మాదిరి ప్రశ్నలు
1. భాను + ఉదయం కలిపితే ...?
జ: భానూదయం
2. పిత్రాజ్ఞ అనేది ....
జ: యణాదేశ సంధి
3. గుణములు అంటే ...
జ: ఏ ఓ అర్
4. కిందివాటిలో గసడదవాదేశ సంధికి ఉదాహరణ ....
1) నదివోలె 2) కాలుసేతులు 3) కూరగాయలు 4) పైవన్నీ
జ: పైవన్నీ
5. దయంజేసి ఏ సంధి?
జ: సరళాదేశ సంధి
6. ఎయ్యది - విడదీయండి.
జ: ఏ + అది
7. 'పేదరాలు'లో ఆలు శబ్దానికి అర్థం ఏమిటి?
జ: స్త్రీ
8. కిందివాటిలో టుగాగమ సంధి కానిదేది?
1) నిగ్గుటద్దం 2) పొదరుటిల్లు 3) ధీరురాలు 4) పైవన్నీ
జ: ధీరురాలు
9. పుంప్వాదేశ సంధికి ఉదాహరణ?
జ: సరసపు వచనం
10. ఆదేశం అంటే ...?
జ: ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడం
11. జలధరము అనేది ....
జ: ద్వితీయాతత్పురుష సమాసం
12. కిందివాటిలో సప్తమీతత్పురుష సమాసానికి ఉదాహరణ ఏది?
1) మాటనేర్పరి 2) దొంగభయం 3) గురుదక్షిణ 4) భూతబలి
జ: మాటనేర్పరి
13. గురువు కొఱకు దక్షిణ అనే విగ్రహవాక్యం దేనికి చెందుతుంది?
జ: చతుర్థీతత్పురుష సమాసం
14. ముక్కంటి ఏ సమాసం?
జ: బహువ్రీహి
15. సంభావనా పూర్వపద కర్మధారయానికి ఉదాహరణ ...
1) ద్వారకానగరం 2) శ్రీనాథకవి 3) హిమాలయ పర్వతం 4) పైవన్నీ
జ: పైవన్నీ