• facebook
  • whatsapp
  • telegram

గణితశాస్త్ర అర్థం, స్వభావం

గత డీఎస్‌సీ, టెట్‌లలో వచ్చిన ప్రశ్నలు 

1. గణిత స్వభావాన్ని వివరించడానికి సహజ జ్ఞానవాదాన్ని (School of Intuitionism) ప్రచారం చేసిన గణిత శాస్త్రవేత్త
జ: హెన్రీ పాయింకేర్

 

2. 'గణితాన్ని ఆలోచనల, సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి' అని పేర్కొన్నవారు
జ: లైబ్నిజ్

 

3. విద్యార్థుల్లో గణితం పట్ల ప్రేరణ కలిగించడానికి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు అనుసరించదగిన చర్య
జ: గణిత చారిత్రక అంశాలను బోధనలో మేళవింపు చేయడం

 

4. 'సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం' అని నిర్వచించినవారు
జ: ఫ్రాన్సిస్ బేకన్

 

5. గణితశాస్త్ర స్వభావం కానిది
జ: వర్ణణాత్మకం

నమూనా ప్రశ్నలు 

1. గణితం అంటే
1) సంఖ్యలకు, అంతరాళాలకు సంబంధించిన విషయం
2) ఆనందాన్ని ఇచ్చే మేథా ప్రవృత్తి
3) ఒక విధానమైన తార్కిక నిర్మాణం
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

2. 'ఆత్మ యొక్క ఉత్తమోత్తమమైన అభ్యాసం, ప్రపంచ వృత్తులన్నింటిలోనూ చక్కనిది గణితం' అని నిర్వచించినవారు
జ: పాస్కల్

 

3. Mathematics అనే పదం ఏ భాషా పదాల కలయిక వల్ల ఏర్పడింది?
జ: గ్రీకు

 

4. విద్యార్థి వివిధ రకాల గణితాంశాలను పరిశోధించి వాటిలోని సంబంధాలను లేదా వ్యత్యాసాలను గుర్తించి, విశ్లేషించి ఒక విషయ నిర్ధారణకు రావడాన్ని ఏమంటారు?
జ: ఆగమన హేతువాదం

 

5. ఏ వాదం ప్రకారం గణితం అంతా తర్కమే?
జ: తార్కిక వాదం

 

6. ఏ వాదం ప్రకారం 'గణితం అనేది నిలకడైన, సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమావళుల ప్రకారం ఆడే ఆట'?
జ: సాంప్రదాయక వాదం

 

7. గ్రండ్లా గెనెడర్ మేథమెటికా (గణిత పునాదులు) గ్రంథాన్ని రచించినవారు
జ: డేవిడ్ హిల్‌బర్ట్

 

8. తార్కికవాదాన్ని అనుసరించినవారు
i) హెన్రీ పాయింకేర్     ii) బెర్ట్రాండ్ రస్సెల్     iii) ఎ.ఎన్.వైట్‌హెడ్     iv) లియోపాడ్ క్రోనేకర్
జ: ii, iii

 

9. సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసినవారు
i) లియోపాడ్ క్రోనేకర్      ii) హెన్రీ పాయింకేర్     iii) డేవిడ్ హిల్‌బర్ట్      iv) డి.స్టాండర్
జ: i, ii

 

10. గణిత చరిత్ర జ్ఞానం వల్ల ఉపాధ్యాయుడికి కలిగే ప్రయోజనం
i) గణితం పట్ల అభిరుచి కలిగించవచ్చు.
ii) మెరుగైన బోధనకు తోడ్పడుతుంది.
iii) అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకునే వీలవుతుంది.
iv) గణిత శాఖ ఎలా అభివృద్ధి చెందిందో తెలుస్తుంది.
జ: అన్నీ

 

11. గణితానికి మూలమైంది
i) హేతువాదం        ii) కచ్చితత్వం       iii) తార్కిక ఆలోచనలు        iv) విశ్లేషణ
జ: i, ii, iii

 

12. పరికల్పితాల ఉత్పాదిక వ్యవస్థే గణితం అని నిర్వచించినవారు
జ: బెంజిమన్ పీర్స్

 

13. International Congress in Mathematics Education - 2000 ఏ దేశంలో జరిగింది?
జ: జపాన్

 

14. గణితాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందేవి?
i) హేతువాదం       ii) సృజనాత్మక శక్తి       iii) తార్కిక ఆలోచనా శక్తి
జ: i, ii, iii

 

15. సాంప్రదాయక వాదాన్ని తెలియజేసే గ్రంథం
జ: గణిత పునాదులు

 

16. 'గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించడం వల్ల గణిత భావనల అవగాహన మెరుగవుతుంది' అని నిర్వచించినవారు
జ: డి.స్టాండర్

 

17. ఏ వాదం ప్రకారం మానవుడి సహజ జ్ఞాన ఫలితంగా ఏర్పడిన సహజసంఖ్యల నిర్మాణంపై గణితం ఆధారపడి ఉంది?
జ: సహజ జ్ఞానవాదం

 

18. కిందివాటిలో అమూర్త భావన
1) సంఖ్య        2) వృత్తం        3) కసాగు        4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

19. గణితం తర్కంతో సమానం అని పేర్కొన్న వాదం
జ: తార్కిక వాదం

 

20. మొదటి మహిళా గణిత శాస్త్రవేత్త
జ: హైపాటిమా

 

21. ఏ పదాల కలయిక వల్ల Mathematics అనే పదం ఏర్పడింది?
జ: Manthanein, Techne

 

22. తార్కికవాదాన్ని వివరించే గ్రంథం
జ: ప్రిన్స్‌పియా మేథమెటికా

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌