• facebook
  • whatsapp
  • telegram

కాలం - పని

1. A,B, అనే ఇద్దరు వ్యక్తులు ఒక పనిని విడివిడిగా 10 రోజులు, 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేసి రూ.40,000 పొందారు. అయితే ఆ మొత్తంలో A వాటా ఎంత?

1) రూ.20000       2) రూ.24000      3) రూ.25000    4) రూ.16000 

సాధన: A,B లు ఒక పనిని విడివిడిగా పూర్తి చేయడానికి పట్టే కాలాల నిష్పత్తి

 = 10 : 15 = 2 : 3

A,B, లు పొందే వాటాల నిష్పత్తి = 3 : 2

A వాటా = 40000 X 3 / 3+2

= 40000 X 3 / 5 = రూ.2

                                                  సమాధానం: 2


2. ఒక పనిని పూర్తి చేయడంలో శ్రీధర్, వంశీల సామర్థ్యాల నిష్పత్తి 7 : 8. శ్రీధర్‌ ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే అదే పనిని వంశీ ఎన్ని రోజుల్లో  పూర్తి చేస్తాడు?

1) 12       2) 18       3) 14      4)16

సాధన: శ్రీధర్, వంశీల సామర్థ్యాల నిష్పత్తి = 7 : 8  శ్రీధర్, వంశీలు ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే కాలాల నిష్పత్తి

= 1/7: 1/8 = 8: 7

శ్రీధర్‌             :              వంశీ

8                  :                7

↓                                   ↓

16  రోజులు                   X 2

 (1 సమాన భాగం        14 రోజులు 

 = 2 రోజులు)                                    సమాధానం: 3


3. A  సామర్థ్యం B సామర్థ్యం కంటే రెట్టింపు. A ఒక పనిని 4½  రోజుల్లో పూర్తి చేస్తాడు. అదే పనిని B ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు?

1) 9       2) 8          3) 13  ½        4) 12 ½   

సాధన: A,B , ల సామర్థ్యాల (పనితనాల) నిష్పత్తి = 2 : 1

A,B  లు ఒక పనిని పూర్తి చేసేందుకు పట్టే కాలాల నిష్పత్తి = 1 : 2

A : B =      1         :                   2
                  ↓                            ↓                   

                4 ½  రో.                  X  4  ½  రో.

  (1 స.భా. = 4 ½  రో.)             9  రోజులు

                                                                       సమాధానం: 1                   


4. X పఠన సామర్థ్యంY పఠన సామర్థ్యం కంటే 60% ఎక్కువ.y ఒక పుస్తకాన్ని పూర్తిగా చదవడానికి 24 గంటలు పట్టింది. అయితే x అదే పుస్తకాన్ని ఎన్ని గంటల్లో పూర్తిగా చదవగలడు?

1) 27      2)  18     3) 21      4)15


సాధన: x , y పఠన సామర్థ్యాల నిష్పత్తి 

                   = 160% : 100% = 8 : 5

x , y, లు ఒక పుస్తకాన్ని పూర్తిగా చదవడానికి పట్టే కాలాల నిష్పత్తి

= 1 /8    :       1 / 5

    x                  y

    5         :       8

    ↓                 ↓  
  x 3 

 15 గం.         24 గంటలు 

                (1 స.భా. = 3 గం.) 


                                                                సమాధానం: 4


5. A సామర్థ్యం B సామర్థ్యం కంటే 40% తక్కువ.A ఒక పనిని ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఇద్దరూ కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు?

1) 6½          2) 7½          3) 8½        4) 9½ 

సాధన: A, B ల సామర్థ్యాల నిష్పత్తి 

             =(100  40) % : 100)

            = 60% : 100% = 3 : 5

A, B, లు ఒక పనిని విడివిడిగా పూర్తి చేసేందుకు పట్టే కాలాల నిష్పత్తి = 5 : 3 

A ఒక పనిని పూర్తిచేయడానికి పట్టే రోజులు = 20

అదే పనిని B పూర్తిచేయడానికి పట్టే రోజులు 

= 20/5 x 3 = 12

A , B, లు కలిసి ఆ పనిని పూర్తిచేయడానికి 

పట్టే రోజులు =20 x12/ 20 +12

= 20 x 12 / 32 = 15 / 2 = 7 ½  రోజులు   

                                                            సమాధానం: 2


6. నరేంద్ర, హర్ష ఒక పనిని విడివిడిగా 12, 60 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?

1) 9      2) 8   3) 10      4) 6

సాధన: నరేంద్ర, హర్ష కలిసి ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే రోజులు 

   12  x 60  /12 + 60 = 12 x 60/ 72 

                                  = 10 రోజులు

                                                              సమాధానం: 3

 7. A ఒక పనిలో  2 / 5 భాగాన్ని 12 రోజుల్లో, B అదే పనిలో 1/3 వ భాగాన్ని 20 రోజుల్లో  పూర్తి చేస్తారు. ఇద్దరూ కలిసి ఆ పనిలో 3/5  వ భాగాన్ని పూర్తిచేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?

1) 12        2)15     3)16       4) 18

సాధన: ఒక పనిని A పూర్తిచేయడానికి పట్టే 

రోజులు = 12 x 5 / 2 = 30 రోజులు 

అదే పనిని B పూర్తిచేయడానికి పట్టే

రోజులు = 20 x 3 / 1 = 60 రోజులు 

A , B, లు కలిసి అదే పనిని పూర్తిచేయడానికి పట్టే రోజులు 

= 30 x 60 /30 + 60 =  30 x 60 / 90

                             = 20 రోజులు

A , B,లు కలిసి ఆ పనిలో 3/5 వ భాగం పూర్తిచేయడానికి పట్టే రోజులు 

                              = 20 x 3/5 = 12 రోజులు 

                                                                          సమాధానం: 1 


8. కోమల్, జీవన్‌ కలిసి ఒక పనిని 18 గంటల్లో పూర్తిచేస్తారు. ఆ పనిని కోమల్‌ ఒక్కడే 24 గంటల్లో పూర్తి చేయగలడు. అయితే జీవన్‌ ఆ పనిని ఎన్ని గంటల్లో పూర్తి చేస్తాడు?

1) 32      2) 36      3) 64     4) 72

సాధన: కోమల్, జీవన్‌ కలిసి ఒక పనిని పూర్తిచేయడానికి పట్టే గంటలు(x) = 18

           కోమల్‌ ఒక్కడే ఆ పనిని పూర్తిచేయడానికి పట్టే గంటలు(y) = 24

జీవన్‌ ఒక్కడే ఆ పనిని పూర్తిచేయడానికి 

పట్టే గంటలు = x x y / y - x

= 24 x 18 / 24 - 18 = 24 x 18 / 6 = 72  గంటలు

                                                                                 సమాధానం: 4


9. ఒక టీమ్‌లో 10 మంది పురుషులు ఉన్నారు. వారు ఒక ప్రాజెక్ట్‌ను 12 రోజుల్లో పూర్తిచేస్తారు. మరొక టీమ్‌లోని 10 మంది పురుషులు అదే ప్రాజెక్ట్‌ను 6 రోజుల్లో పూర్తిచేస్తారు. అయితే ఆ రెండు టీమ్‌లు కలిసి ఆ ప్రాజెక్ట్‌ను ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తారు?

1) 4      2) 3      3) 2      4) 4  ½ 

సాధన: రెండు టీమ్‌లు కలిసి ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి పట్టే రోజులు 

=  12 x 6 /12+6 = 12 x 6 /18 = 4 రోజులు

                                                                                   సమాధానం: 1


10. A అనే కుళాయి ఒక తొట్టెను గంటలో నింపుతుంది. అదే తొట్టెను B అనే కుళాయి 30 నిమిషాల్లో నింపుతుంది. రెండు కుళాయిలను ఒకేసారి తెరిస్తే, ఆ తొట్టె ఎంత సమయంలో నిండుతుంది? (నిమిషాల్లో)

1) 15      2) 20      3) 25   4) 30


సాధన: తొట్టె నిండటానికి పట్టే సమయం 


    1 గం. x 30 ని./ 1 గం.+ 30 ని.

   60 ని.x 30 ని. / 60 + 30 ని.

   60 x 30 / 90 

           = 20 నిమిషాలు

                                                                సమాధానం: 2


11. ఒక తొట్టెను రెండు కుళాయిలు విడివిడిగా 3 గం., 4 గం.లలో నింపుతాయి. తొట్టెకు ఉన్న మరొక కుళాయిని తెరిస్తే అది నీటిని 2 గం.లలో ఖాళీ చేస్తుంది. అయితే మూడు కుళాయిలను ఒకేసారి తెరిస్తే ఆ తొట్టె నిండటానికి పట్టే సమయం ఎంత? (గంటల్లో)

1) 8     2)10     3)12      4) 14

సాధన: రెండు కుళాయిలు 1 గం.లో నింపగలిగే 

భాగం = 1/3+1/4

మూడూ కలిసి 1 గం.లో నింపగలిగే భాగం 

= 1/3 + 1/4 - 1/2

 = 4 + 3 - 6 /12 = 1/12 గం

మూడు కలిసి తొట్టెను నింపడానికి పట్టే

సమయం = 12/1 = 12 గం. 

                                                  సమాధానం:12 గం

12. A,B,C లు కలిసి ఒక పనిని 16 రోజుల్లో పూర్తిచేస్తారు. ఆ పనిని విడిడిగా పూర్తిచేయడానికి A కంటే B కి రెట్టింపు సమయం పట్టింది. B కంటే C కి రెట్టింపు సమయం పడితే, A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తిచేస్తాడు?

1) 24       2) 28      3) 32   4) 36

సాధన: A పనిని పూర్తిచేయడానికి పట్టే రోజులు = x అనుకోండి.

B ఆ పనిని పూర్తిచేయడానికి పట్టే రోజులు =2x

C ఆ పనిని పూర్తిచేయడానికి పట్టే రోజులు =4x

A,B,C లు ఆ పనిని పూర్తిచేయడానికి పట్టే రోజులు = 16

⇒    1 /x  + 1 / 2x + 1/4x = 1/16
⇒     4+ 2+ 1 /4x  =  1/16

⇒   7/4x = 1/16⇒ 7/4 x 16 = x

⇒    x = 28 రోజులు

                                              సమాధానం: 2


* ఒక పనిని పురుషుడు, స్త్రీ, బాలుడు కలిసి 6 రోజుల్లో పూర్తిచేస్తారు. పురుషుడు, స్త్రీ ఆ పనిని విడివిడిగా 10 రోజులు, 24 రోజుల్లో పూర్తిచేస్తారు. అయితే ఆ పనిని బాలుడు ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు?

1) 56     2) 75      3) 60    4) 40

సాధన: బాలుడు ఒక్కడే పనిని 1 రోజులో పూర్తిచేసే భాగం  

= 1/6 - ( 1/10 + 1/24 )

=1/6 - 1/10 - 1/24 = 20-12-5 / 120

= 3 /120 =1/40

బాలుడు ఒక్కడే ఆ పనిని పూర్తిచేయడానికి పట్టే రోజులు = 40/1 = 40 రోజులు 

                                                      సమాధానం: 4

Posted Date : 06-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌