• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయం

పంటల ఉత్పత్తులు

ఉత్పత్తి పరంగా ముందంజలో ఉన్న ముఖ్యమైన పంటలు:

తృణధాన్యాలు, చిరు ధాన్యాలు: వరి, మొక్కజొన్న, జొన్న

పప్పు ధాన్యాలు: సెనగ, మినుములు    

ఆహార ధాన్యాలు: వరి, మొక్కజొన్న, సెనగ

నూనెగింజలు: వేరుసెనగ

ఆహర పంటలు: వరి, వేరుసెనగ

ఆహారేతర పంటలు: పత్తి, చెరకు

పండ్లు, కూరగాయిలు: అరటి, మామిడి

మొత్తం పంటలు: వరి, పత్తి, చెరకు

ఉత్పత్తి ధోరణులు

* 2013-14 నాటితో పోలిస్తే 2020-21 నాటికి తృణధాన్యాలు, చిరుధాన్యాల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.  ప్రారంభంలో తగ్గి మళ్లీ పెరిగి తర్వాత తగ్గుముఖం పట్టాయి.

* పప్పుధాన్యాల ఉత్పత్తిలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

* నూనెగింజల ఉత్పత్తిలో స్వల్ప పెరుగుదల నమోదైంది. నూనెగింజల కింద సాగయ్యే భూమి తగ్గినప్పటికీ, ఉత్పత్తి పెరిగింది.

పంటల ఉత్పాదకత

సగటున ఒక హెక్టారు భూమిలో పండే పంటను వ్యవసాయ ఉత్పాదకతగా పేర్కొంటారు. 

ఉత్పాదకత = ఉత్పత్తి/ హెక్టార్‌ 

2020-21లో వివిధ పంటల ఉత్పాదకత వరుసగా...

1. మొక్కజొన్న - 5918 కేజీ/హెక్టారు

2. వరి - 5130 కేజీ/హెక్టారు 

3. జొన్న - 3428 కేజీ/హెక్టారు

* పప్పు ధాన్యాల్లో సెనగ పంట అత్యధిక ఉత్పాదకతను కలిగి ఉంది.

* వరి ఉత్పాదకత అత్యల్పంగా ఉన్న జిల్లా - విశాఖపట్నం

* మొక్కజొన్న ఉత్పాదకత అత్యల్పంగా ఉన్న జిల్లా - అనంతపురం

* వేరుసెనగ ఉత్పాదకత అత్యల్పంగా ఉన్న జిల్లా - అనంతపురం

* పత్తి ఉత్పాదకత అత్యల్పంగా ఉన్న జిల్లా - కర్నూలు

* సజ్జలు, రాగులు మినహా మిగతా అన్ని ప్రధాన పంటల ఉత్పాదకతలో రాయలసీమ కంటే కోస్తాంధ్ర ముందుంది. రాయలసీమ జిల్లాల కంటే కోస్తాలో భూసారం మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం.

* రాష్ట్రం మొత్తం జొన్న విస్తీర్ణంలో గుంటూరులోనే 41% సాగవుతోంది.

* గుంటూరు, కర్నూలు రెండు జిల్లాల్లో 80% జొన్నను పండిస్తున్నారు.

* రాష్ట్ర మొత్తం రాగి పంట విస్తీర్ణంలో 55% విశాఖపట్టణం జిల్లాలోనే ఉంది.

* వేరుసెనగ విస్తీర్ణం, ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న అనంతపురం ఉత్పాదకతలో ఆఖరి స్థానంలో నిలిచింది. నీ 2020-21 లో రాష్ట్రంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 165.04 లక్షల టన్నులు. 2019-20 (175.12 లక్షల టన్నులు)తో పోలిస్తే 5.76% రుణాత్మక వృద్ధి నమోదైంది. 

* 2020-21లో మొత్తం తృణధాన్యాలు, చిరుధాన్యాల ఉత్పత్తి 154.10 లక్షల టన్నులు. 

* 2020-21 లో వరి ఉత్పత్తి 130.89 లక్షల టన్నులు. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వరి వాటా 79%.

* 2020-21 లో మొక్కజొన్న ఉత్పత్తి 17.84 లక్షల టన్నులు. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దీని వాటా 10.8%

* గత కొన్నేళ్లుగా జొన్న పంట విస్తీర్ణం తగ్గుతున్నప్పటికీ ఉత్పాదకత పెరిగింది.

* 2020-21 లో మొత్తం పప్పు ధాన్యాల ఉత్పత్తి 10.94 లక్షల టన్నులు. మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తిలో సెనగ వాటా 50%.

* మొత్తం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో సెనగ, మినుములు, పెసలు, కందులు 97% వాటాను కలిగి ఉన్నాయి.

* 2020-21లో మొత్తం నూనె గింజల ఉత్పత్తి 29.91 లక్షల టన్నులు. ఇందులో పామాయిల్‌ 74% వాటా, వేరుసెనగ 25% వాటాను కలిగి ఉన్నాయి.

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌