• facebook
  • whatsapp
  • telegram

గణితశాస్త్ర బోధనలోని సాంకేతిక విధానాలు  

మౌఖిక పని (Oral Work)
నిర్వచనం: ఒక సమస్యను సాధించే ప్రక్రియలో అవసరమయ్యే గణనలన్నీ రాయడం ద్వారా కాకుండా, నోటితో చేసే కృషిని 'మౌఖిక పని' అంటారు.
* మౌఖిక పని చర్చల ద్వారా లేదా ప్రశ్నల ద్వారా ఉండవచ్చు.
* vమౌఖిక పని వల్ల నిత్య జీవితాంశాలకు దగ్గరగా ఉండే సమస్యలను తొందరగా సాధించడానికి వీలవుతుంది.

 

అంకగణితంలో మౌఖిక పని
* అంకగణితంలో చాలా అంశాలను మన నిత్యజీవితంలో ఉపయోగిస్తాం.

 

బీజగణితంలో మౌఖిక పని
* బీజగణితంలోని చాలా అంశాలు సూత్రాల రూపంలో ఉంటాయి. వాటిని మిగిలిన పాఠ్యాంశాలు, ఇతర సబ్జెక్టుల్లో నిత్యం ఉపయోగించాల్సి ఉంటుంది.
* చిన్న చిన్న సమస్యల ద్వారా గణన చేయడంలో సాధన కోసం ఇది ఉపయోగపడుతుంది.

 

రేఖాగణితంలో మౌఖిక పని
* దూరం, ఎత్తు, వైశాల్యం లాంటి వాటిని అంచనా వేసి, మౌఖిక కృషి ద్వారా రేఖాగణిత ఆలోచనా విధానంలో తార్కిక పరిజ్ఞానాన్ని పెంపొందించవచ్చు.
మౌఖిక పని ప్రయోజనాలు
* మౌఖిక పని కళ్లను, చెవులను అనుసంధానం చేస్తూ విద్యార్థుల ఏకాగ్రతను పెంపొందిస్తుంది.
* విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సరిచేస్తుంది.
* విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరీక్షిస్తుంది.
* సమయాన్ని పొదుపు చేస్తుంది.
* మౌఖిక పని సహాయంతో విద్యార్థుల దృష్టిని ప్రస్తుత అంశాలపై కేంద్రీకరింపజేయవచ్చు.
* విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని అలవరచవచ్చు.

 

మౌఖిక పనిలో లోపాలు
* ఈ పనిని సక్రమంగా ఉపయోగించనట్లయితే తొందరగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.
* క్లిష్టమైన సమస్యలను ఈ పద్ధతి ద్వారా సాధించలేం.
* వ్యక్తి జ్ఞాపకశక్తిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
* నియమబద్ధమైన ఆలోచనలను పెంచుకోనట్లయితే దీనివల్ల ఫలితం ఉండదు.

 

రాతపని (Written Work)
* క్రమబద్ధమైన అలవాటుకు, కచ్చితత్వానికి ఎంతో అవసరమైంది రాతపని.
* "Reading makes a full man conference a ready man and writing an exact man"
* మౌఖికంగా నేర్పిన అంశాలు స్థిరంగా ఉండటానికి ఉత్తమమైంది రాతపని.

 

రాతపని జాగ్రత్తలు
* రాతపని పూర్తి చేయడానికి సమయాన్ని కేటాయించాలి.
* రాతపనిలో శుభ్రతతోపాటు వేగం, కచ్చితత్వానికి ప్రాముఖ్యం ఇవ్వాలి.
* శుభ్రంగా పని ముగించిన విద్యార్థిని అభినందించాలి.
* చిత్తుపనిని కేటాయించిన కాలంలో మాత్రమే చేయాలి.
* విద్యార్థి చేసిన రాతపని అందరికీ అర్థమయ్యేలా ఉండాలి.

 

ఆవర్తన విధానం (Drill Method)
* దీన్నే సమస్యా సాధనా నైపుణ్యం అని కూడా అంటారు.
* ఆవర్తనం అనేది పలుమార్లు ఒకే మాదిరి సమస్యలను సంఖ్యా మార్పులతో చేయడం.
* గణిత శాస్త్రంలో భావనలు, సూత్రాలు, నియమాల స్థిరీకరణానికి తోడ్పడేది ఆవర్తనం.
* గణిత శాస్త్ర అభ్యసనకు తగింది ఆవర్తన విధానం.

 

ఆవర్తన సూత్రాలు
* ఆవర్తనం అనేది 20 నిమిషాలకు మించకూడదు.
* ఆవర్తనం ఏర్పాటు చేసినప్పుడు మొదట్లో వారి తప్పులను కనుక్కుని వాటిని తొలగించాలి.
* ఎంపిక చేసిన విద్యార్థుల జట్ల మధ్య పోటీలు నిర్వహించాలి.

 

ఆవర్తన విధానం యొక్క ఉపయోగాలు
* ఆవర్తనం నైపుణ్యాన్ని, శక్తిని పెంపొందిస్తుంది.
* సమస్య గురించి వెచ్చించే కాలాన్ని, శక్తిని పొదుపు చేస్తూ వ్యక్తి ఉన్నతికి తోడ్పడుతుంది.

 

ఆవర్తన పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* అన్ని సబ్జెక్టుల్లో ఆవర్తనం ఒకే రోజు ఇవ్వకూడదు.
* ఆవర్తనం పూర్తి చేసిన తర్వాత బోధనా లక్ష్యాలు సాధించారో లేదో విశ్లేషించాలి.
గమనిక: ఆవర్తనం గణితంలో లేకుంటే విద్యార్థులు సమస్యా సాధన నైపుణ్యాన్ని సాధించలేరు.

 

నియోజనాలు (స్వయం అధ్యయనశక్తి పెంపొందుతుంది)
* నియోజనం అనేది పాఠ్యాంశం బోధించడానికి ముందు లేదా తర్వాత విద్యార్థికి ఇచ్చే పని.
* నియోజనాన్ని విద్యార్థి సొంతంగా చేయాల్సి ఉంటుంది.
* నియోజనం ఒక రకమైన స్వీయ అధ్యయనం. ఇది తరగతి బోధనను తగ్గిస్తుంది.


నియోజనం ఆవశ్యకత
* బోధనాంశాలను విద్యార్థి అవగాహన చేసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి
* పాఠ్యాంశానికి సంబంధించిన అధిక సమాచార సేకరణకు

 

నియోజనం లక్షణాలు
* విద్యార్థికి పూర్వజ్ఞాన అనుభవాలతో సంబంధం ఉండాలి.
* స్పష్టత, కచ్చితత్వం ఉండాలి.
* నియోజనాలు పూర్తి చేయడానికి కాలనిర్ణయం అవసరం.
* ముందుగా నిర్దేశించిన బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలపై ఆధారపడి ఉంటుంది.
* సిలబస్‌లోని ఖాళీలను పూరిస్తాయి.

 

నియోజనాలు ఇచ్చేటప్పుడు పాటించే నియమాలు
* నియోజనం ప్రశ్నరూపకంగా లేదా సమస్యారూపకంగా ఇస్తే చాలదు. దీంతోపాటు సంబంధించిన, సంప్రదించాల్సిన గ్రంథాలను సూచించాలి.
* విద్యార్థి అవసరాలు, ఆసక్తులకు తగినట్లుగా ఉండాలి.
* అనవసరమైన ఆలోచనలకు తావివ్వకూడదు.
* నియోజనం పెద్దది లేదా చిన్నది కాకుండా విద్యార్థుల వయసుకు తగినట్లుగా ఉండాలి.
* నియోజనాల్లో వైవిధ్యం ఉండాలి.
* నియోజనాన్ని ఇంట్లో లేదా తరగతిలో పూర్తి చేయవచ్చు.
గమనిక: నియోజనాల వల్ల విద్యార్థుల్లో స్వయం అధ్యయనశక్తి పెంపొందుతుంది.

వేగం, కచ్చితత్వాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే మార్గాలు
* వేగం, కచ్చితత్వం గణిత శాస్త్రానికి రెండు కళ్ల లాంటివి.

 

వేగం:
* కచ్చితత్వాన్ని పెంపొందించడం.
* అలవాటు చేయడం.
* నియోజనాల కాలపరిమితి.
* సులభ మార్గాలను అనుసరించడం.
* వైయక్తిక భేదాలు

 

గమనిక
1) మంచి అలవాట్లను పెంపొందించడం.
2) శుభ్రత, సంఖ్యలను స్పష్టంగా రాయడం.
3) సమస్యను సరిగ్గా విశ్లేషించడం.
4) ఫలితాన్ని సరిచూడటం.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌