• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో  భూ సంస్కరణలు

1. భారతదేశంలో మొదటిసారి జమీందారీ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారు? (లార్డ్‌ కారన్‌ వాలీస్‌ దీన్ని ప్రవేశపెట్టారు.)

1) 1793   2) 1794   3) 1795    4) 1796


2. శాశ్వత భూమిశిస్తు విధానానికి ఉన్న మరొక పేరు?

1) రైత్వారీ విధానం    2) సామాజిక వ్యవసాయ విధానం

3) జమీందారీ పద్ధతి     4) భూగరిష్ఠ విధానం


3. జమీందారీ పద్ధతిని తొలిసారి ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు?

1) బిహార్‌      2) మద్రాస్‌ 

3) పశ్చిమ్‌ బెంగాల్‌     4) మహారాష్ట్ర


4. జమీందారీ పద్ధతి ప్రకారం జమీందార్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తు?

1) పంట దిగుబడిలో 10/11వ వంతు 

2) పంట దిగుబడిలో 10/12వ వంతు

3)  పంట దిగుబడిలో 10/13వ వంతు

4)  పంట దిగుబడిలో 10/14వ వంతు


5. మహల్వారీ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారు? (దీన్ని విలియం బెంటింక్‌ ప్రవేశపెట్టారు.)

1) 1831   2) 1832     3)1833   4) 1834


6. మహల్వారీ పద్ధతిని అమలు చేసిన ప్రాంతం?

1) వాయవ్య రాష్ట్రాలు     2) ఆగ్రా, పంజాబ్‌

3) అవధ్‌       4) పైవన్నీ


7. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) రైత్వారీ పద్ధతిని 1820లో ప్రవేశపెట్టారు.

బి) రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది    - థామస్‌ మన్రో

సి) రైత్వారీ పద్ధతిని మొదటిసారి మద్రాస్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు.

1)ఎ, బి    2) ఎ, సి     3) బి, సి   4) పైవన్నీ


8. రైత్వారీ శిస్తు నిర్ణాయక విధానానికి ఉన్న మరొక పేరు?

1) జమీందారీ విధానం   2) రైత్వారీ పద్ధతి

3) మహల్వారీ విధానం    4) శాశ్వత శిస్తు విధానం


9. కింది ఏ కంపెనీవారు శాశ్వత భూమిశిస్తు వసూలు విధానాన్ని ప్రవేశపెట్టారు?

1)  ఈస్టిండియా కంపెనీ    2) సౌత్‌ ఇండియా కంపెనీ

3) వెస్టిండియా కంపెనీ    4) నార్త్‌ ఇండియా కంపెనీ


10. బ్రిటిష్‌ వారు వ్యవసాయ భూముల శిస్తు వసూలుకు కింది ఏ పద్ధతిని అనుసరించారు?

1) జమీందారీ పద్ధతి    2) రైత్వారీ పద్ధతి

2) మహల్వారీ పద్ధతి  4) పైవన్నీ


11. శాశ్వత భూమి శిస్తు వసూలు విధానం ప్రకారం, మొదట వ్యవసాయ భూముల నికర ఆదాయంలో ఎంత శాతం కౌలుగా వసూలు చేశారు?

1) 80 శాతం   2) 81 శాతం   3) 82 శాతం    4) 83 శాతం


12. కింది ఏ విధానంలో సాగుభూమి నుంచి వచ్చే నికర ఆదాయంలో 40 శాతం శిస్తుగా వసూలు చేశారు?

1) శాశ్వత భూమిశిస్తు వసూలు విధానం

2) రైత్వారీ శిస్తు విధానం

3)మహల్వారీ శిస్తు పద్ధతి 

4)ఏదీకాదు


13. దేశంలోని ఎంత వ్యవసాయ భూమిలో మాత్రమే రైత్వారీ విధానం అమల్లో ఉంది?

1) 35 శాతం  2) 36 శాతం    3) 37 శాతం  4) 38 శాతం


14. రైత్వారీ విధానంలో స్థూల ఉత్పత్తిలో ఎంతశాతం పన్నును నిర్ణయించారు?

1) 20 - 30% వరకు

2) 30 - 40% వరకు

3) 40 - 50% వరకు

4) 50 - 60% వరకు


15. బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక గ్రామంలో వ్యవసాయానికి పనికివచ్చే భూమిని అంచనావేసి, దాన్ని ఆ గ్రామ సమష్టి ఆస్తిగా పరిగణించి, దానిపై శిస్తు విధించేది. ఈ పద్ధతిని ఏమంటారు?

1) జమీందారీ విధానం    2) రైత్వారీ పద్ధతి

3) మహల్వారీ పద్ధతి     4) పైవన్నీ


16. జమీందారీ విధానాన్ని రద్దు చేసి, భూసంస్కరణలు అమలు చేసిన సంవత్సరం?

1) 1950   2) 1951   3) 1952   4)1953


17. కాంగ్రెస్‌ వ్యవసాయ సంస్కరణల కమిటీ (Congress Agrarian Reforms Committee) కి ఎవరు అధ్యక్షులుగా వ్యవహరించారు? (మనదేశానికి స్వాతంత్య్రం వచ్చాక, పార్లమెంట్‌ 1948లో ఈ కమిటీని నియమించింది.)

1) జె.సి.కుమారప్ప   2) డి.ఆర్‌.గాడ్గిల్‌

3) జయతీ ఘోష్‌    4) వై.కె.అలఘ్‌


18. భూసంస్కరణలను ఏమని పిలుస్తారు?

1)వ్యవసాయ సంబంధ సంస్కరణలు 

2) భూగరిష్ఠ పరిమితి 

3) కౌలు విధానం 

4) శాశ్వత శిస్తువిధానం 


19. భారతదేశంలో భూసంస్కరణలు అమలు చేసిన మొదటి రాష్ట్రం?

1) కేరళ   2) జమ్మూ-కశ్మీర్‌ 

3) మహారాష్ట్ర   4)పశ్చిమ్‌ బెంగాల్‌ 


20. భారత రాజ్యాంగం ప్రకారం, భూసంబంధ చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది?

1) పార్లమెంట్‌   2) రాష్ట్ర శాసనసభలు 

3) రాష్ట్రపతి   4) కేంద్ర ఆర్థికమంత్రి 


21. భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు భూసేకరణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 1891   2) 1892    3) 1893    4) 1894 


22. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని మొదటిసారి ఎప్పుడు చేశారు?

1) 1945      2) 1946    3) 1947      4) 1948 

23. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ) అభిప్రాయం ప్రకారం, భూ సంస్కరణలు అంటే?

1) భూమి పునఃపంపకం, కౌలు పరిమాణ నిర్ణయం, కౌలుదార్లకు భద్రత.

2) వ్యవసాయ కూలీల వేతన నిర్ణయం, వ్యవసాయ పరపతి మార్గాల అభివృద్ధి, భూమి పన్నుల విధాన మెరుగుదల

3) సహకార సంస్థల అభివృద్ధి, వ్యవసాయ విద్యాబోధన, వ్యవసాయంలో సాంకేతిక మార్పులు

4) పైవన్నీ


24. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని తొలిసారి ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు?

1) మద్రాస్‌    2) పశ్చిమ్‌ బెంగాల్‌

3) మహారాష్ట్ర     4) పంజాబ్‌


25. మధ్యవర్తుల దోపిడీకి ఎక్కువగా గురైన రాష్ట్రం?

1) కేరళ   2) పశ్చిమ్‌ బెంగాల్‌    3) మద్రాస్‌     4) అవధ్‌


26. భూ సంస్కరణల లక్ష్యాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) సామాజిక సమానత్వాన్ని సాధించే విధంగా భూ వ్యవసాయ సంబంధాలను పునర్నిర్మించి, దోపిడీని అరికట్టడం.

బి) దున్నేవాడికే భూమి సమకూర్చడం.

సి) గ్రామీణ పేదలకు భూమి పంపిణీ చేసి వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం.

డి) వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం.

1) ఎ, బి, సి    2) బి, సి, డి  3) ఎ, బి, డి     4) పైవన్నీ


27. భూ గరిష్ఠ పరిమితి చట్టం అంటే?

1) చట్టప్రకారం ఒక కుటుంబం ఎంత పరిమాణంలో భూమిని తన ఆధీనంలో ఉంచుకోవచ్చో తెలుపుతుంది.

2) భూ యాజమాన్య హక్కులను తెలుపుతుంది

3) మిగులు భూమి పరిమాణాన్ని తెలుపుతుంది.

4) యాజమాన్య హక్కులను తెలుపుతుంది.


28. భూ గరిష్ఠ పరిమితిలో ఉపయోగించే ‘యూనిట్‌’ అనే పదం కింది దేన్ని వివరిస్తుంది?

1) కుటుంబం     2) అయిదుగురు వ్యక్తులు

3) భర్త, భార్య, ముగ్గురు మైనర్‌ పిల్లలు    4) పైవన్నీ


29. మనదేశంలో తొలిసారిగా భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని కింది ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు?

1)  జమ్ము-కశ్మీర్‌    2) కేరళ

3) పశ్చిమ్‌ బెంగాల్‌   4) మహారాష్ట్ర


30. భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1950 దశాబ్దం చివర్లో

2) 1960 దశాబ్ద ప్రారంభంలో

3)1, 2

4) 1970 దశాబ్ద ప్రారంభంలో


సమాధానాలు

1-1,  2-3,  3-3,  4-1,   5-3,  6-4,  7-4,  8-2,  9-1,  10-4,  11-4,  12-1,  13-4, 14-3,  15-3,  16-3,  17-1,  18-1,  19-1,  20-2,  21-4,  22-4,  23-4,  24-1,   25-2,  26-4,  27-1,  28-4,  29-1,  30-3.


మరికొన్ని...


1. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1972, జులైలో ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించి, ఒక కుటుంబానికి ఉండాల్సిన భూ గరిష్ఠ పరిమితిపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వీటికి సంబంధించి కిందివాటిలో సరైంది?

1) నీటిపారుదల వసతి ఉండి, ఏడాదికి రెండు పంటలు పండే భూమి 1018 ఎకరాల వరకు ఉండొచ్చు.

2) ఏడాదికి ఒక పంట పండే భూమి 1827 ఎకరాల వరకు ఉండొచ్చు.

3)నీటిపారుదల సౌకర్యాలు లేని భూమి గరిష్ఠంగా 54 ఎకరాల వరకు ఉండొచ్చు.

4) పైవన్నీ


2. ‘వక్ఫ్‌ భూములు’ అంటే?

1) ఇస్లాం మత ఉద్ధరణకు నిజాం ప్రభుత్వం కేటాయించిన భూములు

2) ప్రభుత్వ భూములు

3) బీడు భూములు

4) పేద ముస్లిం భూములు


3. అసైన్డ్‌ భూములకు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఇవి ప్రభుత్వానికి సంబంధించిన భూములు.

బి) ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేసే (వ్యవసాయ) భూములు, ఇళ్ల స్థలాలు.

సి) ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో లబ్ధిదారులు వ్యవసాయం చేసుకునే హక్కు కలిగి ఉంటారు.

డి) వీటిని అమ్ముకోవడానికి, ఇతరులకు బదిలీ చేయడానికి హక్కు ఉండదు.

1) ఎ, బి     2) బి, సి    3) ఎ, డి     4) పైవన్నీ


4. నిజాం ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న భూములు....

1) దివానీ భూములు  

2) ఖల్సా భూములు

3) బీడు భూములు  

4) బంజరు భూములు


5. భూకమతాల విఘటన అంటే?

1) ప్రతి స్థలంలో ఉన్న భూమిని కుటుంబంలోని సంతానం మధ్య పంపిణీ చేయడం

2) భూమిని దానం చేయడం 

3) 1, 2

4) భూగరిష్ఠ పరిమితి


సమాధానాలు

1-4,   2-1,  3-4,   4-2,  5-1.   

Posted Date : 20-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌