• facebook
  • whatsapp
  • telegram

పాఠ్యాంశాలు - పాత్రలు - ఇతివృత్తాలు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. పుణ్యాత్ముడిని చంద్రుడితో పోల్చి చెప్పిన శతకకవి ఎవరు?
 

జ: మారద వెంకయ్య

2. కొడుకు లేకున్నా మోక్షం వస్తుందనడానికి ధూర్జటి ఎవరిని ఉదహరించాడు?
జ: శుకమహర్షి

 

3. 'మతిహీనుడు' పాఠంలోని పాత్ర
జ: గర్గుడు

 

4. గోపబాలురితో కూడి చల్ది ఆరగించింది -
జ: శ్రీకృష్ణుడు

 

5. ముగ్ధభక్తితో పరమేశ్వరుడిని సేవించింది 
జ: బెజ్జమహాదేవి

 

6. ద్రౌపది తన అభిజాత్యాన్ని ఎవరికి తెలిపింది?
జ: కృష్ణుడికి

 

7. దృష్టద్యుమ్నుడు ఎవరు?
జ: ద్రౌపది సోదరుడు

 

8. పువ్వును ప్రతీకగా తీసుకుని దేశభక్తిని బోధించిన కవి ఎవరు?
జ: వేదుల సత్యనారాయణశాస్త్రి

 

9. పట్నమేలే రాజు దుర్మార్గం నుంచి తప్పించుకున్నది ఎవరు?
జ: కన్యక

 

10. మనిషి వ్యక్తిత్వానికి మెరుగుపెట్టే బోధనలు చేసిన పాఠ్యభాగం
జ: ప్రపంచ పదులు, దమ్మ పదం, సుభాషితాలు 


11. 'దళిత బంధువు' అంబేద్కర్‌ను కీర్తించిన కవి
జ: బోయ జంగయ్య

 

12. 'కవల పిల్లలు' అనే పాఠంలోని పాత్రలు?
జ: రాజు, రాణి, ముసలి అవ్వ

 

13. సుశీల, మాధురి, జాలమ్మ పాత్రలున్న పాఠమేది?
జ: మూడుతరాలు

 

14. 'సురవరం ప్రతాపరెడ్డి' పాఠంలో ఎవరి గురించి ప్రస్తావించారు?
జ: దేవులపల్లి రామానుజరావు, గడియారం రామకృష్ణశర్మ, ముట్నూరి కృష్ణారావు

 

15. 'అడవి జంతువుల ఆవేదన' పాఠంలోని ముఖ్యాంశం
జ: పర్యావరణ పరిరక్షణ

 

16. హరిశ్చంద్ర, బిల్వమంగళ, కుచేల లాంటి పాత్రలు ధరించింది?
జ: వై.భద్రాచార్యులు

 

17. అగస్త్యుని ప్రస్తావన ఉన్న పాఠ్యభాగమేది?
జ: కాశీపట్టణ విశిష్టత

 

18. పారిజాతాపహరణంలో ప్రస్తావించిన పాత్ర?
జ: శచీదేవి

 

19. బ్రహ్మ, లక్ష్మీదేవి, గంగలను ప్రస్తావించిన శతకం -
జ: ఆంధ్రనాయక శతకం

 

20. పురాణపండ మల్లయ్యశాస్త్రి అవధానంలో నిర్వహించింది
జ: నిషిద్ధాక్షరి

 

21. కొమర్రాజు లక్ష్మణరావుపై పాఠం రాసింది?
జ: విద్వాన్ విశ్వం

 

22. ఒక చెట్టు స్వగతం ద్వారా మనిషి బుద్ధిని విమర్శించిన పాఠ్యభాగ రచయిత?
జ: గోపీచంద్

 

23. 'ప్రవరుని స్వగతం'లో ఎవరి ప్రస్తావన ఉంటుంది?
జ: బ్రహ్మ, తండ్రి, భార్య

 

24. ఓరుగల్లు పాఠంలో ప్రస్తావించిన విద్యానాథుడు ఎవరు?
జ: ఒక కవి

 

25. చీకట్లు అందమైనవీ, మరులు గొలిపేవి అంటూ తెలిపిన పాఠం
జ: తామసి

 

26. 'వంకాయలమ్మే మనిషి' ఎందులో ఉంటుంది?
జ: బొండుమల్లెలు


27. 'అంపకాలు'లో పాత్రలు
జ:బాబాయి, చిట్టాం,  తల్లి

 

28. సంగం లక్ష్మీబాయి అసలు పేరు ఏమిటి?
జ: సత్యవతి

 

29. తాపీ ధర్మారావు ఏ కవి ప్రయోగాన్ని విమర్శించారు?
జ: తిక్కన, పింగళి సూరన,  రామరాజభూషణుడు

 

30. భగవాన్ బుద్ధ, భక్త కబీరు ఎవరికి ఆరాధ్య దేవతలు?
జ: అంబేద్కర్‌కి

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌