• facebook
  • whatsapp
  • telegram

శాతవాహన అనంతర యుగం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కిందివాటిని జతపరచండి.
1) శ్రీపర్వతీయులు                       ఎ) ఆనందగోత్రజులు

2) బప్ప భట్టారక పాదభక్తులు        బి) తూర్పు చాళుక్యులు 

3) త్రికూట పర్వతాధిపతులు         సి) ఇక్ష్వాకులు

4) హారితీపుత్రులు                      డి) శాలంకాయనులు

జ: 1-సి; 2-డి; 3-ఎ; 4-బి
 

2. 'ఇక్షు చిహ్నాన్ని పూజించే కృష్ణా నదీతీరంలోని వారే ఇక్ష్వాకులు' అని అన్నదెవరు?
జ: కాల్డ్‌వెల్

 

3. శతసహస్ర హాలక బిరుదు పొందిన ఇక్ష్వాక రాజు-
జ: మొదటి శాంతమూలుడు

 

4. మాంధాత శిల్పం ఏ ప్రాంతంలో బయల్పడింది?
జ: జగ్గయ్యపేట

 

5. ఆంధ్రదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన వంశీయులు 
జ: ఇక్ష్వాకులు

 

6. నాగార్జునకొండ వద్ద చైత్యాన్ని నిర్మించిన స్త్రీ-
జ: శాంతిశ్రీ

 

7. దక్షిణ భారతదేశంలో తొలి తామ్రశాసనం వేయించిన పాలకులు-
జ: బృహత్పలాయనులు

 

8. శాలంకాయనుల ఆరాధ్య దైవం
జ: చిత్రరథస్వామి

 

9. సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకుని తెలుగు నేలపై పాలించిన తొలి వంశం-
జ: విష్ణుకుండినులు

 

10. చేజర్ల కపోతేశ్వరాలయాన్ని నిర్మించినదెవరు?
జ: దామోదర వర్మ

 

11. బౌద్ధమతాన్ని స్వీకరించిన ఏకైక విష్ణుకుండిన రాజు
జ: గోవిందవర్మ

 

12. తన కుమారుడికి మూడో మాధవవర్మ ఉరిశిక్ష విధించినట్లు తెలుపుతున్న గ్రంథం-
జ: నచికేతోపాఖ్యానం

 

13. ఇక్ష్వాకుల కాలం నాటి దేవాలయాలు బయల్పడిన వీరాపురం ఏ జిల్లాలో ఉంది?
జ: కర్నూలు

 

14. నెల్లూరు జిల్లా భైరవ కొండ గుహాలయాలు ఏ మతానికి సంబంధించినవి?
జ: శైవం

 

15. తొలి తెలుగు వాక్యం విజయోత్సవ సంవత్సరంబుల్ ఏ శాసనంలో ఉంది?
జ: చిక్కుళ్ల శాసనం

 

16. ఆంధ్రరాష్ట్ర అధికార చిహ్నం పూర్ణకుంభం ఏ గుహాలయాల్లో ఉంది?
జ: ఉండవల్లి గుహలు

 

17. ఆనందగోత్రజుల రాజ లాంఛనం-
జ: వృషభం

 

18. ఆంధ్రదేశంలో విష్ణుదేవాలయాలు ఉన్నట్లు తెలిపే తొలి శాసనం
జ: పెదవేగి శాసనం

 

19. ఇక్ష్వాకుల రాజధాని-
జ: విజయపురి

 

20. కిందివాటిని జతపరచండి.
1) చేజర్ల శాసనం                   ఎ) దామోదరవర్మ

2) మట్టిపాడు శాసనం           బి) కందారరాజు

3) గోరంట్ల శాసనం               సి) అత్తివర్మ

4) చిక్కుళ్ల శాసనం             డి) రెండో విక్రమేంద్రవర్మ

జ: 1-బి; 2-ఎ; 3-సి; 4-డి

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌