• facebook
  • whatsapp
  • telegram

జాతీయాదాయం

1. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు మొదటిసారిగా జాతీయాదాయాన్ని లెక్కించింది ఎవరు? (గ్రూప్‌-2 2008)

1) ఎం.ఎన్‌.రాయ్‌     2) డాక్టర్‌ వి.కె.ఆర్‌.వి.రావు     3) కె.ఎన్‌.రాజ్‌       4) దాదాభాయ్‌ నౌరోజీ

జ: దాదాభాయ్‌ నౌరోజీ


2. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఉత్పత్తి కంటే, మార్కెట్‌ ధరల్లో జాతీయోత్పత్తి ఎక్కువగా ఉండటానికి కారణం ..... (గ్రూప్‌-2 2008)

1) పరోక్ష పన్నులు                 2) సబ్సిడీలు     

3) పరోక్ష పన్నులు - సబ్సిడీలు               4) పరోక్ష పన్నులు + సబ్సిడీలు

జ: పరోక్ష పన్నులు - సబ్సిడీలు


3. జాతీయాదాయం ఎక్కువ మొత్తంలో ఏ రంగం నుంచి వస్తుంది? (గ్రూప్‌-2 2008)

1) ప్రభుత్వ రంగం      2) ప్రైవేట్‌ రంగం      3) స్థానిక రంగం       4) ఏదీకాదు

జ: ప్రైవేట్‌ రంగం


4. భారత జాతీయాదాయంలో ప్రాథమిక రంగ సముచిత శాతం ఎంత? (గ్రూప్‌-2 2008)

1) 20%     2) 30%      3) 40%     4) 50%

జ: 20%


5. మనదేశ జాతీయాదాయాన్ని దేని సాయంతో లెక్కిస్తారు?  (గ్రూప్‌-2 2008)

1) ఆదాయ మదింపు పద్ధతి           2) ఉత్పత్తి మదింపు పద్ధతి   

3) వ్యయ మదింపు పద్ధతి            4) పైవన్నీ

జ: పైవన్నీ


6. గనులను కింది ఏ రంగానికి చెందినవిగా పరిగణిస్తారు? (గ్రూప్‌-2 2008)

1) వ్యవసాయ రంగం   2) పారిశ్రామిక రంగం    3) తృతీయ రంగం    4) అవస్థాపన సౌకర్యాల రంగం

జ: పారిశ్రామిక రంగం


7. స్థూల ఉత్పత్తి విలువ నుంచి ఉత్పాదకాల విలువ తీసేస్తే వచ్చేది? (ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 2012)

1) కలిసిన నికర విలువ        2) స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి

3) స్థూల రాష్ట్ర నికర ఉత్పత్తి           4) కలిసిన స్థూల విలువ

జ: కలిసిన స్థూల విలువ​​​​​​​


8. దేశీయ ఉత్పత్తి అంటే?  (జూనియర్‌ లెక్చరర్స్‌ 2007)

1) దేశీయ భూభాగంలో నివసించే వ్యక్తులు చేసిన ఉత్పత్తి

2) దేశీయ భూభాగంలో నివసించే వ్యక్తులు, ఇతరులు చేసిన ఉత్పత్తి

3) విదేశాల్లో ఉంటూ, దేశీయంగా - అంతర్జాతీయంగా చేసిన ఉత్పత్తి

4) ఏదీకాదు

జ: దేశీయ భూభాగంలో నివసించే వ్యక్తులు, ఇతరులు చేసిన ఉత్పత్తి​​​​​​​


9. ఒక దేశ స్థూల జాతీయోత్పత్తి (జీఎన్‌పీ) దేనికి సమానం? (జూనియర్‌ లెక్చరర్స్‌ 2007)

1) దేశంలోని స్థూల ఉత్పత్తి + విదేశాల నుంచి వచ్చిన నికర ఆదాయం

2) దేశంలోని నికర ఉత్పత్తి + విదేశాల నుంచి వచ్చిన నికర ఆదాయం

3) స్థూల దేశీయ ఆదాయం + విదేశాల నుంచి వచ్చిన స్థూల ఆదాయం

4) నికర జాతీయోత్పత్తి + ఎగుమతులు

జ: దేశంలోని స్థూల ఉత్పత్తి + విదేశాల నుంచి వచ్చిన నికర ఆదాయం​​​​​​​


10. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం దేనికి సమానం? (జూనియర్‌ లెక్చరర్స్‌ 2006)

1) మార్కెట్‌ ధరల్లో నికర జాతీయోత్పత్తి - పంచిపెట్టని లాభాలు

2) మార్కెట్‌ ధరల్లో నికర జాతీయోత్పత్తి - పరోక్ష పన్నులు + సబ్సిడీలు

3) మార్కెట్‌ ధరల్లో నికర జాతీయోత్పత్తి - కార్పొరేట్‌ పన్నులు + సబ్సిడీలు

4) మార్కెట్‌ ధరల్లో నికర జాతీయోత్పత్తి - పరోక్ష పన్నులు + బదిలీ చెల్లింపులు

జ: మార్కెట్‌ ధరల్లో నికర జాతీయోత్పత్తి - పరోక్ష పన్నులు + సబ్సిడీలు​​​​​​​


11. జాతీయదాయం అంటే? (ఎండోమెంట్‌ 2008)

1) ఉత్పత్తయిన వినియోగ వస్తువుల విలువ      2) ఉత్పత్తయిన మూలధన వస్తువుల విలువ

3) పూర్తిగా తయారైన వస్తువుల విలువ 

4) ఒక దేశంలో ఒక సంవత్సరంలో తయారైన మొత్తం వస్తు సేవల అంతిమ నికర విలువ

జ:  ఒక దేశంలో ఒక సంవత్సరంలో తయారైన మొత్తం వస్తు సేవల అంతిమ నికర విలువ​​​​​​​


12. ప్రభుత్వ బదిలీ చెల్లింపులు నికర దేశీయ ఉత్పత్తిలో భాగం కాదు, ఎందుకంటే? (యూపీఎస్సీ 1996)

1) అవి ప్రభుత్వం ఇచ్చే బహుమతులు       2) ఈ చెల్లింపులు గ్రహీతలకు చేరవు

3) ప్రభుత్వం చెల్లించిన వాటికి బదులుగా ఎలాంటి వస్తు సేవలు ఉత్పత్తి కావు       4) ఏదీకాదు

జ: అవి ప్రభుత్వం ఇచ్చే బహుమతులు​​​​​​​


13. హిందూ వృద్ధిరేటు అంటే (యూపీఎస్సీ 2000)

1) హిందూ జనాభా వృద్ధికి సంబంధించింది

2) ఈ పదాన్ని మొదటిసారి ప్రొఫెసర్‌ రాజ్‌ కృష్ణ 1978లో ఉపయోగించారు. తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోనూ భారత వృద్ధి రేటు 3.5% ఉంటుందని పేర్కొన్నారు.

3) ఈ పదాన్ని మొదటిసారి 1975లో అమర్త్యసేన్‌ ఉపయోగించారు. తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోనూ భారత్‌ ఏడాదికి 3% వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొన్నారు.

4) ఈ పదాన్ని మొదటిసారి 1977లో డాక్టర్‌ వి.కె.రావు వాడారు. తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోనూ భారత వృద్ధి 4% ఉంటుందని వ్యాఖ్యానించారు.

జ: ఈ పదాన్ని మొదటిసారి ప్రొఫెసర్‌ రాజ్‌ కృష్ణ 1978లో ఉపయోగించారు. తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోనూ భారత వృద్ధి రేటు 3.5% ఉంటుందని పేర్కొన్నారు.​​​​​​​


14. భారతదేశంలో జాతీయాదాయాన్ని గణించే సంస్థ ఏది? (యూపీఎస్సీ 2001)

1) నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ - ఎన్‌సీఏఈఆర్‌

2) నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ - ఎన్‌ఎస్‌ఓ (అప్పట్లో దీని పేరు సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (సీఎస్‌ఓ)గా ఉండేది.)

3) నేషనల్‌ శాంపిల్‌ సర్వే - ఎన్‌ఎస్‌ఎస్‌         4) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - ఆర్‌బీఐ

జ: నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ - ఎన్‌ఎస్‌ఓ (అప్పట్లో దీని పేరు సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (సీఎస్‌ఓ)గా ఉండేది.)​​​​​​​


15. ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయాదాయాన్ని అంచనా వేసినప్పుడు కిందివాటిలో దేన్ని పరిగణించరు? (యూపీఎస్సీ 2001)

1) భాటక ఆదాయం    2) పంచిపెట్టని లాభాలు     3) మిశ్రమ ఆదాయం     4) పింఛన్లు

జ: పింఛన్లు​​​​​​​


16. జాతీయాదాయం నుంచి వ్యయార్హ ఆదాయం పొందాలంటే....   (యూపీఎస్సీ 2008)

1) ఆదాయపు పన్నును మినహాయించి, బదిలీ చెల్లింపులు చేర్చాలి

2) ఆదాయపు పన్నును, బదిలీ చెల్లింపులను మినహాయించాలి

3) ఆదాయపు పన్నును, బదిలీ చెల్లింపులను చేర్చాలి

4) ఆదాయపు పన్నును చేర్చి, బదిలీ చెల్లింపులు మినహాయించాలి

జ: ఆదాయపు పన్నును మినహాయించి, బదిలీ చెల్లింపులు చేర్చాలి​​​​​​​


17. మానవాభివృద్ధి సూచీ నిర్మాణ ప్రధాన శిల్పి?   (యూపీఎస్సీ 2008)

1) పి.ఆర్‌.బ్రహ్మానంద             2) మహబూబ్‌-ఉల్‌-హక్‌   

3) డాక్టర్‌ వి.కె.ఆర్‌.వి.రావు    4) ప్రొఫెసర్‌ అమర్త్యసేన్‌

జ: మహబూబ్‌-ఉల్‌-హక్‌​​​​​​​


18. యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, మానవాభివృద్ధి సూచీ (హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ -హెచ్‌డీఐ)ని  రూపొందిస్తుంది. ఇందులో కింది ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు? (ఏపీపీఎస్సీ 2000)

1) వాస్తవిక తలసరి దేశీయోత్పత్తిని సర్దుబాటు చేయడం     2) తరుగుదల సూచీ 

3) ఆయుర్దాయ సూచీ      4) విద్యా సాధన సూచిక

జ: తరుగుదల సూచీ ​​​​​​​


19. మానవాభివృద్ధి సూచీలో కింది ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు? (ఏపీపీఎస్సీ 2000)

ఎ) దీర్ఘకాలిక జీవనం, ఆరోగ్యం

బి) స్త్రీ - శిశువుల అభివృద్ధి

సి) విద్య - విజ్ఞానం

డి) సామాజిక న్యాయం - సాధికారత

ఇ) మెరుగైన జీవనప్రమాణం

1) ఎ, ఇ         2) బి, డి       3) ఎ, బి, సి         4) పైవన్నీ

జ: బి, డి​​​​​​​


20. నికర ఎగుమతులు అంటే (ఏపీపీఎస్సీ జేఎల్, 2004)

1) స్థూల ఎగుమతులు - తరుగుదల       2) ఎగుమతులు - దిగుమతులు

3) తరుగుదల - దిగుమతులు       4) ఎగుమతులు - ఎగుమతి సుంకం

జ: ఎగుమతులు  దిగుమతులు​​​​​​​


21. కిందివాటిలో బదిలీ చెల్లింపు కానిది? (జేఎల్‌ 2003 (బ్యాక్‌లాగ్‌), జేఎల్‌ 2001)

1) ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు     2) నిరుద్యోగ బీమా సదుపాయాలు

3) పదవీ విరమణ పెన్షన్లు       4) ఆదాయ మద్దతు కల్పన

జ: ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు​​​​​​​


22. కిందివాటిలో మానవాభివృద్ధి సూచికలో అంశం కానిది?  (జేఎల్‌ 2004)

1) జనన కాలం నుంచి ఆయుర్దాయం       2) అక్షరాస్యత రేటు, పాఠశాల సగటు సంవత్సరాలు

3) శిశు మరణాల రేటు      4) ఆదాయం

జ: శిశు మరణాల రేటు


23. వ్యష్టి ఆదాయం అంటే?  (జేఎల్‌ 2004)

1) ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం + పరోక్ష పన్నులు

2) ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం + పింఛన్లు  

3) ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం - పంచిపెట్టిన లాభాలు - సాంఘిక భద్రత చెల్లింపులు

4) ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం - పంచిపెట్టని లాభాలు - సాంఘిక భద్రత చెల్లింపులు + బదిలీ

జ: ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం - పంచిపెట్టిన లాభాలు - సాంఘిక భద్రత చెల్లింపులు​​​​​​​


24. భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)కి ప్రస్తుతం సేవల రంగం సమకూర్చే వాటా సుమారు... (గ్రూప్‌-2 2008) 

(మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ గణాంకాల ప్రకారం 2021లో సేవల రంగం నుంచి జీడీపీకి 53.89% వాటా వచ్చింది.)

1) 70 శాతం        2) 50 శాతం      3) 25 శాతం        4) 30 శాతం

జ: 50 శాతం​​​​​​​


25. చేర్చిన మూలధన విలువలో నుంచి స్థిర మూలధన వినియోగాన్ని మినహాయిస్తే వచ్చేది?  (గ్రూప్‌-2 2011)

1) స్థూల రాష్ట్ర జాతీయ ఉత్పత్తి           2) నికర మూలధనం  

3) నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి      4) ఉత్పత్తి స్థూల విలువ

జ: నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి


మరికొన్ని..


1. ‘పావర్టీ అండ్‌ అన్‌-బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ పుస్తక రచయిత?

1) దాదాభాయ్‌ నౌరోజీ      2) డాక్టర్‌ వి.కె.ఆర్‌.వి.రావు     3) డి.ఆర్‌.గాడ్గిల్‌    4) పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ

జ: దాదాభాయ్‌ నౌరోజీ​​​​​​​


2. ‘సంపద దోపిడీ’ (Drain theory) లేదా ‘ఆర్థిక తరలింపు’ (Economic Drain) అనే సిద్ధాంతాన్ని రూపొందించింది?

1) డి.ఆర్‌.గాడ్గిల్‌     2) ప్రొఫెసర్‌ మహలనోబిస్‌ 

3) దాదాభాయ్‌ నౌరోజీ     4) డాక్టర్‌ డి.టి.లక్డావాలా

జ: దాదాభాయ్‌ నౌరోజీ​​​​​​​


3. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి జాతీయాదాయ అంచనాల కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది?

1) 1947       2) 1948        3) 1949        4) 1950

జ: 1949  ​​​​​​​


4. జాతీయాదాయ అంచనాల కమిటీకి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ    2) ప్రొఫెసర్‌ పి.సి.మహలనోబిస్‌   

3) డి.ఆర్‌.గాడ్గిల్‌     4) డాక్టర్‌ వి.కె.సారస్వత్‌

జ: ప్రొఫెసర్‌ పి.సి.మహలనోబిస్‌​​​​​​​


5. స్థిర/ నిలకడ ధరల్లో జాతీయాదాయం అంటే?

1) తాత్కాలిక జాతీయాదాయాన్ని తెలుపుతుంది       2) వాస్తవ జాతీయాదాయాన్ని తెలుపుతుంది

3) వ్యయార్హ ఆదాయాన్ని తెలుపుతుంది      4) వ్యక్తిగత ఆదాయాన్ని తెలుపుతుంది

జ: వాస్తవ జాతీయాదాయాన్ని తెలుపుతుంది


6. కిందివారిలో జాతీయాదాయ అంచనాల కమిటీలో సభ్యులుగా ఉన్నదెవరు?

1) డి.ఆర్‌.గాడ్గిల్, డాక్టర్‌ వి.కె.ఆర్‌.వి.రావు     2) దాదాభాయ్‌ నౌరోజీ, ఆర్‌.సి.దేశాయ్‌ 

3) కాంబట్టా, షా                       4) విలియం డిగ్బీ

జ: డి.ఆర్‌.గాడ్గిల్, డాక్టర్‌ వి.కె.ఆర్‌.వి.రావు​​​​​​​


7. ప్రస్తుతం మనదేశంలో దేన్ని ఆధార సంవత్సరంగా (బేస్‌ ఇయర్‌) తీసుకుని జాతీయాదాయాన్ని అంచనా వేస్తున్నారు?

1) 2004-05       2) 2011-12          3) 2017-18       4) 2017-19

జ: 2011-12


8. ప్రస్తుత ధరలు లేదా మార్కెట్‌ /వర్తమాన ధరల్లో జాతీయదాయం అంటే?

1) తాత్కాలిక జాతీయాదాయాన్ని తెలుపుతుంది       2) వాస్తవ ఆదాయాన్ని తెలుపుతుంది

3) నిజ ఆదాయాన్ని తెలుపుతుంది      4) జీడీపీని తెలుపుతుంది

జ: తాత్కాలిక జాతీయాదాయాన్ని తెలుపుతుంది​​​​​​​

Posted Date : 19-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌