• facebook
  • whatsapp
  • telegram

గణిత బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు   

1. ఏడో త‌ర‌గ‌తి చ‌దివే సౌమ్య అనే విద్యార్థి జ్యామితీయ పరిక‌రాల పెట్టెలోని వృత్తలేఖిని స‌హ‌యంతో వృత్తం, చాప‌రేఖ‌ను, ఒక రేఖా ఖండాన్ని లంబ స‌మ‌ద్విఖండ‌న రేఖ‌ను, ఇచ్చిన కోణానికి కోణ స‌మ‌ద్విఖండ‌న రేఖ‌ను గీస్తే, ఆ విద్యార్థి ఏ ల‌క్ష్యాన్ని సాధించిన‌ట్లు?
జ: నైపుణ్యం

 

2. విద్యార్థి C = 2πr అనే సూత్రాన్ని 'ఒక వృత్తపరిధి, దాని వ్యాసార్ధానికి 2π రెట్లు ఉంటుంది' అనే శాబ్దిక ప్రవచనంగా అనువదిస్తే ఆ విద్యార్థి ఏ లక్ష్యాన్ని సాధించినట్లు?
జ: అవగాహన

 

3. 'విద్యార్థి ఇచ్చిన గణిత వాక్యాలు, భావనలు, ప్రక్రియల్లో దోషాలను కనుక్కుని సరిదిద్దుతాడు' అనే వ్యాసక్తి ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది?
జ: అవగాహన

 

4. 'భవిష్యత్‌లో నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యసనం విద్యార్థికి దోహదపడుతుంది' - దీనిలో ఇమిడి ఉన్న గణిత విలువ?
జ: క్రమశిక్షణ విలువ

 

5. 9వ తరగతిలో 'సమితి పరిక్రియలు' అనే పాఠ్య పథకంలోని  'సమితి పరిక్రియలను, అంకగణిత పరిక్రియలతో పోల్చడం' అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ?
జ: అవగాహన

 

6. 'విద్యార్థి గణిత సంబంధమైన నమూనాలు, చిత్రాలు, చార్టులు మొదలైనవి తయారు చేస్తాడు' అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది?
జ: ఆసక్తి

 

7. 'విద్యార్థి ఇచ్చిన సమస్యను సాధించడానికి సరైన సూత్రాన్ని ఎన్నుకుంటాడు' ఇది ఏ బోధనా లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
జ: వినియోగం

 

8. పదోతరగతి చదివే విద్యార్థి పైథాగరస్ సిద్ధాంత ప్రవచనాన్ని చెబితే ఆ విద్యార్థి ఏ లక్ష్యాన్ని సాధించినట్లు?
జ: జ్ఞానం

 

9. ఎనిమిదో తరగతి చదివే రోహిత్ అనే విద్యార్థి 312 విలువ కనుక్కోవడానికి (a + b)2 = a2 + 2ab + b2 అనే సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఒక నూతన పద్ధతిని సూచించాడు. అయితే, ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం?
జ: వినియోగం

 

10. ఏడో తరగతి చదివే తేజ అనే విద్యార్థి ఒక దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రాన్ని తన తరగతి గది వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఉపయోగించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం-
జ: వినియోగం

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌