• facebook
  • whatsapp
  • telegram

శాతాలు

1. ఒక సంఖ్యలోని 20% విలువకి, అదే సంఖ్యలోని 4/5 వ వంతుకి మధ్య ఉన్న వ్యత్యాసం 2499. అయితే ఆ సంఖ్యలోని 2/7 వ వంతు విలువ ఎంత?

1) 2156      2)  1190      3)  1090       4)  1465

సాధన: సంఖ్య = X అనుకోండి.

    సమాధానం: 2

2. రెండు వరుస సరి సంఖ్యల లబ్ధం 7568. అయితే ఆ రెండు సంఖ్యల మొత్తంలో 150% విలువ ఎంత?


1)  204       2)  246        3) 261        4)  304

సాధన: రెండు వరుస సరి సంఖ్యలు = x, x + 2 

లెక్క ప్రకారం,

సమాధానం: 3

3. ఒక కళాశాలలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌ చదువుతున్న విద్యార్థుల నిష్పత్తి 2 : 3 : 5. మూడు కోర్సుల్లోని విద్యార్థుల సంఖ్యను వరుసగా 15%, 20%, 25% చొప్పున పెంచితే, పెరిగాక విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత?

1)  46 : 72 : 125        2) 10 : 12 : 15          3 ) 3 : 4 : 5       4) 6 : 12 : 25

సాధన: 

సమాధానం: 1


4. ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థి కనీసం 35% మార్కులు సాధించాలి. అతడు అన్ని పరీక్షల్లో 200 మార్కులు పొంది, 10 మార్కుల తేడాతో ఫెయిల్‌ అయ్యాడు. అయితే ఆ పరీక్షలో గరిష్ఠ మార్కులు ఎన్ని?

1) 500         2) 800        3)  900         4)  600

సాధన: ఉత్తీర్ణత మార్కులు = 35% 

సమాధానం: 4


5. నవీన్‌ తన ఆదాయంలో 20% ఆదా చేస్తాడు. అతడి ఆదాయం 24% పెరిగాక వచ్చే ఆదాయంలో 25% ఆదా చేయాలనుకున్నాడు. అయితే అతడి పొదుపులో పెరుగుదల శాతం ఎంత?

1) 55%          2) 60%            3)  36%        4) 82% 

సాధన:   ఆదాయం  పొదుపు

 సమాధానం: 1


6. హరిత తన ఆదాయంలో 10% ఒక ట్రస్టుకు, మిగిలినదానిలో 15% తన కుమారుడికి, తర్వాతిదానిలో 20% తన కుమార్తెకు ఇచ్చింది. ఆమె వద్ద మొత్తం రూ.38,250 మిగిలింది. అయితే ఆమె ఆదాయం ఎంత?

1) రూ.72,000        2)  రూ.69,540          3)  రూ.62,500      4) రూ.85,000

సమాధానం: 3


7. రాము పంచదార ధర 10% తగ్గితే, మునుపటి కంటే 22 కేజీలు ఎక్కువగా కొనాలని భావించాడు. కానీ దాని ధర 10% పెరిగింది. అయితే అదే సొమ్ముతో రాము కొనగల పంచదార పరిమాణం ఎంత? (కేజీల్లో)

1) 200        2) 220        3) 250        4) 180

సాధన: తగ్గినప్పుడు ధరల మధ్య నిష్పత్తి 

= 100 : 90 = 10 : 9

పరిమాణాల మధ్య నిష్పత్తి = 9 : 10

భేదం = 10 - 9 = 1 భాగం = 22 కేజీలు

అసలు పరిమాణం = 9 x 22 = 198 కేజీలు

పెరిగినప్పుడు ధరల మధ్య నిష్పత్తి 

= 100 : 110 = 10 : 11

పరిమాణాల మధ్య నిష్పత్తి = 11 : 10

సమాధానం: 4


8. ఒక పాఠశాలలోని బాలబాలికల మధ్య నిష్పత్తి 3 : 2. బాలురలో 20%, బాలికల్లో 30% మంది ఉపకారవేతనం పొందుతారు. అయితే ఉపకారవేతనం పొందని వారి శాతం ఎంత?

1) 50%     2) 72%         3) 75%        4) 76%

సాధన: మొత్తం విద్యార్థులు = 3 + 2 = 5 భాగాలు

ఉపకారవేతనం పొందని వారి శాతం = బాలురు ( 80%)  +  బాలికలు ( 70%)

సమాధానం: 4

9. హరి కొన్ని గుడ్లు కొనుగోలు చేశాడు. రవాణా చేసే సమయంలో వాటిలో 10% గుడ్లు పగిలిపోగా, మిగిలిన వాటిలో 80% గుడ్లను అమ్మాడు. ఇంకా అతడి దగ్గర 270 గుడ్లు మిగిలాయి. అయితే హరి కొన్న మొత్తం గుడ్లు ఎన్ని?

1) 10000        2) 8000          3) 1500        4) 1000

సాధన: మొత్తం గుడ్ల సంఖ్య = X అనుకోండి.

సమాధానం: 3

10. ఒక పరీక్షలో A , B కంటే 20% తక్కువ మార్కులు పొందాడు. B , C కంటే 30% తక్కువ మార్కులు సాధించాడు. A  ఆ పరీక్షలో 112 మార్కులు పొందితే, C సాధించిన మార్కులు ఎన్ని?

1 ) 200         2 ) 125        3 ) 205          4 ) 150

సాధన: 

సమాధానం: 1

11. ఒక వ్యాపారి పంచదార ధరను 10% తగ్గించి అమ్మాడు. దీంతో హరిత రూ.900 పంచదారను అదనంగా తీసుకుంది. అయితే 1 కేజీ పంచదార అసలు ధరకు, తగ్గించిన ధరకు మధ్య వ్యత్యాసం ఎంత?

1 ) రూ.6      2 ) రూ.7      3 ) రూ.5      4 ) రూ.4

సాధన: తగ్గిన ధర = 10% of  900

సమాధానం: 3

12. ఒక వాహనాన్ని కొత్తగా కొన్నప్పుడు దాని ధర రూ.25,000. ప్రతి ఏడాది చివర్లో దాని విలువ సంవత్సరం ప్రారంభంలో కంటే 80% మాత్రమే ఉంటుంది. అయితే మూడేళ్ల తర్వాత ఆ వాహనం విలువ ఎంత?

1) రూ.12,500          2) రూ.12,800          3) రూ.13,600          4) రూ.14,800

సాధన: మూడేళ్ల తర్వాత వాహనం విలువ

సమాధానం: 2

13. కిందివాటిలో ఏది 25 శాతానికి సమానం?

1) 10, 50లో ఎంత శాతం       2) 20, 80లో ఎంత శాతం    3) 125, 75లో ఎంత శాతం       4) 25, 125లో ఎంత శాతం

సాధన: లెక్క ప్రకారం,

సమాధానం: 2

14. ఒక ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఒక అభ్యర్థి 43 శాతం ఓట్లు సాధించి, 2,856 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితే ఆ ఎన్నికలో పోలైన మొత్తం ఓట్లు ఎన్ని?

1) 20,400     2) 20,820       3 ) 16,500     4) 25,500

సాధన: ఒక అభ్యర్థికి వచ్చిన ఓట్లు = 43%

మరో అభ్యర్థికి పోలైన ఓట్లు  = 100% - 43% = 57%

ఇద్దరి ఓట్ల మధ్య వ్యత్యాసం = 57% - 43% = 14%

 మొత్తం పోలైన ఓట్లు 

సమాధానం: 1

15. ఒక యజమాని తన ఇంటి అద్దెను ఏటా చివర్లో 5% పెంచుతాడు. ప్రస్తుతం ఆ ఇంటి అద్దె నెలకు రూ.3000. అయితే రెండేళ్ల తర్వాత ఉండే అద్దె ఎంత?

1) రూ.3207.50       2) రూ.3306.50        3) రూ.3307.50        4) రూ.3505.50

సాధన: రెండేళ్ల తర్వాత అద్దె

సమాధానం: 

Posted Date : 22-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌