• facebook
  • whatsapp
  • telegram

క్షేత్రగణితం

ముఖ్యాంశాలు

చతురస్ర భుజం = s అయితే

దాని చుట్టుకొలత = 4 s యూనిట్లు

వైశాల్యం = s2 చ.యూ

కర్ణం =     యూ.

దీర్ఘచతురస్ర పొడవు, వెడల్పులు వరుసగా l యూ., b యూ.

అయితే, దాని చుట్టుకొలత = 2(l + b) యూ.

వైశాల్యం = lb చ.యూ.

కర్ణం =   యూ.

వృత్తవ్యాసార్ధం = r యూ. అయితే

దాని పరిధి = 2πr యూ.

వైశాల్యం = πr2 చ.యూ.

రెండు చతురస్రాల భుజాల నిష్పత్తి = s1 : s2

అయితే వాటి చుట్టుకొలతల నిష్పత్తి = s1 : s2

వైశాల్యాల నిష్పత్తి = s12 : s22

రెండు వృత్త వ్యాసార్ధాల నిష్పత్తి = r1 : r2

అయితే వాటి పరిధుల నిష్పత్తి =  r1 : r2

వైశాల్యాల నిష్పత్తి = r12 : r22 


మాదిరి ప్రశ్నలు


1. ఒక చతురస్రం చుట్టుకొలత 96 సెం.మీ. అయితే దాని వైశాల్యం ఎంత?(చ.సెం.మీ.లలో)

1) 476    2) 576     3) 676    4) 876

సాధన: చతురస్ర భుజం = s యూనిట్లు అనుకోండి.

లెక్కప్రకారం, చతురస్ర చుట్టుకొలత = 96 సెం.మీ.


సమాధానం: 2



2. ఒక చతురస్రం చుట్టుకొలత P యూనిట్లు, వైశాల్యం A చ.యూ. అయితే కింది వాటిలో ఏది సత్యం?

సాధన: చతురస్రం భుజం = s యూనిట్లు అనుకోండి. 

చతురస్రం చుట్టుకొలత = p యూనిట్లు

సమాధానం: 3



3. రెండు చతురస్రాల చుట్టుకొలత నిష్పత్తి 4 : 7 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత?

1) 16 : 49       2) 49 : 16      3) 4 : 7     4) 7 : 4

సాధన: రెండు చతురస్రాల భుజాలు వరుసగా s1 : s2 అనుకోండి.

చతురస్రాల భుజాల నిష్పత్తి = s1 : s2

చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి = s1 : s2

లెక్కప్రకారం, s1 : s2 = 4 : 7

చతురస్ర వైశాల్యాల నిష్పత్తి (A1 : A2) = s12 : s22

= 42 : 72 ⟹ 16 : 49

సమాధానం: 1    


4. ABCD ఒక చతురస్రం. AB, BC, CD, DA భుజాల మధ్య బిందువులు వరుసగా E, F, G, H అయితే ABCD చతురస్ర వైశాల్యానికి, EFGH చతురస్ర వైశాల్యానికి మధ్య ఉన్న నిష్పత్తి?

1) 1 : 2     2) 1 : 3      3) 2 : 1      4) 3 : 1

సాధన: ABCD చతురస్ర భుజం = s యూనిట్లు అనుకోండి. 

ABCD చతురస్ర కర్ణం AC లేదా BD

పొడవు = యూనిట్లు

AB, BC, CD, DA భుజాల మధ్య బిందువులు E, F, G, H లతో ఏర్పడిన చతురస్రం EFGH భుజం పొడవు   

ABCD వైశాల్యం . EFGH వైశాల్యం = s2 = (s1)2

                           

సమాధానం: 3



5. కింది పటాలు వరుసగా ABCD ఒక దీర్ఘ చతురస్రం, EFGH ఒక చతురస్రం. ఈ రెండు పటాల చుట్టుకొలతలు సమానం.  AB = 12 సెం.మీ., EF = 10 సెం.మీ. అయితే ఆ దీర్ఘచతురస్ర, చతురస్ర వైశాల్యాల నిష్పత్తి?

1) 4 : 5    2) 5 : 4   3) 25 : 24    4) 24 : 25

సాధన: దీర్ఘచతురస్రం ABCD  పొడవు (AB) = l  = 12  సెం.మీ.

వెడల్పు = b అనుకోండి

చతురస్రం EFGH భుజం EF = s = 10 సెం.మీ.

లెక్కప్రకారం దీర్ఘచతురస్రం చుట్టుకొలత = చతురస్రం చుట్టుకొలత

⟹ 2(l + b) = 4s

⟹ 2(12 + b) = 4 × 10 = 40

⟹ 12 + b = 20

⟹ b = 20 − 12 = 8 = 8 సెంమీ.

దీర్ఘచతురస్రం ABCD వైశాల్యం : చతురస్రం EFGH వైశాల్యం

= l × b : s2

= 12 x 8 : 102 ⟹ 96 : 100 ⟹ 24 : 25

సమాధానం: 4



6. ఒక వృత్తం ఒక చతురస్రంలో అంతర్లిఖితమై ఉంది. అయితే చతురస్ర వైశాల్యానికి, వృత్త వైశాల్యానికి మధ్య నిష్పత్తి?

1) 4 : π    2) π : 4    3) π : 2    4) 2 : π

సాధన: చతురస్ర భుజం = s యూనిట్లు అనుకోండి

వృత్త వ్యాసార్ధం = r యూనిట్లు అనుకోండి

వృత్తం, చతురస్రంలో అంతర్లిఖితమై ఉంటే చతురస్ర భుజం = వృత్త వ్యాసం 

⟹ s = 2r

s = 2r

చతురస్ర వైశాల్యం : వృత్త వైశాల్యం = s2 : πr2

= (2r)2 : πr2 = 4r2 : πr2 

= 4 : p                        

సమాధానం: 1



7. ఒక చతురస్రం చుట్టుకొలత, ఒక వృత్త పరిధికి సమానం. అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి......

1) 4 : π   2) π : 4    3) π : 2    4)  2 : π

సాధన: పక్క పటంలో ఉన్న చతురస్ర భుజం = s యూ. అ.కో.

వృత్త వ్యాసార్ధం = r యూ. అ.కో.

లెక్కప్రకారం, చతురస్ర చుట్టుకొలత = వృత్తపరిధి

చతురస్ర వైశాల్యం : వృత్తపరిధి = s2 : πr2

సమాధానం: 2


 

8. ఒక వృత్తంలో ఒక చతురస్రం అంతర్లిఖితమై ఉంది. అయితే చతురస్ర వైశాల్యానికి, వృత్త వైశాల్యానికి మధ్య నిష్పత్తి...

1) 14 : 11      2) 11 : 14     3) 11 : 7     4) 7 : 11

సాధన: వృత్త వ్యాసార్ధం = r యూనిట్లు అ.కో.

చతురస్ర భుజం = s యూనిట్లు అ.కో.

వృత్తంలో చతురస్రం అంతర్లిఖితమై ఉంటే,

చతురస్ర కర్ణం = వృత్త వ్యాసం

  

సమాధానం : 4


 

Posted Date : 08-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌