• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకింగ్‌ 

1. కరెన్సీ రిజర్వ్‌ పద్ధతిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ఉండాల్సిన బంగారు నిల్వల విలువ?

1) 115 కోట్లు      2) 116 కోట్లు         3) 117 కోట్లు      4) 118 కోట్లు

జ: 115 కోట్లు


2. అంతిమ రుణదాత అని ఏ బ్యాంక్‌ను అంటారు? 

1) రిజర్వ్‌ బ్యాంక్‌    2) నాబార్డ్‌      3) ఐడీబీఐ బ్యాంక్‌      4) ఎస్‌బీఐ

జ: రిజర్వ్‌ బ్యాంక్‌


3. క్లియరింగ్‌ హౌస్‌ (పరిష్కార నిలయం)గా వ్యవహరించే బ్యాంక్‌ ఏది? 

1) నాబార్డ్‌     2) ఎస్‌బీఐ        3) ఐడీబీఐ     4) ఆర్‌బీఐ

జ: ఆర్‌బీఐ


4. విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిరక్షణ బాధ్యతను ఏ సంస్థ నిర్వహిస్తుంది?

1) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌      2) ఎస్‌బీఐ       3) ఆర్‌బీఐ          4) ఎల్‌ఐసీ

జ: ఆర్‌బీఐ


5. బ్యాంక్‌లు తమ డిపాజిట్‌ మొత్తంలో ఎంత శాతాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌లో నిల్వ చేయాలో సూచించే నిష్పత్తి? 

1) చట్టబద్ధ నిష్పత్తి    2) నగదు నిల్వల నిష్పత్తి       3) రెపోరేటు      4) రివర్స్‌ రెపోరేటు

జ: నగదు నిల్వల నిష్పత్తి


6. బ్యాంక్‌లు తమ డిపాజిట్‌ మొత్తంలో ఎంత శాతం ద్రవ్యస్థ ఆస్తులుగా నిల్వ చేయాలో సూచించే నిష్పత్తిని ఏమంటారు?

1) రివర్స్‌ రెపోరేటు     2) రెపోరేటు     3) చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి     4) బ్యాంక్‌ రేటు

జ: చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి


7. రెపోరేటు అంటే...

1) రిజర్వ్‌ బ్యాంక్‌ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు

2) వాణిజ్య బ్యాంక్‌ల నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ పొందిన రుణాలకు చెల్లించే వడ్డీరేటు

3) రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రభుత్వ సెక్యూరిటీలను (జి-సెక్యూరిటీలు) ద్రవ్య మార్కెట్‌లో విక్రయించడం, కొనుగోలు చేయడం 

4) పైవన్నీ

జ: రిజర్వ్‌ బ్యాంక్‌ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు


8. స్వల్ప కాలానికి సంబంధించి వాణిజ్య బ్యాంకుల నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ పొందిన రుణాలకు చెల్లించే వడ్డీరేటు.....

1) రెపోరేటు     2) రివర్స్‌ రెపోరేటు     3) బ్యాంక్‌ రేటు     4) నగదు నిల్వల నిష్పత్తి

జ: రివర్స్‌ రెపోరేటు


9. రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రభుత్వ సెక్యూరిటీలను ద్రవ్య మార్కెట్‌లో విక్రయించడం, కొనుగోలు చేయడాన్ని ఏమంటారు?

1) రెపోరేటు          2) రివర్స్‌ రెపోరేటు 

3) బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలు       4) నగదు నిల్వల నిష్పత్తి

జ: బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలు


10. బ్యాంక్‌ రేటు అంటే ఏమిటి?

1) కేంద్ర బ్యాంక్‌ నుంచి వాణిజ్య బ్యాంకులు రుణాన్ని తీసుకున్నప్పుడు చెల్లించే వడ్డీరేటు

2) సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోలు

3) మధ్యకాలిక రుణాలు అందించడం

4) నగదు రూపంలో రుణం ఇవ్వడం

జ: కేంద్ర బ్యాంక్‌ నుంచి వాణిజ్య బ్యాంకులు రుణాన్ని తీసుకున్నప్పుడు చెల్లించే వడ్డీరేటు


11. బ్యాంక్‌ ‘రేటు’ను ఏమని పిలుస్తారు?

1) రీ-డిస్కౌంట్‌ రేటు     2) రెపోరేటు     3) రివర్స్‌ రెపోరేటు    4) చట్టబద్ధ ద్రవత్వ నిష్పత్తి

జ: రీ-డిస్కౌంట్‌ రేటు


12. ఓవర్‌ డ్రాప్ట్‌ సౌకర్యం అంటే.....

1) ఖాతాదారుడి ఖాతాలో ఉన్న మొత్తం కంటే ఎక్కువగా తీసుకునే సౌకర్యం

2) ఆర్థిక సమ్మిళిత్వం సాధించడం

3) స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందించడం

4) తక్కావి రుణాలు అందించడం

జ: ఖాతాదారుడి ఖాతాలో ఉన్న మొత్తం కంటే ఎక్కువగా తీసుకునే సౌకర్యం


13. నరసింహం కమిటీ 1998లో ప్రవేశపెట్టిన బ్యాంకింగ్‌ భావన...

1) విస్తృత బ్యాంకింగ్‌       2) సంకుచితమైన బ్యాంకింగ్‌

3) పరపతి      4) రుణ విముక్తి

జ: సంకుచితమైన బ్యాంకింగ్‌


14. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా మూలధనం సేకరించిన మొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఏది?

1) నాబార్డ్‌     2) ఐడీబీఐ     3) ఎస్‌బీఐ     4) ఆర్‌బీఐ

జ: ఎస్‌బీఐ


15. పరిమాణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులు.....

1) బ్యాంక్‌ రేటులో మార్పు       2) నగదు నిల్వల నిష్పత్తిలో మార్పు

3) బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలు      4) పైవన్నీ

జ: పైవన్నీ


16. ప్రభుత్వాలకు ద్రవ్య సమస్య ఏర్పడినప్పుడే తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ, 90 రోజుల గడువుకు మించని ‘వేస్‌ అండ్‌ మీన్స్‌’ రుణాలు అందించే బ్యాంకు ఏది?

1) ఆర్‌బీఐ        2) ఎస్‌బీఐ          3) ఐడీబీఐ       4) నాబార్డ్‌

జ: ఆర్‌బీఐ


17. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కలిగించే బ్యాంక్‌...

1) ఎస్‌బీఐ      2) ఆర్‌బీఐ       3) నాబార్డ్‌     4) ఏదీ కాదు

జ: ఆర్‌బీఐ


18. రిజర్వ్‌ ద్రవ్యానికి మరో పేరేమిటి?

1) మూలధార ద్రవ్యం     2) హైపవర్‌ ద్రవ్యం       3) 1, 2       4) సమీప ద్రవ్యం

జ: 1, 2


19. ధరల స్థిరీకరణకు రిజర్వ్‌ బ్యాంక్‌ అనుసరించే విధానం...

1) ద్రవ్య విధానం       2) కోశ విధానం      3) పన్నుల విధానం      4) పారిశ్రామిక విధానం

జ: ద్రవ్య విధానం


20. ద్రవ్య విధానాన్ని అమలు చేసే సంస్థ ఏది?

1) ఎస్‌బీఐ     2) ఆర్‌బీఐ       3) నాబార్డ్‌         4) పైవన్నీ

జ: ఆర్‌బీఐ


21. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య పరిమాణాన్ని నియంత్రించడం ద్వారా ధరలను అదుపు చేసే విధానాన్ని ఏమంటారు?

1) కోశ విధానం        2) ద్రవ్య విధానం      3) పన్నుల విధానం      4) బడ్జెట్‌ విధానం

జ: ద్రవ్య విధానం​​​​​​​


22. కనిష్ఠ రిజర్వ్‌ పద్ధతితో కలిగే ప్రయోజనం..

1) ద్రవ్యం వ్యాకోచత్వ శక్తి కలిగి ఉండటం         2) డిమాండ్‌ వ్యాకోచత్వం

3) సప్లయ్‌ వ్యాకోచత్వం     4) ద్రవ్యం అవ్యాకోచత్వం

జ: ద్రవ్యం వ్యాకోచత్వ శక్తి కలిగి ఉండటం ​​​​​​​


23. రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్యవర్గీకరణ...

1) M1        2) M1           3) M3      4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​


24. రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసి, ప్రజలు ఇతర బ్యాంకుల్లో నిల్వ చేసే ద్రవ్యం?

1) రిజర్వ్‌ ద్రవ్యం       2) సమీప ద్రవ్యం     3) సంకుచిత ద్రవ్యం       4) పరపతి ద్రవ్యం

జ: రిజర్వ్‌ ద్రవ్యం​​​​​​​


25. 1972 తర్వాత రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధానంలో ప్రధానమైంది.....

1) ద్రవ్యోల్బణ నియంత్రణ    2) కరెన్సీ నియంత్రణ   3) కరెన్సీ సప్లయ్‌    4) కరెన్సీ ముద్రణ

జ: ద్రవ్యోల్బణ నియంత్రణ​​​​​​​


26. ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committe - MPC) ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

1) 2016     2) 2017      3) 2015      4) 2018

జ: 2016​​​​​​​


27. ద్రవ్య విధాన సంఘం ఏర్పాటును సిఫార్సు చేసిన సంఘం/ ప్యానెల్‌?

1) ఉర్జిత్‌ పటేల్‌ సంఘం/ ప్యానెల్‌              2) రఘురామ్‌రాజన్‌ కమిటీ

3) బిమల్‌జలాన్‌ కమిటీ                4) రంగరాజన్‌ కమిటీ

జ: ఉర్జిత్‌ పటేల్‌ సంఘం/ ప్యానెల్‌​​​​​​​


28. ద్రవ్య విధాన సంఘంలో సభ్యుల సంఖ్య... 

1) 4        2) 5        3) 6         4) 7

జ: 6​​​​​​​


29. ద్రవ్య విధాన కమిటీ సమావేశాలను ఆర్‌బీఐ ఏడాదిలో ఎన్నిసార్లు నిర్వహిస్తుంది?

1) 2      2) 3       3) 4       4) 5

జ: 4


30. ద్రవ్య విధాన కమిటీ ఛైర్మన్‌గా ఎవరు ఉంటారు?

1) ఆర్‌బీఐ గవర్నర్‌      2) కేంద్ర ఆర్థిక మంత్రి     3) ప్రధానమంత్రి     4) ఎవరూ కాదు

జ: ఆర్‌బీఐ గవర్నర్‌


31. 1991 నరసింహం కమిటీ సిఫార్సు చేసిన సంస్కరణలు ఏవి?

1) వ్యవసాయరంగ సంస్కరణలు       2) పారిశ్రామికరంగ సంస్కరణలు

3) విత్తరంగ సంస్కరణలు       4) కార్మికరంగ సంస్కరణలు

జ: విత్తరంగ సంస్కరణలు​​​​​​​

32. ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని సిఫార్సు చేసిన సంఘం...

1) ఎల్‌.కె. ఝూ కమిటీ        2) నరసింహం కమిటీ

3) రంగరాజన్‌ కమిటీ       4) రఘురామ్‌రాజన్‌ కమిటీ

జ: నరసింహం కమిటీ​​​​​​​


33. వడ్డీరేట్లపై నియంత్రణ, క్రమబద్ధీకరణ తొలగించాలని ఏ సంవత్సరంలో సిఫార్సు చేశారు?

1) 1990     2) 1991     3) 1992      4) 1993

జ: 1991​​​​​​​


34. నగదు నిల్వల నిష్పత్తికి సంబంధించి నరసింహం కమిటీ సిఫార్సు ఏమిటి?

1) 38% నుంచి 25% కి తగ్గించడం      2) 15% నుంచి 5% కి తగ్గించడం

3) 40% నుంచి 10% కి తగ్గించడం      4) 20% నుంచి 15% కి తగ్గించడం

జ: 15% నుంచి 5% కి తగ్గించడం​​​​​​​


35. ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని నరసింహం కమిటీ ఏ సంవత్సరంలో సిఫార్సు చేసింది?

1) 1991      2) 1990     3) 2000      4) 1992

జ: 1991​​​​​​​

Posted Date : 22-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌