేయడం.

2) ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లిస్తారు. 

3) భర్త, భార్య, మైనర్‌ పిల్లలను కుటుంబంగా తీసుకుంటారు.

4) పైవన్నీ

జ:  పైవన్నీ

5. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీఐ) పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

జ:  2016, జనవరి 13                    

6. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకానికి సంబంధించి కిందివాటిలో నరైంది?

ఎ) ఊహించని సంఘటనల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించడం.

బి) వ్యవసాయంలో నవ కల్పనలు, ఆధునిక పద్ధతులు అవలంబించేలా రైతులను ప్రోత్సహించడం.

సి) వ్యవసాయ రంగానికి పరపతి లభ్యత కొనసాగేలా భరోసా ఇవ్వడం. ఉత్పత్తికి సంబంధించిన నష్టభయాల నుంచి రైతులను రక్షిస్తూ, వ్యవసాయ రంగంలో పోటీని, వృద్ధిని పెంచటం.

డి) రైతులు వ్యవసాయంలో కొనసాగేలా వారి ఆదాయాన్ని స్థిరీకరించడం.

జ:  పైవన్నీ

7. సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

జ:  2016             

8. రైతుబంధు పథకాన్ని ఎప్పుడు, ఎక్కడ ప్రవేశపెట్టారు?

జ:  2018 మే, కరీంనగర్‌ జిల్లా ధర్మరాజపల్లి  

9. వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

జ:  2019, అక్టోబరు 15  

10. జాతీయ వ్యవసాయ బీమా పథకం ఎప్పుడు ప్రారంభమైంది?

జ:  1999 - 2000                

11. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

జ:   2007               

Posted Date : 24-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌