• facebook
  • whatsapp
  • telegram

బడ్జెట్‌

1. బడ్జెట్‌ అనే పదం బౌగెట్టే (Bougette) అనే పదం నుంచి ఆవిర్భవించింది. ఇది  ఏ భాషా పదం?

1) లాటిన్‌      2) ఫ్రెంచ్‌        3) గ్రీక్‌        4) ఏదీకాదు

జ: 2


2. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో వార్షిక ఆర్థిక నివేదిక (Annual Financial Statement) అనే అంశం గురించి వివరణ ఉంది?

1) ఆర్టికల్‌ 110     2) ఆర్టికల్‌ 111        3) ఆర్టికల్‌ 112      4) ఆర్టికల్‌ 113

జ: 3


3. మనదేశంలో బడ్జెట్‌ కాలం.....

1) ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు

2) మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 1 వరకు

3) మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 1 వరకు

4) ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 30 వరకు  

జ: 1


4. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు?

1) ఆర్‌.కె. షణ్ముఖం శెట్టి      2) జాన్‌మత్తాయ్‌

3) గుల్జారీలాల్‌నందా        4) టి.టి.కృష్ణమాచారి

జ: 1


5. సమీకృత నిధి ఖాతా నుంచి నిధులు సేకరించాలంటే కింది దేని అనుమతి తప్పనిసరి?

1) శాసనసభ      2) పార్లమెంట్‌       3) రాజ్యసభ      4) విధానసభ 

జ: 2


6. కంటింజెన్సీ నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది?

1) ఉపరాష్ట్రపతి      2) రాష్ట్రపతి       3) ప్రధానమంత్రి     4) కేంద్ర ఆర్థికమంత్రి

జ: 2


7. గతంతో సంబంధం లేకుండా ఆర్థిక వ్యవస్థ అవసరాలను, ప్రభుత్వ పథకాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా రూపొందించే బడ్జెట్ను ఏమంటారు?

1) శూన్య ఆధారిత బడ్జెట్‌ (జీరో బేస్డ్‌ బడ్జెట్‌)       2) మధ్యంతర బడ్జెట్‌  

3) ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌       4) అనుబంధ బడ్జెట్‌

జ: 1


8. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అంటే?

1) పూర్తి బడ్జెట్‌ను ప్రతిపాదించలేని పరిస్థితుల్లో తాత్కాలికంగా కొన్ని నెలల కోసం ప్రతిపాదించిన బడ్జెట్‌.

2) ఆదాయ, వ్యయాలు సమానంగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది.

3) వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది.

4) ప్రభుత్వం రుణభారం నుంచి విముక్తి పొందలేదు.

జ: 1


9. కోశలోటు అంటే?

1) కోశలోటు = బడ్జెట్‌ లోటు + ప్రభుత్వ రుణాలు + ఇతర అప్పులు

2) ప్రాథమిక లోటు = కోశలోటు + వడ్డీ చెల్లింపులు 

3) ద్రవ్యకరించిన లోటు = కోశలోటు - వడ్డీ చెల్లింపులు 

4) రెవెన్యూ లోటు = రెవెన్యూ రాబడి - రెవెన్యూ వ్యయం

జ: 1


10. ప్రభుత్వ రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువైతే ఏర్పడే లోటు?

1) ప్రాథమిక లోటు     2) కోశలోటు       3) రెవెన్యూ లోటు       4) బడ్జెట్‌ లోటు

జ: 3


11. బడ్జెట్‌ లోటు (Budget deficit) అంటే?

1) ప్రభుత్వ రాబడి కంటే వ్యయం తక్కువగా ఉండటం

2) కోశలోటు, వడ్డీ చెల్లింపులు  

3) బడ్జెట్‌ లోటు, ఇతర అప్పులు

4) ప్రభుత్వ రాబడి కంటే వ్యయం ఎక్కువగా ఉండటం

జ: 4


12. ప్రణాళికేతర వ్యయ ఖాతాల్లో ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ కూడా ఉంటుంది. ఈ మేరకు వ్యయాన్ని కోశలోటు నుంచి తీసేస్తే వచ్చేది?

1) కోశలోటు      2) ప్రాథమిక లోటు       3) లోటు బడ్జెట్‌      4) ఏదీకాదు

జ: 2


13. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి సేకరించిన రుణంలో పెరుగుదలను ఏమంటారు?

1) ద్రవ్యకరించిన లోటు      2) కోశలోటు    3) బడ్జెట్‌ లోటు     4) రెవెన్యూ లోటు

జ: 1


14. భారతదేశంలో మొదటిసారిగా డిజిటల్‌ బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 2021, ఫిబ్రవరి 1        2) 2022, ఫిబ్రవరి 1

3) 2021, ఫిబ్రవరి 28      4) 2022, ఫిబ్రవరి 28

జ: 1


15. మనదేశంలో డిజిటల్‌ బడ్జెట్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టింది?

1) పి.చిదంబరం             2) నిర్మలా సీతారామన్‌  

3) పీయూష్‌ గోయల్‌      4) అరుణ్‌ జైట్లీ

జ: 2


16. గణతంత్ర భారతదేశంలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి?

1) జాన్‌ మత్తాయ్‌        2) సి.డి.దేశ్‌ముఖ్‌ 

3) ఆర్‌.కె.షణ్ముఖం శెట్టి       4) జేమ్స్‌విల్సన్‌

జ: 1


17. స్వాతంత్య్రానికి ముందు (1860లో) మనదేశంలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఎవరు?

1) జేమ్స్‌విల్సన్‌       2) జేమ్స్‌టేలర్‌  

3) ఆస్‌బార్న్‌ స్మిత్‌     4) ఎవరూ కాదు

జ: 1


18. మనదేశంలో రెండోసారి డిజిటల్‌ బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 2019, ఫిబ్రవరి 1      2) 2020, ఫిబ్రవరి 1

3) 2021, ఫిబ్రవరి 1      4) 2022, ఫిబ్రవరి 1

జ: 4


19. బడ్జెట్ అంటే?

1) ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళిక       2) వార్షిక వ్యయ ప్రణాళిక  

3) వార్షిక రాబడి ప్రణాళిక       4) ప్రణాళికేతర వ్యయాన్ని సూచిస్తుంది

జ: 1


20. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్రబడ్జెట్‌ వసూళ్లను ఎంతగా అంచనా వేశారు?

1) రూ.35.09 లక్షల కోట్లు     2) రూ.34.83 లక్షల కోట్లు

3) రూ.37.70 లక్షల కోట్లు        4) రూ.39.44 లక్షల కోట్లు

జ: 4


21. స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1947, నవంబరు 26      2) 1947, నవంబరు 27

3) 1947, నవంబరు 28           4) 1947, నవంబరు 29

జ: 1


22. 1921లో సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేసి, ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ?

1) విలియం అక్వర్త్‌ కమిటీ        2) జాన్‌ మత్తాయ్‌ కమిటీ

3) జేమ్స్‌ టేలర్‌ కమిటీ         4) రాయల్‌ కమిషన్‌

జ: 1


23. మనదేశంలో కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళా ఆర్థికమంత్రి?

1) ఇందిరాగాంధీ      2) నిర్మలా సీతారామన్‌ 

3) మేనకాగాంధీ          4) మమతా బెనర్జీ

జ: 2


24. మనదేశంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి?

1) ఇందిరాగాంధీ      2) జవహర్‌లాల్‌ నెహ్రూ

3) రాజీవ్‌ గాంధీ      4) మొరార్జీ దేశాయ్‌

జ: 2


25. మనదేశంలో ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది?

1) మొరార్జీ దేశాయ్‌       2) జవహర్‌లాల్‌ నెహ్రూ

3) రాజీవ్‌గాంధీ        4) ప్రణబ్‌ ముఖర్జీ

జ: 1


26. భారత ఆర్థిక సర్వేను రూపొందించేది?

1) కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ         2) భారత ప్రభుత్వం

3) కేంద్ర వ్యవసాయ శాఖ    4) నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ)

జ: 1


27. కింది అంశాలను జతపరచండి.

i) మిలీనియం బడ్జెట్    a) 200203 

ii) రోల్‌బ్యాక్‌ బడ్జెట్       b) 2000

iii) చరిత్రాత్మక బడ్జెట్‌    c) 197374

iv) బ్లాక్‌ బడ్జెట్            d) 1991

1) i-b, ii-a, iii-d, iv-c       2) i-c, ii-a, iii-d, iv-b
3) i-d, ii-c, iii-a, iv-b     4) i-c, ii-d, iii-b, iv-a

జ: 1


28. భారత రాష్ట్రపతి జీతాన్ని కింది దేని నుంచి చెల్లిస్తారు?

1) సమీకృత నిధి          2) కంటింజెన్సీ నిధి

3) రుణవిమోచన నిధి      4) పబ్లిక్‌ ఖాతా

జ: 1

Posted Date : 17-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌