మాదిరి ప్రశ్నలు
కింది సమాచారాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1) A, B, C, D, E లలో ఒకరు టెన్నిస్, మరొకరు బాస్కెట్‌బాల్, ఇంకొకరు క్యారమ్స్ ఆడతారు. A, D లు అవివాహిత స్త్రీలు. వారు ఏ ఆటలో పాల్గొనరు. ఏ స్త్రీ కూడా టెన్నిస్, బాస్కెట్‌బాల్ ఆడరు. వారిలో ఒక వివాహిత జంట ఉంది. E అనే వ్యక్తి బాస్కెట్‌బాల్ ఆడతారు. బాస్కెట్‌బాల్, క్యారమ్స్ ఆడని B సోదరి C. అయితే
1. టెన్నిస్ ఆడే వ్యక్తి ఎవరు?
2. క్యారమ్స్ ఆడే వ్యక్తి ఎవరు?
3. బాస్కెట్‌బాల్ ఆడే వ్యక్తి ఎవరు?
4. E భార్య ఎవరు?
5. అయిదుగురు వ్యక్తుల్లో ముగ్గురు స్త్రీలు ఎవరు?
వివరణ: దత్తాంశాన్ని విశ్లేషించగా
B బాస్కెట్‌బాల్, క్యారమ్స్ ఆడరు కాబట్టి టెన్నిస్ ఆడతారు. అంటే B పురుషుడు
బాస్కెట్‌బాల్ ఆడతాడు కాబట్టి E పురుషుడు.
C కచ్చితంగా క్యారమ్స్ ఆడతారు.
A, D లు అవివాహిత స్త్రీలు, ఏ ఆట ఆడరు. కాబట్టి E, C లు భార్యాభర్తలు
పై విశ్లేషణను పట్టికీకరించగా,
సమాధానాలు
1. టెన్నిస్ ఆడే వ్యక్తి B 2. క్యారమ్స్ ఆడే వ్యక్తి C
3. బాస్కెట్‌బాల్ ఆడే వ్యక్తి E 4. E భార్య C
5. అయిదుగురు వ్యక్తుల్లో ముగ్గురు స్త్రీలు A, C, D
2) A, B, C, D, E లు ఒక కుటుంబంలోని వ్యక్తులు. వారిలో వ్యాపారి, టైలర్, ఫిట్టర్, బ్యూటీషియన్, ఇంజినీర్ ఉన్నారు. A కూతురు B అవివాహిత. ఆమె ఒక టైలర్. C సోదరుడు E ఇంజినీర్. ఆ కుటుంబంలో ఒక వివాహిత జంట ఉంది. వారిలో భర్త C. భార్యను కోల్పోయిన A ఒక వ్యాపారి. అతడికి ఇద్దరు కుమారులు, ఒక అవివాహిత కూతురు ఉంది. A కోడలు బ్యూటీషియన్ అయితే
1. A కోడలు ఎవరు? 2. C వృత్తి ఏమిటి?
3. C భార్య ఎవరు? 4. ఫిట్టర్ ఎవరు?
5. A కుమారులు ఎవరు?
వివరణ: పై దత్తాంశాన్ని విశ్లేషించి, పట్టికీకరించగా
సమాధానాలు
1. A కోడలు D 2. ది ఒక ఫిట్టర్ 3. C భార్య D
4. ఫిట్టర్ C 5. C, E లు A కుమారులు
3) ఒక కుటుంబంలో P, Q, R, S, T, U, V, W అనే ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ముగ్గురు స్త్రీలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరిలో ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు లాయర్లు, ఒకరు టీచర్, మరొకరు ఇంజినీర్, ఇంకొకరు డాక్టర్. ఏ స్త్రీ కూడా ఇంజినీర్ కాదు. R లాయరు P ను వివాహం చేసుకున్నారు. P టీచర్. V ఇంజినీర్ S ను వివాహం చేసుకున్నారు. S లాయరు కాదు, డాక్టర్ కాదు. ఏ ఇద్దరు స్త్రీలు ఒకే వృత్తిలో లేరు. W చెల్లెలు Q. W మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే
1. T వృత్తి ఏమిటి?
2. ఆ కుటుంబంలోని పురుషులు ఎవరు?
3. Q వృత్తి ఏమిటి?
4. W చేస్తున్న వృత్తినే ఎంచుకున్నవారు?
5. ఒకే ఉద్యోగం చేస్తున్న వ్యక్తుల సమూహాలు ఏవి?
వివరణ: ఇచ్చిన దత్తాంశాన్ని విశ్లేషించి పట్టికీకరించగా
సమాధానాలు
1. T ఒక లాయర్
2. P, T, V, W లు ఆ కుటుంబంలోని పురుషులు
3. Q డాక్టర్
4. W, S లు మేనేజర్లుగా పని చేస్తున్నారు
5. W, S లు మేనేజర్లు; R, T లు లాయర్లు
4) A, B, C, D, E, F లు ఒక వ్యాన్‌లో ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు డాక్టర్లు, ఒక ఆర్కిటెక్ట్, ఒక అకౌంటెంట్ ఉన్నారు. D అనే ఇంజినీర్‌ను A అనే ఆర్కిటెక్ట్ వివాహం చేసుకున్నారు. A, B, C, D లు రెండు వివాహిత జంటలు, వారిలో ఏ ఇద్దరు కూడా ఒకే వృత్తిలో లేరు. F, B లు ఒకే వృత్తిలో ఉన్నారు. C సోదరుడు F. అయితే
1. డాక్టర్ల జంట ఏది?
2. ఇంజినీర్ల జంట ఏది?
3. F కి C ఏమవుతారు?
4. వివాహిత జంటలు ఏవి?
5. భర్తల జంట ఏది?
వివరణ: ఇచ్చిన దత్తాంశాన్ని విశ్లేషించగా,
* A ఒక ఆర్కిటెక్ట్, D ఒక ఇంజినీర్.
* A, D దీని వివాహం చేసుకున్నారు కాబట్టి AD ఒక జంట.
* A, B, C, D లు రెండు వివాహిత జంటలు కాబట్టి BC ఒక జంట.
* A, B, C, D లు వేర్వేరు వృత్తుల్లో ఉన్నారు. B, F లు ఒకే వృత్తిలో ఉన్నారు.
* B అకౌంటెంట్‌ను వివాహం చేసుకున్నాడు కాబట్టి C అకౌంటెంట్.
* B, F లు డాక్టర్లు అవుతారు. గ్రూప్‌లో ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు కాబట్టి E ఇంజినీర్ అవుతారు.
సమాధానాలు
1. B, F లు డాక్టర్లు 2. D, E లు ఇంజినీర్లు
3. F కి C సోదరుడు అవుతాడు
4. A-D, B-C లు వివాహిత జంటలు
5. A, B, C, D ల లింగభేదాలు దత్తాంశం నుంచి కచ్చితంగా తెలియదు కాబట్టి భర్తల జంటలను నిర్ధారించలేం.
5) ఒక కుటుంబంలో P, Q, R, S, T, U అనే ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వారు టైపిస్టు, ఆర్కిటెక్ట్, వ్యాపారి, టైలర్, ఫొటోగ్రాఫర్, పెయింటింగ్ వృత్తుల్లో ఉన్నారు. వీరిలో రెండు వివాహిత జంటలు ఉన్నాయి. వ్యాపారి టైలర్‌ను, ఆర్కిటెక్ట్ టైపిస్టును వివాహం చేసుకున్నారు. పెయింటర్ U... Q కు కుమారుడు, T కు సోదరుడు. P కోడలు R ఒక టైపిస్టు. T అవివాహిత ఫొటోగ్రాఫర్. U నాయనమ్మ P. అయితే
1. U కి T ఏమవుతారు?
2. Q వృత్తి ఏమిటి?
3. P వృత్తి ఏమిటి?
4. వివాహిత జంటలు ఏవి?
5. U కి S ఏమవుతారు?
వివరణ: పై దత్తాంశాన్ని కుటుంబ చిత్రరూపంలో వ్యక్తీకరించగా
సమాధానాలు
1. దత్తాంశం నుంచి U, T ల లింగభేదాలు కనుక్కోలేం కాబట్టి వారి మధ్య సంబంధాన్ని కచ్చితంగా చెప్పలేం.
2. Q ఒక ఆర్కిటెక్ట్.
3. P ఒక టైలర్.
4. P-S, Q-R వివాహిత జంటలు.
5. U కి S తాతయ్య అవుతారు.