• facebook
  • whatsapp
  • telegram

సంఖ్యా శ్రేణులు

వరుస కుదిరితే సమాధానం సులువే!

ఈ నెలలో ఖర్చుల వివరాలు విశ్లేషించుకుంటే వచ్చే నెల జాగ్రత్తగా ఇంటి బడ్జెట్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. పెట్టుబడులపై వచ్చే రాబడులను సరిగా గమనించుకోగలిగితే లాభాలు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం సంఖ్యలతో పరిచయం పెంచుకుంటే అందుబాటులో ఉన్న సమాచారాన్ని సక్రమంగా ఉపయోగించుకుని మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ పరిజ్ఞానం వ్యాపారాలు, శాస్త్రీయ పరిశోధనల్లోనూ ఉపయోగపడుతుంది. తార్కిక ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. సంఖ్యలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యాలను అభ్యర్థుల్లో అంచనా వేయడానికి రీజనింగ్‌లో ‘సంఖ్యాశ్రేణి’ నుంచి ప్రశ్నలు అడుగుతారు. సాధారణ గణిత పరిక్రియలపై పట్టు సాధిస్తే, వరుస కుదిరి సమాధానాలు సులభంగా దొరుకుతాయి.


ఒక వరుసలో ఉంచిన సంఖ్యలు ఒకే ధర్మాన్ని కలిగి ఉంటే అలాంటి వరుస క్రమాన్ని సంఖ్యాశ్రేణి అంటారు.


రీజనింగ్‌లో ఇదొక ముఖ్యమైన భాగం. పోటీ పరీక్షల్లో అధిక మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది.


సంఖ్యాశ్రేణుల నుంచి అడిగే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాబట్టాలంటే 20 ఎక్కాలు, 1 నుంచి 25 వర్గాలు, ఘనాలు రావాలి.


సంఖ్యాశ్రేణుల్లో ఏ విధమైన నియమం ఉంటుందో ముందుగా గుర్తించాలి. 

ఎ) ఇచ్చిన సంఖ్యల క్రమంలో ఎడమ నుంచి కుడి వైపునకు సంఖ్యల విలువ కొద్దిగా పెరుగుతూ లేదా తగ్గుతూ ఉంటే అవి కూడికకు లేదా తీసివేతకు సంబంధించిన ప్రశ్నలై ఉంటాయి.

బి) ఇచ్చిన సంఖ్యల క్రమంలో ఎడమ నుంచి కుడి వైపునకు సంఖ్యల విలువ బాగా పెరుగుతూ ఉంటే అవి గుణకారానికి సంబంధించిన ప్రశ్నలై ఉంటాయి.

సి) ప్రశ్నల్లో సంఖ్యల క్రమంలో ఎడమ నుంచి కుడి వైపునకు సంఖ్యల విలువ బాగా తగ్గుతూ ఉంటే అవి భాగాహారానికి సంబంధించిన ప్రశ్నలై ఉంటాయి.

డి) ప్రశ్నలోని సంఖ్యల పెరుగుదల లేదా తగ్గుదల క్రమాన్ని బట్టి ముందు సంఖ్యల యొక్క వర్గం లేదా ఘనాలకు సంబంధించిన ప్రశ్నలని గమనించాలి.

 
  పై విధంగా లేని సంఖ్యల్లో n2 - 1 లేదా n2 + 1 లేదా n2 - 2 లేదా n2 + 2 లేదా n(n + 1) లేదా n2 - n లేదా n2 + n లేదా n3 - n లేదా n3 + n రూపంలో ఉండే ప్రశ్నలు ఉంటాయి.


నమూనా ప్రశ్నలు


సూచన: కిందివాటిలో ప్రశ్నార్థక స్థానంలో ఉండాల్సిన సంఖ్య ఎంత?  


1.    5678, 6778, 7878, ?, ?, 101178

1) 8988, 9978    2) 8879, 91078

3) 8978, 91078    4) 8988, 91078


2.     91827364, 81726354, 71625344, ?

1) 5234165    2) 61524334

3) 5234166    4) 61524336


3.     1432, 2543, 3654, 4765, ?

1) 3654    2) 4775    3) 5766    4) 5876


4.     3, 7, 15, 31, 63, ?

1) 92    2) 115    3) 127    4) 131


5.     2, 5, 7, 12, 15, 17, 22, ?

1) 25    2) 26    3) 27    4) 28


6.     26, 29, 33, 38, ?

1) 42    2) 44    3) 50    4) 54


7.     9, 8, 10, 16, 11, ?, 12, 64

1) 28    2) 36    3) 25    4) 32


8.     6, 11, 21, 36, 56, ?

1) 91    2) 51    3) 81    4) 42


9.     4, 9, 20, 43, 90, ?

1) 180    2) 185    3) 190    4) 200


10. 27, 29, 33, ?, 57

1) 41    2) 40    3) 35    4) 30


11. 12, 23, 45, 78, ?

1) 128    2) 122    3) 130    4) 125


12. 11, 23, 48, 99, 202, ?

1) 404    2) 409    3) 410    4) 420


13. 31, 38, 44, 51, ?

1) 51    2) 55    3) 57    4) 58


14. 15, 31, 64, 131, ?

1) 266    2) 256    3) 196    4) 524


15. 625, 5, 125, 25, 25, ?, 5

1) 5    2) 25    3) 125    4) 625


16. 121, 16, 132, 36, 252, ?

1) 81    2) 64    3) 49    4) 121


17. 48, 32, 63, 18, 29, 18, 34, ?

1) 7    2) 12    3) 16    4) 18


18. 84, 64, 63, 27, 92, ?

1) 256    2) 343    3) 289    4) 525


19. 2, 3, 10, 39, 172, ?, 5346

1) 693    2) 885    3) 756    4) 743


20. 7, 7, 10.5, 21, 52.5, ?

1) 163.5    2) 145    3) 157.5    4) 105


21. 8, 9, 178, 356, 712, ?

1) 1068    2) 1424    3) 1086    4) 1429


22. 67, 70, 76, 85, ?

1) 96    2) 89    3) 97    4) 98


23. 53, 61, 88, 152, 277, ?

1) 490    2) 493    3) 496    4) 485


24. 66, 77, 90, 107, 126, ?, 178

1) 168    2) 154    3) 136    4) 149


25. 23, 28, 38, 55, 81, ?

1) 118    2) 104    3) 136    4) 99


26. 11, 29, 65, 137, 281, ?

1) 391    2) 569    3) 540    4) 442


27. 1, 9, 36, 100, ?

1) 196    2) 169    3) 144    4) 225


28. 560, 280, 140, 70, ?

1) 50    2) 35    3) 45    4) 40


29. 1, 2, 3, 8, 15, ?, 105, 384

1) 54    2) 68    3) 72    4) 48


30. 32, 33, 37, 46, ?, 87

1) 60    2) 52    3) 62    4) 77


31. 2.5, 3.5, 7.5, 23.5, ?, 343.5

1) 108.5    2) 87.5    3) 154.5    4) 129.5


32. 29, 33, 42, 58, 83, ?

1) 119     2) 150     3) 157     4) 140


33. 24, 25, 33, 60, ?, 249

1) 124     2) 156     3) 148     4) 90


34. 7, 13, 25, 43, ?, 97

1) 67     2) 63     3) 61     4) 56


35. 19, 32, 46, 64, 91, ?

1) 130     2) 134     3) 142     4) 155


36. 1210, 648, 294, 100, ?

1) 17     2) 18     3) 19     4) 13


37. 3, 6, 30, 870, ?

1) 705020     2) 754070

3) 708040     4) 756030


38. 1, 2, 5, 14, 41, ?

1) 121     2) 122     3) 123     4) 124


39. 5, 24, 61, ?, 213, 340

1) 113     2) 120     3) 122     4) 160


40. 4, 8, 14, 22, 32, 44, 58, ?

1) 96     2) 84     3) 74     4) 104


41. 1, 0, 2, 6, ?

1) 10     2) 12     3) 14     4) 16


42. 91, 78, 65, ?, 39, 26

1) 49     2) 56     3) 54     4) 52


43. 4, 7, 13, 25, ?

1) 48     2) 49     3) 50     4) 51


44. 5, 10, 15, 25, 40, 65, ?

1) 95     2) 105     3) 100     4) 115


45. 1, 22, 44, 67, 91, ?

1) 116     2) 106     3) 115     4) 118


46. 2, 4, 10, 28, ?, 244

1) 94     2) 90     3) 88     4) 82


47. 345, 356, 368, 381, 395, ?

1) 409     2) 408     3) 406     4) 410


48. 111, 222, 444, ?, 1776, 3552

1) 999     2) 888     3) 1780     4) 1770


49. 29, 33, ?, 113, 369

1) 55    2) 51     3) 54      4) 49


50. 26, 54, 110, 222, ?, 894

1) 446     2) 442     3) 440     4) 444


51. 100, 50, 52, 26, 28, ?, 16, 8

1) 30       2) 36       3) 14       4) 32


52. 33, 48, 65, 84, ?, ?

1) 105, 128        2) 99, 110   

3) 101, 118       4) 105, 126

53. 0, 7, ?, 63, 124

1) 26       2) 24       3) 23       4) 22


54. 12, 36, 108, 324, ?

1) 972        2) 648       3) 1296       4) 432


55. 110, 99, 86, ?, 54, 35

1) 81       2) 75       3) 71       4) 67
 


57. 5, 11, 17, 25, 33, 43, ?

1) 53       2) 56       3) 49       4) 51


58. 720, 720, 360, 120, 30, 6, ? 

1) 1        2) 2       3) 3       4) 5


59. 1.5, 2.3, 3.1, 3.9, ?

1) 3.12       2) 4.7       3) 4.9    4) 5.1


60. 2, 5, 7, 12, 19, 31, ?, 81

1) 30       2) 40       3) 50       4) 60


61. 5, 13, 29, 61, 125, ?

1) 253       2) 196       3) 245       4) 145


62. 13, 10, ?, 100, 1003, 1000, 10003

1) 1030       2) 1130       3) 103       4) 130


63. 24, 35, 20, 31, 16, 27, ?, ?

1) 12, 23   2) 5, 30       3) 8, 25       4) 9, 9


64. 4, 7, 14, 24, 41, ?

1) 71       2) 68      3) 72       4) 51


65. 1.4, 2, 3, 2, ?

1) 2       2) 3       3) 4       4) 5


66. 2, 7, 17, 32, 52, 77, ?

1) 107       2) 91       3) 101       4) 92


67. 1, 2, 2, 4, 3, 8, 7, 10, ?

1) 11       2) 13       

3) 9       4) 8


సమాధానాలు


1-3; 2-2; 3-4; 4-3; 5-1; 6-2; 7-4; 8-3; 9-2; 10-1; 11-2; 12-2; 13-3; 14-1; 15-3; 16-1; 17-2; 18-2; 19-2; 20-3; 21-2; 22-3; 23-2; 24-4; 25-1; 26-2; 27-4; 28-2; 29-4; 30-3; 31-2; 32-1; 33-1; 34-1; 35-2; 36-2; 37-4; 38-2; 39-3; 40-3; 41-3; 42-4; 43-2; 44-2; 45-3; 46-4; 47-4; 48-2; 49-4; 50-1;  51-3; 52-1; 53-1; 54-1; 55-3; 56-2; 57-1; 58-1; 59-2; 60-3; 61-1; 62-3; 63-1; 64-2; 65-4; 66-1; 67-1.



రచయిత: రాంబాబు 

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌