• facebook
  • whatsapp
  • telegram

భారత ఆర్థిక వ్యవస్థ

ఆర్థిక వృద్ధి (Economic Growth)

వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే నికర వృద్ధిని ‘ఆర్థిక వృద్ధి’ అంటారు. ఇది పరిమాణాత్మకమైంది. ఇది అభివృద్ధి చెందిన దేశాలు పొందే భావన.

 ఒక దేశంలో ఒక సంవత్సరం ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తు - సేవలను, ప్రస్తుత మార్కెట్‌ ధరల్లో లెక్కిస్తే వచ్చే మొత్తాన్ని స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంటారు.

 వస్తు - సేవల ఉత్పత్తి పెరగకుండా, కేవలం ధరలు మాత్రమే పెరిగినా స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రస్తుత ధరల్లో కాకుండా, స్థిర ధరల్లో (constant prices) లెక్కిస్తే వాస్తవ స్థూల జాతీయోత్పత్తి లభిస్తుంది.

స్థూల వస్తు - సేవల కంటే  దేశ జనాభా మరింత పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది. అధిక జనాభా కంటే జీడీపీ పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి జరుగుతుంది.

వస్తు - సేవల ఉత్పత్తి దీర్ఘకాలంలో  నిలకడగా పెరిగినప్పుడే దాన్ని వృద్ధిగా పేర్కొంటారు. అందుకే వాస్తవ తలసరి స్థూల జాతీయ ఉత్పత్తిలోని దీర్ఘకాల వస్తు - సేవల పెరుగుదలను ‘ఆర్థిక వృద్ధి’గా నిర్వచిస్తారు.

ఆర్థికాభివృద్ధిని కొలిచే సూచికలు

1950, 1960 దశకాల్లో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి వృద్ధి లక్ష్యాలను సాధించినప్పటికీ, జనాభాలోని ఎక్కువ భాగం ప్రజల జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పు రాలేదు. పేదరికం, నిరుద్యోగిత, ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు భావించారు. 

ఈ నేపథ్యంలో జాతీయ ఆదాయం (National Income), జాతీయ తలసరి వాస్తవ ఆదాయాలతో (Per capita real national income) పాటు ఆర్థికాభివృద్ధిని కొలిచేందుకు అనేక సూచికలు ప్రతిపాదించారు. అవి:

తలసరి వినియోగ స్థాయి

ఐక్యరాజ్యసమితి పరిశోధన సంస్థ సాంఘిక ఆర్థిక సూచీ (United NAtions Reseach Institute for Social Development - UNRISD)

భౌతిక జీవన నాణ్యత సూచీ (Physical Quality of Liine Index - PQLI)

మానవాభివృద్ధి సూచీ (Human Development Index)

లింగ అభివృద్ధి సూచీ (Gender Development Index - GDI)

లింగ అసమానత సూచీ (Gender Inequality Index - GII)

మానవ పేదరిక సూచీ (Human Poverty Index)

అమర్త్యకుమార్‌సేన్‌ ప్రతిపాదించిన సామర్థ్యాల అప్రోచ్‌ (Sen's Capability Approach)

బహుళకోణ పేదరిక సూచీ 9Multidimensional Poverty Index - MPI)

ప్రపంచ హరిత ఆర్థిక వ్యవస్థ సూచీ (Global Green Economy Index - GGEI)

సామాజిక ప్రగతి సూచీ (Social Progress Index - SPI)

తలసరి వినియోగ స్థాయి

తలసరి ఆదాయం పెరిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్బంధ పొదుపు షరతు విధిస్తే ప్రజల వినియోగం పెరగదు.

ఆర్థికాభివృద్ధి ముఖ్య ఉద్దేశం ప్రజల జీవన స్థాయిని పెంచడం.

ప్రజల తలసరి వినియోగం పెరిగితే ఆర్థికాభివృద్ధి సాధించినట్లు భావించాలి.

ఐక్యరాజ్యసమితి పరిశోధన సంస్థ సాంఘిక 

ఆర్థిక సూచీ (UNRISD)

దీన్ని 1963లో ప్రవేశపెట్టారు. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్‌. దీని మాతృసంస్థ యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌ ్బగీవినిళీద్శి యూఎన్‌ఆర్‌ఐఎస్‌డీ కింది కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 

1. సామాజిక విధానం - అభివృద్ధి

2. లింగ సమానత్వం - అభివృద్ధి

3. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కొలమానాలు

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని సాంఘిక, రాజకీయ, ఆర్థిక అంశాలకు సంబంధించిన పారిశ్రామిక, పట్టణీకరణ, ఆధునికీకరణ మొదలైన 16 అంశాలను పరిగణనలోకి తీసుకుని యూఎన్‌ఆర్‌ఐఎస్‌డీ ఒక సూచికను తయారు చేసి ఆర్థికాభివృద్ధిని నిర్వచిస్తుంది.

భౌతిక జీవన నాణ్యత సూచీ (PQLI)

1970 దశకం మధ్యలో డేవిడ్‌ మోరిస్‌ అనే ఆర్థికవేత్త దీన్ని అభివృద్ధి చేశారు.

పీక్యూఎల్‌ఐలో మూడు అంశాలకు సమాన భారితాన్ని ఇచ్చారు. అవి:

1. ప్రాథమిక అక్షరాస్యత (Basic Literacy - BL)

2. శిశు మరణాల రేటు (Infant Mortality - IM) - ప్రతి వెయ్యి మంది పిల్లల్లో

3. ఆయుర్దాయం (Life Expectancy - LE)

ఈ సూచీ ఒక దేశంలోని ప్రజల జీవన నాణ్యతను లేదా సంక్షేమాన్ని తెలియజేస్తుంది. అంతర్జాతీయ తులనాత్మక పరిశీలనకు ఇది అనువుగా ఉంటుంది.

మానవాభివృద్ధి సూచీ (HDI)

యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ్బగీవిదీశ్శి మానవాభివృద్ధి నివేదిక (హెచ్‌డీఐ)ను విడుదల చేస్తుంది.

హెచ్‌డీఐని 1990లో పాకిస్థాన్‌ ఆర్థికవేత్త మహబూబ్‌-ఉల్‌-హక్‌ రూపొందించారు. ఈయనతో అమర్త్యసేన్‌ కూడా కలసి పని చేశారు.

ఇందులో మానవాభివృద్ధికి సంబంధించిన ఆయుఃప్రమాణం, విద్యార్హత, తలసరి ఆదాయం/ తలసరి స్థూల జాతీయోత్పత్తి అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని, వాటినే సూచికలుగా ఉపయోగిస్తారు.

ఈ మూడు సూచీలను కింది సూత్రం ద్వారా లెక్కిస్తారు.

 

ప్రతి కోణానికి కనిష్ఠ, గరిష్ఠ విలువలను విడివిడిగా నిర్ణయిస్తారు.

మానవాభివృద్ధి నివేదిక (హెచ్‌డీఆర్‌) 2019లో 2020కి సంబంధించి హెచ్‌డీఐపై ఆధారపడిన ప్రపంచ దేశాలను నాలుగు రకాలుగా విభజించారు. అవి:

1. తక్కువ మానవాభివృద్ధి దేశాలు (Low): 0.350 - 0.549

2. మధ్యస్థాయి మానవాభివృద్ధి దేశాలు (Medium): 0.550 - 0.699

3. అధిక మానవాభివృద్ధి దేశాలు (High) 0.700 - 0.799

4. అత్యధిక మానవాభివృద్ధి దేశాలు(Very High): 0.800 - 1.000

యూఎన్‌డీపీ హెచ్‌డీఆర్‌ 2020ను 2020 డిసెంబరు 15న విడుదల చేసింది. మొత్తం 189 దేశాలకు ర్యాంకులను ప్రకటించారు. ఇందులో నార్వేకు మొదటి స్థానం దక్కగా, నైగర్‌కు చివరి స్థానం లభించింది. భారత్‌ 131 స్థానంలో నిలిచింది.

లింగ అభివృద్ధి సూచీ (GDI)

దీన్ని 1995లో ప్రవేశపెట్టారు.

మానవాభివృద్ధిలో  స్త్రీ, పురుషుల మధ్య ఉండే అసమానతలను లింగ అభివృద్ధి సూచీ (జీడీఐ) తెలుపుతుంది

మానవాభివృద్ధి సూచీని స్త్రీ, పురుషులకు విడివిడిగా నిర్మించి, వాటి నిష్పత్తిని లెక్కిస్తారు. ఈ నిష్పత్తి విలువ జీడీఐని సూచిస్తుంది.

ఈ సూచీ విలువ ఒకటికి దగ్గరగా ఉంటే స్త్రీ, పురుషుల మధ్య మానవాభివృద్ధిలో తక్కువ అసమానతలు ఉన్నట్లు, సూచీ విలువ ఒకటి కంటే చాలా తక్కువ ఉంటే అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాలి.

జీడీఐ - 2019 గణాంకాలు:

స్త్రీ సగటు జీవితకాలం 71 సంవత్సరాలు ఉండగా, పురుషుల సగటు జీవితకాలం 68.5 ఏళ్లుగా ఉంది.

Mean years of schooling: స్త్రీలు - 5.4 సం., పురుషులు - 8.7 సం.

 Expected years of schooling:  స్త్రీలు - 12.6 సం., పురుషులు - 11.7 సం.

​​​​​​​ తలసరి స్థూల జాతీయాదాయం (2017 PPP $): స్త్రీలు - 2,231 డాలర్లు, పురుషులు - 10,702 డాలర్లు

లింగ అసమానత సూచీ (GII)

దీన్ని 1995లో ప్రవేశపెట్టారు. జీఐఐ 2020లో స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో ఉండగా, యెమన్‌ ్బ162్శ చివరి ర్యాంకులో నిలిచింది. మనదేశం 123వ స్థానంలో ఉంది.

లింగ అసమానత సూచీని మూడు అంశాలను ఉపయోగించి ఒక మిశ్రమ సూచికగా ఏర్పాటు చేశారు. అవి:

1. పునరుత్పత్తి ఆరోగ్యం        2. సాధికారత 

3. శ్రామిక మార్కెట్‌

పునరుత్పత్తి ఆరోగ్యం: ఇందులో మాతృ మరణాల రేటు, వయోజన జనన రేటు ఉంటాయి.

సాధికారత: పార్లమెంట్‌లో మహిళా సభ్యుల సంఖ్య, వయోజన విద్య పొందిన స్త్రీల సంఖ్య ఆధారంగా దీన్ని నిర్మిస్తారు.

శ్రామిక మార్కెట్‌: శ్రమశక్తిలో పాల్గొనే స్త్రీల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటారు.

లింగ అసమానత సూచీ విలువ తక్కువగా ఉంటే స్త్రీ - పురుషుల మధ్య అసమానతలు తక్కువగా ఉన్నట్లు, సూచీ విలువ అధికంగా ఉంటే వారి మధ్య ఎక్కువ అసమానతలు ఉన్నట్లు గుర్తిస్తారు.

​​​​​​​​​​​​​​

ఆర్థికాభివృద్ధి (Economic Development)

ఆర్థికాభివృద్ధి చాలా విశాలమైంది.

ఇది గుణాత్మకమైంది (Qualitative).

ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన భావన. ఉదా: భారత్‌

‘ఆర్థికాభివృద్ధి’ అంటే ఆర్థిక వృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు. వీటిని ప్రధానంగా కింది విధంగా పేర్కొంటారు. అవి:

నిరుద్యోగిత, పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గించడం.

 అక్షరాస్యతను పెంచి, ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపర్చడం.'

జీడీపీలో వ్యవసాయరంగం, పరిశ్రమలు, సేవా రంగాల వాటా పెరగడం.

సంప్రదాయ ఉత్పత్తి పద్ధతులను వదిలి, ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఎంచుకోవడం.

రవాణా, విద్యుత్, సమాచారం మొదలైన అవస్థాపన రంగాలను అభివృద్ధి చేయడం.

పట్టణీకరణ.

 శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి.


 

Posted Date : 18-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌