• facebook
  • whatsapp
  • telegram

వ్యాకరణం - సంధులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భాను + ఉదయం -
జ: భానూదయం

 

2. గుణసంధికి ఉదాహరణ -
జ: సప్తర్షులు

 

3. ఐ, ఔ లను ఏమంటారు?
జ: వృద్ధులు

 

4. యణ్ణులు అంటే...?
జ: యవరలు

 

5. 'అభ్యుదయం' లో ఉన్న సంధి లాంటిది -
జ: అత్యున్నతం, గుర్వాజ్ఞ, అభ్యర్థి

 

6. చిన్మయం - విడదీయండి.
జ: చిత్+మయం

 

7. పిత్రంశం అనేది -
జ: యణాదేశసంధి

 

8. విసర్గ సంధికి ఉదాహరణలు -
జ: శిరోరత్నం, చతురాశన, మనస్తాపం

 

9. హ్రస్వమైన ఉకారాన్ని ఏమంటారు?
జ: ఉత్తు

 

10. ప్రథమ మీది పరుషాలకు వచ్చే సంధి -
జ: గసడదవా దేశసంధి

 

11. పేదరాలు, గుణవంతురాలులోని 'ఆలు' అంటే.
జ: స్త్రీ

 

12. దయఁజూచి అనేది-
జ: సరళాదేశ సంధి

 

13. ద్విరుక్తం యొక్క పరరూపం -
జ: ఆమ్రేడితం

 

14. యడాగమ త్రికసంధికి ఉదాహరణ-
జ: అయ్యది

 

15. కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దాలకు వచ్చేది-
జ: ద్విరుక్తటకార సంధి


16. అత్తఱి - విడదీయండి.

జ: ఆ + తఱి
 

17. వర్ణాధిక్యం అనేది ......
జ: ఆగమం

 

18. జగన్నాటకం - అనేది ఏ సంధి?
జ: అనునాసిక సంధి

 

19. గుణములు అంటే ...?
జ: ఏఓఅర్

 

20. స్వాగతం - విడదీయండి.
జ: సు + ఆగతం

 

21. కిందివాటిలో విసర్గ సంధి?
    1) చ‌తుర్ముఖ                  2) దేవ‌ర్షి                3) దివ్యౌష‌ధం               4) సూక్తి
జ: 1) చతుర్ముఖ

 

22. కెందమ్మి - ఏ సంధి?
జ: ప్రాతాది సంధి

 

23. వసంత + ఋతువు - కలపండి.
జ: వసంతర్తువు

 

24. సంస్కృత ప్రాకృతాలతో సమానమైన పదాన్ని ఏమంటారు?
జ: తత్సమం

 

25. కిందివాటిలో ఆమ్రేడిత సంధి కానిది ఏది?
       1) అందదుకు       2) ఊరెల్ల        3) చెచ్చెర        4) ఏదీకాదు 
జ: 2) ఊరెల్ల

 

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌