• facebook
  • whatsapp
  • telegram

గణిత విద్యా ప్రణాళిక

1. రాష్ట్ర స్థాయిలో పాఠ్య పుస్తకాలను అభివృద్ధి చేసేది-
జ: SCERT
 

2. తరగతి గది బోధనలో ఎక్కువగా ఉపయోగపడే బోధనోపకరణం
జ: పాఠ్యపుస్తకం
 

3. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషేతర పుస్తకాలను ప్రస్తుతం ఏ పద్ధతిలో రూపొందిస్తోంది?
జ: సర్పిల పద్ధతి
 

4. విషయ కాఠిన్యత, శీర్షిక పరిపూర్ణత సూత్రం మీద ఆధారపడిన పద్ధతి-
జ: శీర్షిక పద్ధతి
 

5. ఏకకేంద్ర పద్ధతికి సంబంధంలేని అంశం-
జ: విషయాలు నేర్చుకోవడంలో తార్కిక క్రమం ఉంటుంది.
 

6. కఠినతను అనుసరించి విషయ భాగాలను క్రమంలో అమర్చి, తగిన దశలో భాగాన్ని ప్రవేశపెట్టడం-
జ: సర్పిల విధానం
 

7. 'విద్యా ప్రణాళిక కళాకారుడి చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో, తన సామగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం' అని పేర్కొంది.
జ: ఆల్‌బర్టీ

8. విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి బోధన దోహదపడాలని సూచించింది
జ: జాతీయ విద్యా ప్రణాళిక - (2005)
 

9. కచ్చితత్వం, వేగం, ఏకాగ్రత మొదలైనవి ఏ కరిక్యులం నిర్మాణ సూత్రానికి చెందుతాయి?
జ: క్రమశిక్షణా విలువ
 

10. విద్యార్థి ఆసక్తి, అవసరాలు, సామర్థ్యాలకు ప్రాముఖ్యతనిచ్చేది
జ: శిశు కేంద్రీకృత సూత్రం

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌