• facebook
  • whatsapp
  • telegram

వ్యాపార చెల్లింపు శేషం - లోటు నియంత్రణ చర్యలు

1. వ్యాపార చెల్లింపుల శేషం లెక్కలను నిర్వహించే సంస్థ?

1) వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూటీఓ)

2) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)

3)నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ)

4) నీతి ఆయోగ్‌


2. వ్యాపార చెల్లింపుల శేషం పట్టిక ఆకృతిని సిఫార్సు చేసిన కమిటీ?


1)డాక్టర్‌ సి.రంగరాజన్‌ కమిటీ

2)రఘురామ్‌ రాజన్‌ కమిటీ

3) ఉర్జిత్‌ పటేల్‌ కమిటీ

4) బిమల్‌ జలాన్‌ కమిటీ


3. వర్తక శేషం పట్టికలో కింది ఏ అంశాలు ఉంటాయి?

1) ఎగుమతులు      2)దిగుమతులు      3) 1, 2     4) నికర బదిలీ


4. వర్తక శేషం పట్టికలో అదృశ్య అంశాలుగా  కింది వేటిని పేర్కొంటారు?

1) నికరసేవల ఎగుమతులు    2) నికర పెట్టుబడి రాబడి        3) నికర బదిలీ         4) పైవన్నీ


5. వర్తకలోటు అంటే?

1)ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉంటడం

2) ఎగుమతుల కంటే దిగుమతులు  తక్కువగా ఉండటం

3) ఎగుమతులు, దిగుమతులు రెండూ ఎక్కువగా ఉండటం

4) దిగుమతులు స్థిరంగా, ఎగుమతులు ఎక్కువగా ఉండటం


6. వర్తమాన ఖాతా లావాదేవీల్లో రూపాయి పూర్తి పరివర్తనను ఎప్పటి నుంచి అనుమతించారు?

1) 1994     2) 1998       3)1996     4) ఏదీకాదు


7. మూల్యహీనీకరణ (Devaluation)  అంటే?

1) ప్రభుత్వం తమ దేశ కరెన్సీ విలువను ఇతర దేశాల ప్రభుత్వ కరెన్సీ విలువ దృష్ట్యా అధికారికంగా తగ్గించడం

2)ప్రభుత్వం తమ దేశ కరెన్సీ విలువను పెంచడం

3) ప్రభుత్వం తమ దేశ కరెన్సీ విలువను తగ్గించి, పెంచడం

4) ప్రభుత్వం అధికారికంగా కరెన్సీ అంతర్గత విలువను పెంచడం


8. వ్యాపార చెల్లింపుల శేషంలోని ఖాతా?

1) వర్తమాన ఖాతా       2) మూలధన ఖాతా       3) బ్యాంకు ఖాతా       4) 1, 2


9. మూలధన ఖాతాలో చూపే రుణాలు?

1) సావరిన్‌ రుణాలు       2)బాహ్య వాణిజ్య రుణాలు         3)1, 2       4) స్వల్పకాలిక రుణాలు


10. ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకున్న రుణాలను ఏమంటారు?

1)సావరిన్‌ రుణాలు       2)మధ్యకాలిక రుణాలు      3) దీర్ఘకాలిక రుణాలు      4)స్వల్పకాలిక రుణాలు


11. ప్రవాసుల (విదేశాల్లో నివసించే వారి) నుంచి ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలు విదేశీ కరెన్సీలో పొందిన రుణాలు?

1)బాహ్య వాణిజ్య రుణాలు       2) వర్తకలోటు    3)సావరిన్‌ రుణాలు      4) అంతర్గత రుణాలు


12. మూలధన ఖాతా     (Capital Account)    లో కింది ఏ అంశాలు ఉంటాయి?

ఎ) రుణాలు     బి) ప్రవాస భారతీయుల డిపాజిట్లు

సి) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు

1) ఎ, బి     2) ఎ, సి       3)బి, సి     4)పైవన్నీ


13. విదేశీ చెల్లింపులకు సంబంధించి భారత్‌ కింది ఏ సంవత్సరంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది?

1)1990     2) 1991     3) 1992     4) 1993


14. కింది ఏ సందర్భంలో వ్యాపార చెల్లింపుల శేషంలో ప్రతికూలత ఉంటుంది?

1) రాబడిని మించి చెల్లింపులు ఉన్నప్పుడు

2) వ్యయానికి సమానంగా చెల్లింపులు  ఉన్నప్పుడు

3) రాబడికి మించి చెల్లింపులు లేనప్పుడు

4) మిగులు రాబడి ఉన్నప్పుడు


15. 197273లో వ్యాపార చెల్లింపుల శేషం.....

1) ప్రతికూలం     2) అనుకూలం    3)1, 2       4) తటస్థం


16. వర్తమాన ఖాతా లావాదేవీల్లో పాక్షికపరివర్తనను అనుమతించిన సంవత్సరం?

1)1990     2) 1991    3) 1992  4)1993


17. మూలధన ఖాతాలో అమల్లో ఉన్న రూపాయి పరివర్తన విధానం....

1) పాక్షిక పరివర్తన    2)సామాజిక పరివర్తన      3) పరివర్తన లేకపోవడం   4) ఏదీకాదు


18. విదేశీ చెల్లింపుల శేషంలో లోటు....

1)వర్తమాన/ మూలధన ఖాతాల్లో స్వయంచాలక రాబడుల కంటే స్వయంచాలక చెల్లింపులు ఎక్కువగా ఉండటం

2) స్వయంచాలక పెట్టుబడులు తక్కువగా ఉండటం

3) విదేశీ పెట్టుబడులు తక్కువగా ఉండటం

4)రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉండటం


19. వ్యాపార చెల్లింపుల శేషంలో మిగులు లేదా లోటు ఉన్న పరిస్థితిని ఏమంటారు?

1) సమతౌల్యం     2)అసమతౌల్యం      3) తటస్థం     4) పాక్షిక సమతౌల్యం


20. మూలధన ఖాతాలో కరెన్సీ పరివర్తన గురించి అధ్యయనం చేసేందుకు కింది ఏ కమిటీని ప్రభుత్వం నియమించింది?

1)డాక్టర్‌ సి.రంగరాజన్‌ కమిటీ      2) తారాపూర్‌ కమిటీ  3) వాంఛూ కమిటీ    4) ఖుస్రో కమిటీ


21. ఒకదేశ కరెన్సీ బాహ్య విలువను స్థిరంగా ఉంచే మారకపు రేటు కిందివాటిలో?

1) సరళ మారకపు రేటు      2)స్థిర మారకపు రేటు     3)1, 2      4) హెడ్జింగ్‌


22. ఆర్థిక వ్యవస్థలో, డిమాండ్‌-సప్లయ్‌లో మార్పులను బట్టి మారే మారకపు రేటు?

1)సరళమారకపు రేటు     2) స్థిర మారకపు రేటు   3) 1, 2       4) సమతౌల్య మారకపు రేటు


23. విదేశీ మారకపు రేట్లలో మార్పుల వల్ల కలిగే నష్టభయాన్ని నివారించే వ్యూహం....

1) హెడ్జింగ్‌     2)మార్కెట్‌ సప్లయ్‌      3) స్థిర మారకపు రేటు     4) ఏదీకాదు


24. కొనుగోలు శక్తి సమానత్వ సిద్ధాంతాన్ని రూపొందించిన ఆర్థికవేత్త? (ఇది విదేశీ ద్రవ్య మారక రేటుకు సంబంధించింది.)

1)గస్టవ్‌ క్యాసెల్‌     2) జె.ఎం.కీన్స్‌        3) రికార్డో      4) పాల్‌క్రుగ్‌మెన్‌


25. మారకంలో విదేశీ కరెన్సీని వెంటనే చెల్లించడానికి వీలు కల్పించే మారకపు రేటు....

1) తక్షణ మారకపు రేటు     2) సరళ మారకపు రేటు      3)స్థిర మారకపు రేటు      4)హెడ్జింగ్‌


సమాధానాలు


1 - 2  2 - 1  3 - 3  4 - 4  5 - 1  6 - 1  7 - 1  8 - 4  9 - 3  10 - 1  11 - 1  12 - 4  13 - 2  14 - 1  15 - 2  16 - 3  17 - 1  18 - 1  19 - 2  20 - 2  21 - 2  22 - 1  23 - 1  24 - 1  25 - 1


మరికొన్ని...

1. భారతదేశంలో మొదటిసారి పేటెంట్‌ హక్కులకు సంబంధించిన చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1)1855       2)1856      3) 1857    4) 1858


2. భారతదేశంలో పేటెంట్‌ హక్కులకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం?

1) భారత పేటెంట్‌ చట్టం, 1968           2)భారత పేటెంట్‌ చట్టం, 1969

3) భారత పేటెంట్‌ చట్టం, 1970     4)భారత పేటెంట్‌ చట్టం, 1971


3. ప్రపంచ వాణిజ్యంలో వ్యవసాయానికి సంబంధించిన ఒప్పందం?

1) పరిశ్రమల ఒప్పందం, 1994      2) వ్యవసాయ ఒప్పందం, 1995

3) తయారీ ఒప్పందం, 1996         4) ఏదీకాదు


4. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వస్త్రాల దిగుమతుల పరిమితికి సంబంధించిన ఒప్పందం?

1) మల్టీఫైబర్‌ అగ్రిమెంట్‌   2)బౌండ్‌ టారిఫ్‌   3) మోస్ట్‌ ఫేవరెట్‌ నేషన్‌ టారిఫ్‌  4)అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ రిలేటెడ్‌


5. కిందివాటిలో బ్రెట్టన్‌ వుడ్స్‌ కవలలు ఏవి?

1) ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ

2) యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌

3)  యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌

4)  వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్, నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌


6. ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌  అండ్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ను ఎప్పుడు స్థాపించారు?

1) 1941    2) 1942      3) 1943     4) 1944


7. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మొదటి డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌?

1) క్రిస్టలీనా జార్జియేవా   2) గీతా గోపినాథ్‌   3) డేవిడ్‌ మాల్పస్‌     4) క్రిస్టలీనా లగార్డే


8. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఉద్దేశం?

1)అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను స్థిరీకరించడం.

2) వ్యాపార చెల్లింపుల్లో సమస్యలు ఏర్పడినప్పుడు సభ్య దేశాలకు విదేశీ మారక ద్రవ్యం రుణాలుగా ఇచ్చి ఆదుకోవడం.

3)మారకంరేటు స్థిరత్వాన్ని కాపాడటం

4) పైవన్నీ


9. కిందివాటిలో విదేశీ వ్యాపార చెల్లింపుల అసమతౌల్యానికి సంబంధించిన కారణాల్లో సరైంది?

1) రుతుపవనాలు విఫలం కావడం, అనావృష్టి ఏర్పడటం, వ్యవసాయ ఎగుమతులు తగ్గడం లేదా అతివృష్టి కారణంగా పంటలు నాశనమవ్వడం, విద్యుత్‌ శక్తి కొరత వల్ల పారిశ్రామిక ఉత్పత్తులు తగ్గడం.

2)స్వదేశంలో తయారయ్యే వస్తువుల ధరల కంటే విదేశీ వస్తువుల ధరలు తక్కువగా ఉండటం, తద్వారా దిగుమతుల పరిమాణం పెరగడం.

3) మన ఎగుమతులకు విదేశీ ఎగుమతులకు మధ్య పోటీ

4)పైవన్నీ


10. మోస్ట్‌ ఫేవర్డ్‌ టారిఫ్‌  (Most Favored Tariff) అంటే ఏమిటి?

1) సభ్యదేశాలన్నిటి మధ్య తేడాలు లేకుండా వసూలు చేసే ఒకే గరిష్ఠ సుంకపురేటు

2) సభ్యదేశాలు సంప్రదింపుల ద్వారా ఒక వస్తువుపై విధించే కనిష్ఠ రేటు

3) స్థిర మారకపు రేటు

4) సరళ మారకపు రేటు


11. 20వ శతాబ్దంలో విదేశీ వ్యాపార చెల్లింపులకు కింది ఏ ప్రమాణాన్ని అనుసరించారు?

1)స్వర్ణం      2) డాలర్‌    3) పౌండ్‌     4) వెండి 


సమాధానాలు


1 - 2  2 - 3  3 - 2  4 - 1  5 - 1  6 - 4  7 - 2  8 - 4  9 - 4  10 - 1 11 - 1


రచయిత


బండారి ధనుంజయ


విషయ నిపుణులు


 

Posted Date : 10-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌