• facebook
  • whatsapp
  • telegram

గణితశాస్త్ర బోధనాభ్యసన ఉపకరణాలు

గత డీఎస్సీ, టెట్‌లో వచ్చిన ప్రశ్నలు

1. దీర్ఘచతురస్రంతో పోలుస్తూ ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యాన్ని గణన చేసేందుకు ఎక్కువగా ఉపయోగపడే బోధనోపకరణం
జ: ప్లానెల్ బోర్డు

 

2. గణిత బోధనలో ప్లానెల్ బోర్డు ఉపయోగం
జ: త్రిభుజం, చతురస్రం సూత్రాలను రాబట్టేందుకు

బిట్లు

1. బోధనోపకరణాలను శంఖువు ఆకారంలో రూపొందించినవారు?
జ: ఎడ్గార్‌డేల్

 

2. కోబన్ అనే విద్యావేత్త ప్రకారం చూడటం ద్వారా నేర్చుకునే వారి శాతం
జ: 83%

 

3. ఎడ్గార్‌డేల్ అనుభవాల శంఖువులో పీఠభాగంలో ఉండేవి
జ: ప్రత్యక్ష, ప్రయోజనాత్మక అనుభవాలు

 

4. ఎడ్గార్‌డేల్ అనుభవాల శంఖువులో అగ్రభాగంలో ఉండేవి
జ: శాబ్దిక సంకేతాలు

 

5. ఎడ్గార్‌డేల్ అనుభవాల శంఖువులో పరిశీలన ద్వారా అభ్యసనను సూచించేవి?
   1) చలనచిత్రాలు, టీవీ      2) ప్రదర్శనా వస్తువులు      
  3) క్షేత్ర పర్యటనలు         4) అన్నీ
జ: 4(అన్నీ)

 

6. ఎడ్గార్‌డేల్ అనుభవాల శంఖువులో వినడం, చూడటం ద్వారా అభ్యసనను సూచించేవి?
   1) శాబ్దిక సంకేతాలు                     2) దృశ్య సంకేతాలు      
   3) రేడియో, రికార్డింగ్‌లు, స్థిరచిత్రాలు      4) అన్నీ

జ: 4(అన్నీ)
 

7. గణిత ఉపాధ్యాయుడు త్రిభుజం ABCని ΔABC అని రాస్తే, ఈ ప్రక్రియ అనుభవాల శంఖువులో దేన్ని సూచిస్తుంది?
జ: దృశ్య సంకేతాలు

 

8. కిందివాటిలో దృశ్య ఉపకరణం కానిది ఏది?
   1) స్థిర చిత్రాలు      2) టేప్‌రికార్డర్      
   3) నమూనాలు      4) వాస్తవ వస్తువులు
జ: 2(టేప్‌రికార్డర్)

 

9. ఉపాధ్యాయుడు తాను ముందుగా ఒక పాఠ్యాంశాన్ని ఎన్నుకొని, దాన్ని బోధించడానికి ఒక ప్రణాళికను రచించి, ఆ పాఠాన్ని కంప్యూటర్ సహాయంతో బోధన చేస్తాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన టీఎల్ఎం దేన్ని సూచిస్తుంది?
జ: దృశ్య శ్రవ్యోపకరణం

 

10. ఎడ్గార్‌డేల్ అనుభవ శంఖువులో మొదటి సోపానం
జ: ప్రత్యక్ష అనుభవాలు

 

11. ఎడ్గార్‌డేల్ అనుభవ శంఖువులో చివరి సోపానం
జ: శాబ్దిక సంకేతాలు

 

12. ఎడ్గార్‌డేల్ అనుభవ శంఖువులో మూడో సోపానం
జ: నాటకీకరణ అనుభవాలు

 

13. కిందివాటిలో వినడం, చూడటం ద్వారా అభ్యసన జరిగే సోపానం కానిది
    1) శాబ్దిక సంకేతాలు      2) దృశ్య సంకేతాలు      
    3) క్షేత్ర పర్యటనలు      4) రేడియో, రికార్డింగ్‌లు, స్థిర చిత్రాలు
జ: 3 (క్షేత్ర పర్యటనలు)

 

14. పరిశీలన ద్వారా అభ్యసనను సూచించే సోపానం
జ: ప్రదర్శనా వస్తువులు

 

15. కిందివాటిలో ట్రాన్స్‌పరెన్సీలను (పారదర్శకాలను) ప్రదర్శించేందుకు ఉపయోగించనిది
    1) స్లైడ్ ప్రొజెక్టర్      2) ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్    
    3) ఒపెక్ ప్రొజెక్టర్    4) పవర్ పాయింట్ ప్రొజెక్టర్

జ: 2(ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్)
 

16. అపారదర్శక వస్తువులను ప్రదర్శించేందుకు వాడేది
జ: ఒపెక్ ప్రొజెక్టర్

 

17. స్లైడ్లను ప్రదర్శించేందుకు వాడేది
జ: స్లైడ్ ప్రొజెక్టర్

 

18. అర్ధ వృత్తంలోని కోణం లంబకోణం అని నిరూపించేందుకు ఉపయోగపడే గణిత బోధనోపకరణం
జ: జియోబోర్డు

 

19. జియోబోర్డు ద్వారా ఏర్పరిచే ఆకారం
    1) వృత్తం      2) చతురస్రం      3) త్రిభుజం      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

20. గణితంలో Mensuration అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగపడే టీఎల్ఎం
జ: నమూనాలు

 

21. జియోబోర్డులా కనిపిస్తూ, మేకుల స్థానంలో రంధ్రాలు కలిగిన గణిత బోధనోపకరణం
జ: పెగ్‌బోర్డు

 

22. ఫ్లాష్ కార్డులు వల్ల ఉపయోగం ఏమిటి?
    1) డ్రిల్లింగ్‌కు
    2) బోధించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకునేందుకు
    3) పునశ్చరణ
    4) అన్నీ
జ: 4(అన్నీ)

 

23. చార్టులపై ప్రదర్శించేవి

    1) సూత్రాలు      2) సిద్ధాంతాల నిరూపణ      3) పటాలు      4) అన్నీ
జ: 4(అన్నీ)
 

24. నిజ వస్తువులకు బదులుగా చూపించే ఉపకరణాలు
     1) చార్టులు      2) గ్రాఫ్‌లు      3) పటాలు      4) నమూనాలు
జ: 4(నమూనాలు)

 

25. కిందివాటిలో ద్విమితీయ ఉపకరణం
    1) పత్రికా వ్యాసాలు      2) స్థిర చిత్రాలు      3) పోస్టర్లు      4) అన్నీ
జ: 4(అన్నీ)

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌