1. రాజు, సీతతో ‘‘నీ తల్లి భర్త సోదరి నాకు అత్త’’ అవుతుంది అన్నాడు. అయితే సీత, రాజుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
1) సోదరి 2) అత్త 3) కూతురు 4) తల్లి
సాధన: దత్తాంశం ప్రకారం, తల్లి భర్త - తండ్రి, తండ్రి సోదరి - అత్త.
కాబట్టి, సీత అత్త, రాజుకీ అత్త అవుతుంది.
సీత అతడికి సోదరి.
సమాధానం: 1
2. ప్రశాంత్ ఒక వ్యక్తిని చూపిస్తూ ‘‘అతడి ఏకైక సోదరుడు నా కూతురి నాన్నకి నాన్న’’ అన్నాడు. అయితే ఆ వ్యక్తి ప్రశాంత్‌కు ఏమవుతాడు?
1) అన్న 2) మామయ్య
3) బాబాయి 4) తాతయ్య
సాధన: దత్తాంశం ప్రకారం, ప్రశాంత్ కూతురు నాన్నకి నాన్న అంటే ప్రశాంత్‌కి తండ్రి.
కాబట్టి, ఆ వ్యక్తి ప్రశాంత్ తండ్రికి సోదరుడు.
ఆ వ్యక్తి ప్రశాంత్‌కి ‘‘బాబాయి’’ అవుతాడు.
సమాధానం: 3
3. A + B అంటే A అనే వ్యక్తి B కూతురు.
A - B అంటే A అనే వ్యక్తి B భర్త.
A x B అంటే A అనే వ్యక్తి B సోదరుడు.
అయితే పై దత్తాంశం ఆధారంగా P + Q - R లో R అనే వ్యక్తి Pకి ఏమవుతారు?
1) తండ్రి 2) తల్లి 3) సోదరి 4) మామ
సాధన: పై దత్తాంశాన్ని డీకోడ్ చేయగా,
P + Q అంటే P అనే వ్యక్తి Qకి కూతురు.

Q - R అంటే Q అనే వ్యక్తి R భర్త
పై వివరణ ఆధారంగా Q, Rలు భార్యాభర్తలు.
అయితే, Pకి R తల్లి అవుతుంది.
సమాధానం: 2
4. A * B అంటే 'A భర్త B
A • B అంటే A తమ్ముడు B
A % B అంటే A కూతురు B
అయితే, P * Q % R లో P అనే వ్యక్తి Rకి ఏమవుతారు?
1) పిన్ని 2) మామ 3) తండ్రి 4) తల్లి
సాధన: పై దత్తాంశాన్ని డీకోడ్ చెయ్యగా
పై చిత్రం నుంచి R తల్లి P అవుతుంది.
సమాధానం: 4
5. i) P x Q అంటే 'A తండ్రి P'
ii) P - Q అంటే 'Q సోదరి P'
iii) P + Q అంటే 'Q తల్లి P'
iv) అంటే 'Q సోదరుడు P'
పై దత్తాంశం ఆధారంగా అయితే, M, Bకి ఏమవుతారు?
1్శ తండ్రి 2్శ మనవడు
3్శ సోదరుడు 4్శ అత్త
సాధన: ను డీకోడ్ చేస్తే
పై చిత్రం ఆధారంగా M, Bకి మనవడు అవుతాడు.
సమాధానం: 2
6. i) A + B అంటే 'A తండ్రి B'
ii) A - B అంటే 'B భార్య A'
iii) A x B అంటే 'B సోదరుడు A'
iv)

అయితే a) ప్రకారం శి, శీకి ఏమవుతారు?
b) P - R + Q అయితే P, Qకి ఏమవుతారు?
1) మేనత్త, తల్లి 2) సోదరి, తల్లి
3) మామ, తండ్రి 4) బాబాయి, మేనత్త
సాధన: ను డీకోడ్ చేస్తే,
పై చిత్రం ఆధారంగా 'P, Qకి మేనత్త్ఠ' అవుతుంది.
b) అదేవిధంగా P - R + Q ని డీకోడ్ చేస్తే,
పై చిత్రం ఆధారంగా, P, Qకి తల్లి అవుతుంది.
సమాధానం: 1
7. i) A $ B అంటే 'B తల్లి A'
ii) A # B అంటే 'B తండ్రి A'
iii) A @ B అంటే 'B భర్త A'
iv) A % B అంటే 'B కుమార్తె A'
అయితే ప్రకారం P, T ల మధ్య సంబంధం ఏమిటి?
1) బావ, మామ 2) తల్లి, మనవరాలు
3) మనవడు/మనవరాలు, బావ
4) మేనత్త, భార్య
సాధన:
పై చిత్రం ఆధారంగా T, Pకి మనవడు లేదా మనవరాలు అవుతారు.
పై చిత్రం ఆధారంగా F, Hకు బావ అవుతారు.
సమాధానం: 3
8. కింది సమాచారం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.
అనిల్, రమ, కృష్ణ, దేవి, సోను - కుటుంబ సభ్యులు. వీరు గ్రూప్ ఫొటో తీసుకోవాలని అనుకున్నారు. ఫొటోగ్రాఫర్ వారందరినీ ఉత్తర దిశగా, ఒక వరుసలో కింది విధంగా కూర్చోబెట్టాడు.
i. రమ, కృష్ణవేణికి వెంటనే కుడివైపు కూర్చుంది. కృష్ణవేణి భర్త రమ సోదరుడు.
ii. అనిల్, సోను పక్కపక్కనే కూర్చున్నారు.
iii. అనిల్ కుమారుడికి వెంటనే కుడివైపు దేవి కూర్చోలేదు.
iv. దేవి ఆ వరుసలో ఎడమ చివర కూర్చున్నారు. దేవి తల్లి కృష్ణవేణి. ఈమె అనిల్ భార్య.
v. రమ, అనిల్ పక్కపక్కనే కూర్చున్నారు.
అయితే, ఆ వరుసలో మధ్యలో కూర్చున్న వ్యక్తి దేవికి ఏమవుతారు?
1) నాన్న 2) తల్లి 3) పిన్ని 4) మేనత్త
సాధన: పై దత్తాంశం ఆధారంగా కుటుంబ చిత్రం గీయగా,
* దత్తాంశం ఆధారంగా వారు గ్రూప్ ఫొటోకు కూర్చున్న విధానం
పై వరుసలో మధ్యలో ఉన్నవారు - రమ.
కుటుంబ చిత్రం ఆధారంగా ‘రమ’ దేవికి ‘మేనత్త’ అవుతుంది.
సమాధానం: 4
9. ఒక కుటుంబ పెద్ద ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకి హరీష్, గిరీష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు వృత్తిరీత్యా న్యాయవాదులు. రేణు, ఆమె అత్తగారు ఇద్దరూ వృత్తిరీత్యా ఇంజినీర్లు. హరీష్ భార్య సైంటిస్ట్, వాళ్లిద్దరికీ లలిత్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే,
i) లలిత్‌కు రేణు ఏమవుతుంది?
ii) గిరీష్ భార్య వృత్తి ఏమిటి?
1) పిన్ని/ పెద్దమ్మ, ఇంజినీర్
2) అత్త, సైంటిస్ట్
3) అమ్మమ్మ/ నాయనమ్మ, న్యాయవాది
4) తల్లి, ఇంజినీర్
సాధన: పై దత్తాంశం ఆధారంగా కుటుంబ చిత్రం గీయగా,
పై రేఖాచిత్రం ఆధారంగా లలిత్‌కు రేణు పిన్ని/పెద్దమ్మ అవుతుంది, గిరీష్ భార్య వృత్తి ఇంజినీర్.
సమాధానం: 1
10. A + B అంటే B తండ్రి A.
A - B అంటే B భార్య A.
A x B అంటే B సోదరుడు B.
అంటే B తల్లి A.
A = B అంటే B సోదరి A.
అయితే P + Q - R ప్రకారం P, R మధ్య సంబంధం ఏమిటి?
1) నాన్న 2) తల్లి 3) మామయ్య 4) పిన్ని
సాధన: పై దత్తాంశం ఆధారంగా, P + Q - R

రేఖా చిత్రం గీయగా,
P, R కు మామయ్య అవుతారు.
సమాధానం: 3
11. A + B అంటే B తండ్రి A.
A - B అంటే B సోదరి A.
A $ B అంటే B భార్య A.
A % B అంటే B తల్లి A.
అంటే తీ కుమారుడు తి.
అయితే J అనే వ్యక్తి T సోదరుడు అయితే, స్థానంలో ఉండాల్సిన గుర్తు?
సాధన:
రేఖా చిత్రం గీయగా
పై రేఖాచిత్రం నుంచి
H, T లు అక్కాచెల్లెళ్లు. వారి మధ్య సంబంధం దత్తాంశం ఆధారంగా ‘´’ అవుతుంది. సమాధానం: 1