• facebook
  • whatsapp
  • telegram

అనుపాతం

ముఖ్యాంశాలు


a, b అనే సంఖ్యల నిష్పత్తి = a : b 


a : b లో మొదటిపదం (పూర్వపదం) = a, 


                     రెండోపదం (పరపదం) = b


a : b = c : d అయితే a, b, c, d  లు అనుపాతంలో ఉంటాయి.


a : b = c : d ⇒ a ని మొదటి పదం, 


                          b ని రెండో పదం,


                          ‘c ని మూడో పదం, 


                          d ని నాలుగో పదం అంటారు.

 a : b = c : d ⇒ a × d = b × c 


a : b = b : c   అయితే a, b, b, c లు అనుపాతంలో ఉంటాయి.


 a, b, c లు అనుపాతంలో ఉంటే b2 = ac అవుతుంది.


లేదా

             


         =  అవుతుంది.


మాదిరి సమస్యలు


1. 25, 255ల అనుపాత మధ్యమం ఎంత?


1 ) 65          2 ) 25          3 ) 75          4 ) 95


సాధన: a, b ల అనుపాతమధ్యమం = √ab


25, 225 ల అనుపాతమధ్యమం = √ 25 × 225 

= √ 25 × √ 225 = 5 × 15 

= 75     

సమాధానం: 3


2. కిందివాటిలో కనిష్ఠ (smallest) నిష్పత్తి ఏది?


1) 41 : 92     2 ) 33 : 41     3 ) 42 : 49     4 ) 35 : 47


 సాధన:  1 ) 41 : 92 =41/92 = 0.4456 = 0.45 


               2 ) 33 : 41 = 33/41 = 0.8048 = 0.80 


               3 ) 42 : 49 = 42/49 = 0.8571 = 0.86 


                4 ) 35 : 47 =35/47  = 0.7446 = 0.74 

సమాధానం: 1


3. 24, 72 ల అనుపాత తృతీయ పదం.... 


1 ) 146          2 ) 176          3 ) 196          4 ) 216


సాధన: 24, 72 ల అనుపాత తృతీయ పదం = x అనుకోండి.


⇒ 24, 72, x లు అనుపాతంలో ఉంటాయి.


a, b, c‘ లు అనుపాతంలో ఉంటే b2 = ac 

ఇక్కడ a = 24, b = 72, c = x 


⇒ (72)2 = 24 × x


⇒ x = 216     

సమాధానం: 4


4. 16, 40ల అనుపాత తృతీయపదానికి; 10, 40ల అనుపాత మధ్యమానికి మధ్య నిష్పత్తి?


1 ) 4 : 1          2 ) 5 : 1          3 ) 2 : 1          4 ) 3 : 2


సాధన: 16, 40 ల అనుపాత తృతీయ పదం = x అనుకోండి.


a = 16, b = 40, c = x 

10, 40 ల అనుపాత మధ్యమం =  √ ab 


a = 10, b = 40


= √10 × 40 = √400 = 20


కావాల్సిన నిష్పత్తి = 100 : 20 = 5 : 1


సమాధానం: 2


5. 0.024, 0.12ల అనుపాత తృతీయపదం ........


1 ) 0.600       2 ) 6.000       3 ) 0.060       4 ) 0.006


సాదన: 0.024, 0.12ల అనుపాత తృతీయపదం = x అనుకోండి 


0.024, 0.12, x లు అనుపాతంలో ఉంటాయి.


a, b, c‘ లు అనుపాతంలో ఉంటే, ‘ 


 


ఇక్కడ  a = 0.024, b = 0.12, c = x 

     

సమాధానం:
1


6. a : b = 2 : 3, b : c = 6 : 7 అయితే  a : b : c = ........ 


1) 1 : 2 : 3    2 ) 3 : 2 : 1    3 ) 4 : 6 : 7    4 ) 4 : 3 : 2


సాదన: a : b = 2 : 3, b : c = 6 : 7


రెండు నిష్పత్తుల్లో ఉమ్మడి పదం = b 


3, 6ల క.సా.గు = 6


a : b = 2 : 3 = 4 : 6, b : c = 6 : 7

a : b : c = 4 : 6 : 7


సమాధానం: 3


7. 1.5x = 0.04y అయితే      విలువ .......... 

సాదన: 1.5x = 0.04y 


     
 సమాధానం: 4


8. రూ.1050ను a, b, c‘ అనే వ్యక్తులు a :  b  = 3 : 4, b : c = 6 : 7 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే అందులో ‘ వాటా ఎంత? 


1 ) రూ.420         2 ) రూ.360         3 ) రూ.270         4 ) రూ.450


సాదన:a : b = 3 : 4, b : c = 6 : 7 
     
  4, 6 ల క.సా.గు. = 12


a : b = 3 : 4 = 9 : 12; b : c = 6 : 7 = 12 : 14

a : b : c = 9 : 12 : 14


     
 సమాధానం:
1


9. 3, 9ల అనుపాత తృతీయపదం p అయితే 6, p, 4 ల అనుపాత చతుర్థపదం ఎంత?


1 ) 12            2 ) 15            3 ) 18            4 ) 21


సాదన: 3, 9ల అనుపాత తృతీయపదం = p 

∴ p = 27 


6, p, 4ల అనుపాత చతుర్థపదం = x అనుకోండి


6 : p = 4 : x ⇒ 6 : 27 = 4 : x


⇒ 6 × x = 27 × 4

∴ x = 18     

సమాధానం: 3


10. 4p = 6q = 9r అయితే  p : q : r = ....... 


1) 4 : 6 : 9    2) 9 : 6 : 4    3) 2 : 3 : 4    4) 4 : 3 : 2


సాదన: 4p = 6q = 9r 

 ( 4, 6, 9 ల క.సా.గు. = 36 ) 

p : q : r = 9 : 6 : 4     


సమాధానం: 2


11. a : b = 5 : 7, b : c = 8 : 15 అయితే   8c : 5a = ...... 


1 ) 7 : 3       2) 21 : 5       3) 21 : 17       4) 8 : 5


సాదన: a : b = 5 : 7,  b : c = 8 : 15


7, 8ల క.సా.గు. = 56

a : b = 5 : 7 = 5 × 8 : 7 × 8 = 40 : 56 


b : c = 8 : 15 = 8 × 7 : 15 × 7 = 56 : 105

a : b : c = 40 : 56 : 105


8c : 5a = 8 × 105 : 5 × 40  = 21 : 5

సమాధానం: 2


12. 12, 18, 6ల అనుపాత చతుర్థపదం; 4, k ల అనుపాత తృతీయపదం సమానం. అయితే k విలువ..... 


1 ) 9             2 ) 8             3 ) 7             4 ) 6


సాదన: 12, 18, 6ల అనుపాత చతుర్థపదం = x అనుకోండి


12, 18, 6, x లు అనుపాతంలో ఉంటాయి.


12 : 18 = 6 : x


12 × x =  18 × 6 

∴ x = 9

లెక్కప్రకారం, 4, k ల అనుపాత తృతీయపదం = 12, 18, 6ల అనుపాత చతుర్థపదం

k2 = 9 × 4 = 36

k = 6
 

సమాధానం: 4


13. a = 2b  అయితే  విలువ..... 

1 ) 5             2 ) 4             3 ) 3             2 ) 2


సాదన: a = 2b 


సమాధానం: 3


రచయిత

సీ‡హెచ్‌. రాధాకృష్ణ

విషయ నిపుణులు 

Posted Date : 15-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌