• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయ మార్కెటింగ్‌ - సంస్కరణలు

1. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాథమిక మార్కెట్లు/ స్థానిక మార్కెట్లను ఏ పేరుతో పిలుస్తారు?

1) షాండీలు    2) హాట్‌ 

3) బజార్‌  4) రైతుబజార్లు


2. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాథమిక మార్కెట్లను ఏమంటారు?

1) హాట్‌     2)  బజార్‌ 

3) 1, 2    4) ఈ-నామ్‌


3. ద్వితీయ మార్కెట్లకు ఉన్న మరో పేరు?

1) టోకు మార్కెట్‌   2) అంతిమ మార్కెట్‌

3) క్రమబద్ధ మార్కెట్‌    4) స్థానిక మార్కెట్‌


4. మార్కెట్లలో అక్రమ పద్ధతులను నివారించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్లను ఏమంటారు?

1) ద్వితీయ మార్కెట్లు   2) సహకార మార్కెట్లు

3) ప్రాథమిక మార్కెట్లు   4) క్రమబద్ధ మార్కెట్లు


5. వ్యవసాయ వస్తువుల క్రయ, విక్రయాలను క్రమబద్ధీకరించే మార్కెట్‌....

1) ద్వితీయ మార్కెట్లు    2) రైతుబజార్లు  

3) క్రమబద్ధ మార్కెట్లు    4) అంతిమ మార్కెట్లు

6. వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్, మార్కెటింగ్‌ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 1936   2) 1937   3) 1938    4) 1939


7. క్రమబద్ధ మార్కెట్లకు నిధులు ఏ విధంగా సమకూరతాయి?

1) మార్కెట్‌ ఫీజు   2) లైసెన్స్‌ ఫీజు

3) పునరుద్ధరణ ఫీజు   4) పైవన్నీ


8. వ్యవసాయ వస్తువుల నాణ్యతను నిర్ధారించే గుర్తు?

1) అగ్‌మార్క్‌ (AGMARK)    2) ఐఎస్‌ఓ   

3) పేటెంట్‌    4) కాపీరైట్‌


9. అగ్‌మార్క్‌ ప్రమాణాలు వర్తించే వస్తువుల సంఖ్య....

1) 221    2) 222     3) 223    4) 224


10. అగ్‌మార్క్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ఫరీదాబాద్, హరియాణా      2) నాసిక్, మహారాష్ట్ర   

3) హైదరాబాద్‌    4) ఏదీకాదు


11. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్థను ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటుచేశారు?

1) 1988, జైపూర్‌ (రాజస్థాన్‌)

2) 1989, బివానీ (హరియాణా)

3) 1990, ఫరీదాబాద్‌ (హరియాణా)

4) 1991, నాగ్‌పుర్‌ (మహారాష్ట్ర)


12. వ్యవసాయ వస్తువుల మార్కెట్‌ సమాచారాన్ని తెలిపే ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ...

1) ఐఎస్‌ఓ      2) అగ్‌మార్క్‌నెట్‌

3) ఈ-నామ్‌      4)  కిసాన్‌ పోర్టల్‌


13. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన కేంద్ర నాణ్యత నియంత్రణ ప్రయోగశాల ఎక్కడ ఉంది?

1) నాసిక్‌   2) పుణె 

3) నాగ్‌పుర్‌      4)  జైపూర్‌


14. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాంతీయ ప్రయోగశాల ఎక్కడ ఉంది?

1) విజయవాడ      2) గుంటూరు 

3) కాకినాడ    4) రాజమహేంద్రవరం


15. కిందివాటిలో వ్యవసాయ సమాచారాన్ని తెలిపే పటం ఏది?

1) జాతీయ వ్యవసాయ మార్కెట్‌ అట్లాస్‌ (NAMA)

2) సర్వే ఆఫ్‌ ఇండియా

3) జియోలాజికల్‌ సర్వే

4) ఏదీకాదు


16. వ్యవసాయ మార్కెటింగ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ప్రత్యేకత...

1) అంతిమ మార్కెట్లు    2) ద్వితీయ మార్కెట్లు 

 3) రైతుబజార్లు   4) షాండీలు


17. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన జాతీయ పోర్టల్‌?

1) జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ-నామ్‌)

2) కిసాన్‌ పోర్టల్‌     

3) అగ్‌మార్క్‌నెట్‌

4) ఏదీకాదు

18. వ్యవసాయరంగంలో ఏకీకృత జాతీయ విపణి....

1) జాతీయ వ్యవసాయ మార్కెట్‌    2) అంతిమ మార్కెట్‌

3) ద్వితీయ మార్కెట్‌    4) రైతుబజార్లు


19. ఈ-నామ్‌ (e-nam) అంటే ఏమిటి?

1)  జాతీయ స్థాయి వ్యవసాయ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాం

2) కనీస మద్దతు ధర

3) వ్యవసాయ విధానం

4) సేకరణ ధర


20. జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ-నామ్‌)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1)  2016, ఏప్రిల్‌ 16  

2)  2017, ఏప్రిల్‌ 17

3) 2018, ఏప్రిల్‌ 18 

4) 2019, ఏప్రిల్‌ 19


21. ఈ-నామ్‌లో మొత్తం ఎన్ని రకాల వస్తువులను విక్రయిస్తారు? (ఆహార ధాన్యాలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలు మొదలైనవి ఇందులో ఉంటాయి.)

1) 180    2) 181    3) 182   4) 183


22. జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ-నామ్‌)ని నిర్వహించే సంస్థ?

1)  సన్నకారు రైతుల వ్యవసాయ వాణిజ్య కన్సార్టియం

2)  పెద్ద రైతుల కన్సార్టియం

3) ఉపాంత రైతుల కన్సార్టియం

4) మధ్యస్థ రైతుల కన్సార్టియం


23. వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన నిధి?

1) వ్యవసాయ మార్కెట్‌ అవస్థాపక నిధి   2) రుణ విమోచన నిధి

3)  సంచిత నిధి   4) ఏదీకాదు


24. మనదేశంలో మొట్టమొదటి సహకార మార్కెటింగ్‌ సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1912     2) 1913 

3) 1914     4) 1915


25. జాతీయస్థాయిలో సహకార వ్యవసాయ మార్కెటింగ్‌కు శిఖర సంస్థగా కింది దేన్ని పేర్కొంటారు?

1) నాఫెడ్‌ - NAFED  (నేషనల్‌ అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా)

2) ట్రైబల్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (TRIFED)

3) 1, 2     4) ఈ-నామ్‌


26. నాఫెడ్‌ను ఎప్పుడు స్థాపించారు?

1) 1958, అక్టోబరు 2

2)1957, అక్టోబరు 2

3) 1956, అక్టోబరు 2

4) 1955, అక్టోబరు 2


27. వ్యవసాయ వస్తువుల సేకరణ, పంపిణీ, ఎగుమతులు, దిగుమతులను నిర్వహించే సంస్థ?

1) నాఫెడ్‌       2)  ట్రైఫెడ్‌

3) కేంద్ర వ్యవసాయ శాఖ 

4) ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ)


28. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ  (National Cooperative Development Corporation NCDC)ని ఎప్పుడు ఏర్పాటుచేశారు?

1) 1961    2) 1962    3) 1963    4) 1966


సమాధానాలు

1-1  2-3  3-1  4-4  5-3  6-2  7-4  8-1 9-4 10-1  11-1  12-2  13-3  14-2  15-1  16-3  17-1  18-1  19-1  20-1  21-3  22-1  23-1  24-4  25-1  26-1  27-1  28-3.


మరికొన్ని..

1. వ్యవసాయ వస్తువుల ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్‌ని ప్రోత్సహించే జాతీయ సంస్థ?

1)జాతీయ సహకార అభివృద్ధి సంస్థ       2) నాఫెడ్‌

 3) ట్రైఫెడ్‌   4) ఏదీకాదు


2. ఆహారధాన్యాలు, నిత్యావసర వస్తువుల పంపిణీలో చురుకైన పాత్ర నిర్వహించే కేంద్ర సహకార సంస్థ?

1)  నాఫెడ్‌     2)  ట్రైఫెడ్‌

3) జాతీయ సహకార అభివృద్ధి సంస్థ    4) పైవన్నీ


3. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానాన్ని ఎప్పుడు చేశారు?

1)  2018     2)  2019 

3)  2020     4)  2021


4. రైతుల ఆదాయం రెట్టింపునకు కేంద్రం పెట్టుకున్న గడువు సంవత్సరం?

1)  2020     2) 2021 

3) 2022     4) 2023


5. 2020లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణల చట్టాలు ఏవి? (ఈ చట్టాలను కేంద్రం అమలు చేయలేదు.)

1) రైతుల ఉత్పాదన, వర్తకం, వాణిజ్యం, (ప్రోత్సాహం, సదుపాయం) చట్టం-2020

2) రైతుల (సాధికారత, రక్షణ), ధర హామీ, సేవల ఒప్పంద చట్టం - 2020

3) 1, 2     4) కనీస మద్దతు ధర


6. వ్యవసాయ వ్యాపారానికి సంబంధించి రైతు సంఘాల ప్రధాన ఆందోళన....

1)  కనీస మద్దతు ధర     2) సేకరణ ధర

3) బఫర్‌ నిల్వలు    4) ఏదీకాదు


7. చెరకు మార్కెటింగ్‌ సంఘాలు చురుకుగా పనిచేస్తున్న రాష్ట్రాలు....

1) ఉత్తర్‌ ప్రదేశ్‌     2) బిహార్‌

3) 1, 2       4) ఝార్ఖండ్‌


8. పత్తి విక్రయ సంఘాలు చురుకుగా పని చేస్తున్న రాష్ట్రాలు...

1) మహారాష్ట్ర      2) గుజరాత్‌

3) 1, 2      4) కర్ణాటక


9. పొగాకు, పండ్లు, కూరగాయల విక్రయంలో ప్రత్యేకీకరణ సాధించిన రాష్ట్రం?

1) మహారాష్ట్ర    2) కర్ణాటక

3) తమిళనాడు  4) తెలంగాణ


10. వ్యవసాయ ధరల కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1962   2) 1963    3) 1964     4) 1965


11. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటుచేశారు?

1) 1985    2) 1986  3) 1987    4) 1988


12. 2021-22 భారత ఆర్థిక సర్వే ప్రకారం కనీస మద్దతు ధరలు ప్రకటించే వస్తువుల సంఖ్య?

1)  22    2) 24    3)  25    4) 26


సమాధానాలు

1-1   2-3   3-1   4-3   5-3   6-1   7-3   8-3   9-1  10-4  11-1  12-1

Posted Date : 27-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌